భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

ఆంగ్ల సైన్యాలను సాయుధంగా నిలువరించిన సాహసి-బేగం జవిూలా

   మాతృభూమిని పరాయిపాలకుల నుండి విముక్తం చేసి సొంత గడ్డను స్వదేశీయుల పాలనలో చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన యోధులు స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ బాటను ఎన్నుకున్నారు. ఆ విధంగా తిరుగుబాటు యోధులతో కలసి కదనరంగాన ఆంగ్లేయ సైనికులను నిలువరించిన యోధులలో ఒకరు బేగం జవిూలా.
       ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూరు జిల్లాలోని ఓ గ్రామంలో బేగం జవిూలా 1935లో జన్మించారు. ఆమె ఆత్మాభిమానానికి మారుపేరైన పరాయి పాలకులకు తలవంచని పఠాను కుటుంబానికి చెందిన యువతి. పరాయిపాలకుల పెత్తనాన్ని ఏమాత్రం సహించని వారసత్వంగల ఆమె ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. కంపెనీ పాలకులు మాతృభూమిని కబ్జా చేయటం భరించలేకపోయారు.
      ఆ సమయంలో 1857 నాటి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ నగారా మోగింది. ఆ నగారాతో ఆమెలోని యోధురాలు రణరంగానికి సిద్ధ్దమయ్యారు. మాతృభూమి సేవలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ముందుకు సాగారు. స్వదేశీపాలకుల విూద దాడులు జరుపుతూ తరలివస్తున్న బ్రిటీషు సేనలను నిలువరించడానికి తిరుగుబాటుయోధులతో కలిసి శతృవుపై కలబడ్డారు.
         ఆ సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు ఆమెను అరెస్టు చేశాయి. బ్రిటీషు సైనిక న్యాయస్థానం విచారణ తంతును పూర్తిచేసి ఆమెకు ఉరిశిక్షను ప్రకటించింది. పుట్టిన గడ్డను పరాయి పాలకుల నుండి విముక్తం చేయటంలో ప్రాణాలను అర్పించి బేగం జవిూలా చరితార్థురాలయ్యారు.
(Who is Who Indian Martyrs, Dr.PN Chopra, Govt. of India Publications, New Delhi. 1973, Page.64)

అగ్ని యుగంలో అపూర్వంగా భాసించిన సాహసి -ఖుదీరాంకి దీది

బ్రిటీష్‌ వలసపాలకుల బానిసత్వం నుండి స్వదేశాన్ని విముక్తం చేసి, స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరం ఆయుధాలు చేపట్టి విస్ఫులింగాలై బ్రిటీషర్ల విూద విరుచుకుపడుతున్న అగ్నియుగం రోజులవి. విప్లవకారుల అణిచివేతకు పలు చట్టాలను అమలులోకి తీసుకురావటమే కాకుండా, విప్లవోద్యమాన్ని దుంపనాశనం చేయడానికి అన్ని రకాల అధికారాలను ప్రసాదించి పోలీసు అధికారులను ఆంగ్లేయ ప్రభుత్వం ఉసికొల్పింది. విప్లవకారులకు సహాయపడుతున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఉద్యమ సానుభూతిపరులను అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించి అంతం చేస్తున్న భయానక వాతావరణమది.
     బ్రిటీష్‌ పోలీసుల దాష్టీకాలను భరించలేక కుటుంబ సభ్యులే విప్లవకారులైన తమ బిడ్డలతో సంబంధాలు వదులుకుంటున్న భయంకర వాతావరణంలో బ్రిటిష్‌ పోలీసులకు ఏమాత్రం భయపడకుండా విప్ల్లవయోధుడు ఖుదీరాంకు అండగా నిలవటమే కాకుండా ఆయనకు ఓ యువతి ఆశ్రయం కల్పించారు. ఆమెను ఆయన దీది (అక్కయ్య) అని పిలిచారు. ఆ కారణంగా ఆమె ఖుదీరాంకి దీది ఆయ్యారు.
       ఆమె అసలు పేరు తెలియదు. చరిత్ర ఆమెను ఖుదీరాంకి దీది (ఖుదీరాం అక్కయ్య) గా నామకరణం చేసింది. ఆ పేరుతోనే ఆమె స్వాతంత్య్రోద్యమ చరిత్రలో గణుతికెక్కారు. ఆమె ప్రముఖ విప్లవకారుడు మౌల్వీ అబ్దుల్‌ వహీద్‌ చెల్లెలు. అన్నకు తగ్గ చెల్లెలుగా ఆమె పోరుబాటన నడిచి పోరాట యోధులకు అండదండలు అందించారు.(Freedom Movement and india Muslims,Santimoy Ray, PPH,New Delhi,1993,Page.34)
భయమెరుగని విప్లవకారుడు ఖుదీరాంను తమ్ముడిగా భావించిన ఆమె అతనికి ఆశ్రయమిచ్చారు. ఆంగ్లేయాధికారి కెన్నడీ (Kennedy) భార్యను హత్య చేసారన్నది ఖుదీరాం విూద ఆరోపణ. బ్రిటీష్‌ మహిళను హత్యగావించాడని ఆగ్రహంతో రగిలిపోతున్న అధికారులు ఖుదీరాం సమాచారం కోసం, ప్రజలపై, విప్లవోద్యమ సానుభూతిపరులపై విరుచుకుపడి, విధ్వంసం సృష్టిస్తున్నారు, చిత్రహింసల పాల్జేస్తున్నారు. ఆ పరిస్థితులలో ఆమె ఖుదీరాంను రక్షించపూనుకోవటం సాహసం.
       ఆ విషయాన్ని పోలీసులు ఏమాత్రం పసిగట్టినా, ఖుదీరాంతోపాటుగా ఆమె కూడా దారుణ చిత్రహింసలకు గురికావటమేకాక ప్రాణాలను కూడా అర్పించాల్సి వచ్చేది. అటువంటి భయానక వాతావరణంలో కూడా ఆమె భయపడలేదు. అక్కయ్యకు ఏమాత్రం కష్టం-నష్టం కలిగించటం ఇష్టంలేక కొంతకాలం తరువాత ఖుదీరాం ఆమె వద్ద నుండి వెళ్ళిపోయారు. అ తరువాత అరెస్టయ్యారు. ఆయనను చాలా కాలం నిర్భంధంలో ఉంచింది ప్రభుత్వం. ఆ సమయంలో కూడా జైలులో నున్న ఖుదీరాం క్షేమసమాచారాలను తెలుసుకోడానికి ఆమె ఎంతో తెగింపుతో ప్రయత్నించారని ఆ యోధురాలి సాహసాన్ని చరిత్రకారుడు ప్రముఖ రచయిత Santimoy Ray, తన గ్రంథం Fredom Movement and India Muslims(Page.34) లో ప్రశంసించాడు.
         చివరకు ముజఫర్‌పూర్‌ జైలులో ఖుదీరాంను 1908 ఆగస్టులో ఉరితీశారు. ఉరిశిక్ష విధించిన విషయం తెలుసుకున్న ఆమె ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలను ఖాతరు చేయకుండా పోలీసు వర్గాలను విమర్శించారు. అత్యంత కష్టకాలంలో విప్లవకారులకు అండగా నిలచి, కోరి తెచ్చుకున్న కష్టనష్టాలను చిరునవ్వుతో భరించిన ఆ యోధురాలు భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఖుదీరాంకి దీది గా చిరస్మరణీయమైన ఖ్యాతిని స్థిరపర్చుకున్నారు.

జుగాంతర్‌ విప్లవ దళం వీరవనిత -రజియా ఖాతూన్‌

భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రజానీకాన్ని అన్ని రకాల త్యాగాలకు సిద్ధపర్చింది. అహింసామార్గంలో బ్రిటీష్‌ సేనల తుపాకి గుండ్లకు బలైన ఖుదాయే- ఏ-ఖిద్మత్‌గార్‌లనూ (భగవత్సేవకులు), ఆయుధాలను చేతపట్టి బ్రిటీష్‌ పోలీసు-సైనిక దళాలను తొడగొట్టి సవాల్‌చేసి రణరంగంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను బలిపెట్టిన విప్లవకారులనూ జాతీయోద్యమం సృజియించింది.
     బ్రిటీషర్ల బానిసత్వం నుండి విముక్తి కోరుకుంటూ సాగిన ఈ పోరాటాల మార్గాలు ఏవైనా అందులో పురుషులతోపాటు మహిళలు కూడా నడుంబిగించి మున్ముందుకు సాగారు. విముక్తి పోరాటంలో ఏమాత్రం వెన్ను చూపక ఆయుధం చేపట్టి బ్రిటీషర్ల వెన్నులో చలి పుట్టించారు. ఈ మేరకు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని సవాల్‌ చేసి హడలగొట్టిన ఆడపడుచులలో రజియా ఖాతూన్‌ ఒకరు.
   

        భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో అగ్నియుగం గా పిలువబడిన సాయుధ పోరాట కాలంలో జుగాంతర్‌, అనుశీలన సమితి, ఆత్మోన్నతి దళం, గదర్‌ విప్లవ దళం, హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ తదితర విప్లవ దళాలలోని విప్లవవీరులు అపూర్వ ధైర్య సాహసాలతో, అసమాన త్యాగాలతో అగ్నియుగాన్ని రగిలించారు. అటువంటి విప్లవ వీరుల సరసన నిలిచిన మహిళామణి రజియా ఖాతూన్‌.
ఆమె ప్రముఖ విప్లవయోధుడు మౌల్వీ నశీరుద్దీన్‌ అహమ్మద్‌ కుమార్తె. చిన్ననాటి నుండి ఆమెలో అంకురించిన దేశభక్తి భావనలు బ్రిటీష్‌ వ్యతిరేకతను తీవ్రతరం చేశాయి. స్వదేశాన్ని విదేశీ పాలకుల బానిసత్వం నుండి విముక్తం చేయాలని ఆమె సంకల్పించారు. తండ్రితో పాటు ఆమె కూడా జుగాంతర్‌ విప్లవ దళంలో సభ్యత్వం స్వీకరించారు. జుగాంతర్‌ విప్లవయోధులు సాగించిన సాయుధపోరాటానికి దళ సభ్యురాలిగా రజియా ఖాతూన్‌ క్రియాశీలక తోడ్పాటునందించారు.

       మాతృదేశ విముక్తికోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి చిరునవ్వుతో బలిపెట్టడానికి సిద్ధమైన, ముక్సుద్దీన్‌ అహమ్మద్‌ (నెట్రకోన), మౌల్వీ గయాజుద్దీన్‌ అహమ్మద్‌, అబ్దుల్‌ ఖాదర్‌ (జమ్లాపూర్‌) తదితరులతో కలసి రజియా ఖాతూన్‌ విప్లవ కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిటీష్‌ పాలకవర్గాలు జుగాంతర్‌ దళ సభ్యులను పూర్తిగా మట్టుపెట్టాలని ఒకవైపున తీవ్రంగా కృషి చేస్తూ, దాడులు, దాష్టీకాలకు పాల్పడుతున్న భయానక సమయంలో కూడా ఆమె మార్గం మళ్ళకుండా విప్లవబాటన నడిచారు.
             ఆనాటి భయంకర పరిస్థితులలో కూడా విప్లవోద్యమంలో మున్ముందుకు సాగేందుకు రజియా ఖాతూన్‌ ఏమాత్రం భయపడలేదు. బ్రిటీష్‌ గూఢచారుల, పోలీసుల కదలికలను, ఇతర సమాచారాన్ని రహస్యంగా విప్లవకారులకు చేరవేయటం, దళంలోని సభ్యులకు ఆశ్రయం కల్పించటం, ఆహారం, ఆర్థిక, ఆయుధ సహాయ సహకారాలు అందచేయటం లాంటి పనులను చాకచక్యంగా నిర్వహించి జుగాంతర్‌ విప్లవ దళం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు.
ప్రముఖ చరిత్రకారుడు Santimoy Ray తన గ్రంథం Freedom Movement and India, PPH, New Delhi,1993,Page.44లో ఆ పోరాట యోధురాలు రజియా ఖాతూన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

– సయ్యద్ నశీర్  అహమ్మద్

““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““
72

Uncategorized, , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో