దీపావళి

నాడు నరకాసుర సంహారం 
తెచ్చింది దీపావళి పర్వదినం

నేడు ఒక ప్రక్క ఉగ్రవాద నరమేధం
చేస్తోంది వికృత వికటాట్టహాసం
మనుషుల్లో తరుగుతోంది మానవత్వం
నానాటికి పెరుగుతోంది దానవత్వం

మరోప్రక్క నిత్యావసర సరుకుల ధరలు
నింగి నంటుతోన్న తారాజువ్వలు
ఉల్లి, కూరగాయల రేట్లు
గుండెలదిరేలా పేలుతున్న ఔట్లు

ఆర్ డి ఎక్స్ ఆటం బాంబులు ,
ఏకే ఫార్తీ  సెవన్ రైఫిళ్లు ,
వీధుల్లో  సంచరించే మానవబాంబులు
కొనకుండానే దొరికే టపాసులు
ఇది ఈనాటి దీపావళి సరళి
మతోన్మాద ముష్కరుల విలయకేళి

చీకట్లు తొలిగిన గురుతులు
ముంగిళ్ళ  వెలిగే  దీపాలు
తొలగాలి  మనసున ముసిరిన చీకట్లు
వెలగాలి మమతల మతాబులు

అహంకార తిమిర స్వార్ధం
నేను,నాదను సంకుచిత భావం
సంహరంచ గలిగిన రోజు
నిజమైన దీపావళి పండుగ రోజు

కె.రాజకుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to దీపావళి

 1. prabhakar says:

  బావుంది !

 2. Dadala Venkateswara Rao says:

  ఉగ్రవాద నరమేధం చేయడానికి మనుషుల్లో మానవత్వం తగ్గడానికి సంభందం ఏమిటో చెబుతారా ?
  నిత్యావసర సరుకుల ధరలు (తారాజువ్వలు) కూరగాయల రేట్లు (ఔట్లు)- ప్రతిరోజూ దీపావళి అంటారు – అంతేనా?
  మతోన్మాద ముష్కరుల విలయకేళిని ఈనాటి దీపావళిగా పోల్చడం సరికాదనిపించింది – ఏమంటారు?
  అ నిజమైన దీపావళి పండుగ రోజు ఒక మతం వారికి మాత్రమె, మరి ఇతరమతాల వారి సంగతి ఏమిటంటారు?