వన్నె తరగని వనిత
వెన్ను తానె ఇంటికి
వగరును తాను రుచి చూసి
కమ్మదనమును పంచిపెట్టును
ఆలి అయి మగనికి చేరువై
అనురాగమునిచ్చి
అమ్మ అయి తాను
అమృతమును పంచును
ఆకాశానికెగిరినా… వనిత
ఆత్మ స్థైర్యం వీడదు
అసహనాన్ని దరి
చేరనీయదు …
అభిమానం ఆమె ఆభరణం
దాన్ని జారవిడువని
జాగరతే తను
చాచుకున్న ఆయుధం
మగవానితో పోరాటం కాదు
ఆమె సంకల్పం
మనిషి మనిషీ మమతను
పంచుకునీ…
సన్నిహితంతో
సమంగా జీవించాలనే
అభిమతం కల
వన్నె తరగని వనిత…
వెన్నుతానే ఇంటికి
ప్రతి కంటికి
వెలుగునీయు నెన్నటికీ..
– సుజాత తిమ్మన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to వన్నె తరగని వనిత…..