తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

ISSN 2278 – 4780

  “కావ్యేషు నాటకం రమ్యం”, ‘నాటకాంతం నా సాహిత్యం”అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా  సంస్కృత పండితులు సంభావించారు. జాతిని జాగృతం చేసేది జాతి జీవనాన్ని   ప్రతిబింబించేది నాటకం.తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం  తన పరిమాళాలను సుమారు ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది.

అన్ని ప్రక్రియలలోను సంస్కృత కవులను అనుసరించిన తెలుగు కవులు ఈ విషయం లో మినహాయింపనే చెప్పాలి. ప్రపంచ సాహిత్య చరిత్ర లో నాటకానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వమే భారతదేశంలో సంస్కృత నాటకం,గ్రీకు దేశం లో గ్రీకు నాటకం విరివిరిగా ప్రదర్శిపబడుతూనే ఉన్నాయి. అయితే తెలుగు సాహిత్యం లో 19వ శతాబ్దం వరకు నాటక రచన ఆరంభం కాలేదు.  1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన “మంజరి మధుకరీయము” తొలి నాటకం. నాటక రచన ప్రారంభమయిన తొలినాళ్ళలో  రామాయణ,భారత,భాగవత సంబంధమైన కథలతోనే నాటక రచన సాగేది. తరువాత కాలంలో సాంఘిక ఇతివృతాన్ని తీసుకుని రచనలు చేయడం ప్రారంభమయింది.

గుంటూరు,రాజమండ్రి,బళ్ళారి, బందరు వంటి నగరాలలో నాటక ఆవిర్భావానికి వేదికలను ప్రారంభించారు . కాళ్ళకూరి నారాయణరావు,కందుకూరి వీరేశలింగం,గురజాడ అప్పారావు  సాంఘిక ఇతివృత్తాల తో సామాజిక సమస్యలతో రచించిన నాటకాలు విశేష ఆదరణ పొందాయి. అప్పటిదాక పౌరాణిక ఇతివృత్తాలు, పద్యాలకి మాత్రమే పరిమితమైన నాటకం వచనంలోను సామజిక సమస్యలను నాటకంగా మలిచిన నాటకకర్తలు వాటిని ప్రదర్శించడం లో విజయవంతం అయ్యారు. బలం చేకూర్చడానికి నాటక రచనా రంగంలోనూ,ప్రదర్శనలో నూతన ధోరణులు ప్రవేశించాయి. ఈ  క్రమంలో 1920 తరవాత నాటకం,నాటికీ మరిన్ని మార్పులకులోనయింది. దానికి కారణం నాటక సంస్థలు పుట్టుకురావడమే. ఈ మర్పులుతో పాటు సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది ఆంధ్ర నాటక కళా పరిషత్తు.

ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆవిరళా కృషి మూలంగా జన జీవితానికి సంబందించిన అనేక అంశాలు నాటకాలుగా ,నాటికలుగా తెర పైకి వచ్చాయి. ఆంధ్ర నాటకకళాభివృద్ధికి తెనాలి పట్టణం లో పరిషత్తును ఏర్పాటుచేయడానికి వనారస గోవిందరావు ఆంధ్ర దేశంలోనికి నటకవి గాయకులు,విమర్శకులను ఆహ్వానించారు. 1929 జూన్ 19వ తేదిన తెనాలిలో గోవిందరాయ నాట్య మందిరం లో సమావేశాన్ని ఏర్పాటు చేసారు.  ఆచంట వెంకట సాంఖ్యాయనశర్మ అధ్యక్షతన నెల్లూరి నాగరాజారావు,వింజమూరి,బుర్రా శేషగిరిరావు,భమిడిపాటి  చినయజ్ఞ నారాయణ,వక్కలంక అచ్యుతరావు,దేవులపల్లి కృష్ణ శాష్త్రి, తల్లా వఝ్ఝల  శివశంకరశాస్త్రి,బెల్లంకొండ మొదలగు వారు ఈ సభలో పాల్గొన్నారు.

                      ఆంధ్ర నాటక కళా పరిషత్తు ప్రమాణాన్ని రెండు దశలుగా విభజించవచ్చు 1929 నుండి 1944 వరకు ఒక దశ.   ఈ దశలో పరిషత్తు సంవత్సరానికి ఒకసారి నాటకోత్సవాలను నిర్వహించడం , పెద్దలను ఆహ్వానించి  వారి చేత ఉపన్యాసాలు చెప్పించటం , నాటక వస్తువు నటన వంటి విషయాలపై ఆలోచన సాగించారు.  ఈ మొదటి దశలో పరిషత్తుకు పిఠాపురం మహారాజు, వేంకటగిరి, ఉయ్యూరు రాజులు, బెజవాడ రామచంద్రారెడ్డి  మొదలైన వాళ్ళు పోశాకులుగా నడిపించారు.  ఈ పరిణామాల వలన నటులు ,నాటక కర్తలు ,విమర్శకులు అందరు ఒక చోట చేరి నాటకాభివృద్దికి కావలిసిన చర్చ లో  పాల్గొని వారి వారి అభిప్రాయాలను పంచుకునే అవకాశం కలిగించింది .  అదే సమయంలో 1934లో  పరిషత్తు ఆధ్వర్యంలో శ్రీ నీలం రాజు వెంకట శేషయ్య సంపాదకత్వంలో నాట్యకళ త్రైమాసిక పత్రిక కొంత కాలం నడిచింది .

