రాజమండ్రి పుస్తక మహోత్సవాలు

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ & నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యములో రాజమండ్రి పుస్తక మహోత్సవము నవంబర్ 23 నుండి డిసెంబర్ 2 వ తేది వరకు జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన సందర్భంగా సాహితీ గౌతమి పలు సాహిత్య సభలు , విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటిలు నిర్వహించింది.

23 వ తేదిన ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు అధ్యక్షులుగా , వై.స్ .నరసింహారావు వక్తగా ‘కందుకూరి వీరేశలింగం రచనలు , సాహిత్య సేవ, అనే అంశం పైన , 24వ తేదిన ఎస్.పి. గంగిరెడ్డి అధ్యక్షులుగా రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, శ్రీమతి వెలువోలు నాగ రాజ్య లక్ష్మి వక్తలుగా ఆది కవి నన్నయ్య కవిత్వ సభ , 27 వ తేదిన యర్రా ప్రగడ రామ కృష్ణ అధ్యక్షులుగా శ్రీమతి కె.ఎన్ మల్లీశ్వరి , నండూరి రాజగోపాల్ వక్తలుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య సభను , 01 వ తేదిన పతంజలి శాస్త్రి అధ్యక్షులుగా యు.ఎ . నరసింహమూర్తి , శ్రీమతి అయ్యగారి సీతారత్నం వక్తలుగా మహాకవి గురజాడ వర్ధంతి సభ జరిగాయి.
విద్యార్ధినీ, విద్యార్ధులకు కథా విశ్లేషణ , శ్రీ శ్రీ కవితల కంఠస్థ పోటీ , కవితా రచన పోటీ , వ్యాస రచన పోటీ, విజ్యువల్ క్విజ్ మొదలైన పోటీలని నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులకు డిసెంబర్ 2వ తేదిన పుస్తక మహోవత్సము ముగింపు సభలో ప్రధమ,ద్వితీయ , తృతీయ బహుమతులను ప్రదానం చేసారు.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.