పసిడి మొగ్గలు

చిద్రమైన  బాల్యాన్ని తలచుకుని
చిత్రంగా విలపించే చిన్నారులు
పసిడి మొగ్గలుగానే నేల రాలిపోతున్నామని
తెల్లటి మల్లెపూల రెక్కల రక్తంతో  తడిసి
ఎర్రటి  మందారాలై ఎలుగెత్తి అరుస్తున్నాయి.
ఆ అభాగ్యుల ఆర్తనాదాలు
ఆరని మంటల్లో కాలిపోతూ
కీచకుల వంటి కామాంధులకు  బలిపోయి,
బాలికల హాహాకారాల మిన్నంటుతున్నాయి
ఆడే పాడే బాల్యం -మసిబారిపోతున్నాయి
చిన్నారి లోకంలో విరిసిన మల్లెలు
నవ్వుతూ  విరబూయాలనుకొంటే
ఏ మృగం పొదలచాటున పొంచి ఉందో
తెలియని  అమాయల బేలలు
చీకటి  పొదల చాటున
రాకాసి కామాంధులకు నలిగిపోతున్నాయి
మొగ్గలుగానే నేల రాలిపోతున్నాయి 
కాలం బాల్యంలోనే పడగవిప్పి  కాటేస్తుంటే
పతనమైపోతున్న బాల్యం అంతరించి 
భయం భయంగా బ్రతకలేక చావలేక
బ్రతుకు భారమై చెప్పుకోలేని  మూగజీవాలుగా
వావివరుసలు మరచిన – వయసుడిగిన ముదుసలి
సైతం/అత్యాచారంతో  నరహంతకులై
ఉన్మాదిగా ప్రవర్తిస్తుంటే కంచే చేను మేస్తుంటే
ఎవరిని నమ్మాలి -ఎవరి తోడు కావాలి
ఆడపిల్లగా పుట్టటమే నేరమా !
ఆడజాతికిది శాపమా !
మా జీవితాలను విరబూయనీయండి
అందమైన పువ్వులపై అందాల నవ్వులమై
ఆడుతూ పాడుతూ తిరగాలని
మా కలలు  కల్లలు చేసి – మా తలరాతలు మార్చకండి
అమ్మగా , అక్కగా , చెల్లిగా , చెలియగా
తనువులు , మనసులు పంచి అనురాగంతో
ఆదరిస్తాము / అన్నగా , నాన్నగా, భర్తగా రూపాలెన్నో
చూడాలి మంచి మనసుతో – పంచాలి జీవితం
తోడు నీడవై /ఆకు చాటు మొగ్గలై దాగి ఉన్నాము
రేపటి కోసం విరబూసే పసిడి మొగ్గలం …

-తాటికోల పద్మావతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to పసిడి మొగ్గలు

 1. prabhakar says:

  మొగ్గలు రాలిపోవడానికి మాలి సంరక్షణ లోపం కారణం అయితే పసికూనల కష్టానికి పెద్దలందరమూ కారణమే ! ఇంకా బేల పలుకులు పలుకుతారెందుకు? విద్య, ఆర్ధిక శక్తి, స్వేచ్చ, చట్ట సహకారమూ లాంటి ఆయుధాలు ధరించిన నవ స్త్రీ ఇలా కాదు ఉండాల్సింది ! తుక్కు రేపండి, తాట తీయండి, కీళ్ళు విరచండి, వెళ్ళు నరకండి ! సహించడం కూడా నేరమన్నది మరవకండి !

 2. పద్మావతి గారు.. విహంగ లో మీ దర్శనం ఆనందం.

  వేదనని చాలా బాగా వెలిబుచ్చారు. పైన డి వి.ఆర్ గారు ఇచ్చిన వ్యాఖ్యానంతో నేను ఏకీభవిస్తున్నాను.

  రక్షణ కై శిక్షణ పొందాలి. శిక్షించాలి

 3. Dadala Venkateswara Rao says:

  “మా జీవితాలను విరబూయనీయండి” అని ఎందుకండీ ప్రదేయ పడతారు
  ఆదిలోనే ఎదురు తిరిగి పోరాటపటిమను సంతరించుకోండి
  బలమైన చట్టాలను తీసుకు రండి మీ చుట్టూ ఉన్న వారికి రక్షణ ఇవ్వండి
  మామోలు ఆకు చాటు మొగ్గల వెనుక కూడా ము ళ్ళుఉంటాయి
  అన్ని తెలివితేటలున్న మానవ నారీమణులు మీరు
  మోసపోకండి మోసగించే అవకాశమే ఇవ్వకండి
  తెలివిగా మసలుకొని వదిలించుకోండి
  అవసరమైతే కాటేయండి
  మీకు మీరే మీభవిష్యత్తును
  తీర్చి దిద్దుకోండి
  మొగ్గలుగా పూవులుగా ఉండకండి
  కాయలోని టెంకలు గా గట్టిబడండి
  మీ తలరాతను మీరే దిద్దుకోండి