శపించనా !?

                                                                                   

 

 

పున్నమిపూట నింగి ఎందుకంత నల్లని ముసుగేసుకుందో ..
ఇంతుల కన్నుల కాటుక కరిగి మేఘంగా మారినదని తెలియదెందుకో..
మద మత్సర క్రూర మనసుకు అర్ధం కాదు ఎందుకో ..

వేదన వెల్లువై ముంచెత్తదేమి ?
ఆక్రోశం  మేఘంలా  గర్జించదేమి?
దుఖం సముద్రమై చుట్టేయదేమి ?

ఈ మానవ మానసం ఎంత కఠినమైనది
నాతి ఎన్ని దౌష్ట్యాలకి కునారిల్లుతుంది
రాతి లెక్కన అయినా మారలేదేమి ?
ధూళి లెక్కన దూరంగా తరలిపోలేదేమి ?

courtesy:Times of Indiaఈ భువిపై మానవజాతిని మిగిలి ఉంచడానికి
ఇంకా ఇంకా భారాన్నిమోస్తూనే ఉన్నదెందుకు ?
యుగాల ధర్మంలో పూజ్యం కాబడిన ఔన్నత్యం ఎంత గొప్పదో
శతాబ్దాల సహచర్యంలో దక్కిన విలువలు ఏ పాటివో
గుర్తు చేసుకుంటూ తీరిక లేకుందేమో !

నగ్నత్వం నింపుకున్న వెలుగు లాగున
స్తిగ్ధత్వం నింపుకున్న పువ్వులాగున
ఉండటం పాపమైనదో,నేరమైనదో,
శాపమైనదో తెలియజాలక

జనని ని ఆశ్రయించిన జానకిలా నిర్వేదంగా
అస్త్ర సన్యాసం చేసిన ఆచార్యుడిలా  విరక్తిగా
తనవారిపైనే అస్త్రం సంధించలేని పార్దునిలా నిస్సత్తువుగా
తల్లికిచ్చిన మాట జవదాటని తనయుడిలా నీరవంగా నిలిచినట్లు

మానప్రాణాలపై దాడి చేసినప్పుడు ఎదుర్కోలేని అబలగా
పదఘట్టనల క్రింద నలిగిన పువ్వులా
పైశాచికాన్ని భరించిన పడతిలా
కాలనాగుల కాటుకు బలి అవుతూ
అడుగడుగునా రాళ్ళు ముళ్ళు నిండిన బాట లో
నలుగుతూ, నడుస్తూ నిర్వీర్యం అవుతూ..
ఈ నవీన నాగరిక సోపానాల పై ..
ధ్వంసమైన సంస్కృతికి ఆనవాలు గా నిలుస్తున్న
మానవజాతిని గొడ్రాలి గా మిగలమని శపిస్తున్నా!!
అమ్మని ..బొమ్మని చేసి ఆడినందుకు శపిస్తున్నా !!

                                                                         –  వనజ వనమాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

8 Responses to శపించనా !?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో