చర్విత చరణం

నాలోకి నేను….నాలోకి నేనే…..

జ్ఞాపకాలఅగ్నిపర్వతాలు రగులుతూ 

పశ్చాత్తాపపు  లావాలు మరిగిస్తూ ఉంటే 

ఆవృత చిత్రాలను గీస్తూ  ఉంది 

కాలం మొహం మీద ముడుతల్లో 

శిధిల జ్ఞాపకాల ఎండ మావుల్లో 

చేసిన మంచి పనులకై వేట 

ధాన్యపు కంకుల్ని అంకాలుగా వ్రాసిన చెయ్యి 

ఆకలికి వణికి పోతుంది 

స్వార్ధం తో  ప్రేమను దాచుకున్న చెలమ 

నేడు నీకెవరు అని ప్రశ్నిస్తూ ఉంది 

నాకెవరు సాటి అని విర్రవీగిన పొగరు 

 ఆదరించే పలుకు కోసం  అర్రులు చాస్తూ 

ఎదురులేక నిలిచిన చెట్టు 

కర్ర ఊతంతో వంగింది 

హిమాలయానికైనా వృద్ధాప్యపు చెలిమి లో 

ఊతం అవసరం ఏమో…..

 

గూటి నుండి తరమబడిన పక్షులు 

వృద్ధాశ్రమ పంచలకు వేలాడుతూ 

మరణ స్వాగతాలను ఆలపిస్తున్నాయి 

కాల చక్రం తరుముతూ ఉంటే 

నడుము వంగిన నేను ఆరడుగుల జాగా కోసం 

అంగలారుస్తూ..ఆకలి వెతలు మోస్తూ…

నాలోకి నేనే పయనిస్తూ…..

 

స్వార్ధమే అజండాగా ఝండా  ఎగురవేసి 

అంతస్తుల పునాదుల్లో బంధాలు పూడ్చివేసి 

అహంతో ఎగరవేసిన మోము 

ఇలాతలానికి  వ్రాలి సిగ్గు పడుతూ ఉంది 

చేసిన తప్పులు మదిలో రొద పెడుతుంటే 

వాడిపోయిన సంధ్యలో ….వలికి పోయిన కాలం లో 

నాలుగు రాళ్ళే కాని ….నలుగురిని దగ్గరకు 

చేర్చుకోలేకపోయిన అశక్తత 

చర్వితచరణం ప్రతి జీవితం లో 

మానవత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది…

 

– శశికళ.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)