చరితార్ధ స్వాతంత్య్రం

భారత స్వాతంత్య్రానికి మహోత్సవం
భారతీయులకిది మహోదయం
ఇన్నేళ్ళ స్వాతంత్య్ర ప్రస్థానంలో
మనల్ని మనం ఓసారి అవలోకించుకొంటే
మనది పురోగమనమా ! తిరోగమనమా !
ప్రగతిపథంలో మనది పురోగమనమైనా
మానవతా పథంలో మాత్రం తిరోగమనమే
కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో
మనస్సు కల్మషమైపోయి
అణువణువు ద్వేషాగ్నితో రగిలి
మానవత్వాన్ని మంట గలుపుతోంది.
ప్రతి వ్యవస్థలో అల్లుకొన్న అవినీతిని
కూకటివేళ్ళతో పెకలించగలిగితే
‘నా’ అన్న స్వార్ధం వీడి
‘మన’ మన్న భావనతో
సాటివాడిని ప్రేమించగలిగితే
శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి.
ఆనాడే స్వాతంత్య్రానికి చరితార్ధత
మహామహుల త్యాగానికి సార్ధకత

– కె.రాజకుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , Permalink

One Response to చరితార్ధ స్వాతంత్య్రం

 1. -ఆర్.దమయంతి. says:

  ప్రగతిపథంలో మనది పురోగమనమైనా
  *మానవతా పథంలో మాత్రం తిరోగమనమే
  ‘నా’ అన్న స్వార్ధం వీడి
  ‘మన’ మన్న భావనతో
  సాటివాడిని ప్రేమించగలిగితే
  ఆనాడే స్వాతంత్య్రానికి చరితార్ధత..*
  – అనే మీ భావన బావుంది.
  శుభాకాంక్షలతో-
  ఆర్.దమయంతి.