ఓ వనితా… నీ ఘనత !

అందమైన పొగరు..
ముద్దులోలికే నగవు..
మురిపించే మాట…
మళ్లీ మళ్ళి చూడాలనిపించే మోము…
చురకత్తిలాంటి చూపు…
స్వచ్చమైన మనసు…
మచ్చ లేని సొగసు…
పరిపూర్ణ ఉషస్సు…
కట్టిపడేసే తేజస్సు…
ఆకర్షించే అందం…
సెలయేటి గలగలల చెలాకితనం…
పుడమిని మించిన ఓరిమి గుణం…
నింగిని మించిన విశాల హృదయం…
ఏదైనా సాధించగల ఆత్మ స్త్యర్యం…
అభిమానాన్ని దానం గా భావించే ఆత్మ గౌరవం…
మాటలని పదునెక్కిన కత్తిలా సంధించే వాక్చాతుర్యం…
ఏ రంగం లోనైనా అవలీలగా రాణించగల  మొండితనం…
ఏ ఏటికైన ఎదురీదే ధైర్యం…
తెగువతో తల వంచక నడచుకునే గుండె నిబ్బరం…
సమస్యలను సామరస్యంగా చేదించే నైజం…
” ఇవన్ని ఒక్క మగువకు మాత్రమె సొంతం…”
మగవాళ్ళు బలవంతులు ఆడవాళ్ళు బలహీనులు,  అని అంటుంటారు.. నిజానికి ” మగవాడి బలం కండల్లో మాత్రం కనపడుతుంది, ఆడవారి బలం ధైర్యం గుండెల్లో కొలువుంటుంది ” సమయం వచ్చినప్పుడే అది కట్టలు తెంచుకుని విజ్రుంబిస్తుంది.

ఎవరు?? ఎవరు  అన్నారండి ఆడవాళ్ళూ వంటలు చేయటానికి వంటింటికి తప్ప దేనికి పనికిరారు ఏమి సాధించలేరు అని, పాతి పెట్టేయండి ఆ పనికిరాని మాటలన్నీ..
ప్రపంచానికి అమ్మై ప్రేమను పంచిన మదర్ తెరిస్సా …
రాజకీయ రణ రంగం లో అలుపెరుగని పులి లా తన చూపుడు వేలుతో దేశాన్ని గడ గడలాడించి పరిపాలించి అందరికి ఆదర్సమైన ఇందిరమ్మ….
ఆకాశానికి దూసుకెళ్ళి అంతరిక్షాన్ని తన గుప్పెట పట్టి విజయ ఢంకా మ్రోగించి నింగికెగిసి రారాణిలా  జండా ఎగరేసిన  సునీత…
క్రీడా రంగంలో అలుపెరుగని పటిమని ప్రదరించిన p.t.ఉష , సానియా మిర్జా…
లాటి చేత పట్టి దేశంలో అన్యాయ అక్రమాల భరతం పట్టి శాంతి భద్రతల రక్షణకు నేనున్నా అంటూ ధైర్యాన్ని  సాహసాన్ని తన ఇంటి పేరుగా మలచుకున్న కిరణ్ బేడి…
కళా రంగాన్ని ఒక ఊపు ఊపిన సావిత్రి, విజయ శాంతి…
ఒక రంగం ఏంటి, ఒక వృత్తి ఏంటి అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో తనదంటూ తనకంటూ  ఒక  రాజస స్థానాన్ని ఏర్పరచుకుని యెనలేని సేవలతో యెనలేని కీర్తి ప్రతిష్టలతో , ధైర్యే సాహసే లక్ష్యే , మాకు మేమే సాటి లే అంటూ ఎవరికి తీసిపోని విధంగా ఈ ప్రపంచంలో మొదటి స్థానం లో నిలిచింది నేటి మహిళా…
తర తరాలుగా అణిచివేయటానికి రాసిన రాతల, ఆడంకుల  గోడలను చీల్చుకుని బద్దలు కొట్టుకుని వచ్చి  మాకేం తక్కువ, మాలో లేదా ఏ గొప్ప అనుకుంటూ ప్రపంచానికే పాటాలు చెప్పెంతగా ఎదిగి, ప్రపంచాన్నే తన అదుపు ఆజ్ఞల్లో పెట్టి ఆ ప్రపంచానికే సరి కొత్త గమ్యం చూపే దిశగా పరుగులు తీసి అలుపు ఎరుగక, ఆగక తన దారిలో వచ్చిన ముళ్ళని ఒక్క తన్ను తన్ని పక్కకు పారేసి గర్వంగా, విజయ గర్వం తానుగా నిలిచింది మరొకరికి మగవారికి సైతం ఆదర్శం అయ్యింది..

అందం లో అయిన,  ఆటు పొట్ల కు ఎదురు తిరిగే ధైర్యం లో అయిన, సమస్యలను అవలీలగా, సులువుగా పరిష్కరించే నేర్పులో అయిన
ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అత్యున్నత స్థానం లో నిలిచి, సవాళ్ళను ఎదుర్కొని తన బ్రతుకుకి తానూ సమాధానం చెప్పుకుని, ఎవ్వరినైన ఒప్పించగల ఘన చాతుర్యాన్ని తన సొంతం చేసుకుని బహు ముఖ ప్రజ్ఞాశాలిగా ఈ లోకానికి ఒక రారాణి అయ్యింది.
మగవాలు ఏమన్నా దిగొచ్చార, కొమ్ముల తో ఏమన్నా పుట్టుకొచ్చార అని మా పటిమను చుడండి అని తానెంతో తన తెగువ ఏంటో నిరూపించుకుని
మేమేవరికీ తీసిపోం ఆన్న రీతిలో నేడు మగువ మగ మహారాజుల తెలివి బలిమి ఘన కీర్తిలను సైతం జయించి తానొక శిఖరమై సప్త సముద్రాలను సైతం జయించి, వినీలాకసపుటంచులను   కూడా పరిపాలించి, కదన రంగాన యుద్ధం చేసి  ఈ సమస్త విశ్వం ఆస్చరం తో  దద్దరిల్లేలా తన కీర్తి శక్తి సామర్ధ్యాలను చాటింది.

అసలైన సాహసం ఆడపిల్లదే దాన్ని తట్టి లేపి సాధించు అసాధ్యమైనదాన్ని…
నిజమైన ధైర్యం ఆడ జన్మదే లేని పోనీ భయాలకు దాన్ని బలి చేయకు, పోరడు పట్టుదల నీ సొత్తని …
జ్వలించు శక్తివై  తడబడక  నిలబడు విజయం కోసం…
మహోన్నత శిఖరాలు అధిరోహించుట నీ కర్తవ్యం…
అసలు నువ్వు ఆడపిల్లవేనా అని వెక్కిరించిన నోళ్లకి తెలియచెప్పు అసలు సిసలైన ఆడపిల్ల తత్వం…
నీ కోన గోటి తో శాసించు ఈ సమస్త విశ్వం…
గుర్తుంచుకో గుర్తుంచుకో ఓ నేస్తం నీకు నువ్వు వెలితి అనిపించుకునేల మలచుకోకు నీ జీవితం…
నీ మీద నీకు విరక్తి కలిగేల బావిలో కప్పల బ్రతకకు అది అవివేకం…
నువ్వేమి తక్కువ కాదు నీలో వుంది సామర్ధ్యం…
చేసి చూపితే తప్పేమీ కాదు ఎవరికి తీసిపోను అన్న రీతిలో ఏదో ఒక ఘనకార్యం…
అని సాటి మహిళా లోకానికి తన పిలుపునిచ్చి మహిళ అంటే మహోన్నత శక్తి యుక్తుల సమ్మేళనం అని రుజువు చేసి గర్జించి తలదన్నేలా తన బ్రతుకుని  మలచుకుని మహిమాన్విత శక్తి అయ్ ఈ లోకానికే తన సత్త చూపించి మెప్పించింది.ప్రపంచం మొత్తం కూడబలుక్కుని ఒక్కటైనా ధైర్యంగా అడుగులేసే మగువ నీడను సైతం తాకలేరు ఇది నిజం, ఈ నిజాన్ని నిజం చేయటం కోసం
తన కృషి దీక్షలను పెట్టుబడులుగా పెట్టి తానంటే ఒక జ్వలించే అగ్గి సంద్రం అని నిప్పులతో చెలగాటం ఆడింది, నివురు గప్పిన నిప్పులా చెలరేగి  తన ప్రతిభను చాప కింద నీరుల ప్రపంచ నలువైపులా వ్యాపింప చేసింది..
నువ్వెంత అని ఎగతాళి చేసిన వారికి ఇదిగో నేనింత అని కను సైగ చేసి సమాధానం చెప్పింది నేటి మహిళ.

ప్రపంచ సుందరి కిరీటాన్ని అలంకరించుకుని అందానికి మేమే, అన్నిటా మాకు మేమే సాటి అని మేటి అయ్యి నిలిచింది..
నన్ను గేలి చేస్తే నా పట్టుదలని తట్టి లేపిన వారవుతారు అన్నట్లు ఎవరెన్ని వెక్కిరింతల కిష్కిందలు తైతక్కలు ఆడిన వాటన్నిటికి ఘాటు సమాధానం చెప్పగలిగింది
నవ మాసాలు తన గర్భ గుడిలో  తన ప్రాణాన్ని పణం గా పెట్టి తన రక్తాన్ని పంచి ఒక బిడ్డని  మోసి కని పెంచి పెద్ద చేసి తీర్చి దిద్ది మంచి పౌరులుగా దేశానికీ అందించి తన అపూర్వ భాద్యతని నిర్వర్తించటం లో అమ్మ గా తన స్థానం అందరికన్నా మిన్నే…
ప్రపంచానికి తానెంతో నిరూపించుకున్న ఒక ఇల్లాలు గా ఒక అమ్మ గా ఒక చెల్లి గా ఒక అక్క గా తన పూర్తి భాధ్యతలను నిర్వర్తిస్తూ అన్ని విషయాల్లో తానె మిన్న అన్నట్లు తనని తానూ మలచుకుంది  నేటి మగువ..

ఒకప్పుడు సతి సహా గమనం, బాల్య వివాహాలు అనే ఛాందసాలు ఉండేవి , గురజాడ వారు చలం  మరెందరో స్త్రీ స్వచ్చ వాదులు అనేకమంది
వీటిపై పోరాడి స్త్రీ యొక్క  గొప్పతనాన్ని  చాటి చెప్పారు…

ఆడవాళ్ళు అయిన మగవాళ్ళు  అయిన సమానమే అని గుర్తించే మగవాళ్ళు  వున్నప్పుడు ఈ ప్రపంచం లో  అంతా మర్యాద గౌరవాలే వుంటాయి చిన్న చూపులకి తావుండదు..

-అభిలాష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
4 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Numita
Numita
8 years ago

సూపర్బ్ …. చాలా బాగుంది ….

Chaitanya Kranti
Chaitanya Kranti
8 years ago

మేడం వ్యాసం బావుంది కాని ఇది ఎవరిని ఉద్దేశించి రాసారో అర్ధం కాలేదు..
స్త్రీలు అన్నిటా విజయ బావుటా ఎగరేస్తున్నారు అని అంటూ మళ్ళీ ఎవరి గుర్తింపు కోసం చూస్తున్నారు..నేను ఏ లోకంలో ఉన్నానా అని నాకు సందేహం కలుగుతున్నది.. నాకు తెలిసిన ప్రపంచములో మగవారి నుంచి ఈ వివక్షలు కనపడటం లేదు.. అయితే గియితే సాటి ఆడవారి నుంచి (అమ్మగా, అత్తగారిగా, ఆడపడుచుగా, వదిన గా, తోడి కోడలిగా) ప్రమాదం పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది.. మగవాడి ప్రతి కదలిక వెనుక ఏదో రూపం లో ఆడదే ఆడడానికి శత్రువుగా కనిపిస్తున్నది..
అటు నుంచి మీవంటి వారు నరుక్కు రాగలిగితే అంతా ఇందిరమ్మలు, సునీతా విల్లియంలు, మదర్ తెరేసాలు, సావిత్రి, విజయశాంతి, సుశీల, జానకి, శైలజ, శ్రీలేఖ, విజయనిర్మల, సానియా, సైనా, కిరణ్ బేడి, సుష్మిత సేన్, మరో అభిలాష కాగలరు..
ఈ రోజుల్లో కూడా సతి సహగమనం & బాల్య వివాహాల గురించి చర్చించడం తగదు.. ఒకప్పుడు వివక్ష ఉండేదాన్న మాట వాస్తవమే కాని దాన్ని పట్టుకుని ఎన్నాళ్ళు ఆవేశాలు వ్యర్ధం చేసుకుంటారు.. దానికంటే ఈ ఆవేశాన్ని, టాలెంట్ ని వేరే చోట సదుపయోగం చెయ్యడానికి మీ వంటి తెలివయిన వాళ్ళు ప్రయత్నిచి ముందడుగు వేస్తే చాల మందికి ఒక మంచి దారి చూపిన వారవుతారు..
నా మనోగతం చెప్పానంతే.. ఇక్కడ నా అభిప్రాయం చెప్పడంలో నేనెంచుకున్నమార్గం తప్పయి ఉండవచ్చు కాని ఆలోచన తప్పు కాదు.. ఆ దృక్పధంలో నా మాటని తిలకించ మనవి.. శుభం భూయాత్.. సర్వేజనా సుఖినోభవంతు..

Abhilasha
Abhilasha
8 years ago

ha ha ha మీ అక్కసు చాలా చక్కగా వేల్లబోసారు చైతన్య కృష్ణ….

Shamili Nyabilli
Shamili Nyabilli
8 years ago

వావ్….excellent