సమకాలీనం- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

                    ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబరు ఒకటో తారీఖున జరగబోతోంది. నిత్య జీవిత సమరం చేస్తున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో స్త్రీల జనాభా ఎంత? సగం!
   రైల్లో తల పెట్టేసిన స్త్రీలు, నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలు చాలా మంది. ఒళ్ళు తగలబెట్టుకునే వాళ్ళు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామందే! వీళ్ళ మరణాలకు కారణం ఎయిడ్స్! ఈ వ్యాధి సోకిందని తెలిసిన మరుక్షణం చనిపోవడం లేదా ఐనవారికి దూరంగా వెళ్ళిపోవడం మాత్రమే మార్గంగా తలుస్తున్నారు ఇంకా!
  లివింగ్ పాజిటివ్ విత్ ఎయిడ్స్ అని, లెట్ పీపుల్ విత్ ఎయిడ్స్ లివ్ పీస్ ఫుల్లీ అని ప్రతి ఎయిడ్స్ దినోత్సవం రోజూ అనుకున్నా, అది జరగడం లేదు. సమాజం పాజిటివ్ గా స్పందించడం లేదు. వ్యాధి ఎలా వచ్చినా, ఆ వ్యాధికి నైతిక పతనం ముఖ్య కారణం కావడం వల్ల ఈ వ్యాధి ఫలితాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.
   ఎయిడ్స్ ఎటువంటి వారికి ఎక్కువగా వస్తోంది? బిలో పావర్టీ లైన్ లోని వారికే! నేటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని చూస్తే, మామూలు జబ్బులకే మందుల్లేవని చేతులెత్తేసిన పరిస్థితి! మరి ఎయిడ్స్ వ్యాధికి మందులున్నాయా? వ్యాధి బారిన పడిన వారి మానసిక, శారీరక స్థితిని మెరుగుపర్చే రీహేబిలిటేషన్ సెంటర్లు ఎన్నున్నాయి? వారికి సామాన్య జీవితం నడపడానికి కావాల్సిన ఆధారాన్నిచ్చే సంస్థలు ఎన్నున్నాయి?

సెక్స్ వర్కర్లకు అవగాహన కల్పించేందుకు చేసే ప్రభుత్వ కృషి కాగితాలకే పరిమితమౌతోంది. క్షేత్ర స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలు కుంటుపడటం వల్ల ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, వ్యాధి తగ్గుదలకు మార్గం కష్టమౌతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు దేశాల్లో క్రొత్త కేసులు బాగా తక్కువగా నమోదయ్యాయంట! చైనా ఎనభై శాతం ఖర్చు పెడుతోంది ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలకు. భారతదేశం కూడా తొంభై శాతం ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. భారత దేశంలో కూడా ఈసారి తక్కువ కేసులే నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి రిపోర్టు పేర్కొంది. కానీ ఎయిడ్స్ పై జరుగుతున్న పరిశోధనల్లో వెల్లడైన విషయం ఏమిటంటే, హెచ్ ఐ వి వైరస్ లో క్రొత్తగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని! ఇదే జరిగితే, ఇప్పటి వరకూ వాడుతున్న మందులు కూడా పనిచెయ్యడం మానేస్తాయి. క్రొత్త పరిణామాలకనుగుణంగా మళ్ళీ క్రొత్త మందుల కోసం పరిశోధనలు చేయాలి.
  రక్త పరీక్షల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితం కాని సెక్స్ కు ఆస్కారం ఇవ్వరాదు. విమెన్ కాండోమ్ ను వాడాలని అన్ని దేశాల ఎయిడ్స్ నివారణా సంస్థలు సూచిస్తున్నాయి. ఎయుడ్స్ వ్యాధి సోకకుండా ఒక మైక్రోబిసైడ్ తయారుచేయాలని ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఇంకా అవి సఫలీకృతం కాలేదు! ఎంత సమయం పడుతుందో తెలీదు! ఇద్దరు ముద్దులొలికే పిల్లలను గాలికొదిలి, వ్యాధి ఉందని తెలియగానే ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలను చూసిన నేను ఇంకా ఆ బాధనుండి తేరుకోలేదు. ఆ ఇద్దరు చిన్నారులు కూడా హెచ్ ఐ వి పాజిటివ్ కావడం హృదయాన్ని కలచి వేస్తుంది!
  హెచ్ ఐ వి గురించి అవగాహన కలిగి ఉండడం, నివారణా మార్గాలు అవలంబించడం మాత్రమే ఉత్తమం!

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to సమకాలీనం- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

  1. Jade says:

    Kudos to you! I hadn’t tohguht of that!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)