నా రౌద్ర వర్షం

ఘోరం ఘోరం ఘోరం….
పూజించాల్సిన దేవతలని

కామ రూపంలో చూసే విచ్చలవిడితనం….
పాశవిక మృగాల చేతుల్లో బలైపోతున్నాయి

అనేక ఆడబిడ్డల మాన ప్రాణం….
రాక్షసులకే ఛీత్కారంగా తోచే మహా నీచ కార్యం…..
ప్రతి మనిషీ చూసి బెంబేలెత్తిపోయిన ఉన్మాదం….
ఒక చోట లేదు ఒక వయసు లేదు

 ఆలికి చెల్లికి తేడా  లేదు

 మనిషి మరిచేపోయాడు మానవత్వం….
నిస్సిగ్గుగా బట్టలిప్పి

 బజారుకెక్కింది కుసంస్కారం…..
నిర్లజ్జగా నేను మగాడిని అని చెప్పుకుని

చంపేసుకుంది అసలైన మగతనం…..
అక్కడ ఆ ఇంద్రుని ఆనాడే చాచి కొట్టి

 నిలువునా తగలబెట్టి వుంటే

ఇంతకి బరి తెగించేది కాదు ఈ దౌర్భాగ్యం….
మగాడంటే ఏదైనా చేయొచ్చు అని రాసిన

పుక్కిట పురాణాలని పాతి పెట్టి సంస్కరించి వుంటే
మగాడు  మృగాడయ్యుండేవాడు కాదు

తరతరాలుగా సాగుతుంది

ఈ పచ్చి నిస్సిగ్గు యవ్వారం……
ఆడదంటే పడక గదికే

సుఖాల విందుకే

అని వాగిన శాస్త్రాల చెంప పగలగొట్టి

తిక్క తిన్నగ సవరించి వుండుంటే
ఇంతగా పేట్రేగేది కాదుగా ఈ నీఛత్వం…..
దేవుళ్ళ పేరుతో మా బాగా నూరిపోసి

 రెచ్చగొట్టారు చచ్చు రాచకార్యం…..
సరస రసిక  శిఖామణులని

వాళ్ళు  చేసిన పచ్చి విచ్చలవిడి తనాన్ని

 సమర్ధించటం మన దేశ  దౌర్భాగ్యం…..
చీరలెత్తుకెళ్ళటం, ఆడవాళ్ళని లేపుకెళ్ళే

కథలని మహా దైవకార్యంగా సెలవివ్వటం

మనకే చెల్లిన పిచ్చి లేకితనం…..

మగాడు అంటే తిరగకుండా వుండడనే

పనికిమాలిన సూత్రాలతో

మగాడ్ని అచ్చోసి వదిలేస్తున్నది ఈ సమాజం…..

ఎంత ఘోరం జరిగినా

ఆడది భారతీయత పాటించాలనే

వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది మన సంఘం….
మరి మగాడు పాటించాల్సిన భారతీయత ఎవ్వడూ బొధించడే

 అంత జుగుప్సాకరమా మగాడి నైజం…..
జరిగిన అన్యాయం ధిక్కరించకుండా

 ఆడవారి అంగాంగ ప్రదర్శనను  వర్ణించటం

నిజంగా ఎంత పాపం…..
వస్త్రధారణ వేషధారణ భేషుగ్గా వున్నా

జరిగే అరాచకాలకి ఏం చెప్తారు సమాధానం…….
కన్న కూతురుని సైతం ఆకలి చూపులు చూసే

దౌర్భాగ్య కొడుకులకి ఏ గడ్డి పెడితే వస్తుంది మనిషి నైజం….
పశువు కూడ థూ! అని చీదరించుకుని

అసహ్యించుకునేలా   దిగజారిపోయింది మానవ లక్షణం…..
ఎంత ఘోరాతి ఘోరం జరిగినా

 తమకేం పట్టనట్లు మొద్దు నిద్ర లో దొర్లుతుంది ప్రభుత్వం……
చేస్తాం చూస్తాం అనుకుంటూ

 సాగదీసి సాగదీసి చచ్చు తీర్పులతో

 పెంచి పోషిస్తున్నారు ఈ క్రూరత్వం…..
ఝాన్సీ రాణి కత్తి

 ప్రతి నారి చేతిలో ప్రత్యక్షమైతేనన్నా

 మారుతుందేమో మన లోకం….
రుధ్రమ దేవి కన్నెర్ర   చేసి విరుచుకు పడితే అయినా

వెనకడుగు వేస్తుందేమో ఈ రాక్షసత్వం…..
ప్రతీ స్త్రీ పరమ అగ్ని జ్వాలగా మారి

 నిలువునా ఈ పురుషాహంకారాన్ని తగలబెట్టి పాతిపెట్టే
ధైర్యం తెచ్చుకుంటేనే

 తోక ముడుస్తుంది ఈ మగ అహంకారం……
మారాలి మారాలి ఈ పచ్చి అడ్డగోలుతనం…..
మారకపోతే మరో ప్రపంచం మహా ప్రజ్వ్వలనమై

 మహోజ్వలిత ఆగ్రహావేశా లతో

ప్రతి పడతి రచిస్తుంది మరణ శాసనం…….

-అభిలాష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to నా రౌద్ర వర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో