వాడితో జాగ్రత్త !!

 శరీరాలని

చూసినప్పుడల్లా నోట్ల కాగితాలే కనిపిస్తాయి

వాడికి

 నౌకల్లా దేహాల్ని ఉపయోగించుకుని

మురికి ఆలోచనల నదుల్లో

కోరికల్ని మారకం చేస్తూ

కరెన్సీ కాగితాల వాసన రక్తంలోకి రవాణా చేసుకుంటూ

మానవత్వాన్ని మచ్చుకైనా   కనిపించకుండా

మారేడు కాయ చేయగల

మాయగాడు

 

తాగుడు కోసం తండ్రి రూపంలో నక్కలా

కామంతో కళ్ళు నిండి

ప్రేమ ముసుగులో

కోరికలు తీర్చుకుని చంపే   గొర్రె చర్మం కప్పుకున్న తోడేలులా

డబ్బుకు మానం అభిమానాల్ని

అమ్మ ,  అక్క  చెల్లెళ్ళ బంధాలని తూకం వేసి

దైవభయం, ఆత్మ  భయం లేక వారి దేహాలను అవయవాలను సైతం

అమ్ముకునే నయ వంచకుడు

రక్తపిశాచి రూపంలో చుట్టు పక్కన తిరిగే వంచకుడై

పొరుగువాడి రూపంలో

ఎక్కడో ఒక దగ్గర నీకు తారస పడకుండా ఉండడు

ఎందుకంటే వాడికి ” ఆడది  ” అంటే

ఒక  పదార్ధం

 

కపటం తెలియని పావురాలను

మోసంతో  చిక్కించుకుని  అమ్మేస్తూ కాలం గడుపుతూ

సమాజంలో మనుషులమద్యే

వాడు

 

శరీరం అంటే వాడుకుని వదిలేసే వస్తువే వాడికి

కులమతాలుండవు

ఆస్తులు చదువులు పట్టవు

కేవలం దేహం మాత్రమే కనబడుతుంది

 

వాడెళ్ళే  రోడ్లమీద ట్రాఫిక్ జాం లుండవు

ఎందుకంటే చేసేది విమెన్ ట్రాఫికింగ్

హ్యూమన్ ట్రాఫికింగ్ కదా ‘!!

నా వరకోచ్చినప్పుడు కదా అనుకునే సమాజంలో

మనతో పాటే సహజీవనం కదా

– మెర్సీ  మార్గరెట్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
D.Venkateswara Rao
D.Venkateswara Rao
7 years ago

మెర్సీ మార్గరెట్ గారు వాడితో జాగ్రత్త అని చాలా బాగా కవితని అల్లారు
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కవితలో వ్రాస్తారని ఆశించవచ్హా

మీ కవిత చదివిన తరువాత నాకిలా వ్రాయాలనిపించింది

వాడితోనే కాదు
వీడితోనే కాదు
ఎవడితోనైనా జాగ్రత్త
మాట కలిపెవాడితో జాగ్రత్త
మాటల్లోపెట్టేవాడితో జాగ్రత్త
ప్రేమిస్తున్నాననే వాడితో జాగ్రత్త
ప్రేమించక పొతే చస్తాననే వాడితో జాగ్రత్త
తెలియని వాడితోనూ జాగ్రత్త
తెలిసినవాడితోనూ జాగ్రత్త
కష్టాల కడలి నుండి కడతేర్చి
సుఖ సాగరంలో మున్చుతాననేవాడితో -జాగ్రత్త
డబ్బున్నవాడినని చెబుతూ కర్చుకు వెనుకాడకుండా
ఆ డబ్బు మత్తులో మాయచేయాలనుకునే వాడితో – జాగ్రత్త
కులం పట్టింపులు లేవని చెప్పుతూ
వెనుకపడి తీయగా మాట్లాడే వారితో తస్మాత్ -జాగ్రత్త
ఆణువణువూ పొగుడుతూ ప్రేమకురిపిస్తూ
అడుగడుగునా వెంటపడి నీవేమన్న సహించేవాడితో చాలా -జాగ్రత్త

అడుగు తీసి అడుగు వేస్తె
ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని
ఆశతో కోరికలతో కాకుండా
ఆశయాల ఆలోచనలు రూపొందించుకొని
మెలకువతో లౌక్యంగా
లక్ష్య సాధనలో ముందుకు పోతూ
అందుకు కావలసిన మనొభలాన్నిసమకూర్చుకుంటూ
తోటివారిని కలుపుకుంటూ
ఆడది తన బాట తానె వేసుకుని
ఎవడి అవసరమూ లేకపోయినా
హాయిగా ఆనందంగా జీవించాలి

దడాల వెంకటేశ్వరరావు

Mercy Margaret
Mercy Margaret
7 years ago

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు సర్ , మీరు చెప్పిన విషయాలు ఆచరించే ప్రయత్నం చేస్తాను .