మానవవాదుల ప్రాంతీయ సదస్సు

ప్రముఖ సంఘసంస్కర్త సరస్వతి గోరా శత జయంతి సందర్భంగా…కళలకు  రాజధాని అయిన రాజమండ్రిలో ఆనం కళా కేంద్రంలోని సర్వారాయ కళామందిరం లో ఈ సభ జరిగింది.ఉదయం 10 గంటలకు సభను ప్రారంబించారు. దీనికి డా.వి.వి.రామారావు గారు అధ్యక్షత వహించారు.ఈ సభకు డా.విజయం,డా.మారు, ఎండ్లూరి సుధాకర్ రావు ,నియంత, నౌ, హరి సుబ్రహ్మణ్యం , పసల భీమన్న, డా.రాష్ట్ర , డా.పుట్ల  హేమలత, మార్ని  రామకృష్ణారావు పాల్గొన్నారు.
సభలో  విజయం గారు నాస్తిక కేంద్రం గురించి దాని ప్రస్తానం గురించి చెప్పారు.


ఎండ్లూరి సుధాకర్ రావు గారు మాట్లాడుతూ గుర్రం జాషువాకి గోరా కుటుంబానికి గల అనుబంధాన్ని, గోరా జాషువాల వ్యక్తిత్వాన్ని తెలియ జేశారు, ఈ ప్రపంచికరణ కాలం లో కూడా గోరా వారి భావ జాలాన్ని మానవతావాదం,హేతువాదాన్ని వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలియజేసారు.  డా.రాష్ట్ర మాట్లాడుతూ తనకు వాళ్ళ అమ్మమ్మ గోరా సరస్వతికి గల అనుబందాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు . డా.పుట్ల హేమలత గారు మాట్లాడుతూ సరస్వతి గోరాలో గల  ఆధునిక భావ జాలాన్ని , ఆచరణాత్మక వాదం  పై ఉపన్యాసించారు.చివరగా మనోరంజన్ గోరా కుటుంబంతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరుకు చర్చా కార్యక్రమం జరిగింది, తదుపరి 4 గంటల నుండి 6 గంటల వరుకు సాంసృతిక కార్యక్రమాలు జరిగాయి.పసల భీమన్నగారు వందన సమర్పణ  చేసారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలు, , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.