టగ్ ఆఫ్ వార్ (ధారావాహిక ప్రారంభం)

– స్వాతీ శ్రీపాద

కిటికీలోంచి బయటకు తొంగిచూసింది వసుంధర.నిర్మానుష్యంగా వున్న రోడ్డు  అప్పుడో ఇప్పుడో వెళ్ళే స్కూటరో , ఆటో చప్పుడో తప్ప మరో అలికిడి లేదు.

నిజమే శంకర్ చెప్పినది సరైన మాటే. ఈ వేళప్పుడే వీధిలో జనం సందడి పలుచబారుతుంది. పదకొండున్నర పన్నెండుకు మధ్య.

అమ్మలక్కలు ఇళ్ళలో పిల్లలకు అన్నాలు పెట్టే హడావిడిలోనో బట్టలుతికి ఆరవేసుకునే పనిలోనో ఉంటారు.

లేచి ముస్తాబవడం మొదలుపెట్టింది వసుంధర.  లోపలి గదిలోకి వెళ్ళి చెక్క బీరువా తెరిచింది. అందులో పై అరలో

ఖరీదైన చీరలన్నీ చక్కగా మడతలుపెట్టి వాటిలో కర్పూరపు గోలీలు వేసి మరీ పెట్టింది తల్లి.

వారం క్రితం కొన్న కొత్త చీరలకోసం చూసింది వసుంధర.

స్కూల్లో పని చేసే యామిని వారం క్రితం మూడు పట్టు చీరలు స్కూల్ కి కంచినుంచి తెచ్చే చీరల వాడి వద్ద

వాయిదా పద్ధతుల్లో కట్టే విధంగా కొంది. అందులో తోపు రంగు అంచున్న  తెల్లజరీ చీర “వసుంధర పెళ్ళి కుదిరితే

బావుంటుందని”అందరూ అనడం కూడ చెప్పింది. వాటికి అక్కడికక్కడే ఫాల్ పీకోలు కుట్టించి మరీ తెచ్చింది.

వసుంధర నిన్న కాలేజీకి వెళ్ళేప్పుడే ఆ చీర పట్టుకెళ్ళి ఒక రెడీ మేడ్ ఫాన్సీ జాకెట్ కూడా కొని తెచ్చుకుంది.

తల్లిచూడకుండా మళ్ళి ఎప్పటిలా ఆచీరలోపల పెట్టేసింది.

ఉదయం ఎప్పటిలానే తల్లి నాగవేణి హడవిడిగా అన్నం కాస్త ఆకుకూర పప్పూ వండి అక్కడపెట్టి ఉరుకుల

పరుగులమీద ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న స్కూల్ కి వెళ్ళింది.

చెల్లెలు సాహితి అమ్మ వెళ్ళిన ఓ గంటకి తనూ వెళ్ళింది.నిజానికి చిన్నదైనా శ్రద్ధగా చదవడం వల్ల ఎక్కడ బ్రేక్స్

లేకపోడంతో సాహితి డిగ్రీ మొదటి సంవత్సరానికి వచ్చేసినా వసుంధర మాత్రం ఆర్నెల్లకో సబ్జెక్త్ పాసవుతూ ఇంకా

ఇంటర్ లోనే వుంది.

అదేమిటో చదివినప్పుడు అన్నీ వచ్చేసినట్టే ఉంటాయి కాని తీరా పరీక్షలు రాయబోయే సమయానికి మనసు

శూన్యమయిపోయి ఒక్కటీ గుర్తుకు వచ్చి చావదు.

tug of warఆర్నెల్ల క్రితం సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వెళ్ళి నప్పుడే శంకర్ తో పరిచయం. ఆటో ఎక్కి కూచుని ఇంగ్లీష్ పుస్తకం తెరిచింది , కాని ఆటో స్తార్ట్ చేస్తూనే పెద్ద సౌండ్ తో మొదలైంది పాట. పుస్తకం ఎటో జారిపోయింది. అప్రయ్త్నంగానే గొంతువిప్పి పాడటం మొదలెట్టింది. శంకర్ ఎప్పుడు సీడీ ఆపేశాడో తెలియదు. తను మాత్రం కళ్ళు మూసుకుని పాడుతూనే పోయింది.ఆటో రోడ్డువారన ఆగిన సంగతీ తెలియదు. పాటంతా పాడేశాక కళ్ళువిప్పి చూస్తే ఏముంది.. తన్మయంగా చూస్తూ శంకర్. సిగ్గుపడిపోయింది. వంగి జారి కింద ఆటోలో పడిన పుస్తకాన్ని అందుకుంది, కాని అప్పటికే చదివిన వాటికి రెక్కలు వచ్చి ఏమూలకు ఎగిరిపోయాయో, ఒక్క పదమూ అర్ధం కాలేదు.

” మీ పేరు వసుంధర కదూ ” కాస్త పాలిష్డ్ భాషలోనే అడిగాడు.

” అవును నీకెలా తెలుసు?”

” మేముండేది మీ ఇల్లు దాటాక నాలుగిళ్ళ అవతల. ” అంటూ క్షణం ఆగి, ” ఎంత చక్కగా పాడారు పాట, అచ్చు సుశీలలా…”

పొంగిపోయింది వసుంధర.

ఎంత సేపూ చదువు తలకెక్కడం లేదని తిట్టిపొయ్యడం తప్ప, ఇంటి పనులు చెయ్యడం లేదన్న సాధింపులు తప్ప

ఒక్కరోజూ …ఒక్కరోజన్నా ఎవరైనా ఇలా మెచ్చుకున్నారా?

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వసుంధరకు.

సినిమాలోలాగా ఒక్కసారి వెళ్ళి అతన్ని హత్తుకు పోదామనిపించింది.

 అంతే ఆరోజున ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదు కాని పరీక్షమాట గట్టున పెట్టి శంకర్ తో మాటలే నడిచాయి.

శంకర్ కి తండ్రి ఎవరో తెలియదు. తల్లి చెప్పించే చదువు అతనికి సొక్కలేదు.అందుకే ఆటో అద్దెకు తెచ్చుకుని

నడిపిస్తూ మరో పక్క సినిమాల్లో పాటలు పాడాలన్న తపన తో ప్రయత్నాలు.

నిజమే అతని గొంతు బాగానే ఉంటుంది.

లుంబినీ పార్క్ లో ఓ మూల కూచుని ఎన్నిసార్లు గంటలు గంటలు పాటలు పాడుకున్నారిద్దరూ…

సగం మాటలు ఒకరినొకరు పొగుడుకుందుకే చాలకపోయేవి.

గోడ గడియారం పన్నెండు గంటల సంగీతం వినిపించడంతో తుళ్ళిపడింది వసుంధర.

ఐదు నిమిషాల్లో శంకర్ ఇంటిముందుంటాడు. గబగబా చీరకట్టుకుని అద్దం ముందు నించుంది. కళ్లకు దిద్దుకుందుకు కాటుక చేతుల్లోకి తీసుకుందో లేదో ఇంటిముందు ఆటో హార్న్ వినిపించింది. చటుక్కున దాన్నక్కడే వదిలి సిద్ధంగా ఉంచుకున్న బాగ్ తీసుకుని ఇంటికి తాళం పెట్టి తలతిప్పి చూసింది.

శంకర్ కొత్తగా కనిపించాడు. ఫుల్ హాండ్స్ తెల్ల షర్ట్ స్లీవ్స్ సగానికి మడిచి తలస్నానం చేసిన జుట్టు గాలికి ఎగురుతోంది.

వెళ్ళి ఆటో ఎక్కింది వసుంధర.

మెచ్చుకోలుగా ఆమెను చూసి ఆటో ముందుకు దూకించాడు శంకర్.

                      *********************

పెళ్ళి తంతు సరిగ్గా అరగంటలో ముగిసింసి ఊరవతల ఉన్న అమ్మవారి గుడిలో ఇద్దరు శంకర్ మిత్రులు ఇద్దరు వసుంధర మిత్రుల సమక్షంలో.పూలదండలు, ఫొటోలు, మంగళ సూత్రధారణ యధావిధిగా ముగిసాక  ఎవరిదారిన వాళ్ళు టీ తాగి బయల్దేరారు.

ఇప్పుడేమిటిక అన్నట్టు అతనివంక చూసింది వసుంధర.

“పద ” ఆటోలో ఎక్కాక సరాసరి పోలీస్ స్టేషన్ ముందు తీసుకెళ్ళి ఆఫాడు శంకర్.

వెలవెల బోయింది వసుంధర మొహం ” శంకర్ ఏమిటిది?” తడబడుతూ అడిగింది. ……………..

ఎందుకో ఊహించగలరా? ఫ్రయత్నించి ఒక్క పది వాక్యాల్లో రాయండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to టగ్ ఆఫ్ వార్ (ధారావాహిక ప్రారంభం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో