మళ్ళీ ఓకొత్త శకం

ఇంకెంత అదిగో ఆ మలుపే వచ్చేశానిక
అంటూ
అమ్మయ్య అనుకుని ఘడియైనా కాలేదు
ఒక సుదీర్ఘ పయనానికి తెర వాలే సమయం అని
సంబరపాటు క్షణమైనా మిగల్లేదు
మలుపు ఆరంభంలోనే
మళ్ళీ ఓ కొత్త బాట
ఎగుడు దిగుళ్ళూ , ఆటుపోట్లూ
అన్నింటికీ పూర్తి విశ్రాంతి నిద్దామనుకుంటే
అది ఒక విరామం మాత్రమే అయింది.
ఎక్కడో ఓ చిన్న వెలుగు గోటిచారలా
విదియనాటి నెలవంకలా సన్నని తుఫానురేఖ
క్షణ క్షణం విజృంభించి
నిలువెల్లా కమ్ముకున్నప్పుడు
మొదటి సారి కేరుమనే పసిపాపై మనసు
మళ్ళీ జీవన సమరానికి సన్నద్ధ మవుతూ
నాకేంతెలుసు ఓ తుది మలుపు
మరో కొత్త యుగానికి నాంది అవుతుందని
రోజూ పెరిగి పెరిగి పూర్తిగ విరిసిన పున్నమి వెలుగులు తరిగితరిగి
చీకటి సముద్రాన ఓ రోజు ఓలలాడి మళ్ళీ ఉదయించినట్టే
వేడి వడగాలుల్లో తపించి తపించి ఉక్కిరిబిక్కిరైన చల్లగాలి
మళ్ళీ హేమంతం సేదదీర్పులో గుక్కతిప్పుకుని వసంతాన
వాకిట కాలాంచినట్టూ
వినయంగా తలవంచుకు
చేతులు కట్టుకున్న కొత్త ఉషోదయం
వేలికొసలతో నిమిరి బుజ్జి కుక్కపిల్లను ముద్దాడినట్టు
సౌకుమార్యపు చిరునవ్వులాలింపుల్లో
మళ్ళీ ఓకొత్త శకం

– స్వాతీ శ్రీపాద ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to మళ్ళీ ఓకొత్త శకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో