మళ్ళీ మాట్లాడుకుందాం…

 

నిన్న రాత్రి చెన్నై నుంచి రాజా ఫోన్ చేసి ఈ రోజు ఇక్కడ ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా ఆఖరి ఆట వేస్తున్నారు.  నేను చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్పి ఆపేసాడు. రెండో ఆట సినిమా అన్నమాట.  ఉదయం లేచే సరికి నా ఫోన్ లో ఒక షార్ట్ మెస్సేజ్ రాత్రిది ఉంది.  “లారెటో నిన్ను అడిగేనని చెప్పమన్నాడు.  నీకు గుడ్ నైట్ చెప్పేడు” అని. అది మా అబ్బాయి రాజా ఇచ్చిన మెస్సేజ్.  నాకు ఉదయానే లేవగానే అది చూడగానే  అప్రయత్నంగా చిన్న నవ్వొచ్చింది.

లారెటో ఆ సినిమాలో శశిని ఇష్టపడిన ఫ్రెంచ్ యువకుడు.  ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ సమానంగా నచ్చిన పాత్ర అన్న మాట.  అని నవ్వుకున్నాను.

దర్శకురాలు గౌరీ షిండే చేసిన చమత్కారం అది.  ఆ ఉదయం తర్వాత అయిదారు గంటలు గడిచాక వాడు మళ్ళీ ఫోన్ లో పిలిచి ఆ సినిమా గురించి మాట్లాడుతూ ప్రపంచమంతా దిగ్విజయంగా ఆడింది ఈ సినిమా అన్నాడు.

కుటుంబం కోసం ఎంత కష్టపడినా కుటుంబంలోని భర్త నుంచి, పిల్లల నుంచి ఏ మాత్రము గుర్తింపు కానీ, మర్యాద గానీ పొందలేని స్త్రీ కథ ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో ఉంది.  అయితే ప్రపంచమంతటా స్త్రీల సమస్య ఒకేలా ఉందన్నమాట అన్నాను నేను.

ఇంట్లో చేసే వంటపనికి గౌరవం లేక పోవడమూ, ఇంగ్లీషు లో మాట్లాడగలగడమే గౌరవ కారణము అని భావించే సమాజానికి ప్రతీకలాంటి భర్త, తెలిసీ తెలీని వయసున్న కూతురు ఆ సినిమాలో ఉన్నారు.  ఇలాంటి సమస్య మరొక రూపంలోనూ, మరొక కోణంలోనూ ఇంచుమించు అన్ని దేశాలలో స్త్రీలు అనుభవిస్తూ ఉన్నారా ?  అని ఆలోచిస్తుంటే నాకు ‘గాన్ విత్ ది విండ్’ నవల గుర్తొచ్చింది.  అందులో రచయిత్రి అమెరికాలో వితంతువయిన యువతి  సమాజంలో ఎలా అడుగడుగునా కించపడుతూ, అవమానించబడుతూ ఉంటుందో రాస్తుంది.  స్త్రీకి కేవలం భర్త వల్ల మాత్రమే గౌరవం పొందే పరిస్థితి ప్రపంచమంతటా ఒకేలా ఉందన్న నిజం ఆ నవల ద్వారా తెలిసి ఆశ్చర్యం కలిగింది.

అయితే గౌరీ షిండే ఇంగ్లీష-వింగ్లీష్ సినిమాలో ఏ స్త్రీ అయినా తన గౌరవం తానే సంపాదించుకోక తప్పదని, అందుకోసం కష్టపడాలని , సరదాలు, సంతోషాలు కూడా అవసరమైతే వదులుకోవాలని ఎంతో సమర్థవంతంగా చెప్పింది.

అయితే ఈ సినిమాలో మరొక అంశం వల్ల సినిమా ప్రపంచమంతటా హిట్ అయిందని చెప్తూ కొత్త చోటికి వెళ్లి కొత్త విద్య నేర్చుకోవడం ఎలాగా! అనే అంశమే అది అని సినిమా చూసిన కొందరు కుర్రవాళ్ళు అన్నా నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను.

అడుగడుగునా భార్య యొక్క ఆత్మా విశ్వాసాన్ని దెబ్బ తీస్తూ ఉండకపోతే సాధారణ భర్త ధైర్యంగా భద్ర జీవితం జీవిన్చాలేదనుకుంటా.  ఆమెలో ఆత్మా విశ్వాసం కనిపిస్తే అతనికి అభద్రతా, భయం వస్తుందేమో! అంటే ఎన్నో తరాలుగా భర్త ఎక్కువ భార్య తక్కువ అనే పురుషాధిపత్య పితృస్వామ్య భావజాలమే దీనికి కారణం అని మనకు అర్థమవుతూనే ఉంది.

అమెరికాలో అక్క కూతురు పెళ్ళికి వెళ్ళిన శశి అక్కడ స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులో చేరుతుంది.  లారెటో కూడా అందుకే చేరినా శశిని చూసి ఇష్టపడి ఆమె కోసమే వస్తూ ఉన్నాడు.  అతని ఇష్టం ఆమెను అలజడికి గురిచేస్తునే తన మీద తనకు నమ్మకాన్ని కూడా కలిగించింది.  కానీ ఆ మూడు వారాల క్లాసు తర్వాత అతన్ని కలవకుండా సున్నితంగా తిరస్కరించి వెనక్కి వచ్చెయ్య గలిగింది.

లారెటో కూడా భారతీయ పురుషుడు కాదు గనక వెంట పడి వేధించకుండా మర్యాదగా గీత బయట నిలబడిపోయాడు.

కానీ ఒక ఏడాది పాటు అతనితో కలిసి అలాంటి క్లాసులో విద్య నేర్చుకోవాల్సి వస్తే శశి పరిస్థితి ఏమిటి ? అని ఒక యువకుడు నన్ను అడిగాడు.

నేనన్నాను సాధారణంగా ఆడవాళ్ళు కుటుంబాలను పిల్లల కోసం వదలరు.  దేవుడు స్వర్గం ఇస్తానన్నా పిల్లల్ని వదిలి రాలేరు.  వచ్చినా పిల్లల కోసం ఏడుస్తూ ఉంటారు.  అవతలి వ్యక్తి ఎంత బాగా చూసుకున్నా సరే, మళ్ళీ పిల్లలు పుట్టినా సరే, ఆ ముందు పిల్లల మీద మమకారం పట్టి పీడిస్తుంది.  సత్యవతిగారి దమయంతి కూడా కూతురి కోసం ఎంతో కుమిలిపోతునే ఉండి ఉంటుంది అన్నాను.  భావాలు, భావజాలాలు కూడా అంత బలమైనవి మరి.  ఇప్పుడు ఆలోచించాలి. స్వేచ్చ అంటే ఏమిటా ? అని.*

– వాడ్రేవు వీరలక్ష్మీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to మళ్ళీ మాట్లాడుకుందాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో