2012 స్మైల్ సాహితీ పురస్కారాలు , రాజమండ్రి

2012 డిసెంబర్ 25 వ తేదీన గోదావరి తీరాన హోటల్ మహాలక్ష్మిలో స్మైల్ సాహితీ పురస్కారాల సభ ఘనంగా జరిగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిగా, కధకుడిగా, రచయితగా,అనువాదకుడిగా స్మైల్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్మైల్ పేరిట వారి కుటుంబ సభ్యులు సాహితీ పురస్కారాలను , పది వేల నగదును అందజేస్తున్నారు .
2011, 2012 సంవత్సరాలకు గాను డా. సీతారాం , డా. సామాన్య లకు ఈ సాహితీ పురస్కారాలను అందజేసారు. వక్తలుగా శ్రీ పతంజలి శాస్త్త్రి , శ్రీ కొమ్మన రాధా కృష్ణ రావు, శ్రీ ఖాదర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. అవార్డ్ గ్రహీతలు డా.సీతారామ్ మాట్లాడుతూ సాహిత్యాన్ని విస్తరించాలనే ఎజెండా స్మైల్ కి ఉందని ,ఈ పురస్కారం ద్వారా వచ్చే ప్రతి పైసా తెలుగు సాహిత్యానికి ఒక కవిని కాని ఒక కథకుని కాని పరిచయం చేయడానికి వినియోగిస్తానని మాట యిస్తున్నాని అన్నారు.
డా. సామాన్య మాట్లాడుతూ స్మైల్ గారితో పరిచయం లేక పోయినా వారి అక్షరాలతో పరిచయం ఉందని, ఒక సారి అనుకోకుండా ఆదివారం నాడు ఒక కవిత తన కంట పడిందని… అందులో ఒక లైను ” ఛాతికే తప్ప వీపుకు సిగ్గుం డదేమో ‘ అనీ ,కొన్ని స్మైల్ కవితలను ప్రస్తావించారు. చివరగా ముస్తాఫా వందన సమర్పణ చేసారు .

సాహిత్య సమావేశాలుPermalink

Comments are closed.