ఘోషిస్తున్న మనసు

– దుర్గ  డింగరి

పైశాచికత్వం, దుర్మార్గం, రాక్షసత్వం అన్నీ

కూడగట్టుకుని తాము హింసిస్తున్నది ఒక

మనిషిని అన్న విషయం మరిచిపోయి

ఇంత కర్కశంగా ఒక అమాయక జీవితాన్ని

సర్వనాశనం చేసి,

ఒక వస్తువును వాడుకున్నాక విసిరి

పారేసినట్టుగా పారేసే కౄరత్వం

రక్తాన్ని త్రాగి శరీరాన్ని పీక్కు తినే పిశాచాల్లా

ప్రవర్తించిన కీచకులకు

ఏ శిక్ష విధించాలని చర్చలు,

మాకు రక్షణ కల్పించాలంటూ,

నిందితులకు మరణశిక్ష విధించాలంటూ

ప్రదర్శనలు!

రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం

ఎందుకని ఘర్జిస్తున్నఅమ్మాయిల,

స్త్రీల ముందు తల ఎత్తుకోలేనివారు

ఇంకా మామూలు జీవితం ఎలా

సాగిస్తున్నారు?

మొగవారమైతే చాలు మా ఇష్టం వచ్చినట్టు

తిరగవచ్చు అనే తుచ్చమైన, పుచ్చిపోయిన

పుర్రెలతో అచ్చోసిన అంబోతుల్లా తిరుగుతూ

మంచి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి బ్రతుకుతున్న

కన్నెపిల్లల జీవితాలను అమానుషంగా, కిరాతంగా

నలిపేస్స్తున్న అధములకు ఏ శిక్ష విధించినా

తక్కువే?

అమ్మాయిలంటే భయపడి కడుపులోనే

హత్యలు చేస్తున్న సమాజం,

అబ్బాయిలు పుడితే పండగలు చేసుకుంటూ,

పెళ్ళికి ముందు బయట పిచ్చ తిరుగుళ్ళు

తిరిగితే అనుభవం కావాలి కదా అని ప్రోత్సహించే

తల్లి తండ్రులున్నంత వరకు,

అమ్మాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ అని

పెంచే సమాజం,

కట్నం కోసం అమాయకమైన పడతులను

తగలపెట్టే సంస్కృతి ఇంకా కొనసాగుతున్నంత

కాలం,

కొడుకైతే పున్నామ నరకం నుండి రక్షిస్తాడని

వాడికి ఎనలేని ప్రాముఖ్యతనిచ్చి పెంచుతున్న

వారున్నంత కాలం,

మినిష్టర్ల కొడుకులు మదం ఎక్కువై వూళ్ళల్లో

కంటికి ఇంపుగా కనిపించే ప్రతి స్త్రీ పై తనకు

హక్కు వున్నదని హింసించే దుష్టులున్నంత

కాలం,

ఇలాంటి సంఘటనలను ఆపలేము!

అమ్మాయి రేప్ కి గురయ్యి నగ్నంగా రోడ్డు మీద

స్పృహలేకుండా పడి వుంటే ఎవ్వరు సాయం

చేయడానికి ముందుకు రాని సాటి మనుషులు

రేపు మీ కూతుళ్ళకి ఇదే గతి పడితే ఎవ్వరూ

ముందుకు రారని గుర్తు పెట్టుకొండి!

దేశ పౌరులని రక్షిస్తామన్న

పోలీసుల్లారా ఖాకీ దుస్తులను తగలబెటట్టి,

మీ ఇంట్లో అమ్మాయిలతో ముఖాలమీద

ఉమ్మేయించుకొని సిగ్గుతో చావండి!

ఏ చట్టాలయినా ఇంత ఉన్మాదంతో, హింసాత్మకమైన

 చర్యలను చేసే వారిని ఎలా ఆపుతాయి?*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో