పాపాయి సమాధి దగ్గర

కరుగుతున్న మంచుగడ్డ
ఆవిరవుతున్న నీటి బొట్టు
మానస నైరూప్య వర్ణచిత్రాలు
రేపు ఉదయించే సుకుమార సుమాలు
అవిచ్చిన్న ప్రతి ఖడ్గంతో
ప్రకటించిన అవిరళ  యుద్ధం ఇది !

లింగ నిర్ధారణ పరీక్షల్లో
అంతర్దానమౌతున్న ఆడపిండాల
చిరునామాలను లెక్కిస్తున్నారా!

వైద్య శిఖామణుల వృత్తి నైపుణ్యానికి
చుట్టాలుగా మారిన చట్టాలు పాడే
అంధ సంగీతాన్ని వింటున్నారా!

రిపోర్టులు , రహస్య సంకేతాలతో
స్కానింగ్ సెంటర్ల సేవా హంతకులపై
నిప్పుకన్ను తెరవకపోవటం ఎవరి  నేరం ?

సెక్స్ సెలక్షన్  ప్రజా విధానమైతే
సెన్సె క్స్ గుహలోకి  ఓసారి  తొంగి చూడండి  
నిర్జీవ పసి చిత్రాల్ని గుర్తు పట్టా గలరా

జగమంత  కుటుంబంలో జాగాలేని ఆడకూతురు
తెరిపిళ్ళు పడని కంటితడి చీకటి
మన ఆనందాల వెలుగు మింగేస్తోంది
సృష్టి  విశ్వరూప  హృదయంలో
దిగులు కత్తి సూటిగా దిగబడుతోంది

రెండు లేత దీపాల మధ్య రగుల్తున్న నిశ్శబ్దం
నోరు విప్పకుండా ఉంటుందా!

మనం ఆడవాళ్ళం  కదా!
మరో ఆడశిశువును తాకాలన్పించటం లేదా!
ఇంకో చెల్లెల్ని
ముద్దు పెట్టుకోవాలన్పించటం  లేదా!

ఆడపిల్లంటే ….  అమ్మ కదా!
తల్లివేరు తెగిపోతున్న చప్పుళ్ళు
కర్ణకఠోరంగా లేవూ!
పాపాయి సమాధుల దగ్గర
పాపభారంతో కుమిలే
దీపాల రెపరెప వేదన
వింటావా!… వింటున్నావా!

– డా . సి . భవానీదేవి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
4 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
7 years ago

పాపాయిని పురిటిలోనే చంపి పాతేయాలంటే
ఒక్కరు కాదు ఇద్దరు కాదు
చాలా మంది కలిస్తేనే ఈ పాపం చేయడం సాధ్యం
ఒకరికి ఆడపిల్ల అక్కరలేదు
వేరొకరికి డబ్బు వస్తే చాలు
మరొకరికి ఎదురుతిరగలేని పిరికితనం
ఇక తల్లి మాటకొస్తే ఏమీచేయలేని నిస్సహాయత
మిగిలినవారిది తప్పని పరిస్తితి
మనిషిలో మానవత్వం కొద్ది కొద్దిగా మాయమవుతుంది
మంచి కవితామ్రుతాన్నిచ్చి మానవత్వాన్ని కాపాడుతున్న
డాక్టరు భవానీదేవి గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు

vali
vali
7 years ago

భవానీ దేవి గారు మీరు రాసిన కవిత చాలా బాగుంది . ఈ సమాజం ఎప్పుడు ఆలోచిస్తుందో ఆప్పుడే ముందుకు వెళ్తుంది . యిది అక్షర సత్యం

kadambari
7 years ago

వర్తమాన సమస్య ను
చాలా ఆర్ద్రంగా రాసారు, భవాని గారూ!
– కాదంబరి

lathasharma
lathasharma
7 years ago

డాక్టర్ గారి కవిత చాలా బావుంది.