ఏం చదవాలి ?

( మొదటి భాగం – పాఠ్య పుస్తకాల గురించి )

మనకి తెలిసినంత వరకూ
చదువు మార్కులనిస్తుంది
మార్కులు ర్యాంకులనిస్తాయి
ర్యాంకులు ఉద్యోగాలనిస్తాయి
ఉద్యోగాలు జీతాలిస్తాయి
జీతాలు జీవితాలనిస్తాయి…

ఇదీ  చదువు పట్ల మనలో చాలామందికున్న  అవగాహన.
ఈ విషయం ఆయా పాఠ్య పుస్తకాలు రాసిన పెద్దలకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ?
మేము అష్ట కష్టాలూ పడి తయారు చేసిన పాఠాల విలువ ఇంతేనా అని ఆవేదనతో తల్లడిల్లి పోతారు.

ఎందుకంటే,
విద్య వినయాన్నీ
వినయం వివేకాన్నీ
వివేకం విజ్ఞతనీ
విజ్ఞత విచక్షణనీ
విచక్షణ విశ్లేషణా సామర్ధ్యాన్నీ.., ఇలా ఒకదానికి  ఒకటి పరస్పర పూరకాలయ్యేలా, విద్యార్ధి సర్వతోముఖ అభివృద్ధే లక్ష్యంగా తయారు చేసిన పాఠ్య పుస్తకాలు కేవలం ఉద్యోగాలనీ జీతాన్నీ  ఇవ్వడానికి తప్ప ఇంకెందుకూ పనికి రావా ? అని ఎంతో బాధ పడతారు.

అయినా సరే, మన అవగాహన మాత్రం మారదు.
అందుకు కారణం మన విద్యా విధానం కాదు. దాన్ని అమలు పరిచే విధానం.
ఒక విద్యార్ధి  తెలివితేటలని కొలవడానికి మనం ఎంచుకున్న ప్రమాణాలు ఏమిటి ?
మార్కులు….
ఆ మార్కులని సంపాదించడానికి ప్రతి విద్యార్దీ  ఆయా పాఠాల్ని చదివి అర్ధం చేసుకుని ఆచరణలో పెట్టి అందులోని మంచి చెడ్డలనీ కష్ట నష్టాలనీ తెలుసుకో వడం ద్వారా జ్ఞానం సంపాదించుకోవాలనేది వాటిని రాసినవారి ఉద్దేశం.
దాదాపు మూడు నాలుగు  తరాల క్రితం ఆ ఉద్దేశం కొంత మేరకి నెరవేరేది.
ఇప్పుడు కూడా నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారు తమ పరిధిలో విద్యని నేర్పడం అంటే కేవలం నేర్పడం మాత్రమే కాదనీ, నేర్పడంలోనే నేర్చుకోవడం అనే సృజనాత్మక వ్యాసంగం కూడా ఇమిడి ఉన్నదనే అవగాహనతో నిరంతరం ప్రయోగాలు చేస్తూనే తమ వృత్తికి ధన్యతని చేకూరుస్తున్నారు.
వారి దగ్గర చదువుకున్న వారికి ఇలాంటి వ్యాసాలతో పని వుండదు.

కానీ,
మన విద్యా వ్యాపార సంస్థలు పుట్ట గొడుగుల్లా విస్తరించడం ప్రారంభించాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
స్వయంగా విద్యార్ధుల తల్లిదండ్రులే తమ పిల్లల భవిష్యత్తుని చేజేతులా తీసుకు వెళ్లి ఆ కసాయిల చేతుల్లో పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ చదువంటే అర్ధం అయినా కాకపోయినా పగలూ రాత్రీ పాఠాల్ని నోట్లో వేసి రుబ్బించడమే. ఆ మాత్రం చదివించడానికి ఉపాధ్యాయులే అక్కర లేదు. వారి  చేతుల్లోని బెత్తం చాలు.
ఇప్పుడు ఆ వ్యాపార సంస్థలే  అరబ్బుగారి ఒంటెల్లా తయారై మన విద్యా వ్యవస్థని అన్ని విధాలుగానూ భ్రష్టు పట్టించాయి. అందుకు గల కారణాలని వెతకడం మొదలు పెట్టడం అంటే గొంగడిలో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరడం లాంటిది.

మనకి మార్కులే పరమ ప్రమాణం కనుక ఆ మార్కులని సంపాదించడమే అంతిమ లక్ష్యం.
ఆ మార్కులు చదివింది అర్ధం చేసుకోక పోయినా వస్తాయి.
బట్టీ పట్టి పేపర్లో కక్కినా వస్తాయి.
కాపీ కొట్టి రాసినా వస్తాయి.
మన బదులు బాగా రాయ గలిగిన వాళ్ళతో రాయించినా వస్తాయి.
అంచేత, మన డిగ్రీలు మన చదువు నాణ్యతని కొలవలేవు.
అందుకే అసలైన చదువు, మన చదువు ముగిసిన తరువాత కానీ మొదలు కాదు.
ప్రతి ముగింపూ ఒక ఆరంభానికి నాంది.
అలాగే ప్రతి మొదలూ  ఒక ముగింపు నించే పుడుతుంది.
కాబట్టే..,
మనం జీవితం అనే విద్యాలయంలో అడుగు పెట్టగానే మనకి ఎదురయ్యే మొదటి ప్రశ్న..
ఏం చదవాలి ?

దీని జవాబు కోసం వెతుకులాట కొనసాగుతుంది.


-రాణి

చర్చావేదిక, వ్యాసాలు, , , , , , , , , , Permalink

23 Responses to ఏం చదవాలి ?

 1. pathakuraalu says:

  రాజు గారి పాయింట్ ౧౦౦% కరెక్ట్

  నవ భారత నిర్మాత లని సృష్టించే ఉపాధ్యాయులు should be paid the highest salaries.

  కవిత అండ్ కళ్యాణి గార్లు…దయ చేసి వ్యక్తిగత విమర్శలు వద్దు. మన వెబ్సైటు gauravam pari rakshinchukundam,

  థాంక్స్,

  Pathakuraalu

 2. శంకర్ says:

  ఎంతయినా ప్రయివేటు స్కూళ్ళు స్టూడెంట్స్ టీచర్స్ రక్తాన్ని పిండేస్తూ డబ్బు చేసుకుంటున్నాయి.
  గవర్నమెంట్ స్కూళ్ళు గోదాముల్లా మారుతున్నాయి. చదువులు చంకనాకి పోతున్నాయి.

 3. usha says:

  కవితగారి పాయింట్ చాలా వాల్యుబుల్ గా వుంది.నిరుద్యోగం కంటే ఏదో ఒక ఉద్యోగం ఉండటం బెటరే కదా ?ఈ గవర్నమెంట్ ని నమ్ముకుంటే జాబ్స్ రావు.ఎనీ హౌ మంచి డిస్కషన్ i like it …

 4. kavitha says:

  మేడం,
  పేపర్లో చూశాను. అయితే, corporate schools ని కంట్రోల్ చెయ్యడం మన government వల్ల కాదు. కావాలంటే వాటిని పెంచి పోషించడానికి కొత్త కొత్త పథకాలు పెట్టమంటే పెడుతుంది.
  నిరుద్యోగం మనిషిని కృంగదీస్తుంది. కడుపు కాల్చుకోవడం కంటే ఏదో ఒక ఉద్యోగం ఉంటె better కదా …

 5. రాణి says:

  జీవన్ గారూ,
  మీ మాట ముమ్మాటికీ నిజం.
  కానీ,
  చీకట్లో మనకి వస్తువులేవీ మనకి కనపడవు.
  మరి ఆ వస్తువులు ఉన్నట్టా లేనట్టా ?
  మనకి బాగా అలవాటైన మన ఇంట్లో కూడా కరెంటు పోగానే మనకి తడుముకోవలసి వస్తుంది. అలా తడుముకున్నప్పుడు గానీ గుడ్డివాళ్ళు మనకంటే ఎంత చురుకయినవారో అర్ధం కాదు.
  ఇది కూడా చీకటి విలువని గుర్తించే ప్రయత్నమే.
  మేమింకా చిలుకుతూ ఉండగానే మాకు నవనీతాన్ని అందించినందుకు కృతజ్ఞతలతో…

 6. Jeevan says:

  పుట్టినప్పటి నుండి చని పోయే వరకు సమాజం లో మనం చూసే, చేసే, వినే, చదివే ప్రతి ఒక్క సంఘటన ఓ పాటమే. పాట్య పుస్తకాలు మాత్రం వినయం, విజ్ఞానం, మొదలైనవి నేర్పిస్తాయనుకుంటే అదో మూస సామెత లాటిదే…

 7. రాణి says:

  మనోజ్ గారూ,
  మీ స్పందనకి ధన్యవాదాలు.
  మనం చదువు గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగానే, అక్కడ పొడుపు లక్ష్మి ఎమ్మెల్సీ కావడం యాదృచ్చికం కాదు. ఆవిడ చదివింది కేవలం ఆరో తరగతి మాత్రమే. అయినా ఆవిడ మేధావుల సభలో అడుగుపెట్టగాలిగారంటే అందుకు కారణం కేవలం చదువు మాత్రమే కాదు కదా ? మన టెక్స్టు పుస్తకాలను ఆవిడ చదవలేదు కదా ? అయినా ఆవిడ ఎంతోమంది మేధావులూ పండితులూ విద్యాధికులూ సాధించలేని విజయం సాధించారు. దీన్ని బట్టి, మనం దేన్నివిద్య అనుకుంటున్నామో దాన్ని మించిన విద్య ఏదో వుందని తెలుస్తోంది కదా ?
  అదేమిటో కనుక్కునే ప్రయత్నంలో భాగం గానే ఈ వ్యాసం రాయడం జరిగింది. అది మీ అందరి సహకారంతో చర్చా వేదికగా మారింది.
  కవిత గారూ,
  ఈరోజు పేపర్లో ప్రయివేటు విద్యా సంస్థల మీద కొరడా ఝుళిపించనున్నట్టు నిఘా నేత్రాన్ని బలోపేతం చేయనున్నట్టూ ప్రకటించారు.
  ఆ ప్రకటనలోని ముఖ్యాంశాల్లో ఉపాధ్యాయులచేత తక్కువ వేతనాలకే ఎక్కువ పనిచేయించుకోవడం కూడా ఒకటి.
  మీరన్నట్టు ప్రయివేటు విద్యా సంస్థలు నిరుద్యోగులకి ఉపాధిని ఇస్తున్న మాట నిజమే.
  నా బాధ ఏమిటంటే అవి కేవలం ఉపాధిని తప్ప ఇంకేమీ ఇవ్వ లేకపోతున్నాయనేదే.
  ప్రభుత్వ విద్యా సంస్థలయితే ఉపాధితో బాటుగా భద్రతనీ ఎప్పటికప్పుడు తమని తాము పునర్మూల్యాంకనం చేసుకోవడానికి అనువుగా శిక్షణనీ ఇప్పిస్తాయి. వాటిని సద్వినియోగ పరచుకోవడం అయ్యవార్ల చేతుల్లోనే వుంటుంది.

 8. manoj says:

  రాణి గారూ! మీ తర్కం , చాల బాగుంటుందండి.అవును ఈ విషయం అందరం కలిసి మాట్లాడుకోవల్సినది .

 9. రాణి says:

  కవితగారూ,
  క్రిష్, మహీధర, కుసుమ, కల్యాణి,ఉష,రాజు గార్లు మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడుకోవాలి. కనీసం ఇప్పుడయినా మాట్లాడుకోకపోతే తరవాత మాట్లాడుకోవడానికి ఏమీ మిగలదు.అందుకే మనం మాట్లాడుకోవాలి. మన పిల్లల బాగుకోసమయినా మనం మాట్లాడుకోవాలి. అందుకే అందర్నీ ఆదరంగా ఆహ్వానిస్తున్నాను.రండి మాట్లాడుకుందాం.

 10. kavitha says:

  మేడం,
  పాఠ్య పుస్తకాల పట్లా మన విద్యా వ్యవస్థ పట్లా మీకున్న గౌరవం మెచ్చదగినది.
  ఒక teechar గా అప్పుడప్పుడూ నాకూ ఈ సమస్య ఎదురవుతూనే వుంటుంది. వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం ఎంత ముఖ్యమో, దాన్ని ఆచరణలో పెట్టడం తద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరడం కూడా అంతే ముఖ్యం.దురదృష్ట వశాత్తూ మన విద్యా విధానం లక్ష్యాలని చేరడం మాట దేవుడెరుగు అసలు గమ్యం ఏమిటో మరిచిపోయినట్టు అనిపిస్తోంది.
  ఈ చర్చలో మీరు అన్నింటికీ సమాధానాలు చెప్పారు.కానీ క్రిష్ గారు ” మీరయినా అలాగే ఆలోచిస్తారు” అనే వ్యాఖ్యకి మాత్రం సమాధానం దాటవేశారు.ఎందుకు ?అలాగే మీకు ప్రయివేటు విద్యా సంస్థల మీద అంత కోపం ఎందుకు?అవి కూడా ఎంతో మంది ఉపాధ్యాయులకి ఉపాధిని ఇస్తున్నాయి కదా?

 11. రాణి says:

  క్రిష్ గారూ,

  సమస్య ఏమిటంటే, సామాన్యంగా అందరూ చదువు పూర్తి చేసి పెళ్లి చేసుకుని తమ తమ జీవితాల్లో స్థిరపడగానే తమకి అంతటి జీవితాన్నిచ్చిన చదువు గురించి మర్చిపోయి తమ పిల్లల చదువు గురించి ఆలోచించడం మొదలు పెడతారు.
  కొందరు మాత్రమే చదువు అనేది జీవన పర్యంతం కొనసాగావాల్సిన శోధన అనే విషయాన్ని గుర్తిస్తారు. ఆ కొందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టే ఈ చర్చ ఇంత చైతన్యవంతంగా సాగుతోంది.

  ఇదిలా కొనసాగడానికి కారణం ఏమిటి ?

  మనం చదివినదానికంటే చదవవలసినది ఇంకా మిగిలే ఉందనే అసంతృప్తే కదా ?

  అందుకే ఈ చర్చని ఇలాగే కొనసాగిద్దాం.

  కుసుమ గారూ,

  పాఠ్య పుస్తకాల గురించి మనం చర్చించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఎందరో సుశిక్షితులూ మేధావులూ తమ మేధస్సుని మధించి శాస్త్రీయంగా రాసిన పుస్తకాలు.
  ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో తొంభై శాతం మందికి సరయిన అర్హతలుండవు. కనీసం చెప్పాల్సిన చదువుకి సంబంధించిన శిక్షణ కూడా వుండదు. ఎందుకంటే అక్కడ ఎంత తక్కువ జీతానికి పనిచేస్తే అంత మంచి మేష్టారన్నమాట. అదే ప్రభుత్వ విద్యాలయాల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నా అక్కడ పిల్లలుండరు. పేరెంట్స్ కి తమ పిల్లాడికి ఎంత ఎక్కువ ఫీజు కట్టి ఎంత పెద్ద స్కూల్లో చదివిస్తే అంత బాగా చదువు వస్తుందనే పిచ్చి నమ్మకం.
  ఇది ఇలా కొనసాగినంత కాలం మన విద్యా వ్యవస్థ ఇలాగే ఉంటుంది.
  వ్యవస్థని తయారు చేసింది వ్యక్తులే కనుక దాన్ని మార్చగల సామర్ధ్యం వ్యక్తులకే వుంటుంది.
  అలాంటి వ్యక్తుల సముదాయాన్ని రూపొందించడానికి ‘ విహంగ ‘ జాల పత్రిక మనకి చక్కటి వేదికని అందించింది. మన వంతు కృషి మనం తప్పకుండా చేద్దాం.

  మహీధర గారూ,

  మన విద్యా విధానం చాలా చైతన్య పూరితమైనది. అయితే, అందులోని చైతన్యాన్ని కార్పోరేట్ చదువులు మింగెయ్యడమే అతి పెద్ద విషాదం.
  – రాణి.

 12. krishh says:

  రాణి గారూ…!పాఠ్య పుస్తకాల వరకే చెప్పుకుంటే…

  వినయాన్ని,వివేకాన్ని,విజ్ఞత ను,విచక్షణ ఇచ్చేవి…languages ,literatures ,history ల్లాంటివి అయితే… …

  maths ,science …ఇంకా పై చదువుల్లో ఇంజనీరింగ్ ,మెడికల్ సైన్సు ల్లాంటివి విజ్ఞానాన్ని,skills ని పెంపొందించి మన జీవితావసరమైన మంచి ఉద్యోగం జీతం ను కలిగిస్తాయి.
  schooling లో రెండు సమపాళ్ల లో వుండగా higher studies లో knowledge ,skill ప్రాధాన్యత పెరుగుతుంది.
  అంతే కాని ,మీరన్నట్లు మార్కులు,ఉద్యోగం,తద్వారా జీతం .. అనే అవగాహన తప్పు కాదేమో… ఎందుకంటే మీరైనా అలానే ఆలోచిస్తారు .

 13. krishh says:

  ok
  thnq very much … నా అసంతృప్తి ని positive గ తీసుకుని సమాధానం చెప్పి..నా అలక తీర్చినందుకు.

 14. krishh says:

  రాణి గారు మీరు రాజుగారి
  , కల్యాణి గారి అభిప్రాయాల లో అబ్యంతరం వుంటే తెలపండి,కాని వారి తరుపున క్షమించమని అడగటం
  … … వాళ్ళను అవమానించడమే అనుకుంటా..
  మీరు చాలా పేర్లతో పోస్ట్ లు చెయ్యటం వల్ల confusion గ ఉన్నదన్న నా కామెంట్స్ కూడా approve చెయ్యలేదు… .. మరి అంత ఎడిటింగ్ చెయ్యటం .. … ఓకే నంటారా… …

  • విహంగ says:

   క్రిష్ గారూ!అంత ఎడిటింగ్ అవసరమా?? అంటే … ఒక్కోసారి తప్పదు. అప్పుడు చర్చకి సంబంధించని కొన్ని ఇతరుల వ్యాఖ్యలను కూడా తొలగించాల్సి వచ్చింది.మీ సహకారానికి , స్ఫూర్తికి ధన్యవాదాలు.

 15. maheedhara says:

  తమ పిల్లలు కడుపులో పిండాలుగా ఉండగానే ఎం చదవాలో నిర్ణయించుకుంటున్నారు తల్లితండ్రులు.కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చి
  పిల్లల బాల్యాల్ని మొగ్గలోనే తుంచేస్తున్నది తల్లిదండ్రులే. ఇంకా ఏం చదవాలి ? అని ఇప్పుడు ఆలోచించే దశలో వున్నారా?
  కుసుమ గారు అన్నట్టు పిల్లల చదువులు ఎలా సాగాలో చర్చిస్తే బాగుంటుంది.
  వ్యాసకర్త రాణి గారికి అభినందనలు.

 16. పిల్లకాయలు చేతి మొట్టికాయలు
  తినే రోజులేనా ఐ వి ??!!!!!!
  మా అమ్మాయి చదివిన స్కూల్లో – జనం గుంపులుగా వచ్చారు,
  “మా పిల్ల వాడిని కొట్టారు, మూర్ఛ పోయాడు- అంటూ. ”
  పాఠ్య పుస్తకాల గురించి హిస్టరీ,గణితము, సైన్సు, తెలుగు మొదలైన
  పాఠాలను విద్యార్ధులకు బోధపడేలా ఏ బోధనా పద్ధతులను – అనుసరించాలో –
  టీచర్ల కోసము – ఉపయుక్త వ్యాసాలు ఇలాటివి – అవసరమే!
  మంచి essay ను అందించారు,

 17. రాణి says:

  రాజుగారూ,
  కల్యాణి గారి తరఫున క్షమించమని వేడుకుంటూ..,
  టీచర్ల జీతాలు గొర్రె తోకలా బెత్తెడే అనేది అందరికీ తెలిసిందే.
  సామాన్యంగా వ్యవస్థల్లో అందరికంటే కింది వరుసలో నిలబడి ఆ వ్యవస్థ బరువుని మోసే ఉద్యోగుల పని నిరంతరం మోస్తూ ఉండటమే.
  అలా మోసీ మోసీ నడుములు పడిపోవలసిందే తప్ప జీవన ప్రమాణాలు మాత్రం పెరగవు. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగులందరి పరిస్థితీ అంతే. కాబట్టీ దాని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు.
  అయితే ఒకటి,
  సమాజాన్ని నిర్మించే అద్భుతమైన అవకాశం కేవలం మీ చేతుల్లో మాత్రమే వుంది.
  అందుకు మీరు గర్వించాలి. ఎందుకంటే, ఎంత గొప్పరాజు కొడుకైనా మీ దగ్గరకి రావలసిందేమీ చేతి మొట్టికాయలు తినవలసిందే.
  కళ్యాణి గారూ,
  సామెతలు జీవితంలోంచీ పుడతాయనేది నిజమే అయినప్పటికీ మీరు ఆ సామెతని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి ?

 18. usha says:

  వ్యాసం బాగుంది.బట్…….
  రాజుగారు టూ మచ్
  కళ్యాణి గారు త్రీ మచ్

 19. కళ్యాణి says:

  రాజు గారూ,
  ఈ వ్యాసానికీ జీతాలకీ ఏమైనా సంబంధం ఉందా?మీరు రాసింది చూస్తే నాకు ఓ సామెత గుర్తొస్తోంది.పిల్లకాయలు పప్పులకి ఏడిస్తే అయ్యవార్లు డబ్బులకి ఎదుస్తారట.సామెతలు జీవితం లోంచీ పుడతాయని నిరూపించారు.

 20. kavitha says:

  స్వయంగా విద్యార్ధుల తల్లిదండ్రులే తమ పిల్లల భవిష్యత్తుని చేజేతులా ఆ కసాయిల చేతుల్లో పెడుతున్నారు.
  అనడం కొంచెం బాధ కలిగించినా అదే నిజమని ఒప్పుకోక తప్పదు.

 21. raju says:

  ముందుగా మన ఎలిమెంటరీ స్కూలల్లో పని చేసే ఉపాధ్యాయుల జీతాలు పెంచాల్సిన అవసరం వుందని నేను అనుకుంటావున్నాను.