వెన్నెల కౌగిలి

సంగీతానికి ఇంత శక్తి వుందా ?

నాకు తెలియకుండా నా వళ్ళంతా ఉత్సాహమూ, మనసంతా ఉత్తేజంతో నిండిపోయింది.  విసుగ్గా, అలసటగా ఆఫీసుకి సెలవు

పెట్టి పడుకున్న వాణ్ణి, తీరా ఇప్పుడు లేచి హుషారుగా ఏమేనా చేసేయ్యాలనిపించేలా నన్ను మార్చేసిన ఈ సంగీతం !!

అసలు దీన్ని సంగీతమంటారా ?

దాదాపు పది నిమిషాలనుంచి వినిపిస్తోంది – హర్మోనికా మీంచి తెరలు తెరలు గా ఏదో చాలా పాత సినిమా పాట అయి వుండాలి.  ఆ పాట ఏమిటో గుర్తురావడం లేదు. ఇలా మొదటి సారి కాదు హర్మోనికా మీంచి ఆ పాట వినడం. ఇప్పటికి నాలుగైదు సార్ల నించి నన్ను మోహపెడుతోంది ఆ స్వరం.

లేచి వెళ్లాను ఆగలేక.  తలుపులు దగ్గిరగా వేసి ఉన్నాయి. కిటికీ రెక్క తీసే వుంది. అతను నలిగిన పక్క మీద పడుకుని

ఉన్నాడు. చూపులు ఎక్కడో వున్నాయి. అప్రయత్నంగా పెదవులమీద ఆ ఇనుస్ట్రుమెంట్ కదులుతోంది అద్భుతమైన రాగాలను

సృజిస్తూ .

పిలిచాను. అతని చూపుల్లో సంగీతపు తాదాత్మ్యత కనిపించలేదు నాకు. అందుకే పిలిచాను.

“అరె ! మీరా !”” లేచి గబుక్కున తలుపు తీసాడు. తీసి “వచ్చి కూర్చోండి మాష్టారు! ఈ రోజు ఇంట్లోనే ఉన్నారా” అంటూ.

“అవునండి కొంచం నలతగా వుండి సెలవు పెట్టాను. కాని ఇప్పుడు చాలా ఫ్రెష్ గా అయిపోయాను. అది చెప్పాలనే వచ్చాను.”

అని అతడి చేయి పట్టుకుని “ఎంత బాగా వాయించేరండి” అన్నాను.

చిన్న నవ్వు నవ్వాడు. “నా గాలి పాట మీకు అంత నచ్చిందా!”

అవునండీ నిజంగా గాలిపాటే. మీరు ఊపిరి పోసి సృష్టించిన ఆ రాగాలు నాకు కొత్త ఊపిరినిస్తూంటాయి. ఇలా ఇది మొదటిసారి

కాదు.

అతను చిన్నగా మొహమాట పడ్డాడు. మౌనంగా ఉండిపోయాడు. రెండు నిమిషాల తర్వాత పక్క మీదున్న హార్మోనికా తీసి

సన్నగా వాయించడం మొదలు పెట్టాడు. అది అలవోకగా పలకడం లేదు. అతని ప్రయత్నంలోంచి పలుకుతోంది. ఇప్పుడు అతని

ధ్యాస దానిని బాగా పలికించాలనే.

కాసిపు కూచుని లేద్దామనుకుంటూంటే వీధి గేటు చప్పుడైంది. గేటు తీసుకుని బేంక్ ప్యూన్ వస్తున్నాడు.

“ఏమిటోయ్ ఇలా వచ్చేవ్” అన్నాను. గుండె కొంచెం దడదడలాడింది. నా ఊహ నిజమే. “మీరు త్వరగా రావాలి. ఆవిడ ఓ పది

నిమిషాల క్రితం ఫైట్స్ వచ్చి పడిపోయారు”

నేను క్షణం ఆలశ్యం చెయ్యలేదు. వెంటనే మా వాటాలోకి వెళ్లి  బీరువా తీసాను. లాకర్ తాళాల కోసం వెతికి లాకర్ తెరిచేసరికి

రెండు నిముషాలు పట్టింది. గబగబా డబ్బు తీసి జేబులో పెట్టుకుంటూ చూసాను. ఆ బాక్స్ లో చాలా రోజులుగా నేను చూస్తున్న

పేక్ చేసిన కవరు ఊడిపోయి ఉంది. దాంట్లోంచి ఆగలేక పైకి ఎగురుతున్నట్లు “స్ట్రింగ్స్”.

ఓ నిమిషం ఏమీ అర్ధం కాలేదు. మరు నిముషంలో స్పష్టంగా అర్ధమైపోయింది.  కామ్ గా తాళాలు వేసేసి బయల్దేరాను.

చెల్లి బేంక్ లో వర్క్ చేస్తోంది. చాలా తెలివయినదని చెప్పడానికి సాక్ష్యం – అది పందొమ్మిదో ఏటే బేంక్ టెస్ట్ లో సెలక్ట్ అయ్యింది.

అప్పటి నుంచి ఆవిడ ఎంప్లాయీ, దాదాపు తొమ్మిదేళ్ళ నుంచి. ఇప్పుడు ఆఫీసర్.

నేను వెళ్లేసరికి సోఫాలో పడుకుని వుంది. వెళ్లి తల దగ్గర కూచుని తలని ఒళ్ళోకి తీసుకున్నాను. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది.

తిరిగి కళ్ళు వాల్చేసుకుంది.

కళ్ళ నించి పక్కలకి కారుతున్న నీళ్ళు.

“ఏమిటి చెల్లీ!ఇది. ఛ ఊరుకో ఇప్పుడేమయిందని” కసిరాను.

కసిరెను గాని ఇప్పుడేమయిందో ఎందుకిలా అవుతుందో నాకు బాగా తెలుసు. చదువుకున్న పిల్ల ప్రపంచం చూస్తున్న పిల్ల.

దానికి మాత్రం తెలిసి వుండదా ?

“ఎందుకిలా అయిపోతున్నానన్నయ్యా ? ఫిజికల్ గా, మెంటల్ గా ఇంత వీక్ ఎందుకయిపోతున్నానో తెలీడం లేదు.” అంది.ఎంతో

ధైర్యమున్న పిల్ల.  ఆ విషయం తనకి కూడా తెలుసు.

కాఫీ వచ్చింది. నేనే నెమ్మదిగా పట్టించి, పర్మిషన్ పెట్టించి ఇంటికి తీసుకొచ్చేసాను.

*                                                    *                                      *

రెండు రోజుల తర్వాత ఇంటికెల్లిపోతూ ఒక్కసారి చూసి పోదామని శివరం రూం దగ్గర ఆగాను.

లోపల నుంచి గజ్జెల చప్పుడు.  నా మనస్సులో చిన్న నవ్వుతో కూడిన బాధ.. కొన్ని నెలలుగా నేర్చుకుంటూన్న భరత నాట్యానికి ప్రాక్టీస్… నన్ను చూసి మానేసాడు.

“రావోయ్! చాలా కాలానికి వచ్చేవు” అని ఆదరంగా తీసికెళ్ళి మంచం మీద కూచో పెట్టాడు. తనూ కూచొని గజ్జెలు విప్పేస్తూ – ఎలా ఉన్నారు రాజీ!” అనడిగాడు.

“అరే ! విప్పేస్తావెం . నా ఎదురుగా చెయ్యవా? నేనూ చూడొద్దా?”

“ఈ విద్యలు నీకోసం కాదోయ్ – వీటి పర్పస్ వేరు. డబ్బు పోసి కష్టపడి నేర్చుకుంటున్నది పచ్చి మొగవాసన కొడ్తున్న నీ కోసమా?” అని పకపకా నవ్వాడు.

నాకు అతనితో వాదించడం ఇష్టం లేదు.

వెయ్యి రూపాయల జీతం తో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే సుఖవంతమైన జీవితానికి ఆ డబ్బు చాలదు. సరదాలు

బోలెడు. అబ్బాయిల స్నేహం కావాలి. సంగీత పాటగాడు, డాన్సర్, కవి ఇలాంటి ఆర్టిస్టులంటే అమ్మాయిలకీ క్రేజే.

శివరాం కి పెళ్లి ప్రమేయం లేకుండా ప్రేమించే అమ్మాయిలు కావాలి.

నాకు అందుకే ఇతని తో వాదన ఇష్టం ఉండదు.  జాలి నవ్వు మనసులో నవ్వుకుంటాను. వెళ్తానని లేచాను.

ఇంటికి వచ్చే సరికి రాజీ ఎప్పటిలా నా కోసం భోజనం చెయ్యకుండా చూస్తూ కూచుని ఉంది.

“ఎందుకమ్మా? ఇంత సేపు ఆగావు. అసలే ఒంట్లో బావుండట్లేదు కదా” మందలింపుగా అన్నాను.

నువ్వు దగ్గర లేకుండా ఎప్పుడేనా తినగలనా? అన్నట్టు నవ్వింది.  నవ్వి లేచి లోపలి వెళ్ళింది.

అన్నం తింటూంటే చెప్పింది. “ఆయన అదే – మూర్తి ఈ రోజు బైటకి వెళ్ళలేదు. హోటల్ టిక్కెట్లు అయిపోయి ఉంటాయి. లోపలే

ఉన్నారు”

“అరె!” అంటూ లేచి వెళ్లి పక్క వాటా తలుపు తట్టాను.

తీరా తట్టాను కాని ఆయన తలుపు తీస్తే ఏమని మాట్లాడను? అనిపించింది. భోజనానికి వెళ్ళే ముందే పిలవాల్సింది. ఇప్పుడు

సగం సగం తింటూ ఈ ఎంగిలి చేత్తో ఇలా ఎలా ?  లోపల నుంచి ఇంకా ఏ రెస్పాన్సూ లేదు.

కామ్ గా వచ్చేసాను.

“ఏం పలక లేదా?” చెల్లి అడిగింది.

“లేదమ్మా. ఇలా మధ్యలో పిలవడం బావుండనిపించింది”. చేసిన పొరపాటు ఎలా సరిచేసు కోవాలో ఆలోచిస్తూ ఉండగా భోజనం అయింది.

నేను అరుగు మీద కుర్చీ వేసాను కూచుందామని – మూర్తి వీధి మెట్ల మీద గోడకి చేరబడి కూర్చున్నాడు.  కాస్త వెన్నెల అతని కాళ్ళ మీద మాత్రం పడుతోంది. మిగతా భాగం అంతా చీకటి.  ఒక గంటా, రెండు గంటలు అలాగే కూచుని ఉంటె అతను పూర్తిగా వెన్నెట్లో మునిగిపోతాడు.  కానీ! ఇంకా కొంతకాలం ఇలా ఉద్యోగం లేకుండా ఉంటే మాత్రం – అతను ఏమైపోతాడో ?

కానీ నిజంగా ఇతని కాళ్ళ మీద వెన్నెల వాలే వుంది. నేనే చెప్పాలి చెప్పడానికయినా, అడగడానికయినా నా సంకోచాలు, భయాలు నాకున్నాయి.  అవీ ఈ మధ్యనే, ఆరు నెలల నుంచి.

ఆరు నెలల నుంచి చెల్లికి ఫిట్స్ వస్తున్నాయి. మొదటి సారి ఇలాగే బేంక్ లో ఉండగానే వచ్చింది. ఆఫీసుకి ఫోన్ వస్తే పరిగెట్టుకెళ్ళాను.

ఒకటి రెండు సార్లు తర్వాత డాక్టరు అడిగారు.

“మీ చెల్లి మంచి జీతం తెస్తున్న ఎంప్లాయ్ కదా! ఇంకా పెళ్లి చెయ్యలేదేం? “

మంచి జీతం తెచ్చుకుంటున్నా ఇంకా మంచి కట్నాలు పోస్తేనే కాని పెళ్ళిళ్ళు కావని ఆయనకి తెలీదా?

“చూస్తున్నాం” అని నసిగాను.

“చూడడం కాదు త్వరలో చెయ్యడం మంచిది. ఆమెకు హిస్టీరియా ప్రారంభంలో ఉంది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా పెళ్లి అవసరం” డాక్టరు గారు మర్యాదగానే ఈ మాటలు చెప్తున్నారు. కానీ నాకు చెళ్ళున చెంప మీద కొడ్తూ చెప్పినట్టయింది.

నా చిన్ని రాజీకి పెళ్లి ఆలస్యం చెయ్యడం వల్ల ఆనారోగ్యమా?  నాకు ఎంతో మంది ఆడపిల్లలు నా రాజీల్లా కనిపించేరు.

ఆ రాత్రి నిద్రలేదు.  మగత-మగత నిండా అర్ధంలేని కళలు – దేశంలో ఆడపిల్లలందరూ హిస్టీరికల్ గా కేకలు పెడ్తూ.

*        *        *

“ఈ రోజు శివరాం మనింటికోస్తానన్నాడమ్మా” అన్నాను.

“అదేమన్నయ్యా! ఈ సాయంత్రం పాపం ఎవరూ అతన్ని ఎంగేజ్ చెయ్యడం లేదా? లేకపోతే నేను చెయ్యాలా? “ ఎంత త్వరగా అనేస్తుందో లోపలి ఆలోచన. అలా అనగలగడానికి ఎంత ధైర్యం కావాలి ?

“ఎన్ని గుండెలు వాడికి?” అని నవ్వాను.

“నాకు ఒక గొప్ప వర్ణన గుర్తొస్తూ ఉంటుందన్నయ్యా! ఒక మదించిన ఏనుగు-ఏనుగు శరీరం నుంచి కారే మద జలానికి ఒక అధ్భుతమయిన సువాసన ఉంటుందటలే. ఆ ఏనుగు సరస్సులో స్నానం చేస్తోందట.  ఆ మద జలం ఆ నీటి నిండా నిండిపోయిందట. ఆ సౌరభానికి వేలాది తుమ్మెదలు వచ్చి ఆ ఏనుగు మీద వాలి పోతున్నాయిట – మనిషికి ఆ జంతు ప్రవృత్తి రావచ్చా?”

నాకు మతి పోయింది. ఎంత కఠినంగా గుండెలో బాకు దించినట్టు చెప్తోంది.

మళ్ళీ తనే అంది “శివరాం మంచి పిల్లని ఏరుకుని పెళ్లి చేసుకుంటే ఎంత బావున్నో కదా! వెయ్యి రూపాయలతో అతను సుఖ జీవనం చెయ్యలేకపోవచ్చు. తృప్తి నిండిన జీవితం – సుఖ జీవితం కంటే ఎంత గొప్పది!”

“ఈ రోజు మనింట్లో డాన్స్ చేస్తాడట” సబ్జెక్ట్ మార్చాలనే మార్చేను.

“వద్దన్నయ్యా! మదాన్ని కళారూపాల్లోకి మార్చి విరజిమ్మడం నేను సహించను. మనం సినిమాకి పోదాం వచ్చేలోగా”

*        *        *

రెండు రోజులయింది. రాజీ మొహం ప్రశాంతం గా వుంది.  ఆ స్త్రింగ్స్ నా కళ్ళ ముందు మెదల్తున్నాయి.  ఎలా అడగను?

ఎలా మొదలుపెట్టను?

మూర్తి రూం లోంచి సన్నగా ఆలాపన విన్పిస్తోంది, ఇతనిహమ్మింగ్ కూడా నన్నేక్కడికో తీసుకుపోతుంది. తీరా పిలిచి కూచోబెట్టి పాడమన్నానా? ఈ అనుభూతీ కలగదు. పాడి తీరాలన్నట్టు పలికిస్తాడు.

నిశ్శబ్దంగా అలాగే ఉంది వింటున్నాను.

లోపల్నించి చెల్లి వచ్చింది. వచ్చి నా పక్కనే కూచుంది. కాసేపటికి నా భుజం మీద వాలిపోయిన తల. వెక్కి వెక్కి ఏడుపు. ఒళ్ళోకి తీసుకున్నాను.

“ఆయన్ని పాడవద్దను అన్నయ్యా. రెండు రోజులకొకసారి తిండి తినే వాళ్ళు పాడలేదు. పాడటానికి ఓపిక ఉండదు”. హిస్తీరికల్ గా అయిపోతూ ఏదేదో మాట్లేడేస్తుంది.

గబుక్కున మూర్తి బైటకి వచ్చాడు. చెల్లి స్పృహలో లేదు. కంగారు పడిపోయాడు. “రండి లోపలి తీసికెళ్ళి పడుకో బెట్టేడ్డం” అంటూ. ఇద్దరమూ కలిసి లోపలి తీసికెళ్ళి పడుకో పెట్టాం.

నా దగ్గర ఎమర్జన్సీలో ఉంచిన మందులు వేసాను.కాసేపటికి ప్రశాంతంగా నిద్రలోకి వెళ్లి పోయింది.

మూర్తి గాబరా ఇంకా తగ్గలేదు.

“మాస్టారూ! ఇలా చూస్తూ కూచుంటే ఎలాగండీ?”

అతన్నే పరీక్షగా చూస్తూ అనుకున్నాను.అవును చూస్తూనే ఊరుకుంటున్నాను అని.

ఇతనికి ముప్ఫై ఏళ్ళు దాటిపోయేయి. ఇంకా ఉద్యోగం వస్తుందో రాదో తెలీదు. తండ్రి మిగిల్చిపోయిన ఈ పాత పెంకుటిల్లు, దీనికి మేము ఇచ్చి అద్దె డబ్బులు.  ఈ డబ్బు నెల రోజులూ భోజనానికి సరిపోతుందా?

పాట పాడుతూనో – హర్మోనికా ఊదుకుంటూనో – శూన్యంలోకి చూసే అతని కళ్ళ నిండా ఎంత నిరాశ.

అతను మానసికంగా రోజు రోజుకీ హిస్టీరికల్ గా అయిపోతున్నాడు.  ఆ అవస్థ లోంచి పలికే సంగీతం గురించి అతనికి చెప్పాలని నేను ప్రయత్నించడం ఎంత అవివేకం? ఇతనికి సుఖ జీవనం అక్కర్లేదు. పెళ్లి చేసుకోగల స్తోమత లేదని తెలిసీ అమ్మాయిలక్కరలేదు. అమ్మాయిల్ని దగ్గర చేసే ఆర్ట్ ఉన్నట్టు కూడా గుర్తింపు లేదు.

ఇతని తంబురా తీగలు తెగిపోయయా?

ఈ ఇంట్లోంకి వచ్చిన ఓ తెల్లవారు జామున హాయి అయిన జ్ఞాపకం కదిల్చినట్టు ఎక్కడిదో పాట నన్ను లేపేసింది.

చెల్లి లేచి రేడియో పెట్టిందా? అని చూసాను. లేదు కానీ అదీ నాలానే లేచి ఆలోచిస్తోంది.

బాల మురళీ పాడే తత్వం అది. సాధారణంగా రేడియో లో సోమవారాలు వస్తూ వుంటుంది. బాలమురళీ పాడుతున్నట్టు లేదు కాని చాలా హాయిగానే ఉంది. ముఖ్యంగా వెనక ఆ తంబురా శ్రుతి. నాకూ, చెల్లికీ ఆ శ్రుతి ఎంత ఇష్టమో.

నా వేపు చూస్తోంది చెల్లి.

ఎక్కణ్ణించి అన్నట్టు సైగ చేసాను.

పక్క వట వైపు చూపించింది. లేచి తల దువ్వుకుని, పెరటి తలుపు తీసాను. తెల్లగా వెలుగు రాలేదు. కాని చల్లని వెలుగు. అస్తమయ వెన్నెల్లో తులసి కోటని ఆనుకొని కూచుని పాడుతున్నాడు మూర్తి.  పాతగిల్లినా చెక్కు చెదరని తంబురా శ్రుతి వేస్తూ.

అతని నగిషీలు సహజమైనవి. అతను అమ్మాయిల స్నేహం కోసం చెక్కుకున్నవి కావు అని ఆ క్షణంలోనే తెలిసింది నాకు.

అతన్ని కదిపి మళ్ళీ పాడిస్తే మామూలు మనిషై పోతాడని కూడా అప్పుడే తెలిసింది.

*        *        *

అవును. ఈ మధ్య తంబురా సృతించడం లేదు. నీను ఆ ధ్యాసలోనే లేను. చెల్లి అనారోగ్యం గొడవలో వుండి పోయాను. ఇప్పుడు చెల్లి బీరువాలో తీగలు గుర్తు చేసి – ఇంకెన్నో విషయాలు చెప్పాయి.

చెప్పాయికాని ఎలా సాల్వ్ చెయ్యను?

డాక్టరు చెప్పిన తర్వాత చెల్లి పెళ్ళికి తీవ్ర ప్రయత్నాలు చేశాను. రకరకాల ‘లోన్లు’ తీసుకోడానికి నిర్ణయించుకుని.

కాని నా హిస్టీరియా ఎవరి దగ్గరా దాచకు అని పెద్ద షరతు పెట్టింది.

ఇక నా చెల్లికి  పెళ్లి చెయ్యగలనా? ఇప్పుడూ అదే సంకోచం. అయినా సాహసించదల్చుకున్నాను.  ఆ మధ్యాహ్నం ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను.  మూర్తి అలాగే – అదే – పద్ధతి లో ఉన్నాడు.

లోపల్నించి నాలో ఉత్సాహాన్ని నింపుతూ హర్మోనికా స్వరాల తెరలు.  తాళం తీసి లోపలి వెళ్లి మొహం కడుక్కున్నాను. పెరట్లోంచి పూర్తిగా విరిసిన ఒక బంతి పువ్వు కోసి తెచ్చాను. కాసేపు ఆ తీగల మీద పెట్టాను. తర్వాత తీసుకుని బైటకొచ్చి మూర్తి రూంలోకి వెళ్లాను.

మూర్తి లేచి కూచున్నాడు. ఈ రోజు అతని మొహం లో ఏదో రిలీఫ్ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఉద్యోగం వచ్చేసిందా ఒక వేళ?

“ఈ రోజు నాకోసమే త్వరగా వచ్చేసారా? ఉదయం నించి మిమ్మల్ని ఒక మాట అడగాలని వెయిట్ చేస్తున్నాను” అన్నాడు.

“వద్దు ఉండండి – ఒక్క నిమిషం తర్వాత చెప్పవచ్చు” అని క్షణం ఆలస్యం చేస్తే ఏమై పోతుందో నన్నంత భయంతో.

“ఈ తీగలు ఆరు నెలల క్రితం చెల్లి కొంది. బీరువాలో ఈ మధ్యే కనిపించాయి నాకు. తీగలు తెగిపోయిన తంబూరాని మొదట తనే గుర్తించింది. కాని కొన్న తర్వాత తనకి కలిగిన త అవస్థ – వీటిని మీకు ఇవ్వనియ్యలేదు.  మీకు ఇష్టమైతే ఈ తీగలు తంబురాకి బిగించి ఈ బంతి పువ్వుని డానికి పెట్టండి” అని ఆ రెండూ అతని చేతిలో పెట్టేసాను.

అతను అవాక్కయి పోయాడు.

“మాస్టారూ! మీరు నమ్ముతారో లేదో ? క్రితం క్షణం లోనే మిమ్మల్ని బావగారూ అని పిలవాలని ఉంది. అభ్యంతరం లేదు కదా! అని అడగాలను కున్నాను. రాజీ గురించి అన్నీ నాకు తెలుసు.  నా పాటలకి శ్రుతి తంబూరాలో లేదు” అంటున్నాడు.

అతని కళ్ళల్లో సన్నని నీటి పొర.

నా కళ్ళ నిండా నీళ్ళే వాటి వెనుక ఎన్నో చిత్రాలు.  మూర్తీ, చెల్లీ చెయ్యి చెయ్యీ పట్టుకుని నడుస్తున్నారు. ఆ వెనుక నిరుద్యోగులైన అబ్బాయిలూ, పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలూ – నాకు వాళ్ళ గురించి బెంగా వెయ్యడం లేదు.అందులో “మూర్తులు, రాజీలు” ఉండక మానరు.

ఆనందంలో నా కౌగిలిలో మూర్తి.  ఆ రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి చేరెను.  మెట్ల మీద వెన్నెల బొమ్మలా రాజీ కూచుని ఉంది. అరుగు మీద పడక కుర్చీలో పడుకుని మూర్తి తంబురా శ్రుతి చేస్తూ పాడుతున్నాడు.

తీరెను కోరిక తీయ తీయగా

హాయిగ ప్రయాణం తేలి పోవగా

కలిసి ప్రయాణం కలదు వినోదం

కళలు ఫలించెను కమ్మ కమ్మగా –

నన్ను చూసి పాట ఆపేసాడు.  ఇప్పటికి తట్టింది ఇదే పాట మూర్తి హర్మోనికా మీద ఊదేవాడు. తెరలు తెరలుగావచ్చి నన్ను కుదిపేసేవాడు. ఈ వేళ దాకా నాకు తెలీదు. అది ఈ పాట అని. పడే పడే అలా వినిపిస్తూనే ఉంది. చిత్రం ఇప్పుడు మూర్తి పాడడం లేదు. మానేసి చాలా సేపయింది. రాజీ నా ఒళ్లో వాలి ఉంది.

ఇంత హాయైన వెన్నెల్లో వాళ్ళిద్దరి ఆనందం నన్ను ఆ పాటగా తాకి మౌనంగా నాకు వినిపిస్తోంది.*

– వాడ్రేవు వీర లక్ష్మి దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to వెన్నెల కౌగిలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో