సంపాదకీయం

మనసు పుస్తకానికి ముఖమే దర్పణం …

మనసులోని భావాలేవో మొఖంమీదే ప్రతిబింబిస్తాయి.

అద్దంలో చూసుకుంటే వున్న లోపాలతో సహా ఆ మొఖమే కనిపిస్తుంది కానీ లేని సౌందర్యాన్ని చూపించదు కదా!

రాసుకోవటానికి గోడ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు విషపు గీతలు గీస్తే… ఏమవుతుంది?

స్త్రీలపై , విద్యార్దినులపై , దళిత , మైనారిటీ వర్గాల పై చివరికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది వ్యక్తులు తమ పైత్యాన్నంతా ముఖపుస్తక గోడల మీద కుమ్మరించిన వైనం యువతనీ ,తల్లిదండ్రుల్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇది సిగ్గుపడాల్సిన విషయం. తీవ్రంగా స్పందించాల్సిన విషయం కూడా.ఈ సంఘటనలో పాల్గొన్న ఒక పండితుడు తన బృందంతో ఆధిపత్యపు విషపు భావజాలాన్ని సాధ్య మైనంత వరకూ యువతకి ఎక్కిస్తూ అంతర్జాలంలో పలుచోట్ల ఇలాంటి వ్యాఖ్యానాలనే చేసాడు.

అంతర్జాలంలో హద్దులు లేని ఈ సంస్కృతి పై తిరగ బడే చైతన్యం స్త్రీలలో రావటం దానికి ఎంతో మంది పురుషులు మద్దతు తెలపటం ఆహ్వానించదగ్గ పరిణామం. అయినప్పటికీ ఈ అంశం పై పలు ప్రాంతాల్లో జరుగుతున్న చర్చా వేదికల్లో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పురుషులు , స్త్రీలు కూడా కోడిగుడ్డుకి ఈకలు పీకుతూ అమ్మాయిల వస్త్ర ధారణ మీదే పడి గగ్గోలు పెడుతున్నారు.

పురుష స్వామ్య భావ జాలాన్ని పెంచి పోషిస్తున్న స్త్రీ,పురుషులు మాత్రమే స్త్రీలపై ఇన్ని హత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్న తరవాత కూడా ఆ విమర్శలు చేస్తున్నవారిని సమర్ధించుకుంటూ వస్తున్నారు. యువతులపై ఏదో ఒక అఘాయిత్యం జరిగిన ప్రతిసారి అసలు విషయాన్ని ప్రక్క దారి పట్టిస్తూ తిరిగి స్త్రీలనే నిందించడానికి తయారవుతున్నారు. స్త్రీల వస్త్రధారణ వల్లే, ప్రవర్తన వల్లే లైంగిక దాడులు జరుగుతున్నాయని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారు. వృద్దులు,పసి పిల్లల పై లైంగిక దాడులు ఎలా జరుగుతున్నాయన్న దానికి సమాధానం వీళ్ళే చెప్పాలి.ఆ వాదనలో ఎంత బలం ఉంటుందో. ఎంత నిజాయితి ఉంటుందో, వారు విశాల హృదయంతో స్త్రీలని అర్ధం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది.

అదే విధంగా ఆధిపత్య వర్గాల చేతిలో లైంగిక దాడులకు, హత్యలకు ,అణిచివేతకు గురవుతున్న బలహీన వర్గాల మహిళల వైపు ఎంత మంది అండగా నిలబడుతున్నారనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం.కుల హత్యలకు గురైన స్త్రీ, పురుషుల పట్ల కూడా కనీసం మానవత్వాన్ని ప్రకటించాకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమో లేదా ఇవి సర్వ సాధారణం అన్నట్లుగానో, దాడులకి కులాలకి సంబంధాలు లేవన్నట్లుగా వాదనకు దిగటం జరుగుతూనే ఉంది. లైంగిక దాడులకి, అణగారిన వర్గాలపై దాడులకి కులంతో సంబంధం లేనప్పుడు ఖైర్లాంజి , లక్ష్మీం పేట,చుండూరు ,కారం చేడు సంఘటనల వెనక ఏ నేపథ్యం ఉందో జగమెరిగిన సత్యమే. లైంగిక దాడులకి గురైన స్త్రీలపై పితృస్వామ్యాన్ని మోసే స్త్రీలు కనీసం సానుభూతిని ప్రకటించక పోవటం శోచనీయం.

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో