ఉపాధ్యాయుడు

 ఈ భూమి మీద వున్న ప్రతి గురువుకు పాదాభివందనాలు….. 

 ప్రశాంతత,చైతన్యం ఈ రెండు నిశ్శబ్థాల మధ్య  అన్వేషణే సాధన…

 ఈ సాధన ఫలమే ఙ్ఞానం …….

 అటువంటి ఙ్ఞానాన్ని  ప్రసాదించేవాడే గురువు…. 

   ఙ్ఞానార్ధులకు కల్పతరువు గురువు….      

  మరుగుతున్న రాతికి జీవం పోసే దేవుడు గురువు………   

   జీవితం అనే బడిలొ  …

  ఆదర్శం గురువు (ఉపాధ్యాయుడు )….

  విఙ్ఞానం పాఠాల్ని తదేకంగా చెప్పుకు పోతు వుంటారు………… 

  అందుకే ఈ మణి మనసుతో  అంటుందీ  ………

   ఓహోహో అధ్యాపకుడా…..

   అపార ఙ్ఞానానంద భరితుడా…

  ఆచార్యుడవు,ఆరాద్యుడవు నీవే…

  భవిష్యత్తుకు మార్గం చూపే మార్గదర్శకుడవు నీవే….

  భావిపౌరుల పాలిట పునాదివై…..

  విద్యలు ప్రసాదించు మా పాలిట దేవుడవై…  

  వి దయా  ర్ధుల విఙ్ఞాన పెన్నిధివై..

  మీ యొక్క సౌశీల్యమే ఈ సమాజానికి ఆశాకిరణమై..           

  విద్యార్ధిలో విద్యాతృష్ణను కలిగించే వాడివి నీవే… 

  విద్యార్ధికి విలువైన పాఠ్యగ్రంధానివి నీవే..               

  విద్యార్ధిలో భయమనే వరదకు ధైర్యమనే ఆనకట్టను నిర్మించేవాడివి నీవే.

  విద్యార్ధిలో చీకటి అనే అఙ్ఞానాన్ని తొలగించి ,
  వెలుతురు చూపు నీవు 

  సాధారణ ప్రజానికానికి ఓ ప్రతికా   …….

  బండికి ఇరుసే ఆధారం ,

  విద్యార్ధికి ఉపాధ్యాయుడే ఆధారం..

  అందువల్ల –

  ఓ గురుదేవా!

  తల్లితండ్రిలా కలకాలం తోడుగా నిలవాలని …..

  ప్రతీ శుభోదయానా మా నోటితో పలికే అమ్మానాన్న  అక్షరమాల  

  తరువాత తస్మైశ్రీ గురువై నమః

  కావాలని మనసార ప్రార్ధిస్తున్నాను….  

– పీతాంబరం మణికుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కవితలుPermalink

6 Responses to ఉపాధ్యాయుడు

 1. sai Krishna says:

  ఆచార్యులు ., గురువులు., ఋత్విజులు
  సదా పూజనీయులు అజ్ఞానమనే చీకటిని తొలగించి
  జ్ఞాన సంపద అనే మహా ఐశ్వర్యాన్ని వెలుగుని అందించే ప్రత్యక్ష దైవాలు :

  ఆచార్య :
  శ్లో : ఉపనీయ తు యశ్మష్యం వేదమధ్యాపయే ద్ద్విజః ! సకల్పం స రహస్యం చ తమాచార్యం ప్రచక్షతే !!

  తా: శిష్యునకు ఉపనయన సంస్కారం జరిపి వేదాలు మరియు కల్పసూత్రాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అన్నిటిని ఏ బ్రాహ్మణుడైతే నేర్పుతాడో అతడు ఆచార్యుడనబడతాడు

  ఉపాధ్యాయుడు :
  శ్లో : ఏకదేశం తు వేదస్య వేదాంగా న్యపి వాపునః!
  యోఁధ్యాపయతి వృత్తర్థ ముపాధ్యాయస్స ఉచ్యతే !!

  తా: వేదంలో కొంతభాగంగాని జీవనం సాగించడానికి అనువైన పాండిత్యం (వేదాంగాది వ్యాకరణాలు పురోహిత జ్యోతిష్యాది అంశాలను)
  నేర్పేవారిని “ఉపాధ్యాయులు” అంటారు

  గురువు :
  శ్లో: నిషేకా దీని కర్మాణి యౌ కరోతి యధావిధి!
  సంభావ యతి చాన్నేన స విప్రో గురు రుచ్యతే!!

  తా: జాతకర్మ మొదలుకొని జీవోత్పత్తి క్రియలను చేయించటం మరియు సకల కార్యాలు చేయించటం జీవన విధానాన్ని భోదించటం
  భోజనం పెట్టి పోశించటం వంటి సత్కర్మలు చేసేవారిని “గురువు” లు అంటారు

  ఋత్విజుడు :
  శ్లో : అగ్న్యాధేయం పాక యజ్ఞా నగ్నిష్టోమాదికాన్ మఖాన్! యః కరోతి వృతో యస్య సతస్స్యర్త్విగి హోచ్యతే!!

  తా: దేవతార్చనలు వివాహాది శుభకార్యాలు చేయుట అగ్న్యాదేయం అష్టకాది పాకయజ్ఞాలు అగ్నిష్టోమాది యాగాలు వివిధ పురోహితాది కార్యాలు ప్రతిష్ఠాదికములు ఆగమ శాస్త్ర కార్యాలు మొదలగు సత్కర్మలు ఇతరుల ఇష్ఠానుసారం చేయిస్తారో వారిని “ఋత్విక్కు” అంటారు

  వందమంది ఋత్విజుల కంటెను ఒక గురువు గౌరవనీయుడు,,
  వందమంది గురువుల కంటే ఒక ఉపాధ్యాయుడు గౌరవనీయుడు,,
  వందమంది ఉపాధ్యాయుల కంటెను ఒక ఆచార్యుడు గౌరవనీయుడు

  విప్రుడు ఉపనయన సంస్కారంతో ద్విజునిగా రెండవ జన్మపొందుతాడు
  అట్టి ఉపనయనంతో వేదాలను గ్రహించి బ్రహ్మజ్ఞానాన్ని ఇహపరాలను పొందును
  అట్టి అధికారాన్ని ప్రసాదించే ఆచార్యుడు
  తండ్రి కంటెను శ్రేష్టుడు

  ప్రతీ వ్యక్తి జీవితంలో గురువునదే ప్రముఖపాత్ర ఉంటుంది జీవన విదానాన్ని విద్యను భోదించే మార్గదర్శి “గురువు”

  “గు” అనగా “చీకటి”
  “రు” అనగా వెలుగు (ప్రకాశం)
  అజ్ఞానం అనే చీకటిని (అంధకారాన్ని) తొలగించి బ్రహ్మ విద్య అనే జ్యోతిని వెలిగించి
  ప్రకాశవంతమైన జీవన మార్గనిర్ధేశన చేయువారే
  “గురువు”

  శ్లో : శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
  శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
  ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
  నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే !!

  తా : అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు

  శ్లో : గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవొ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  తా: గురవే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల స్వరూపము, గురువే సాక్షాత్తూ సృష్టిమూలమైన పరబ్రహ్మ అలాంటి గురువునకు నా ప్రణామములు

  ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.

  సూచక గురువు – చదువు చెప్పేవాడు
  వాచక గురువు – కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
  బోధక గురువు – మహామంత్రాలను ఉపదేశించేవాడు
  నిషిద్ధ గురువు – వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
  విహిత గురువు – విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
  కారణ గురువు – జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
  పరమ గురువు – జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.

  అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
  చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః

  ఓం శ్రీ గురుభ్యో నమః

  మీ..
  ఆచార్య…

 2. mani kumari. says:

  thank you very much sir….

 3. Dadala Venkateswara Rao says:

  మణి మనసుతో అన్న మాటలు చదివాను.
  ఇందులో ఇవే పదాలు ఉన్నాయి -ఉపాద్యాయుడు,గురువు,,అధ్యాపకుడు,ఆచార్యుడు
  కవితలు వ్రాసే ముందు మీ గురువుగారి దగ్గర ఎలా వ్రాయాలో నేర్చుకుని వ్రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను

  ఇట్లు
  ఒక ఉపాధ్యాయుడు

 4. lakshmans says:

  మణికుమారి గారు ఉపాధ్యాయుడి గురించి మీరు రాసిన కవిత బాగుంది.

 5. D SIVASANKARMAHANTHI says:

  పీతాంబరం మణికుమారి గారు మీ కవిత చాల బాగుందండి ఇలాంటి మంచి కవితలు ఇంకా ఎన్నో రాస్తారని ఆశిస్తున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)