ఆచార్య దేవోభవ……. కవిత

ఉపాధ్యాయుల దినోత్సవాన్ని
పాఠశాల లో  పండుగ సంబరాలు
జరుపుకొంటూ  గురువుని
మించిన దైవం లేదని
గురువులేని విద్యకు గురుతే లేదని
ఏకలవ్యుడు  సైతం ద్రోణాచార్యుని
ప్రతిమను గురువుగా భావించాడు
విలువిద్య నేర్చుకొన్నాడు
పవిత్రమైన గంగానది లా పారే 

అపారమైన విద్యా సంపదను
శిష్యులందరికీ  సమానంగా పంచిపెట్టే
నిష్కల్మషుడు నిరాడంబరుడు  అయిన
గురువు ఎప్పటికి పూజనీయుడే 

బాల్యాన్ని   బంగారు భవిష్యత్తుగా
తిర్చిదిద్దాలని చేయిపట్టుకొని

ఓనమాలు  నేర్పించి  ఓరిమితో
వెలుగనే జ్ఞానాన్ని ప్రసరించి

అజ్ఞానతిమిరాన్ని  పారదోలి
సరస్వతి  పుత్రుడిగా మలచి

విద్యతో పాటు  వినయాన్ని నేర్పించి
భాష పరిజ్ఞానాన్ని, ధర్మాదర్మాలను  ప్రభోదించి
నీతి న్యాయాలను
మట్టిముద్దను  అందమైన శిల్పంగా మలచి
సంస్కారవంతుడిగా  విద్యావంతుడిగా
తీర్చిదిద్దిన వారే నిజమైన గురువులు
పవిత్రమైన గురుత్వాన్ని  కళంకితం చేసి
విద్యాలయాల్లో  విద్యార్దుల పట్ల
నీచంగా, హేయంగా, దయనీయంగా
దౌర్భాగ్యంగా ప్రవర్తించే తీరుకు
ఆకళామతల్లి సరస్వతీ దేవి కన్నీళ్ళతో  విలపిస్తున్నది
తండ్రితో సమానమైన గురువు వికృత  చేష్టలకు
విద్యాలయాలు ఉలిక్కిపడుతున్నాయి
సన్మార్గంలో పెట్టాల్సిన గురువులే
దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే  

గురుపూజోత్సవాలెందుకు
సర్వేపల్లి  రాధాకృష్ణ  గారిని శిష్యులు  గౌరవించినట్లు
ఉపాధ్యాయులంతా  వారి ఆదర్శ మార్గంలో  నడిచిన నాడు
భారతదేశం పునీతమవుతుంది.

– తాటికోల పద్మావతి 

““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

కవితలు, , , Permalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Mansoor Ahmmad
Mansoor Ahmmad
8 years ago

భాష పరిజ్ఞానాన్ని, ధర్మాదర్మాలను ప్రభోదించి
నీతి న్యాయాలను
మట్టిముద్దను అందమైన శిల్పంగా మలచి
సంస్కారవంతుడిగా విద్యావంతుడిగా
తీర్చిదిద్దిన వారే నిజమైన గురువులు
పవిత్రమైన గురుత్వాన్ని కళంకితం చేసి
విద్యాలయాల్లో విద్యార్దుల పట్ల
నీచంగా, హేయంగా, దయనీయంగా
దౌర్భాగ్యంగా ప్రవర్తించే తీరుకు
ఆకళామతల్లి సరస్వతీ దేవి కన్నీళ్ళతో విలపిస్తున్నది
తండ్రితో సమానమైన గురువు వికృత చేష్టలకు
విద్యాలయాలు ఉలిక్కిపడుతున్నాయి
సన్మార్గంలో పెట్టాల్సిన గురువులే
దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే … చాల బాగుంది తాటికోల పద్మావతి గారు.

Dadala Venkateswara Rao
Dadala Venkateswara Rao
8 years ago

తాటికోల పద్మావతి గారూ
ఆచార్య దేవోభవ …..కవిత అయితే
దీనికి ఏపేరు పెడతారో చెబుతారా?
……………………………………….?
ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పాఠశాల లో పండుగ సంబరాలు జరుపుకొంటూ గురువుని మించిన దైవం లేదని, గురువులేని విద్యకు గురుతే లేదని ఏకలవ్యుడు సైతం ద్రోణాచార్యుని ప్రతిమను గురువుగా భావించాడు. విలువిద్య నేర్చుకొన్నాడు. పవిత్రమైన గంగానది లా పారే అపారమైన విద్యా సంపదను శిష్యులందరికీ సమానంగా పంచిపెట్టే నిష్కల్మషుడు నిరాడంబరుడు అయిన గురువు ఎప్పటికి పూజనీయుడే. బాల్యాన్ని బంగారు భవిష్యత్తుగా తిర్చిదిద్దాలని చేయిపట్టుకొని ఓనమాలు నేర్పించి ఓరిమితో వెలుగనే జ్ఞానాన్ని ప్రసరించి అజ్ఞానతిమిరాన్ని పారదోలి సరస్వతి పుత్రుడిగా మలచి విద్యతో పాటు వినయాన్ని నేర్పించి భాష పరిజ్ఞానాన్ని, ధర్మాదర్మాలను ప్రభోదించి నీతి న్యాయాలను మట్టిముద్దను అందమైన శిల్పంగా మలచి సంస్కారవంతుడిగా విద్యావంతుడిగా తీర్చిదిద్దిన వారే నిజమైన గురువులు.

పవిత్రమైన గురుత్వాన్ని కళంకితం చేసి విద్యాలయాల్లో విద్యార్దుల పట్ల నీచంగా, హేయంగా, దయనీయంగా దౌర్భాగ్యంగా ప్రవర్తించే తీరుకు
ఆకళామతల్లి సరస్వతీ దేవి కన్నీళ్ళతో విలపిస్తున్నది. తండ్రితో సమానమైన గురువు వికృత చేష్టలకు విద్యాలయాలు ఉలిక్కిపడుతున్నాయి. సన్మార్గంలో పెట్టాల్సిన గురువులే దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే గురుపూజోత్సవాలెందుకు ?

సర్వేపల్లి రాధాకృష్ణ గారిని శిష్యులు గౌరవించినట్లు ఉపాధ్యాయులంతా వారి ఆదర్శ మార్గంలో నడిచిన నాడు భారతదేశం పునీతమవుతుంది.