            1944 తరవాత  ఆంద్ర నాటక కళా పరిషత్తు రెండవ దశ ప్రారంభమైంది .  ఈ దశలో ఎమ్.ఆర్ అప్పారావు  అధ్యక్షుడిగా పరిషత్తు బాధ్యతలను చేపట్టారు. ఆ తరవాత కొన్ని మౌలికమైన మార్పులు పరిషత్తులో చోటు చేసుకున్నాయి .  మరి ముఖ్యంగా సాంఘిక  నాటకాలకు  ఒక ఒరవడిని పరిషత్తు ఈ దశలోనే తీసుకు వచ్చింది.  ఆ మార్పులలో ప్రధాన మైనవి  ఇప్పటి వరకు పరిషత్తు నిర్వహించిన నాటకోత్సవాల స్థానంలో  నాటక పోటీలను నిర్వహించాలని , అవి కూడా సాంఘిక నాటక పోటీలను. ఈ పోటీలకు పరిషత్తు కొన్ని నియమ నిబందనలను రూపొందిచింది . అవి

1. సాంఘిక నాటకాలను , నాటికలను మాత్రమే ప్రదర్శించాలి .
2. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి .
3. 5 సంవత్సరాలకి ముందు రచించిన నాటకాలు , నాటికలు పోటీలకు పనికిరావు .
4. ఒక్కసారి పరిషత్తు పోటీలో ప్రదర్శించిన నాటకం, నాటికను మరలా పోటీలో ప్రదర్శించడానికి వీలు లేదు .
5. ఒక నటుడు  ఒక నాటకం , నాటిక లలో  మాత్రమే వేషం వేయాలి .

                           ఈ విధమైన నియమనిబందనలు  పెట్టడం వలన పద్య నాటకాలు విసృతమైన తెలుగు నాటక రంగంలో సాంఘిక నాటకాలి విరివిరిగా ప్రవేశించాయి . అదే విధంగా స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి అనడం వలన స్త్రీలు కూడా నాటక రంగం వైపు ఆకర్షితులయ్యారు . వందలాది మంది రచయితలు నాటకాలు , నాటికలు రచించారు . ఈ నియమ నిబందనల ఫలితంగా మొదకూరి జాన్సన్ ,కొండముది గోపాల రామశర్మ, ఆత్రేయ , పినిశెట్టి , అనిశెట్టి , ఎన్.ఆర్.నంది ,బెల్లం కొండ రామదాసు , అవసరాల సూర్యారావు , భమిడి పాటి రాధాకృష్ణ , కొర్రపాటి గంగాధరరావు , పులుగుండ్ల రామ కృష్ణయ్య , సుంకర  వాసిరెడ్డి , ముదిగొండ లింగమూర్తి , రావి కొండలరావు, వేలూరి శివ రామ శాస్త్రి , కొప్పరపు సుబ్బారావు, చింతపల్లి హనుమంతరావు,దివ్య ప్రభాకర్ ,గొల్లపూడి మారుతీరావు , వి.యస్ .కామేశ్వరరావు, తనికెళ్ళ భరణి , వంటి ఎంతో మంది నాటక రచయితలు తమ రచనల ద్వారా బహుమతులు పొందినవారే .

అదే విధంగా నాటకాన్ని ప్రదర్శించే విధానంలో కూడా క్రొత్త ప్రయోగాలకు అవకాశం  ఏర్పడింది . నటి,నటుల కు  ఒక విధమైన ఉత్సాహం వచ్చింది . స్నేహపూరిత వాతావరణంలో పోటీలు జరగడం వలన ఎంతో మంది నారి నటులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి  ఒక గొప్ప అవకాశాన్ని ఆంధ్రనాటక కళా పరిషత్తు నిర్వహించిన పోటీలు వేదిక అయ్యాయి . ఉత్తమ  ప్రదర్శనకు బహుమతి ఇవ్వడం  వలన నాటక ప్రదర్శనలో అందరి  సమిష్టి  కృషి అవసరం అనే అభిప్రాయం ఏర్పడింది . నటినటులు, రంగాలంకరణ , లైటింగ్ , సౌండ్  మొదలైన విభాగాల వారికి ప్రాధాన్యత పెరిగింది .

1979 లో రజతోత్సవాలను పరిషత్తు జరుపుకుంది .  తెలుగులో సాంఘిక నాటకాలు రావడానికి కారణమై , వాటిని ప్రదర్శించడానికి  అవకాశాన్ని కల్పించడంలోనూ , ఆ నాటకాలను ప్రజలు ఆదరించడంలో  ఆంధ్ర నాటక కళా పరిషత్తు పూర్తి స్థాయిలో విజయం సాధించింది .  తెలుగు సాహిత్యంలో నాటక ప్రక్రియకు ఎంతటి అత్యున్నత స్థానం ఉందో , నాటక రంగంలో ఆంద్ర నాటక కళా పరిషత్తు కు అంతే స్థానం ఉంది అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.

                                            – అరసి శ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో