చూడాలని ఉంది

          వందన నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి .కష్ట పడి చదివి ఉన్నతోద్యోగం సంపాధించుకొని తన సంపాదనలో సగభాగం అనాధ పిల్లల కోసం, వృద్దుల కోసం సహాయం చేస్తుంది.అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది .అనాధ పిల్లల కోసం స్పందన ట్రుస్టును కూడ నిర్వహిస్తుంది. అంత చిన్న వయస్సులొ ఆమె సేవా దృక్పథబావనను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.

            వందన అణుకువ, అభిరుచి అందరిని ఆకట్టుకుంటాయి. అనాధ పిల్లలయితే ఆమె వచ్చిందంటే చాలు వారి ఆనందానికి అవధులుండవు..ఈ సేవా కార్యక్రమాలను చూసి ఆ జిల్లా కలెక్టరు మహిళా దినో త్సవం రొజు వందనను సన్మానించాలి అనుకుంటారు.
ఆ విషయము అమెకుతెలియజేసారు . మహిళాదినోత్సవం నాడు పెద్ధ ఎత్తున సభను ప్రారంబిస్తారు. ఆ సభకు అతిధులుగా వ్యా పార వేత్తలను రాజకియ నాయకులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని పిలుస్తారు. ముఖ్య అతిథి గా హైదరాబాద్ కు చెందిన మహదేవ్ గారిని కూడా పిలిచారు.
వందనకు జరిగే సన్మాన సన్నివేశం కొరకు అందరు ఎదురు చూస్తున్నారు ఇంక కొద్ధి సమయంలో సభా కార్యక్రమాలు మొదలవుతాయి అంటూ వుండగా వందన తన తల్లితో వచ్చింది.అందరూ వందనకు అబినందనలు చెప్పారు అక్కడున్న అందరికీ ధన్యవాదాలు చెప్పి కూర్చుంటుంది.
ఆ సభ కార్యక్రమ వ్యాఖ్యాత వేదిక మీదకి అధ్యక్షుల వారిని ముఖ్య అతిథి గారిని మిగతా అతిథు లను కూడ పిలుస్తారు.చివరగా సన్మాన గ్రహీత వందనను పిలిచారు. అందరి చప్పట్ల మద్య వెళ్లి కూర్చుంది. దీప ప్రజ్వలన అయిన అనంతరం ముఖ్య అతిథి అయిన మహదేవ్ మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో అనాధ పిల్లల సేవా, వృద్ధుల సేవ ,చేస్తున్న అనాథ లకు వృద్ధులకు అండగ నిలుస్తూ తన సంపదనలో సగబాగం ఆశ్రమం కోల్పోయిన వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని స్పందన ట్రస్టును నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. తన మాటలలో ఇలాంటి కూతురు నాకుంటే నేను ఎంత అదృష్టవంతుడినో అయ్యే వాడిని. ప్రముఖ వ్యాపారవేత్త ను అయినా ఇలాటి కూతురు లేనందుకు దురదృష్టవంతుడినే , ఇంతకంటే వందన గురించి ఎక్కువగా చెప్పలేను దిన దిన ప్రవర్థమానురాలై వెలగాలని కో రుకుంటూ ముగిస్తున్నాను .
వందనను సన్మానం స్వికరించవలసిందిగా కోరారు .వందన తను మాట్లాడుతూ నేను సామాన్య కుటుంబంలో పుట్టాను నేను ఈ విదంగా ఈ రోజు మీ ముందు ఉండడానికి కారణం నన్ను నా తల్లి కష్టపడి పెంచింది .మా అమ్మ తను చదువుకున్నది పదవ తరగతి వరకే కాని నన్ను చదివించడానికి తను పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. కుట్టుమిషన్ కుడుతూ నా జీవితానికి పరిపూర్ణ మైన బాటను వేసింది. మాతృ మూర్తి స్పందన ట్రస్టు పెట్టడం కూడ తన కోరికనే .తల్లిధండ్రులు లేని అనాధ పిల్లలను చేర దీసి వారికి ఆశ్రయం కల్పించి వారి జీవితాలకు ఒక బాట వేయమని చెప్పింది మా అమ్మ. కారణం నేను పుట్టిన కొన్ని రోజులకే నా జన్మకు కారణమైన తండ్రి నన్ను నా తల్లిని వదిలి వెళ్ళా డు .ఎందుకంటే నా తల్లి పల్లెటూరు అమ్మాయనీ, ఎక్కువగా చదువుకోలేదు అని, డబ్బులేదని తన మానాన తను వెళ్లి పోయాడు. తండ్రి లేకుందానే పెరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలను కడుపులో ధాచుకుంటూ నన్ను ఈ స్థాయికి తీ సుకువచ్చింది .

          ఈ రోజు సన్మానం నాకు కాదు నా తల్లికి జరగాలని ముఖ్య అతిథి గారు అనుమతించాలని కో రుతున్నాను అంది.
అప్పుడు మహదేవా రు మాట్లాడుటూ నాకూ ఆ తల్లిని చూడాలనిఉంది. ఆమెకు చేతులెత్తి నమస్కారాలు చేయాలని ఉంది ఇంత గొప్ప బిడ్డకు జన్మను ఇచ్చినందుకు అనాధ పిల్లలకు అండగ నిలబడమని కోరడం నిజంగా అభినందించ ధగ్గ విషయం .మాలాంటి వ్యాపారవేత్తలు కాదు ఈ దే శానికి కావాల్సింది . ఇలాంటి తల్లులే అత్యవసరం. బారతదేశం ప్రేమానురాగాలతో విలసిల్లడానికి! అంటు ముగించాడు.
వందన తన తల్లిని తీసుకుని వేదిక మీదకి వచ్చిం ది. మహదేవ్ కళ్ళలో ఆశ్చర్యం… వందన                      తల్లిని చూడగానే గతం గుర్తుకు వచ్చింది.తను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన లక్ష్మి.ఈ లక్ష్మి వందనకు తల్లి అంటే వందన నా కూతురు. ఏమిటి ఈ పరిస్థితి !సార్ సార్ అంటున్నారు వేదిక మీదున్న వారందరూ. అతను తేరుకున్నాడు.
సార్ వందన తల్లి లక్ష్మిగారు అని పరిచయం చేసారు . నమస్కారం చేస్తాడు
ప్రతినమస్కారం చేసింది.ఆమె కళ్ళలో గెలిచాను జీవితాన్ని అన్న బావన కనిపించింది.
“తను నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన లక్ష్మికి”, తను ఇప్పుడు సన్మానం చేస్తున్నాడు .వందన కళ్ళ లో ఆనంద బాష్పాలతో కూడిన మెరుపు
‘సభ ముగిసింది.
లక్ష్మి తన కూతురు వందనతో సభా వేదిక నుండి వెళ్తుంటే మహదేవ్ మనసు ఘోషించింది. తన బిడ్డ సంఘ సేవకురాలు,ఉన్నతోద్యోగి .నేను పదిమంది ముందు చెప్పుకోలేని దురద్రుష్టవంతుడిని , డబ్బు మోజులో పడి ప్రేమపాశాన్ని, రక్తసంబందాన్ని కాదనుకున్నవాడిని. పసిపాపను వదిలి వెళ్ళిన దుర్మార్గుడిని .అనుకుంటూ వేదనా భరిత హృదయంతో ఇంటికి వెళ్ళాడు .ఒంటరిగా కూ ర్చుండి రోదించాడు. అతని రోదన అరణ్య రోధనే అయింది. అవును ఇప్పుడైనా నా బిడ్డ అని ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకుని ,తెల్లవారి వందనకు ఫోన్ చేశాడు .
వందన ఏవో ముఖ్య మైన ఫైళ్ళు చూడడంలొ బిజీగా ఉండి తన తల్లిని లిఫ్ట్ చేసి మట్లాడమంది .వందన తన పనిలో నిమగ్నమయింది.
లక్ష్మిఫోన్ తీసుకుని వంట గదిలోకి వెళ్ళింది. టీ పెట్టడానికి . ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరూ ! అంది.
నేను మహదేవ్ ని.వందనను,నిన్ను చూడాలని ఉంది. నా కూతురు అని ప్రపంచానికి తెలియజేయాలని ,నిన్ను అక్కున చేర్చుకోవాలని ఉంది లక్ష్మి .
” ఆ హక్కును ఎపుడో కోల్పోయారు ఇప్పుడు నా కూతురు ఈ స్థాయిలో ఉంది కాబట్టి ప్రపంచా నికి తెలియజేయాలని అనుకుంటున్నావు .అదే నేను తనని చదివించలేక పోయుంటే ఎప్పటికీ నువ్వు మా గురించి ఆలోచించే వాడివి కాదు. మమ్మల్ని చూడాలని మీకు ఉన్నా మిమ్మల్ని చూడాలని మాకు లేదు .ఇదే నేను మీకు విధించే శిక్ష” అంటూ ఫోన్ కట్ చేసింది .
ఎవరమ్మా ఫోన్లో మాత్లాడేది అంటూ వచ్చింది వందన .
నీకు అభినందనలు చెప్పడానికి చేసినట్టున్నారు. “డిస్కనెక్ట్ అయింది”
అమ్మా ! నేను అఫిసుకు వెళ్తున్నాను అంటూ వెళ్ళింది వందన.
జీవితానికి గెలుపునిచ్చిన కూతురుని చూస్తూనే ఉండి పోయింది . మూల మలుపు తిరిగే వరకు………….

గంధం విజయలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, Permalink

One Response to చూడాలని ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో