ఓడిగెలిచిన రాత్రి

యవ్వనాన్ని ధరించిన దేహం
కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ
పెనవేసుకున్న రెండుదేహాలు
రాత్రిని చీల్చుకుంటూ
ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు
ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు
మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు
కణం కణం రగిలిన అగ్నికణం
చెలరేగే మంటలై
అడివంతా దహించే జ్వాలలైనట్లు
కన్ను గానని చీకటిలో
భయమెరుగనిపోరు
పల్నాటి పందెపు కోళ్ళలా
రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ
జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ
దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం

ఎవరికి ఎవరు పోటీ
ఎవరికి ఎవరు భేటీ
సమానమైన నిట్టూర్పులసెగలు
కుడి ఎడమల   సైకిల్ పెడలింగులా
వడివడిగా కదులుతూ
తుది తీరం
మది సుదూరం

ఆకును తాకిన
మంచుబిందువు జారిపడ్డట్టు
క్షణమెనుక ఒక్కక్షణం
యుగాల నిరీక్షణ అంతమైనట్టు
అంపశయ్యపై దాహార్తి తీర్చేందుకు
పాతాళగంగ పైపైకి వచ్చినట్టు

నలిగిన దేహమో
సహకరించిన మోహమో
గెలుపు జెండా ఎగిరే
రెప్పల రెక్కలపై
అతడు గెలిచాననుకుంటాడు

అతన్ని గెలిపించే సూత్రంలో
అతడ్ని గెలిచే రహస్యపు  తాళపుచెవి
తనలోనే దాచుకుంటూ
అరాత్రి గెలుస్తూ ఆమె ఓడిపోతుంది

గంపక్రింద దాగిన కోడిపుంజు
వేకువకోసం
చీకటిని చీలుస్తుంది

ఆమె
ఓడిపోవడం
అలవాటు చేసుకుంటుంది
* * *
ప్రతి వేకువలో
మేల్కొలిపే కోడికూతల ధ్వని దూరమౌతుంటుంది

ఆ రాత్రి
మళ్ళీ మళ్ళీ రాదు
ఆ జ్ఞాపకాన్ని  దాచుకోడానికి
జీవితకాలం సరిపోదు

* * *

ఇక

జీవిత విజయాలలో
ఆమె విజేత.                                                                        

                                               – జాన్  హైడ్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

9 Responses to ఓడిగెలిచిన రాత్రి

 1. Dr.Lingala Satya Yagna Valkya Sarma says:

  బాగుంది

 2. ravindra says:

  chala manchi kavitha

 3. ravindra says:

  nice

 4. దడాల వెంకటేశ్వరరావు says:

  జాన్ హైడ్ కనుమూరి గారు
  నా అభిప్రాయాన్ని కొంచెం ఇలా సవరించాను. ఏమంటారు?

  గెలవడం తెలిసి ఒడిపొవడాన్ని అలవాటు చేసుకుంటుంది ఆమె
  గెలవడం తెలియక పోయినా గెలిచివోడాననుకుంటాడు అతడు
  ఆమెకు ఎందుకో అన్నివేళలా అతడు చేయోతనివ్వలెడు
  అయినా జీవితవిజయాలలో ఆమె విజేతగా నిలుస్తుంది

  • నా ఆలోచనా, అవగాహనల సారాంశములో
   అతనెప్పుడూ గెలిచాననే అనుకుంటాడు అతనికి గెలవడం తెలియకపోయినా.
   (శరీరక నిర్మాణం, పురుషాధిక్య సమాజం, స్త్రీపై వున్న చూపు అతన్ని అలాంటి ఆలోచనా చట్రంలో బిగించేస్తుంది)
   నిజానికి ఆమె అన్ని సమయాలలో విజేత.

   ఒప్పుకోవడం కష్టంగా అనిపిస్తుంది అతనికి.

   • దడాల వెంకటేశ్వరరావు says:

    మీరు నిజమే చెప్పారు

   • దడాల వెంకటేశ్వరరావు says:

    అతనంటే ఆమెకు ఈర్ష ద్వేషం
    అతనికి ఆమె అంటే ప్రేమ అభిమానం

    అందుకే
    ప్రేమ అభిమానం ఎంత చూపినా మీకు తీరదవసరం
    మీ అవసరాలు తీరితే మా ప్రేమాభిమానాలు మీకనవసరం
    మా శక్తి కొద్ది మీ అవసరాలు తీర్చడానికి మీం సిద్దం
    మా అభిప్రాయాలను వ్యతిరేకించడంలో మీరు ప్రసిద్ధం
    అందుకే మీకు మాకూ యుద్ధం

    యుద్ధంలో మళ్లీ అతడే ఓడిపోతాడు
    ఎందుకంటే ఆమెను విజేతగా చూడడానికి

 5. దడాల వెంకటేశ్వరరావు says:

  ఓడి గెలిచాను అనుకుంటుంది ఆమె
  గెలిచి ఓడానని అనుకుంటాడు అతడు
  జీవిత విజయాలలో ఆమె విజేత
  అపజయాల జీవితంలో అతడు చేయూత

  • జాన్ హైడ్ కనుమూరి says:

   గెలవడం ఆమెకు తెలిసిన విద్య అవుతుంది
   ఓడిపోవడం అలవాటుచేసుకుంటుంది
   జీవిత విజయాలలో ఆమె విజేత
   అన్నివేళలా అతడు చేయూతవ్వడు … రకరకాల కారణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)