లలిత గీతాలు

1

నిన్న రాత్రి వెన్నెలతో

కమ్మని కబురంపినాను

తలపు పూల నెత్తావుల

పరిమళాల నందించమనీ

వేవేగమె నిన్ను చేరి

నిముసమైన ఆగలేక

నీకై వేచుండే నా మనసు

వేగు పదిలంగా  పంచమనీ

నిన్నరాత్రి వెన్నెలతో……………

చల్ల గాలి తేరుపైన తేట  తేనెపెదవులద్ది

సుందర చిత్రాలనెన్నో నీ వాకిట

సప్తవర్ణ సంబరాల ముగ్గులుగా కూర్చిపేర్చి

నా విన్నపాల స్వగతాలు పలకమనీ

నిన్నరాత్రి వెన్నెలతో …………..

 

ఒక జీవిత కాలం

అది ఏమూలకుకాకున్నా

ఎందుకీ ప్రయాసలంటు ఎందరెంత  నిరసించినా

ఏటి పాలు ఇక మీ రాయభారమని నెన్నుదుటనె అన్నా

ఎన్ని జీవితాలైనా ఏటి గట్టు పాటలాగ

ఎన్ని యుగాల ఎదురు చూపైనా

ఆరిపోని ఆసూర్యుడి వెలుగు లాగ

ఆగిపోని స్వప్నమిదీ

నిన్నరాత్రి వెన్నెలతో………….

 – స్వాతీ శ్రీపాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
7 years ago

స్వాతీ శ్రీపాద గారు! మీ లలిత గీతం చాలా బాగుంది
ఈ గీతం ఈ వరుసలో ఉంటె చదువుకోవడానికి ఆలపించడానికి బాగుంటుందేమో అనుకుంటున్నాను
మీరేమంటారు?

నిన్న రాత్రి వెన్నెలతో కమ్మని కబురంపినాను
తలపు పూల నెత్తావుల పరిమళాల నందించమనీ
వేవేగమె నిన్ను చేరి నిముసమైన ఆగలేక
నీకై వేచుండే నా మనసు వేగు పదిలంగా పంచమనీ నిన్నరాత్రి వెన్నెలతో…

చల్ల గాలి తేరుపైన తేట తేనెపెదవులద్ది
సుందర చిత్రాలనెన్నో నీ వాకిట
సప్తవర్ణ సంబరాల ముగ్గులుగా కూర్చిపేర్చి
నా విన్నపాల స్వగతాలు పలకమనీ నిన్నరాత్రి వెన్నెలతో …

ఒక జీవిత కాలం అది ఏమూలకుకాకున్నా
ఎందుకీ ప్రయాసలంటు ఎందరెంత నిరసించినా
ఏటి పాలు ఇక మీ రాయభారమని నెన్నుదుటనె అన్నా
ఎన్ని జీవితాలైనా ఏటి గట్టు పాటలాగ ఎన్ని యుగాల ఎదురు చూపైనా
ఆరిపోని ఆసూర్యుడి వెలుగు లాగ ఆగిపోని స్వప్నమిదీ నిన్నరాత్రి వెన్నెలతో…