స్ట్రీట్ డ్యాన్సర్

చూపుల్లో  కలిసి 
చూపుల్లోనే రాలిపోతున్న 
విధ్వంస  స్వప్నాన్ని –
కాలం కూడా చాలా చిత్రమైనది,
ముళ్ళను  గుచ్చుతూనే సౌందర్య సుగంధ పరిమళాన్ని 
వెదజల్లమని ఆజ్ఞాపిస్తోంది  – 
నా సుకుమార నిజనైజాన్ని ప్రేమతో స్పర్శించిన 
ఏకైక  ఛాయ పేరు అత్యంత  విషాదం –
ఆటాడుతున్నంత సేపు నాలోని వింత ఫాంటసి 
వేదికంత  రూపమెత్తి నర్తిస్తుంది –
తర్వాత, 
గ్రీష్మ  భారానికి పండి రాలి నిర్గమ్యంగా  గాలివాటుకు
కొట్టుకొని పోతున్న  ఎండుటాకుని –

వొట్టి  myth  ని –
లోకం 
కోసం
ఆడుతున్నాను –

 లోకం 
నన్ను 
ఆడిస్తోంది –  

– ఇక్బాల్  చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , Permalink

4 Responses to స్ట్రీట్ డ్యాన్సర్

 1. Can I use some of the content from your site on mine? I will make sure to link back to it 🙂

 2. Janakiramam says:

  స్ట్రీట్ డాన్సర్ అనగానే శీర్షిక చదివించేదే అయినా మినీ కవిత కాస్త నిరూత్సాహమ్ కలిగించింది. అయినా స్పందించే మనసుండాలి కాని రాయాలన్న వూహే ముఖ్యం. నా మాటల్లో స్ట్రేట్ డాన్సర్ అంటే

  “అపుడే సాయంత్రపు సూరీడు
  మబ్బుల చాటున దాక్కుంటూ
  చీకటి మాటున మాయమవుతుంటే
  ప్లడ్ లైట్ల పరదా వెనకనుండి
  రంగుల హంగులతో అర్ధనగ్నసుందరి
  కవ్వింపుల హొయలు ఒలకబోస్తూ
  కుర్రకారుకు స్వప్నాల కేన్వసును
  భహిరంగంగా చీకటి ఆకాశాన్ని
  చీల్చుకుంటూ ఉత్సాహాన్ని చిన్దులేయిస్తుంది !”
  రస రాజుల వుహల్ని ఉర్రూత లుగిస్తుంది,
  కసిగా కేకలు వేసె ఊసుల్ని వెర్రిక్కిస్తుంది,
  వేదిక చుట్టూ కేరింతల వలయాన్ని-
  తన జానెడు పొట్ట కోసమేనని యాచిస్తుంది!
  లేని నవ్వును పెదాలపైన పెనవేస్తూ
  కన్నీటి ఉప్పెనలను తనలోనే దాచేస్తుంది,
  తెలవారే వెలుగు రాకముందే అంధకారంలో
  కలిసిపోతుంది…………..

 3. chitrakalpana says:

  రికార్డింగ్ డ్యాన్సులు చూసారా???
  మగాళ్ళలొ రికార్డింగ్ డాన్స్ చూడని వారు ,దాని గురించి వినని వారు అరుదు.రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూతమ అంద చందాలను ప్రదర్శించే వేదిక. పండగ, పబ్బాల సందర్భంగా రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లెటూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి.పోలిసుల నిఘా ఎక్కువ కావడం తో ఇప్పుడు రికార్డింగ్ డాన్సులు చాలా రహస్యంగా . folllow………. www .jaiainayaka .blogspot .com

 4. Dadala Venkateswara Rao says:

  లోకం ఆడిస్తే ఆడుతున్న మనుషులమే మనమందరం
  ఎంచుకున్న వృత్తికి న్యాయం చేకూర్చడం మన ధర్మం
  కాలానుగుణంగా వృత్తి, జీవానవిదానంలో మార్పులోస్తాయి
  మనుషుల సుఖ సంతోషాలకనుగునంగానే జీవనవిధానాలు రూపుదిద్దుకుంటాయి
  ఆడుతున్నంతసేపు నలుగురికి ఆనందాన్ని పంచుతూ తనూ ఆనందిస్తుంది
  అలా అలా ఆనందిచాలేకపోతే మరునాడు అలా ఆడి అందరిని మెప్పించలేదు
  బ్రతుకుతెరువు బాటలో
  నడిచే వారు కొందరు – నడిపించే వారు కొందరు
  ఆడేవారు కొందరు – ఆడించేవారు కొందరు

  ఇక్బాల్ చంద్ గారు మినీ కవిత వ్రాసారు
  నా చేత ఇలా కామెంట్ వ్రాసేలా చేసారు