సురక్షిత మాతృత్వానికి మార్గాలు

తల్లుల మరణాలకు అనేక కారణాలున్నాయి.వాటి నివారణకు కూడా అనేక వ్యూహాల్ని అనుసరించాలి.
1.స్త్రీ విద్య : స్త్రీ విద్య ఆమె పునరుత్పత్తి ఆరోగ్యానికి కీలకం.స్త్రీల విద్యా స్థాయి పెరిగినప్పుడు వారు గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన చేసుకుని అనుసరిస్తారు.  తక్కువమంది పిల్లల్ని కంటారు, తక్కువమంది తల్లులు మరణిస్తారు.
ఉదా:  శ్రీలంక, కేరళ
ప్రాధమిక విద్యాస్థాయి కూడా లేనివారికి 66 రెట్లు ఎక్కువ రిస్కు వుండగా ప్రాధమిక విద్య మాత్రమే వున్న స్త్రీలకు 23 రెట్లు ఎక్కువ రిస్కు వుంటుంది.స్త్రీల విద్యావకాశాల్ని మెరుగుపరచాలి.స్త్రీలకు ఆరోగ్య విద్యా బోధన జరగాలి.
2.    కమ్యూనిటీ భాగస్వామ్యం :
జ    ఎక్కువ ప్రమాదం వుండే పరిస్థితుల్ని గురించి, గర్భం, ప్రసవ సమయంలో కనపడగల ప్రమాద సంకేతాల           గురించి అవగాహనను కమ్యూనిటీలోని సభ్యులకు కలిగించే ప్రయత్నం జరగాలి.
జ    ప్రసవ సమయంలో ప్రమాద సంకేతాలు కనిపించినప్పుడు గర్భిణీస్త్రీని తీసుకువెళ్ళవలసిన మొదటి రిఫరల్‌ ఆరోగ్యకెేంద్రం         ఎక్కడ వుంది, అక్కడకు ఎలా చేరాలి అనే సమాచారాన్ని ముందుగానే కమ్యూనిటీకి ఇవ్వాలి.
జ    కమ్యూనిటీ తనంతటతాను నామమాత్రపు ఫీజును వసూలుచేస్తూ అత్యవసర పరిస్థితిలో గర్భిణులను ఆరోగ్య కేంద్రానికి         తరలించడానికి  రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
జ    అత్యవసర పరిస్థితిలో అవసరమైతే రక్తదానం చెయ్యడానికి కమ్యూనిటీ సభ్యులు సంసిద్ధంగా వుండాలి
జ    జిల్లాస్థాయి హాస్పటల్స్‌కి దగ్గరగా ఎక్కువ ప్రమాదం వున్న గర్భిణులు కొన్ని రోజులు లేక వారాలు ప్రసవానికి         ముందు వుండడానికి వీలుగా వసతిని ఏర్పాటుచేసుకోవాలి.
జ    బాలికల వివాహ వయోపరిమితిని పెంచి, ఆ వయసులోపల వారికి వివాహం చేయకూడదనే నిర్ణయాల్ని ఖచ్ఛితంగా         అమలు చెయ్యాలి.
జ    బాలికల సామాజిక స్థాయిని మెరుగుపరుస్తూ వారిపట్ల వున్న చులకన భావాన్ని విడనాడాలి.
3.    కోరని గర్భాల్ని నివారించడం :
– మంచి నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవల లభ్యత
– సురక్షిత గర్భవిచ్ఛిత్తి సేవల లభ్యత
4.    ఆరోగ్య సిబ్బంది తీసుకోవలసిన చర్యలు :
3 ‘జూ’ లు
జ    గర్భిణులందరికీ అవసరమైన సంరక్షణను అందించడం (Essential Obsteteric care for all)
జ    తొలి దశ లోనే ప్రమాదాల్ని గుర్తించడం (Early detection of complication)
జ    అత్యవసర పరిస్థితిలో ప్రసూతి సంరక్షణ (Emergency Obstetric care)
అందుకు అవసరమైనవి :
1.    అందరికీ ప్రసూతి సంరక్షణ : (Essential Obsteteric care for all)
జ    ప్రసూతి సంరక్షణకు 12 – 16 వారాల్లో నమోదు చేయడం
జ    కనీసం 4 సార్లు పరీక్ష చేయించుకోవాలి.
– గర్భం అని అనుమానం రాగానే
– 24 – 26 వారాల మధ్య
– 32 – 34 వారాల మధ్య
– నెలలు నిండాక
జ    ప్రతిసారి పరీక్షకు వచ్చినప్పుడు
– రక్తపోటును నమోదు చేయడం
– బరువును నమోదు చేయడం
– తల్లిపొట్టను పరీక్ష చేసి నెలలకనుగుణంగా బిడ్డ ఎదుగుతున్నదీ లేనిదీ గమనించడం
జ    తప్పనిసరిగా చేయవలసిన పరీక్షలు –
– హిమోగ్లోబిన్‌
– రక్తం గ్రూపు, ఆర్‌.హెచ్‌. టైపింగ్‌
– రక్తంలో షుగర్‌
– వి.డి.ఆర్‌.ఎల్‌.
– హెచ్‌.ఐ.వి. పరీక్ష
– హెచ్‌.బి.ఎస్‌.ఎ.జి. పరీక్ష
– మూత్రంలో షుగర్‌, ఆల్బుమిన్‌, చీముకణాలు.
జ మందులు –
– ఇనుము, ఫోలిక్‌ ఏసిడ్‌

జ    16 వారాల తరువాత డీవర్మింగ్‌ మందులు
జ    టీకాలు
– ధనుర్వాతం రాకుండా ఇంజక్షన్లు – 2 మోతాదులు
జ    ప్రసవ సమయంలో 5 పరిశుభ్రతలు –
– పరిశుభ్రమైన చేతులు
– పరిశుభ్రమైన బల్ల, లేక మంచం
– పరిశుభ్రమైన బ్లేడు (బొడ్డును కొయ్యడానికి)
– పరిశుభ్రమైన దారం (బొడ్డును కట్టడానికి)
– బొడ్డును పరిశుభ్రంగా వుంచడం
2.    తొలి దశ8 లో ప్రమాదాన్ని గుర్తించడం (Early Detection of Complication)
ఈ క్రిందివి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనిటీలోని ప్రతిఒక్కరికీ తెలిసేలాగా ప్రచారం జరగాలి.
జ    గర్భవతులందరికీ గర్భం మరియు ప్రసవసమయంలో, ప్రసవం తరువాత కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం         వుంది.
జ    గర్భం సమయంలో వచ్చే చాలా ప్రమాదాలను నివారించలేము.
జ    చాలా ప్రమాదాలను ముందుగా పసిగట్టలేము.
జ    గర్భిణులకు నాణ్యమైన సంరక్షణ లభించడం తొలిథలో ప్రమాదాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
ఎవరు ప్రమాదాల్ని గుర్తిస్తారు?
మొట్టమొదట ప్రమాదాల్ని గుర్తించగలిగేది గర్భిణిని పరీక్షించే ఆరోగ్యసిబ్బంది. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన నర్సు లేక మంత్రసాని లేక ఆరోగ్య కార్యకర్త, కుటుంబసభ్యులు, గ్రామాలలో పనిచేసే నాటువైద్యులు కూడా ప్రమాద సంకేతాలను గుర్తించగలరు.  వీరికి అవగాహన కలిగించడం అవసరం.
ప్రమాద సంకేతాలు :
జ    యోనిద్వారా రక్తస్రావం
జ    ఫిట్స్‌ రావడం
జ    తీవ్రమైన జ్వరం
జ    తగ్గకుండా తలనొప్పి మరియు / లేక కళ్ళు మసకబారడం, వాంతులు
జ    శరీరం వాపు – మఖం, వేళ్ళు, కాళ్ళవాపు
జ    మూత్రం తక్కువగా అవడం
జ    చలిజ్వరం
జ    మూత్ర విసర్జనలో మంట, నొప్పి
జ    ఉమ్మనీరు పోవడం
3.    ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ (Emergency Obstetric Care)
ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ సేవల లభ్యత లేకుండా కేవలం గర్భిణి స్త్రీలకు సామాన్య ప్రసూతి సేవల్ని అందించడమే సురక్షిత మాతృత్వం లక్ష్యం అయితే మాతృమరణాలను తగ్గించలేము.  గర్భం, ప్రసవం సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ సేవలు లభించాలి.  ఆ సేవలు సాధ్యమైనంత త్వరగా, కొన్ని గంటలలోపే లభించకపోతే ప్రాణాపాయం జరుగుతుంది. 2 గంటలలోపు రిఫరల్‌ హాస్పటల్‌కు చేరలేని ప్రదేశంలో ఏ గర్భిణి స్త్రీ కూడా ప్రసవమవగూడదు.
సకాలంలో తగిన ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ లభించడానికి అడ్డంకులు :
1.    సంరక్షణను పొందడానికి నిర్ణయించుకోవడంలో ఆలస్యం
2.    మొదటి రిఫరల్‌ ఆసుపత్రిని చేరడంలో ఆలస్యం
3.    ఆసుపత్రికి చేరాక సంరక్షణను పొందడంలో ఆలస్యం
ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ 3 రకాలుగా వుంటుంది :
1.    ప్రసూతి ఫస్ట్‌ ఎయిడ్‌
2.    ప్రాధమిక ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ
3. సమగ్ర ఎమర్జెన్సీ ప్రసూతి సంరక్షణ

సురక్షిత మాతృత్వానికి 3 ప్రధాన సందేశాలు :
1.    ప్రతిగర్భం కోరుకున్నదయి వుండాలి.
2.    గర్భిణులందరకూ, వారి బిడ్డలకూ నిపుణుల సంరక్షణ, నాణ్యమైన సేవలు లభించాలి.
3.    ప్రతి గర్భిణిస్త్రీ గర్భం, ప్రసవం, ప్రసవం తరువాత వచ్చే సమస్యలు లేక ప్రమాదాలనుండి బయటపడడానికి తగిన         చికిత్సను, సంరక్షణను పొందడంకోసం సకాలంలో అన్ని ప్రసూతి సదుపాయాలు వున్న ఆరోగ్య కేంద్రానికి చేరగలగాలి.

ఈ క్రింది సేవలు లభిస్తే 80% మాతృమరణాల్ని, శిశుమరణాల్ని నివారించవచ్చు.
1.    గర్భనిరోధక పద్ధతుల గురించి సమాచారం, సేవల లభ్యత
2.    గర్భస్రావం తరువాత సంరక్షణ
3.    ప్రాధమిక గర్భిణిస్త్రీ సంరక్షణ, బాలింత సంరక్షణ
4.    గర్భం మరియు ప్రసవ సమయంలో, ప్రసవం తరువాత నిపుణులైన ఆరోగ్యసిబ్బంది సంరక్షణ
5.    ప్రమాదాలు వచ్చినప్పుడు రిఫరల్‌ ఆసుపత్రుల సేవల లభ్యత
స్త్రీలు ఏమి కోరుకుంటున్నారు?
1.     కుటుంబం, సమాజం, ఆరోగ్య వ్యవస్థలనుండి ఆదరణ, ఆసరా, గౌరవం, సహానుభూతి
2.    సంపూర్ణమైన, ప్రామాణికమైన సమాచారం
3.    సాంకేతికంగా సమర్ధమైన, సౌకర్యవంతమైన, నమ్మదగిన, అవసరమైన వెంటనే ఆలస్యం లేకుండా సేవలు లభించడం.
మాతృమరణాలు – సాంఘిక అన్యాయం, మానవహక్కుల హరణం :
జ    స్త్రీలకు విలువివ్వడంలో, రక్షించడంలో సమాజపు వైఫల్యాన్ని ప్రతిబింబించే అంశంగా, ఒక సాంఘిక అన్యాయంగా         మాతృమరణాల్ని పరిగణించాలి. స్త్రీలు  స్త్రీలుఅయిన కారణంగా మరణించడానికి వీల్లేదు.  స్త్రీలకు బాల్యంలోనూ,         కౌమారథలోనూ, ముఖ్యంగా గర్భం, ప్రసవం సమయంలో అవసరమయే ప్రత్యేక సంరక్షణను అందజేయవలసిన         తమ కర్తవ్యాన్ని ప్రతి దేశపు ప్రభుత్వమూ గుర్తించాలి.
జ    స్త్రీలు తాము జీవితాంతం ఎదుర్కొనే సామాజిక, సాంస్కృతిక, చట్టపరమైన, ఆర్ధిక మరియు ఇతర అసమానతల్ని         గుర్తించి     వాటి నిర్మూలనకు పోరాడాలి.
జ    విద్య బాలికకు మెరుగైన సాంఘికస్థాయిని, ఎక్కువ స్వాతంత్య్రాన్ని కల్పిస్తుంది.
జ    సెక్సు గురించి, గర్భం గురించి నిర్ణయించుకోవడానికి, తదనుగుణంగా ఆచరించడానికి స్త్రీయొక్క సామర్ధ్యాలను         పెంపొందింపచేయాలి.
జ    స్త్రీల కృషి, స్త్రీల శ్రమ కుటుంబాల్ని, కమ్యూనిటీని, దేశాల్ని జీవింపజేస్తున్నాయి, ముందుకు సాగడానికి         చోదకాలవుతున్నాయి.  వారు నిరపాయకరంగా జీవించడానికి, వారు జీవించి వుండడానికి తగిన ఖర్చు చేయడం         ప్రభుత్వాల నైతిక బాధ్యత.  స్త్రీలపై పెట్టే పెట్టుబడి ఆర్ధికంగా కూడా లాభాన్ని కలిగిస్తుంది.
జ    మాతృమరణాల్ని మానవహక్కుల అంశంగా పరిగణించాలి.  అందుచేత ప్రతిగర్భం సురక్షితంగా వుండేందుకు,         ఆరోగ్యంగా వుండే తల్లి, బిడ్డతో సంతోషప్రదమైన ముగింపు వుండేందుకు కృషి చేయాలి.

-డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

9
Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.