ఎందుకు చదవాలి ?ఇదే ప్రశ్నని ఒక టీచర్ని అడిగితే, ఇదేం ప్రశ్నండీ అంటూ మొదలు పెట్టి విద్య మరియు దాని ప్రయోజనములు అనే ప్రసంగ వ్యాసాన్ని చదవడం మొదలు పెడతాడు. అదే ఓ విద్యార్ధిని అడిగితే, ఎందుకేమిటి సార్ మార్కులకోసం చదవాలి ఆ మార్కుల వలన ర్యాంకులు వచ్చును ఆ ర్యాంకుల వలన ఉద్యోగము వచ్చును. అంటూ మొదలు పెట్టి కెరీర్ గైడెన్సు పాఠాలు అప్పజెప్పడం మొదలు పెడతాడు. ఈ దౌర్భాగ్యానికి కారణం మన విద్యా విధానం. దాన్ని బాగుచెయ్యడం బ్రహ్మ తరం కూడా కాదు.మరి మనం ఎందుకు చదవాలంటారు ?ఎందుకు చదవాలంటే, మన్ని మనం అర్ధం చేసుకోవడానికీ.., మన చుట్టూ ఉన్న సమాజాన్ని అవగతం చేసుకోవడానికీ.., మన తోటివారికీ మనకీ మధ్యగల సంబంధాలని మెరుగు పరుచుకోవడానికీ.., మానవ సంబంధాలని పటిష్ట పరచుకోవడానికీ.., అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక చలన సూత్రాలని తెలుసుకోవడానికీ.., ఆయా సూత్రాలని నిజ జీవితంలో పాటించే సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలని గుర్తించడానికీ.., వాటిని అధిగమించే ప్రయత్నంలో మనవే అయిన జీవన విలువలని తయారు చేసుకోవడానికీ చదవడం చాలా అవసరం.అయితే అందుకోసం ఏం చదవాలి ?
|
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
26 Responses to ఎందుకు చదవాలి ?