బాణమై కిరణమై


 

అరాచకత్వానికి ప్రేమని పేరు పెట్టి

దాని గొంతు కోసే మగాడిని

ఆడపిల్ల చూచే చూపే

బాణమై కిరణమై

సూదిమొన మరణమై

కళ్ళలోన కారమై

ఆడదే ఆధారమై

మతులు చెడి బతుకు చెడి

వళ్ళు చెడి  ఇల్లు చెడి

దుమ్ములోన ధూళిలోన

రోడ్ల పైన గట్ల పైన

పిచ్చివాడై బిచ్చగాడై

ఆకలికి అలమటిస్తూ

అయినవారికి దూరమై

ఎవరికీ కానివాడై

చావలేక బ్రతక లేక

చావుకోసం ఎదురుచూస్తూ

చేసిన తప్పుకు చింతిస్తూ

ఆడపిల్ల ఉసురుపోసుకుని

అధముడై పోయేవాడిపై

జాలెవరికి? దయెవరికి?

అసలు జాలేందుకు? దయెందుకు?

పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, , , , , , , , , Permalink

3 Responses to బాణమై కిరణమై

 1. prabhakar says:

  బాగా రాసారు పద్మావతి గారూ !
  తెలుగు పండితులకు చెప్పగలిగినంత వాడిని కాకపోయినా,
  ‘ కళ్ళలోన కారమై ‘ అన్న పదానికీ
  ‘ ఆడదే ఆధారమై ‘ అన్న దానికీ మధ్య
  ‘ బ్రతుకు బారమై’ అని ఉంటే
  ఇంకా బావుండేది అని చెప్పాలి, అనిపించింది !

 2. బావుంది పద్మావతి శర్మ గారు.

  పరివర్ర్తన రాని వారిపై జాలి చూపడం కూడా సబబు కాదు.

 3. Dadala Venkateswara Rao says:

  ఆడపిల్ల ఉసురు తగిలిన వారెవరైతేనేమి
  రగలనీ
  పోగాలనీ
  బూడిదై మిగలనీ
  రానివాడై
  లేనివాడై
  ఎవరికీ కానివాడై ఏడ్వనీ
  విడిపోనీ
  పడిపోనీ
  మతి కాస్తా చెడిపోనీ
  బిచ్చగాడై
  పిచ్చివాడై
  ఎక్కడైనా చచ్చిపోనీ
  ఇసుమంత జాలిపడి
  దయచూపెకంటే
  కాసింత మట్టేసి
  గోతిలో పాతి పెట్టేయ్