ఒక్కసారి ఆమె స్వరం విను

1.
ఒక్కసారి
ఆమె స్వరం విను

2.
ఏ పెరటి మొక్కో
నాకెందుకనకు !?
నీలోని విత్తనం కూడా
ఏదో ఒక పెరటికెల్లాల్సిందే
మర్చిపోకు

3.
జీవితపు శిఖరానికి
నిన్ను చేర్చడానికి
మెట్లు మెట్లుగా దేహాన్ని విరగొట్టుకున్న
ఆమె
ఎప్పుడు కాళ్ళకిందే అనకు
జారుడు బండ కూడా కాగలదు

4.
వెలిగించబడి వెలిగిస్తూ
ఇంటి దీపంలా ఆరిపోయేదే కాదు
ఆమె
ఆడుకోవాలనుకుంటే
అరణ్యానంత అంటించగల అగ్ని కుంపటిగా
అవతరించగలదు
5.
ఒక్కసారి
ఆమె స్వరం విను
చీల్చిబడిన మర్మావయపు రక్తం
ఏదో మొరపెడుతుంది
తను నీ చెల్లో , చెలియో కాదని వెళ్లకు.

6.
కోర్కెలు తీర్చుకునే కామాందులు
మనలోనే ఉన్నారని తెలియక మసలే
పావురాల్లరా ఆలోచించండి !
ఇంకా గుంపులుగా తిరిగే రోజులే ఇవి
స్త్రీకి స్వాతంత్ర్యం వచ్చి
అర్ధరాత్రి ఆడపిల్ల ఒక్కత్తే నడిచివెళ్ళే
స్వరాజ్యం
ఈ భారతం కాదు.

– మెర్సీ మార్గరెట్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Jaanakiramam koramati
Jaanakiramam koramati
7 years ago

మల్లె మొగ్గ విరిసేవేల
పరిమళం ఒకటేకాదు,
స్వేతసౌదం ఒళ్ళు విరిచే అందం
ఆకాశాన్ని , సముద్రాన్ని పరవసింపచేసి
పర్యావరణాన్నిపసండుచేస్తుంది!
పడుచు అందాన్నియవనం
వెలువరిస్తున్నపుడు ఆకర్షణ
ఆనండిన్చడంపోయి,ఆరావాహం
నయనానందం కసిని కలబోసికొని
మదం మృగ పాశాన్ని ఒలక పోస్తున్నపుడు-
మనసు రాక్షసంగా పరివర్తనం చెందినపుడు,
అవయాల విద్వంసం విలయతాండవం గాక
మానవీయ ఊహల కేక్కడుంది స్తానం !
స్త్రీ పురుష సంభందాల్లో సృగారం –
సముద్రంలోని అలలాంటిదని,
అల తీరం చేరగానే దాని జాడెక్కడ?
అది తెలిసిననాడు మదమెక్కడ? మగతన్మెక్కద?
మానవ విలువల జాడలు – మల్లెలా విరభూసేడెక్కడ ?
మగతనాన్ని మంచిగా మలిచే మార్గం –
మనమందరం వెదుకుదాం రండి !………
మొగ్గలాంటి ఆడతనాన్ని పరిమలింప చేద్దాం రండి !…..

buchi reddy
buchi reddy
7 years ago

బాగుంది మార్గ రట్ గారు

బుచ్చి రెడ్డి గంగుల

mercy margaret
mercy margaret
7 years ago
Reply to  buchi reddy

ధన్యవాదాలు బుచ్చి రెడ్డి గారు