మీరేమంటారు? (చర్చ)

“ఆధునికత” ప్రతి కాలంలోనూ, ప్రతి సాంఘిక అధ్యాయంలోనూ, ఆయా కాలాలకు సరితూగే పదమే! పూర్వ పద్ధతులను ప్రశ్నించి, తన మార్గాలను బయల్పరచి, క్రొత్త దారులను ఏర్పరచేదే!
సమాజం ప్రతి సందర్భంలోనూ (ఫేజ్) ఆధునికతను నాగరికత పేరిట సంతరించుకుంటూనే ఉంటుంది. ఆధునికత రెండు రకాలు. (౧) మార్పుని అప్పటికప్పుడు సమాజంలో ప్రతిబింబించేది. (౨) ఒక అడుగుగా మొదలైనా, కాలక్రమేణా ఇంకా వర్ణాలను సంతరించుకుని, రెక్కలను తొడుక్కుని కొన్నాళ్ళకు అనామకంగా ఉన్న దశ నుండి సీతాకోకచిలుకగా మార్పు చెందేది.
ఇహ జెండర్ విషయానికి వస్తే, ఆధునిక పురుషుడు/ ఆధునిక మహిళ అంటూ విడదీసే పరిస్థితి రావడమే దౌర్భాగ్యమంటాను నేను! మీరేమంటారు?

     – విజయ భాను కోటే 

రాఘవేంద్రరావు నూతక్కి :

.మీరన్నది సత్యం. ఆధునికతకు పరిమితులేమీ వుండవు పురాతనతను ఆదరిస్తే నేటికి ఆధునికత అవుతుంది. .నేటి ఆధునికతను నిరాదరిస్తే పురాతనత్వం..కొత్తొక వింత పాతొక రోత నేటి రోత భావితరాలకు క్రొత్త కావొచ్చు. .ఆధునికతా అంతే. ఓ వృత్తాకార పరిధి. ఆ పరిధిలోనే అన్నీ.

వనజ వనమాలి:

పరిణామ క్రమంలో ప్రతి మలుపు ఆదునికత సంతరించుకున్నదే.. అని నా అభిప్రాయం. ఆధునిక మహిళ \ ఆధునిక పురుషుడు అంటూ విడదీయడం పెద్ద అభ్యంతర కరం కాదు. ఆధునికత ఒక్క రోజులో రాలేదు. ఒకవేళ వచ్చినా ఆ ఆదునికత ఆమోదిన్చాతగినది గా ఉండదు. మఖ లో పుట్టి పుబ్బలో మాయ మైనట్లు అవుతుంది. కాలక్రమేణా జీవన సరళి లో ఒదిగిపోతూ..మారక తప్పని పరిస్తితులల్లో మార్పు అనివార్యమై అందరూ ఆమోదించదగ్గ రీతిలో ఆదునికత చోటు చేసుకుంటుంది.ఉదాహరణకి ఫేజ్ 3 కల్చర్ తీసుకోండి.అది కొన్ని వర్గాలకే పరిమితం. అదే మహిళా ఉద్యోగ ఆవశ్యకత గుర్తెరిగి ఉన్నాం కాబట్టి అది అన్ని వర్గాలు ఆమోదించ తగినదే! ఆదునికత అంటే నాగరికత కాదు. మన ఆలోచనలు నాగరికంగా మారని రోజు మనం ఎంత నాగరికత ముసుగు వేసుకున్నా పెద్దగా ప్రయోజనము ఉండదు. మహిళా ఆధునికంగా మారినప్పుడు (మార్చుకున్నప్పుడూ) అది వ్యక్తిగతం కన్నా కూడా సామాజికం గా ఎక్కువ ప్రయోజనకారి అవుతుంది. అలాంటి మహిళలకి సహకారం అందిస్తూ అర్ధం చేసుకునే పురుషులని ఆధునిక పురుషులు అనడం లో అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.వెనుక ముందూ.. స్త్రీ పురుషులు ఇరువురు..ఆధునికత సంతరించుకోవాల్సినదే ! కేవలం స్త్రీ మాత్రమె ఆధునికత సంతరించుకుంటే..పురుషుల ఆలోచనలు మారకుంటే నష్టపోయేది అందరూ కూడా. మార్పు అనివార్యం అయినప్పుడు ఇద్దరూ మారాల్సిందే. అని నా అభిప్రాయం. జెండర్ ప్రాతిపదిక పై విభజించడం తగదు కూడా.

కరణం లుగేంద్ర పిళ్ళై;

ఆధునికత అనేది ఎప్పటికప్పుడు నిత్యనూతనమే.. ఆధునిక పురుషుడు/ఆధునిక మహిళ అనేది జెండర్ విషయానికి వస్తే విడదీసే పరిస్థితి రావడం దురదృష్టమే అయినా. మనం సమాజ పోకడ చూసి వాస్తవాలు చూసి మాట్లాడవలసి ఉంటుంది. గత 20 సంవత్సరాలకు ఇప్పటికి జెండర్ విషయంలో కొంత పురోగతి సాధించినా మహిళకు కుటుంబంలోనూ, సమాజంలో ఇంకా భద్రతలేదనేది వాస్తవం. అంతేగాక మహిళ ఉద్యోగం, చదువు రీత్యా ఎక్కువగా ఇంటిని విడిచి ఉండటం వల్ల ఆమెకు సమాజం పై అవగాహన పెరిగినా వ్యక్తిగతంగా ఇంకా మానసిక సమస్యలు, లింగ వివక్షత కొనసాగుతూనే ఉన్నాయనే చెప్పాలి.

నళిని :

అభివృద్ధిని  కోరేది ఏదైనా అది  ఆధునికతే . అది మనకి  గురజాడలో , శ్రీశ్రీ లో , రావి శాస్త్రి లో , ఇంకా అనేక మంది లో కనిపిస్తుంది .అందులో  స్త్రీ పురుషలని వేరు చేసి చూడనవసరం లేదు .కాక పోతే స్త్రీలకి ప్రత్యేక సమస్యలుంటాయి కాబట్టి స్త్రీల గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి .అలానే ,స్త్రీలందరినీ ఒకే మూసలో కూడా చూడ కూడదు .కులం ,వర్గం చాలా  ప్రభావం చూపుతాయి .వాటినించి బయటపడే  నిజమైన  సమసమాజాన్ని కోరడమే అభివృద్ధి అవుతుంది . అప్పుడే అభివృద్ధి కరమైన స్త్రీపురుషులు తయారవుతారు . ఇది ఒక్కరోజులో జరిగిపోదు .నిరంతర సంఘర్షణ ద్వారానే ఇది సాధ్యం .చిన్న చిన్న విజయాలు మెట్ల లాంటివి ,అంతే .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
D.Venkateswara Rao
D.Venkateswara Rao
8 years ago

చరిత్ర తెరిచిన పుస్తకం దీనిపై చర్చ అనవసరం అని నా అభిప్రాయం. ఆధునికత గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆధునికత మీరు అనుకున్న మొదటి రకంలో త్వరితగతిన విస్తరించి అంతరిస్తుంది. ఇక్కడ ఆదునిక మహిళ అనవచ్చు
రెండవరకంలో ఆలస్యంగా సంతరించుకుని మార్పును తీసుకు వస్తుంది. ఇక్కడ వేదదీసే అవకాసం లేదు.