ఓ… వనితా….!

ఓ వనితా ….
నిశీధి యేనా
నీ భవిత ….!

ఆదిశక్తి అంశ అంటారే
మరి అంగట్లో
అమ్ముడెందుకు
అవుతున్నావ్ ….?

అండపిండ బ్రహ్మాండాలు నీనుండే

ఉద్భవించాయంటారే
మరి సంతలో సరుకు
ఎందుకు
అవుతున్నావ్ ….?

తెగించు ….
తెగించు ….
ఈ దాస్య శృంఖలాల
గోడలను బ్రద్దలుకొట్టు
కల్కి కోసం ఎదురు చూస్తూ వుంటావా ….!
నీ జీవితం కడ తేరే వరకు ….?
ఆ పరాశక్తికే ఆయుధం
అవసరం అయింది
నీకు తెగింపే ఆయుధం
ధైర్యమే నీ ధనం
కధన రంగంలో రుద్రమ్మ
స్ఫూర్తి చాలదా నీకు
ఈ మద మృగాలను
అణగ త్రొక్కడానికి
ఎగసి పడే అలల నీలోని
ధైర్యాన్ని ప్రదర్శించు
ఈ కీచక సమాజం లో
ఒంటరిగా నైనా సరే
సమరం సాగించు ….
తెగించు ….
తెగించు ….

                       – ఆకుతోట జయచంద్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to ఓ… వనితా….!

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  ఆకుతోట జయచంద్ర గారు మీ కవితను ఈ క్రింది విధంగా చేర్చితే
  చదవడానికి బాగుంటుందని అనిపించింది

  ఓ వనితా నిశీధి యేనా నీ భవిత !
  ఆదిశక్తి అంశ అంటారే మరి అంగట్లో అమ్ముడెందుకు అవుతున్నావ్ ?
  అండపిండ బ్రహ్మాండాలు నీనుండే ఉద్భవించాయంటారే
  మరి సంతలో సరుకు ఎందుకు అవుతున్నావ్.?

  తెగించు .. తెగించు .. ఈ దాస్య శృంఖలాల గోడలను బ్రద్దలుకొట్టు
  కల్కి కోసం ఎదురు చూస్తూ వుంటావా ! నీ జీవితం కడ తేరే వరకు ?
  ఆ పరాశక్తికే ఆయుధం అవసరం అయింది
  నీకు తెగింపే ఆయుధం ధైర్యమే నీ ధనం
  కధన రంగంలో రుద్రమ్మ స్ఫూర్తి చాలదా నీకు
  ఈ మద మృగాలను అణగ త్రొక్కడానికి
  ఎగసి పడే అలలా నీలోని ధైర్యాన్ని ప్రదర్శించు
  ఈ కీచక సమాజంలో ఒంటరిగా నైనా సరే
  సమరం సాగించు తెగించు … తెగించు ….

  • jayachandra akuathot says:

   మీ సలహాకి కృతజ్ఞతలు వెంకటేశ్వర రావు గారు

 2. hary Volam says:

  Jai jayachandra…..