స్త్రీ యాత్రికులు (2వ భాగం)

12 వేల మంది తోడుగా  యాత్రచేసిన ఎమిలీ ఈడెన్, ఫానీ ఈడెన్(2)

అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఇలాంటి కొత్త సమస్యతో ఉన్న సమయంలో వారి బంధువు విలియం ఓస్ బర్న్ ,ఫానీ

ఈడెన్ ని రాజమహల్ కొండల్లో పులి వేటకి ఆహ్వానిస్తాడు.విసిగి పోయి వున్న ఫానీకి ఇదే మంచి అవకాశం

అనుకొనిఅంగీకరిస్తుంది. “ మూడు నెలలపాటు హాయిగా కొండలలో తిరగవచ్చు అనుకోగానే ఎంతో

సంబరపడిపోయింది. ఈ రాజదర్బారులు దూరంగా పారిపోవడానికి ఇంతకంటే మార్గం లేదు. అన్నయ్యని

చూసుకోవడానికి అక్క ఎలాగూ ఉంటుంది.

కాబట్టి పరవాలేదు. అనుకొని బయల్దేరుతుంది. ఏదో ఒక ఉత్సాహంతో కూడుకున్న పని చెయ్యక పోతే ఫానీకి

మనశ్శాంతి ఉండదు.గత సంవత్సరం నుండీ కలకత్తాలో ఉన్న స్థానికులని చూసి  విసుగు పుట్టినా వారి గురించి

తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువయింది ఆమెలో.. భారతీయులంటే ప్రేమ గౌరవం కూడా ఏర్పడ్డాయి .. స్కెచ్

పుస్తకాల నిండా తన సేవకుల బొమ్మలే.. వారి జీవితాల గురించి తెల్సుకుని భారతీయులపై ప్రేమని పెంచుకుంది.

అక్క మాదిరిగా ఇంటి మీద గాలిమళ్ళకుండా ఉండేందుకు ఈ రాజ్ మహల్ కొండల ప్రయాణానికి ఒప్పేసుకుంది

ఫానీ..  ఈ యాత్ర నాకు శక్తినీ బలాన్నీ ఇచ్చి నాలో ఎంతో సంతోషాన్ని నింపింది అని రాసుకుంది.. తన డైరీలో…

1837వ సం జనవరి ఒకటో తారీఖున  వారి వేట యాత్ర మొదలైంది.. ఓస్ బర్న్ చాలా ధైర్యశాలి. తనకి వేటలో

సహాయ పడేందుకు.. ఇరవై ఏనుగులతో పాటు 260 మంది సహాయకులు వస్తున్నారు..

కలకత్తా నగరానికి ఉత్తరంగా 226కి.మీ దూరంలో ఉన్న రాజ్ మహల్ అడావులలోకి వెళ్ళడానికి మొదట్లో ఫానీకి

కొంచెం భయం అనిపించినా తనతో పాటు పదహారు మంది వ్యక్తిగత సేవకులు ఇద్దరు స్త్రీలు కూడా తోడుగా

ఉంటారు కాబట్టి ఒప్పుకుంది.. ’నేను జాగ్రత్తగా ఉండక పోతే ఏ పులి ఓట్లోకో లేదా ఏ ఖడ్గమృగం కొమ్ము

మీదకో  చేరుకుంటాను.. అని ఇంగ్లండులో ఉన్న తన స్నేహితురాలికి ఉత్తరాలు  రాస్తుంది.. ఇలాంటి అవకాశం

ఫానీ ఈడెన్ కి రావడం నిజంగా చాలా అదృష్టం..

వారు బయలు దేరిన నేల అంతా చిత్తడి నేలలు. ఆ దారిలో ఒక పెద్ద మొసలిని చంపుతారు సేవకులు ఫానీ మాత్రం

ఏనుగు దిగకుండా స్కెచ్ లు వేస్తుండేది. ఓస్ బర్న్ అయిదు నిమిషాలు కనిపించక పోతే ఎంతో

దిగులుపడుతూ ’నన్ను ఈ ఆసియా అడావుల్లో వదిలి ఎటు వెళ్ళిపోయాడో’ అంటూ చాలా దిగులు పడేది.

ఈ యాత్ర లో ఫానీ వేసిన డ్రాయింగులు చాలా గొప్పగా ఉంటాయి. వారి సేవకులు ఒక చిన్న సరస్సులో ఏనుగుల్ని

కడుతున్న దృశ్యాలని చిత్రించిన తీరు ఎంతో బాగుంటుంది. తన పని వారి బొమ్మలు, రెండు చక్రాల

బళ్ళు  అడవులు పురాథన మందిరాలు ఇలాంటి దృశ్యాలన్నీ ఫానీ బుక్ లోకి చేరిపోయేవి.

నీటి కాలువలు దాటుతున్నప్పుడు వాటిలో ఉండే  మొసళ్ళను చూసి భయపడేది. దారిలో తన

సేవకులు  గ్రామంలోని గ్రామస్థుల నుండి బలవంతంగా ఆహారాన్ని లాక్కొచ్చి, తన వద్ద నున్న డబ్బుని

వారికివ్వడం లేదని తెల్సుకొని తానే స్వయంగా వెళ్ళి రైతుల చేతికి డబ్బులిచ్చి  కొనుక్కుని వచ్చేది. తాను

తింటున్న ఆహారం దొంగది కాకూడదు అనేది ఆమెకి స్పష్టమవ్వాలి. పేద వారి శాపాలు, తిట్లు

తనకు తగలకూడదు.

ఆ దారిలో ఒక సారి ఫానీకి స్థానిక మహారాజు  రెండు నెమళ్ళు, ఒక తేనె బుంగ, చిన్న జింకపిల్లను బహుమతిగా

తెస్తాడు. వాటిని కష్టపడి సంపాదించిన అతన్ని చూడటం కోసం, తన గుడారం నుండి

గులాబీ రంగు నైటీలో బయటకి వచ్చి ఆ బహుమతుల్ని స్వయంగా స్వీకరిస్తుంది.

ఫానీ అంటే పరిసర ప్రాంతాల్లోని వారికి బాగా తెల్సిపోయింది.

(ఇంకా వుంది)

Uncategorized, , , , , , , , , Permalink

One Response to స్త్రీ యాత్రికులు (2వ భాగం)

  1. maheedhara says:

    ఈ సీరియల్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది .ఆసక్తిగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)