అతివలపై అత్యాచారాలు

               ఒక నెలలో పదిహేను మంది అతివలపై అత్యాచారాలు! మన దేశం లో హర్యానా రాష్ట్రం లో ని పరిస్తితి ఇది. ఒక కల్పనాచావ్లా , ఒక నైనా సేహ్వాల్ వంటి ఆణి ముత్యాలను జాతి కి అందించిన రాష్ట్రంలోని మహిళల ప్రస్తుత పరిస్తితి ఇది.11 సంవత్సరాల పాపాయి మొదలుకుని 40 సంవత్సరాల ప్రౌఢ  వరకూ ఎవ్వరినీ వదలలేదు .అందరూ భంగ పడ్డవాళ్ళే .అత్యాచారమంటే కేవలం ఒక స్త్రీ ని పాశ వికంగా ప్రవర్తించి శారీరకంగా లొంగ తీసుకోవటమే కాదు , ఆ కుటుంబాన్ని అంతా  మానసికంగా మట్టుబెట్టటమే .తన కూతురు రేప్ కు గురి ఐయినదని తెలిసి  సమాజం లోని చీదరింపులు భరించలేక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు ఒక తండ్రి.  వీటన్నిటికీ కారణం ఈ మగ మృగాల పైశాచికత్వం .మద్యం మత్తులో మునిగి ఏమి చేస్తున్నారో తెలీని పాశవిక ప్రవృత్తి.దీనికి తోడు ధన బలం, కండ బలం.ఆ వెనక రాజకీయ అండ.ఏ రకంగా ప్రవర్తించినా ఎవరూ ఎదుర్కోలేరన్న ధీమా .వీటికి  తోడు  దక్షిణాది రాష్ట్రాలకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో స్త్రీ పరిస్తితి చాలా వెనకబడి వుంది.  ఈ  రోజుకీ ముసుగులు ధరించడం , మగవారి ముందుకు రాకపోవటం మొదలైనవి చాలా చోట్ల ఉన్నాయి .
          బాలికలకు చదువుచెప్పించకుండా వారిని నిరక్షరాస్యత లోమగ్గి పోయేటట్లు  చేస్తున్నారు .కానీ ఇక్కడి స్త్రీలు శారీరకంగా చాలా బలవంతులు.వారికి సరియైన శిక్షణ ఇస్తే ఏ రంగంలోనైనా ముందుకు దూసుకు పోగలరు.కానీ ఇవ్వన్నీ పురుషాధిక్య సమాజంలో అణచివేయ బడుతున్నాయి .ఇక చట్టం నిషేధించినప్పటికీ బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయి.  గ్రామాల్లో పంచాయతీ పేర్లతో పురుషులుఅధికారం చెలాయిస్తూ  ఆడపిల్లల మీద అవవసర ఆంక్షలు విధిస్తున్నారు .ప్రేమ వివాహాలు , కులాంతర, మతతంతర, వివాహాలు చేసుకోరాదనీ , అమ్మాయిలు సెల్ ఫోన్ వాడరాదనీ,11 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు ముసుగులు ధరించాలనీ  లాంటి అర్ధ రహితమైన ఆంక్షలు విధిస్తున్నారు. భారత ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా , వోట్ బ్యాంకు కోసం వీరి కొమ్ము కాస్తున్నారు రాజకీయ నాయకులు.

              మాజీ హర్యానా ముఖ్య మంత్రి గారు బాల్య వివాహాలే ఈ సమస్య కు పరిష్కారం అని తేల్చేసారు .ఒక్క హర్యానే కాదు ,ప్రపంచ వ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయని సుప్రీమ్ కోర్ట్ చెపుతోంది.కలకంఠి కంట నీరొలికిన సిరి ఇంట నిలవదని స్త్రీ ని గౌరవించారు మన పెద్దలు.కానీ ప్రస్తుతం సమాజం లో స్త్రీ పరిస్తితి ఏంటి?సమాజ దృష్టి లో స్త్రీ కేవలం ఒక వ్యాపార వస్తువు.షేవింగ్ క్రీం తదితర మగవారు ఉపయోగించే వస్తువులు అన్నిటికీ స్త్రీ ఎందుకు వ్యాపారప్రకటన మోడల్ అవ్వాలనే అవసరం ఏంటి ?ఇలా స్త్రీ ని కేవలం ఒక భోగ వస్తువు గా చూస్తుంటే ఎలా వుంటుంది గౌరవం?ఇక సినిమాల గురుంచిచెప్పుకోకుండా వుంటనే మంచిది.మన అందరికీ తెలిసిందే.మన ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.అప్పుడే ఈపరిస్తితి లో కొంత మార్పు రావటానికి ఆస్కారం వుంది.
                    ప్రస్తుతం మన ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది.కానీ ఇంకా రావాలి.స్త్రీ ని కేవలం ఒక ప్రాణాలున్న మాంసపు ముద్దగా కాకుండా ఒక బుద్ది   జీవిగా గుర్తించ గలిగినప్పుడే , ఇలాంటి  స్థితి  నుంచి స్త్రీ బయటకి రాగలుగుతుంది.

– శారద ములుగు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

7 Responses to అతివలపై అత్యాచారాలు

 1. anand says:

  డబ్బు కావాలంటే చాలా విధాలు ఉన్నాయి సంపాదించడానికి , నటించం అని చెప్పాలి కాని తీసే వాళ్ళని వద్దు అనడం సరైనది కాదు . ముందు స్త్రీ లో మార్పు రావాలి . స్త్రీ సమస్య ని స్త్రీ ఆర్డం చేసుకోకుండా వాళ్ళకి డబ్బు ముఖ్యం చేస్తారు అంటే ఎలా ? వేరే వాలు చేస్తారు సరే ఆ చేసే వాళ్ళు కుడా ఆడవాళ్లే కదా ముందు స్త్రీ లో మార్పు రావాలి

 2. anand says:

  అవును మీరు చెప్పింది నిజమే కాని అందరు అలా లేరు. ముందుగా మా రాల్సింది స్త్రీ , తనలో నే తన గురించి ఆలోచన రావాలి ,వ్యాపార ప్రకటనలలో సినిమాలలో అలా ఎందుకు నటిస్తున్నారు, అప్పుడు తెలియదా , నటించమని అడిగినప్పుడే మేము చేయం అని అడిగివాడికి నాలుగు చివాట్లు పెడితే మళ్ళి అడగరు కాని అలా చేయరు. ముందు మారండి మార్పు కోసం చూడకండి

  • maheedhara says:

   డబ్బు కోసం వీళ్ళు కాకపోతే మరొకరు నటిస్తారు.బ్రతుకు తెరువు కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ మార్పు వ్యాపార ప్రకటనలు తీసే వాళ్ళలో రావాలి.

   • mulugu sarada says:

    ధన్యవాదాలు కామెంట్ చేసినందుకు

  • mulugu sarada says:

   మీరు అన్నది ౧౦౦%రైట్. చదివిన్దందుకు, కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.

 3. jansi devi says:

  అవును అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఎందుకు. అవి మగవాళ్ళకే కావాలి భార్య ప్రక్క నున్న పట్టించుకోకుండా గంటలు గంటలు స్నేహితులతో సోది చెప్పుకోవడానికి మొబైల్స్ ఉండాలి కదా
  అదే అమ్మాయిల దగ్గర సెల్ ఫోన్లు ఉంటె బజారులో ఆకాతయుల నుండి తనని కాపాడమని ఎవరో ఒకరికి ఫోను చేసేస్తుంది.
  అత్తగారి ఆగడాలు భరించలేక పుట్టింటికి ఫోన్ చేసేగలదు, వేధించే మగడి పై పోలీసులికి ఫిర్యాదు చేసేగలదు, అందుకనే అమ్మాయిలకు ఫోను ఉండకూడదు అంటున్నారు.
  రేపు ఇంకెవరో స్టేట్ మెంట్ ఇస్తారు అమ్మాయిలూ ఉపిరి కుడా పిల్చకూడదని

  • mulugu sarada says:

   మీరు అన్నది నిజమే. స్త్రీ ని తమతో సమానంగా గౌరవించని సమాజం లో పురుష పుంగవులు వున్నతవరకూ ఈ పరిస్తితి వుంటుంది కదండీ. కామెంట్ చేసినందుకు, చదివినందుకు ధన్యవాదాలు