నర్తన కేళి -6

ప్రస్తుతం  కూచిపూడి నాట్యం విశ్వవ్యాప్త మైంది .  ప్రపంచం అంతా ఆదరణ పొందుతున్న మన రాష్ట్రంలో కొన్ని చోట్ల కూచిపూడి నాట్యం అంత శాస్త్రీయ బద్దంగా అభ్యసన , ప్రదర్శన సాగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దానికి తగిన సూచనలు చేస్తున్న శ్రీమతి  శ్రీలక్ష్మి చింతలూరి తో ఈ నెల నర్తనకేళీ ముఖాముఖి ….

 *ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు?
రండి రండి , మీ కోసమే ఎదురుచూస్తున్నాను, ఇంతలో  ఈ పని చేయడం ప్రారంభించాను  అంతే.
*ఏదో పరిశోధనకి సంబందించినదిగా ఉంది ?
అవును.  మాకు వేరే పరిశోధనలో ఏముంటాయి . నాట్యం తోనే .
*అంటే నాట్యాన్ని  మరొక శాస్త్రం తో పరిశీలిస్తున్నారా ?
నాట్యాన్ని యంత్ర శాస్త్రం  ఈ రెండింటిని తులనాత్మక పరిశొధన. ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది . సమయం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటాను .
*మీ స్వస్థలం ఎక్కడ ?తల్లిదండ్రులు  గురించి చెప్పండి ?
మా స్వస్థలం విజయవాడ . మా నాన్న పేరు తోలేటి కృష్ణమూర్తి , అమ్మ పేరు కస్తూరి కామేశ్వరి .
*మీ తోబుట్టువులు ఎంత మంది ?
మేము మొత్తం ఎనిమిది మంది .  ఏడుగురు అక్కలు , ఒక అన్నయ్య .
*నాట్యం వై పుఆసక్తి  రావడానికి కారణం ఏమిటి?
నా చిన్నప్పుడు  ఒకసారి వెంపటి చిన  సత్యం మాష్టారు  అధ్వర్యంలో విజయవాడలో జరిగిన శ్రీనివాస కళ్యాణం  నృత్య ప్రదర్శన చూసాను . ఆ ప్రదర్శనలో మంజు భార్గవి , శోభానాయుడు చేసారు అప్పుడు అనిపించింది  నేను ఇలా చేయాలి అనిపించిది .
*నాట్యం నేర్చుకోవడానికి మీ ఇంట్లో ప్రాత్సాహం ఎంత వరుకు ఉంది ?
మా అమ్మ వై పు బంధువులలో  కళాకారులున్నారు. స్థానం నరసింహారావు గారు మాకు బంధువు .  ఇటు  నాన్న వైపు అప్పటిలో తోలేటి వారి వంశం జమిందారుల వంశం కావడంతో  అక్కడికి భాగవతులు వచ్చి ప్రదర్శనలు ఇచ్చే వారంట.  దానితో కళల  పట్ల మా కుటుంబంలో అందరికి అభిరుచి ఉంది .
*మీ ఏడుగురు అక్క లకు కూడా ఈ రంగంలో ప్రవేశం ఉందా?
మా అక్కలు అందరు కుడా కూచిపూడి నేర్చుకున్నారు .  చిన్నప్పుడు వాళ్ళతో వెళ్ళే దానిని ,ఆ విధంగా నాకు ఇష్టం  ఏర్పడింది .
*మీ తొలి గురువు ఎవరు ? వారి గురించి చెప్పండి?
కొత్తపల్లి పద్మ .  ఆమె  మా బంధువులే వారే నా తొలి గురువు . ఆమె వద్ద కూచిపూడి అభ్యసించడం మొదలు పెట్టాను .  తరవాత వాసిరెడ్డి కనక దుర్గ గారి వద్ద  భరత నాట్యం లో  శిక్షణ   ప్రారంభించాను .
*వాసిరెడ్డి కనక దుర్గ గారి వద్ద  ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు ?
కనక దుర్గ గారి వద్ద భారత నాట్యం లో డిప్లమో చేసాను . నాకు  13 సంవత్సరాలు వచ్చేటప్పటికే  భరత నాట్యం లో డిప్లమో పూర్తి చేసాను . ఇప్పటిలా  విశ్వ విద్యాలయాలు అప్పుడు లేవు .  అప్పుడు ఈ నృత్యానికి సంబంధించి న పరిక్షలు బోర్డు నిస్వహించేది.
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు  ఎప్పుడు  జరిగింది ?
కొత్తపల్లి పద్మ వారి వద్ద నేర్చుకునేటప్పుడే  పారిజాతం , చండాలిక , భక్తప్రహ్లాద  చేసాను .
*భరత నాట్యం లో డిప్లమో  చేసి  కూచిపూడి వైపు ఎలా ఆసక్తి  కలిగింది ?
భరత నాట్యం నేర్చుకున్న నాకు ఎందుకో అంతగా సంతృప్తి కలగలేదు.  కూచిపూడి లో అభినయానికి ఎక్కువ అవకాశం ఉంటుంది .  నేను ముందుగా కొత్తపల్లి పద్మ వద్ద కూచిపూడి  నేర్చుకోవడం వాళ్ళ  దాని మీదనే నాకు ఇష్టం  ఏర్పడింది .
*కూచిపూడి ఎవరి వద్ద  అభ్యసించారు ?
కూచిపూడి లో ఉన్న కళా క్షేత్రంలో  నేర్చుకున్నాను .  మా గురువులో వేదాంతం రత్తయ్య గారు, రాధేశ్యాం గారు మాగురువులు .
*కూచిపూడి కళాక్షేత్రంలో  ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు?
సుమారుగా  6 సంవత్సరాలు నాట్యం అభ్యసించాను .  అక్కడ ప్రతి సంవత్సరం గురువులకు నాట్య పునశర్చరణ తరగతులు జరిగేవి .  మూడు నెలలు పాటు చిన సత్యం మాష్టారు వచ్చి చెప్పేవారు . నేనుకూడా ఆ తరగతులకు వెళ్ళే దానిని.
*మీరు ఎంత వరుకు చదువుకున్నారు  ?
నేను కూచిపూడి లో  సర్టిఫికేట్ . డిప్లమో , బి.ఏ  లో కూచిపూడి  చేసాను . డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగం వచ్చింది .
*ఏ  ఉద్యోగం వచ్చింది ?
రైల్వే లో వచ్చింది . అది కూడా డాన్స్ విభాగంలో వచ్చింది . 1988 లో వచ్చింది . ఆల్ ఇండియా పోటిలలో  సౌత్ సెంట్రల్ జోన్ కి నేను  ఒక్క దానినే అర్హత సాధించాను .
*ఆ ఉద్యోగంలో మీరు ఏ విభాగంలో విధులు  నిర్వహించేవారు ?
మాకు డాన్స్ విభాగంలో కదా వచ్చింది . మాకంటూ రైల్లో ఒక భోగి ప్రత్యేకంగా ఉండేది .  దానిలో మాకు కావాల్సిన అన్ని సదుపాయాలూ ఉండేవి .  దేశం అంతా ప్రదర్శనలు ఇవ్వడమే  మా పని .  కొంచం ఖాళి దొరికితే రైల్వే ఉద్యోగుల పిల్లలకి నాట్యం నేర్పించడం ఉండేది .
*కళా క్షేత్రం లో ఉన్నప్పుడు చేసిన  నృత్య ప్రదర్శనలు కొన్నింటిని మా విహంగ చదువరుల కోసం చెప్పండి ?
కళా క్షేత్రం లో  ఉన్నపుడు  భక్త ప్రహ్లాద యక్షగానం లోను  , క్షీరసాగర మధనం నృత్య రూపకం లోను ,భామాకలాపం , పార్వతి పరిణయం , మహిషాసుర మర్ధిని , నర్తనశాల లో కీచక వధ, కృష్ణ విజయం   మొదలైనవి చేసాను.
*ఉద్యోగంలోఉన్నపుడు  మీరు ఇచ్చిన ప్రదర్శనలో మీకు  గుర్తున్న ప్రదర్శనలు ?
నేను ఎక్కువగా నృత్య రూపకల్పన చేసుకునే దానిని  ఎందుకంటె మేము చేసే ప్రదర్శనలు  ఎక్కువగా  ఉత్తర  దేశంలో ఉండేవి వాళ్లకి తెలుగు రాదు కాబట్టి  వాళ్ళ కోసం కొరియోగ్రాఫ్ చేసేదానిని . కథక్ జతుల్ని  కూచిపూడి లోకి మార్చుకుని చేసే దానిని. అష్ట పదులు , థిల్లాన ,కూచిపూడివి  అన్ని చేసే దానిని.
*మీ కుటుంబం గురించి చెప్పండి ?
మా వారి పేరు చింతలూరి వెంకట రత్నం. ఆయన రైల్వే లా ఆఫీసరుగా పని చేసారు. తరవాత రాజీనామా చేసి సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ లలో అడ్వకేట్ గా చేసారు .  నాకు ఇద్దరు  పిల్లలు అమ్మాయి పేరు వెంకట పియూష  బిటెక్  చదువుతుంది . అబ్బాయి అనిరుద్ద్ గౌర్ . 
*మీ ప్రభావం మీ ఇంట్లో  ఎంత వరకు ఉంటుంది ?
మా ఇంట్లో  మా పిల్లలు ఇద్దరు  నాట్యం నేర్చుకున్నారు . ప్రదర్శనలు ఇస్తున్నారు .  మా మూడవ అక్కయ్య కొడుకు అజయ్ , సి. హెచ్  శ్రీనివాస్  వాళ్ళు కుడా ఈ రంగంలో నే ఉన్నారు .  నా వద్దనే విద్య అభ్యసించారు . 
*మీ నృత్య శిక్షణాలయం పేరు ? ఎప్పుడు ప్రారంభించారు?
 “నాట్య వేదం” నేను రైల్వే ఉద్యోగంలో ఉండగానే మొదలు పెట్టాను . తరవాత మేము కొంతకాలం విజయవాడలో ఉన్నాము అక్కడ కొనసాగించాను , ఆ తరవాత మళ్ళి హైదరాబాద్ , ఇప్పుడు  రాజమండ్రి లో నృత్య శిక్షణ ఇస్తున్నాను.  ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది. 

*మీరు రూపకల్పన చేసిన నృత్య రూపకాలు కొన్ని చెప్పగలరా?

సమతా  జ్యోతి , నమో వేంకటేశ ,శివోహం , కృష్ణ తత్వం (పూల బాలలు). నమో వేంకటేశ నృత్య రూపకాన్ని 100 కు పైగా ప్రదర్శనలు ఇచ్చాము .

*మీ అందుకున్న పురస్కారాలు ?

మద్రాసు లో జరిజిన సదస్సులో నాట్య విశారద , బాలభారతి  వారు నాట్య నందిని అవార్డు . 1998 నృత్య అవార్డు , 2010 లో ఆరాధన వాళ్ళు జీవిత సాఫల్య పురస్కారం .

 *మీ వద్ద కు వచ్చే పిల్లలకు  మీరిచ్చే  శిక్షణ ఏ విధంగా ఉంటుంది ?
మా గురువులు  నాకు ఏ విధంగా శిక్షణ  ఇచ్చారో ఆ విధంగానే నేను  చేస్తున్నాను .  నేను వారం రోజులు తరగతులు నిర్వహిస్తున్నాను .  శని, ఆది వారాలలో ప్రదర్శన లకు సంబంధించి శిక్షణ ఇస్తాను .  ఒక్కొక్క  బ్యాచ్ కి రెండు గంటలు శిక్షణ ఇస్తాను .
 *మొన్న  జరిగిన సిలికానాంధ్ర  కూచిపూడి నాట్య  సమ్మేళనం పై మీ అభిప్రాయం ?
చాలా మందికి మేలు జరుగుతుంది . ప్రపంచ మంతా కూచిపూడి గొప్పదనం తెలుస్తుంది . కళాకారులు అందరు ఒకేచోట చేరడం  వలన అందరితో  పరిచయం ఏర్పడుతుంది .ముఖ్యంగా గురువు గౌరవం పెరిగింది .  ఈ   సిలికానాంధ్ర  కూచిపూడి నాట్య  సమ్మేళనం తరవాత చాలా మంది గురువులకు, అలంకరణ  నిపుణులకు పని దొరుకుతుంది.
 * సిలికానాంధ్ర  నిర్వహించే ఈ కార్యక్రమం లో  వారు ఇచ్చే ప్రదర్శన అంశం  కొంచెం తొందరగా  ఇస్తే  బాగుంటుంది అని అందరి అభిప్రాయం  మీరేమంటారు ?
అవును . నేను ఈ విషయంలో ఏకీభవిస్తాను . గురువులందరి తరుపున ఆనంద్ గారికి ,సిలికానాంధ్ర యాజమాన్యానికి  చిన్న విన్నపం 2014 లో నిర్వహించే  ప్రదర్శన  తేదీని , అంశాన్ని కూడా ఆ  రోజు  ప్రకటించారు . మీరు  అప్పుడే దానికి సంబందించిన  వీడియోని   కూడా  ఇచ్చేస్తే  చాలా బాగుంటుంది . అప్పటికి అందరు చాలా బాగా చేస్తారు . మిగిలిన వారికి నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది .  ఇంకా ఎక్కువ మంది అభ్యసిస్తారు .  ఇప్పుడైనా  అతి తొందరలో  ఆ వీడియోని విడుదల చేయగలరు.
  *ఇప్పుడు కళలను  అభ్యసించే వారికి మీరిచ్చే సలహా ?
శాస్త్రీయంగా కూచిపూడిని నేర్చించే గురువు వద్దనే అభ్యసించండి . మొన్న నన్ను ఒక నృత్య ప్రదర్శనకి న్యాయ నిర్ణేతగా పిలిచారు . వారు కూచిపూడి అని ప్రదర్శించిన నాట్య కూచిపూడి కాదు . వస్త్రధారణ, ఆహార్యం ఏ ఒక్కటి సరిగ్గా లేదు . నేను మార్కులు వేయలేను అని చెప్పాను .

*ఈ పరిస్థితికి కారణం  ఎవరంటారు ? ఏమి చేయాలని మీ ఆలోచన ?

ఒక్కరు కాదు  అందరు . వేరే వేరే చోట్ల నేర్చుకో వడం ఒకరికి ఒకరికి పొంతన  లేకండా పోతుంది .  చిన సత్యం మాష్టారు ఉన్నప్పుడు అందరు ఒకేలా చేయాడానికి ఆరాటపడేవారు .ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . మళ్ళి  గురువులకునాట్య పునశర్చరణ తరగతులు జరగాలి . అప్పుడే శాస్త్రీయ కూచిపూడి అందరికి చేరుతుంది .  పది కాలాల పాటు నిలిచి ఉంటుంది .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

                                                                                                                                                        -అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

3 Responses to నర్తన కేళి -6

  1. srinivas guthula says:

    Very nice

  2. srilakshmi chintaluri says:

    మీ వ్యాసం చాల బాగుంది అందుకు ధన్య వాదములు -శ్రీలక్ష్మి

  3. Ravi says:

    చాల బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)