గౌతమీగంగ

               ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు కలిసి కృష్ణా జిల్లాగా వ్యవహరించబడేవి. ఆ విధంగానే ఉభయగోదావరి జిల్లాలు కలిసి గోదావరి జిల్లాగా చెప్పబడేవి. లచ్చన్నగారి పూర్వీకులు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో వున్న పొన్నపల్లి, ఆరెపల్లి గ్రామవాసులు. వేద విద్యల్లోను, యజ్ఞ యాగాది కార్యకలాపాల్లోనూ నిష్ణాతులైన కొందరు వేద పండితులకు సర్వకరపరిగ్రహమైన అగ్రహారంగా ప్రభువులు ఇచ్చిన గ్రామాలు అవి. ఆ చుట్టు ప్రక్కల భూములు నాటికి మెట్ట భూములైనా, పసుపు, మిర్చీ మొదలైన పంటలతో ఓ మోస్తరు ఆదాయం వచ్చేది. ప్రజలు జొన్నలు, కొర్రలు మొదలైన మెట్ట ధాన్యాలనే ఆహారంగా వాడేవారు. వారు దృఢకాయులు, ఆరోగ్యవంతులుగా వుండి తమకు హితమైన ధర్మకార్యాల్ని నిర్వర్తిస్తూ భోగ భాగ్యాలకు దూరంగా వుండేవారు. శ్రీనాథకవి తన చాటువులలో వర్ణించిన ‘‘కాసలనాటి వారి కోడలు’’ ఇటువంటి శ్రమ జీవుల ఇంటి పడుచే. లచ్చన్నగారి పూర్వీకులు ఆ పొన్నపల్లి గ్రామవాసులై ఆ పేరే ఇంటి పేరుగా కలవారు. అక్కడి నుంచి జీవనోపాధి చాలక లచ్చన్న గారికి నాలుగు తరాల నాడు అక్కడినుంచి వలస వచ్చి కొన్నాళ్లు వేలవెన్ను అన్న గ్రామంలో నివసించారు. తరువాత గోదావరి జిల్లాలోని చాగల్నాడు అనే మెట్ట ప్రాంతంలోని కోరుకొండ గ్రామానికి వలస వచ్చారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నిట్ట నిలువుగా వున్న కొండపై వెలసిన నరసింహస్వామి చాలా మహిమగల దైవమని స్థానికులు నమ్ముతారు. లచ్చన్న గారి బంధువులైన కాసలనాటి (కోసలీయ) శాఖ బ్రాహ్మణులు, పెద్దాపురం సంస్థానాధీశులు ఇచ్చిన భూములపైన వచ్చే అదాయంతో అక్కడ సుఖ జీవనం చేస్తున్నారు. పెద్దాపురం సంస్థానం ఆనాటి మంచి ఆదాయం కలిగిన క్షత్రియ స్థానాల్లో ఒకటిగా వుండేది. లచ్చన్నగారు ఏటా, ఏటా కాన్పులతో నీరసించిన భార్యతో నలుగురు పిల్లలతో కోరుకొండలో నివసిస్తున్నారు. నాటి బ్రాహ్మణులకు గౌరవ ప్రదమైన వృత్తి పౌరోహిత్యం, నిత్యం బారసాల, అన్నప్రాశన, కేశ ఖండన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు ప్రతీ ఇంటా ఏదో ఒకటి వుండేవి. ఇవి కాక రజస్వలానంతరం 4వ రోజున, ప్రసవానంతరం 11వ రోజున శుద్ధి స్నానానంతరం జరిగే పుణ్యాహవచనం అనే కర్మకలాపం పురోహితుడు నిర్వహించాలి. ఆయా కార్యక్రమాల్లో లభించే బియ్యం, టెంకాయలు, అరటిపండ్లు, తమలపాకులు, పోకచెక్కల వంటి వస్తువులు పురోహితుని ఇంటి అవసరాలకు సరిపోయేవి. శుభకార్యం జరిగిన రోజు పురోహితుని భోజనం ఆ యింటిలోనే, ఇతర వర్గాల వారి ఇంట్లో బ్రాహ్మణులు భోజనం చేయరు గనుక స్వయంగా వంట చేసుకొని తినడానికి అరటాకుల్లో బియ్యం, పప్పులు, చింతపండు, మిర్చీ, బెల్లం వుంచి కొన్ని కూరలు, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి ఇచ్చేవారు. స్వయంగా వండుకొని తింటారు కనుక దానికి స్వయంపాకం అనే పేరు రూఢ అయ్యింది. ఆయా కార్య కలాపాల్లో ఇచ్చే దక్షిణ (డబ్బు) నూతన వస్త్రాలు, ఇత్తడి పాత్రలు, కొండొకచో వెండి పాత్రలు ఇంటి అవసరాలకు సరిపోయేవి. ఈ రీతిగా యాజ్ఞీకునికి సుఖ జీవనం చేకూరేది.
అయితే ఆ రోజుల్లో బ్రాహ్మణ్యానికి సంఖ్యా బలాన్ని బట్టి అందరికీ ఈ వృత్తి చాలదని, ఏదైనా మరో వృత్తిని కొందరు చేపట్టవలసిన అవసరం వుందని, కొద్ది పాటిగా వున్న ఆస్తి పాస్తుల్ని తెగనమ్మే అవసరాలు వస్తూ వుంటే క్రమంగా జీవనోపాధి కష్టమవుతుందనీ గుర్తిస్తున్న రోజులవి. ప్రజల్లో ఆంగ్ల విద్య కొంత వ్యాప్తి చెందింది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. అనే ఆరవ ఫారం వరకూ చదువగలిగితే ప్రభుత్వంలో మంచి ఉద్యోగాలు లభించేవి. అంతవరకూ చదవలేకపోయినా 3వ ఫారం ( 8వ తరగతి) వరకు చదివితే లోయర్‌ గ్రేడ్‌ అని నెలకు పదిహేను రూపాయల వరకూ జీతం గల ఉద్యోగాలు లభ్యం అయ్యేవి. జిల్లా స్థాయిలోని పెద్ద ఉద్యోగాలను తాము ఉంచుకొని ఆంగ్లేయులు , ఆంగ్లో ఇండియన్లు అనే భారత యురోపియన్ జాతుల కలయిక వలన కలిగిన క్రైస్తవ మతానుయాయులకు తమతరవాతి హోదా కలిగిన ఉద్యోగాలను ఇచ్చేవారు .వారు నల్ల దొరలూ అని పిలవబడుతూ యురోపియన్ సంస్కృతిని అభిమానించి పాటిస్తూ సంఘంలో పలుకుబడి, మంచి హోదా కలిగి ఉండేవారు, చిన్న చితక ఉద్యోగాలు భారతీయులకు దక్కేవి అవే మహా భాగ్యంగా భావించి, భక్తి తాత్పర్యాలతో ఆంగ్లేయులను సేవిస్తూ ఉండేవారు . సగటు భారతీయులు తాలుకా ఆఫీసులో గుమాస్తాగా చేరిన వీడు తాసిల్దారు చిత్రం లో ఆ ఉద్యోగపు ఘనతని చక్కగా హాయి హాయి రుచులూరించూ.. చొక్కాతానే తోదిగించు.. అంటూ నాయిక స్త్రీ వంటయిల్లు దాటి వచ్చి బయట పరప్న్చాన్ని చూడటం, భర్త స్వయంగా పరిచర్యలు చేయడంలో ఉన్న ఆనందాన్ని కవి చక్కగా వర్ణించాడు. మన లతాకాలం నాటికి పరిచర్య మాట దేవుడెరుగు అసలు భర్త ఎదుటకు రావడమే నిషిద్దం. హోజనాల నెల నడ్దన చేస్తూనే భార్య భర్త కంటపడడం రాత్రి అందరూ నిద్రించాక మాత్రమే భార్య భర్తలు ఒకరి నొకరు తీరికగా చూసుకొని కలుసుకోనేది. వెలుతురులో ఒకరి ముఖం ఒకరు చూడకుండానే నాటి భార్యా భర్తలు కాపురాలు కొనసాగించారంటే నేడు మనం నమ్మలేం . ఊహినోఅశాక్యం కాని పరిస్థితి నాటి కాలం వారిది మొత్తానికి ఆంగ్లేయుల వద్ద ఉద్యోగాలు చేయడం వలన తమకు సకల సౌకర్యాలు కలుగుతాయనే భావం 19వ శతాబ్దం లో భారతీయులకు కలుగసాగింది. ఆ ప్రభావానికి లోనైనా వ్యక్తిగా కోరుకొండ గ్రామంలో స్థిరపడ్డ లచ్చన్న గారి సంతానంలో పెదా కుమారునికి ఇంగ్లీషు ఇంగ్లీషు చదువులు చెప్పించాలనే నిర్ణయానికి వచ్చారు.లచ్చన్న తమ్ముడు సుబ్బన్న గారు గోదావరి దాటి అప్పటికి కొత్తగా నిర్మించిన ధవళేస్వరం ఆనకట్ట సమీపాన గోదావరి కాలవపై ల లోల్లలాకులకు ఆవలి వైపున కల కట్టొంగ గ్రామంలో తన చెల్లెలు బాల వితంతువు అయిన రావమ్మ గారితో నివసిస్తున్నారు, వారికిలచ్చాన్న గారి పాటి స్మార్త పరిచయం కూడా లేదు. విఘ్నేశుడి పూజా, స్వస్తి పున్యాహావచనం ఏదో విధంగా లాగిస్తూ, గ్రామస్తుల సౌజన్యంతో సుఖజీవనం కొనసాగిస్తోనారు. ఆయనా చెల్లెలు కూడా నిస్సంతు, పిల్లలు లేరు అన్నగారి మంచి చదువు సర్కారు ఉద్యోగం సంపాదిం చుకోగాలిగితే నాలుగు వేళ్ళు నోటిలోకి వెడుతూ, నిశ్చింతగా బతకడం చూదాననే కాంక్షతో సుబ్బన్న గారు, రావమ్మ గారు కోరుకొండకు వచ్చి అన్నయ్యా మనం ఎలాగో తంటాలు పడి మన సుబ్బన్నన్ని చదివిద్దాం అని అన్నగారిని ప్రోత్సహించారు. పెద్ద వాడిని చదివిస్తే తమ్ముడు రమణయ్య సంగతి వాడే చూసుకుంటాడు అనుకొన్నారు వారు. ఆ ప్రకారంగా సుబ్బన్న చదువు ప్రారంభం అయ్యింది. పాఠశాల లో చేరాక సుబ్బన్న సుబ్బారావు అయ్యాడు. ఉఫాద్యాయులకు తలలో నాలుకలా ఉంటూ. తోటి విద్యార్ధులతో సఖ్యంగా మెలుగుతూ 6వ ఫారం ఉత్తీర్ణు డయ్యాడు . సుబ్రహ్మణ్యం ఒక్క రెండేళ్ళు కష్టపడితే అతడి చదువు ఓ ఒడ్డుకు వస్తుందను కుంటున్న రోజుల్లో లచ్చన్నగారి భార్య రాతంమ్మ గారి ఆరోగ్యం క్షిణించినది. అప్పటికే చదువు తొలిచూలు సంతానమైన లచ్చన్న గారి పెద్ద కుమార్తెను, కాకినాడ గ్రామంలో ఠాణా కచేరిలో శిరస్తాదారుగా పని చేస్తున్న చక్రావధానుల వెంకటాచలం గారికిచ్చి వివాహం చేసారు. చక్రావధానుల వారు మొదట్లో తెలంగాణ ప్రాంతం వారు. అక్కడ వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి చక్రావధానుల అనే బిరుదు నామాన్ని, ఈ నాముల్ని బహుమతిగా పొందారు. క్రమంగా వారు ఆ ప్రాంతాన్ని వీడి పశ్చిమ గోదావరి జిల్లా చేరుకున్నారు. ఆస్తిపరులైన వెంకటాచలం గారి తండ్రి లచ్చావదాన్ల గగారి కుమార్తెను ఆమె ఎనిమిదవ ఏట తమ కుమారునికి వివాహం చేసుకున్నారు.ఆ రోజుల్లో పిల్లనిస్తామని వచ్చిన వారు గౌరవ మర్యాదలకు లూం లేనివారైతే చాలు అవసరమైతే ఉభయ ఖర్చులు తామే పెట్టుకొని వివాహం చేసుకొనేవారు. కోరి గడప త్రొక్కిన వారిని నిరాకరించారాదని నాటి వారి నమ్మిక. డబ్బు ప్రస్తావన ఉండేది కాదు. ఇప్పుడు కష్ట కాలంలో కుమార్తె ఇంటికి వెళ్ళడానికి లచ్చన్న గారికి పెద్దగా ఆదరణ లభించలేదు. అల్లుడు పిన్న వయస్కుడు తల్లితండ్రులు ఇటివలె కాశీ యాత్రలో మరణించారు. ఇంట్లో బాల్య వితంతిలైన అతడి మేనత్తడే ఆధ్వర్యం. ఇంత మంది బంధువులు ఇంటి మీదకు వస్తే మేనల్లుడు పాడయిపోతాడని ఆమె భయం. వైద్యులకు చూపించారు కాని లాభం లేకపోయింది. 30వ ఏట రథమ్మ గారు భర్త, ముగ్గురు పిల్లల్ని విడి గౌరీ సాన్నిధ్యాన్ని పొందారు. లచ్చన్న గారి కుటుంబానికి అల్లుడు మేనత్త పెరట్లో దూడల పక్కనున్న పాకలో బస ఏర్పాటు చేసారు. రథమ్మ గారికి ఒక నూకల మంచం ఇచ్చారు. మిగతా వాళ్ళు నేల మీద తాటాకుల చాపలు పరుకుని పడుకేవాలి.సుబ్బారావు ఏమి తోచక పెరటి గుమ్మాన బయటకు వచ్చి ఊరు చుట్టి వచ్చేవాడు. ఊరి మధ్యగా బాలా త్రిపుర సుందరి సహిత రామ లింగేశ్వ స్వామీ ఆలయం ఉండేది. కోవెల ఎదుట పుష్కరిణి , దేవి కాళహస్తిలోని జ్ఞాన ప్రసూన్నాంబని తలపిన్స్తూ ఉంటుంది. నిలిచి ఉన్న భంగిమలో అమ్మవారు కోడిచేత అభాయమోద్ర తాల్చి ,ఎడమ చేతిని క్రిందకు జాపి కల్హారాన్ని తాల్చి ఉంటుంది ఆ ప్రాంతంలో దేవి భక్తుల ఇండ్లు ఉంటాయి. అది ఆరిల్ల అగ్రహారం. మిగతాదంతా బంజరు బయలు. అదే వీధిలో దక్షిణంగా వస్తే ఉప్పుటేరు సమీపాన రాజ రాజేశ్వరి సహిత భీమేశ్వరస్వామి ఆలయం. అప్పటికింకా నేటి వేనిగోపాలస్వామి కోవెల, ఆజనేయస్వామి కోవెల వేలియలేదు. దక్షిణంగా వెడితే ఏటి ఒద్దున గడియార స్తంభం , నింగిని తాకుతున్నట్లుగా ఆంగ్లేయుల నిర్మాణ చాతురికి, ఔద్ధత్యానికి నిదర్శనంగా ఉంది.ఈ ఉప్పుటేరు గోదావరి నదికి ధవళేశ్వరం నుండి త్రవ్విన కాలువలలో .ఒకటి. ఇది పట్టణాన్ని వెనుకగా పడమటి వైపున కొంత చుట్టి సముద్రంలో కలుస్తుంది. కళింగలు వద్ద దీనిపై లాకులు వున్నాయి. కళింగ గజపతులు ఈ ప్రాంతాన్ని ఏలిన రోజులలో దీనికి కళింగలు అని పేరు వచ్చింది అంటారు. ఈ ప్రాంతాన్ని ఇంద్రపాలెం అంటారు. జనం నోళ్ళలో ఈండ్రపాలెం అయ్యింది తరువాతి కాలంలో. ఉప్పుటేరు ఆవలా, లాకుల సమీపాన జనావాసాలు అంతగా లేవు. కాలువ వారగా సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి. దేవుని అర్చకుల ఇండ్లు కొన్ని ఇతరుల ఇండ్లు మాత్రమే ఆ సమీపాన వుండేవి. భీమేశ్వర స్వామి గుడి దాటాక ఏటిపై ఆంగ్లేయులు నిర్మించిన వంతెన ఆ వంతెన జగన్నాధపురాన్ని, ఆ చుట్టుప్రక్కల గ్రామాల్ని కాకినాడతో కలుపుతూవుంది. ఈ వీధికి సమాంతరంగా తూర్పు వైపున ఉన్న వీధి మెయిన్‌రోడ్‌ ఇక్కడ సీతారామస్వామి కోవెల వుంది. అది పురాతనమైనదని అచ్చట శాసనాలు చెప్తాయి. దేవాలయం విశాలమైనది. తల్లి అనారోగ్యంతో దిక్కుతోచక, పలుకరించే దిక్కులేక సుబ్బారావు పెరటిగుమ్మం గుండా రోజుకోవైపుగా నడక సాగించే వాడు. అన్ని దేవాలయాలలోని దేవతలను తన తల్లిని కాపాడమని మొక్కుకునేవాడు.

                   ఏ దేవుడూ అతని మొర వినలేదు. రత్తమ్మ గారు పరమపదించారు. ఇంటి పాలేరు వారి క్షేమ సమాచారాలు విచారించడానికి వచ్చి చూసి ఈ సమాచారం ఇంటి వారికి తెలియజేసాడు. వేంకటాచలం గారు మేనత్త చాటు వారు బాప్పవారు వెళ్లమనే వరకూ మామగార్ని పరామర్శించడానికి వెళ్లడానికే వారికి జంకు. ఆ రోజుల్లో జాతాశౌచాన్నీ, మరణాశౌచాన్ని చాలా నియమ నిష్ఠలతో పాటించేవారు. పురుడో పుణ్యమో అని జాతి శౌచానికి కొన్ని మినహాయింపులున్నా. మరణాశౌచాన్ని మాత్రం నియమ నిష్ఠలతో, భయభక్తులతో పాటించవలసిందే. ఆ నియమావళిని అతిక్రమించడానికి లేదు. మైలు కలుపుకుంటే మారు కోరుతుంది అని మైల కలిపితే బెడసి కొడుతుందని నమ్మేవారు. అనేక దుర్ఘటనలు జరుగుతాయి దాని వలన అని వారి భావన. అంచేత ఆమె మేనల్లుణ్ణి గట్టిగా హెచ్చరించింది. ‘‘అబ్బాయి! నీవు వెళ్ళి నీ మామ గార్ని ఓ మారు పలకరించిరా. నీ భార్య గర్భవతి కనుక నీవు స్మశానానికి వెళ్ళరాదు. నిండు గర్భిణి అది ఆ చాయలకే పోరాదు. పుట్టుకుంకు ముండని మీ క్షేమమే కాని నాకు మరో ధ్యేయం లేదు. ఏనాడో పెద్దలు పెట్టిన ఆంక్షల్ను మనం దాటరాదు అని. మేనత్త గారి ఆజ్ఞ ప్రకారం వేంకటాచలంగారు ఒక పర్యాయం మామగార్ని పలకరించి వచ్చి పెరటి నూతిలో స్నానం చేసి ఇంటి వసారాలో కూర్చున్నారు. మూడు రోజులు వారికి ఆశౌచం ఇంటిలోనికి వెళ్లి ఏ వస్తువూ తాకరాదు. నిత్య కర్మలు అనుష్ఠించరాదు. లచ్చన్నగారు చేష్టలుడిగి కూర్చున్నారు. ఇక్కడ తనకు పరచయస్తులెవరూ లేరు. ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియడం లేదు. పెద్ద కూతురు కంటికే కనిపించడం లేదు. కొడుకులిద్దరూ మొకాళ్ళలో తల పెట్టుకొని కూర్చున్నారు. బయట పిల్ల ఏడ్చినది ఏడ్చినట్లే వుంది. ఇంటి పాలేరు వచ్చి అయ్యగారూ! ఇలా కూర్చుంటే ఎలా? ఈ పనులన్ని చేయించే అయ్యవారున్నారు. వార్ని నేను తీసుకొని వస్తాను. ఏదో ఒక విధంగా దహనం కానియ్యండి అన్నాడు. లచ్చన్నగారు భార్య మెడలో వున్న మాడెత్తు మంగళసూత్రాలూ, కాలినున్న కడియాలు అతడి చేతిలో వుంచి ఒరేయ్‌ నాయనా నా దగ్గర వున్నది అంతా ఇదే. దీనితో ఏదో విధంగా పని జరిపించు అన్నారు కన్నీరుతో, పాలేరు తీసుకొని వచ్చిన అపరకర్మలు చేసే అయ్యవారు కావలసిన ఏర్పాట్లన్ని చూసాడు. వైదిక వృత్తిలో శుభాశుభ కర్మలు నెరవేర్చే పురోహితులు వేరు వేరుగా వుంటారు. శుభకార్యాలు నిర్వహించే వారు అపరకర్మలు చేయించరు. మధ్యాహ్నానికల్లా రత్తమ్మగారి అంతిమయాత్ర ముగిసిపోయింది. ప్రొద్దు గూకే వేళకు వేంకటాచలంగారి మేనత్త వీర్ని పెరట్లోకి పిలిచి విస్తర్లలో ఉడికిన పెసరపప్పు, అన్నం, నారదబ్బకాయ, ఊరగాయ వేసి తలో విస్తరీ చెట్ల కింద తడిబట్టలో పడేసింది. ఈ చర్య వలన ఆమె దయా దాక్షిణ్యాలు లేని కఠినురాలు అనుకోరాదు. నాటి సాంఘిక నియమాలు అటువంటివి.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19
ఆత్మ కథలుPermalink

Comments are closed.