భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి ప్రాణాలర్పించిన యోధురాలు – ముందర్‌

              1857 నాటి సంగ్రామంలో మాత్రభూమిని బ్రిటీషు పాలకుల నుండి విముక్తి చేయడానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన  తిరుగుబాటు చేసిన యోధులు చివరి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి నాయకుల వెంట నడిచారు. చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి త్యజించారు. ఆ విధంగా  పోరుబాటలో నడిచి అమరత్వం పొందిన ముస్లిం యువతులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి నీడలా వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన ఓ సాహస యువతి కథనం తెలుస్తుంది. ఆమె పేరు ముందర్‌.
ఝాన్సీ రాణి లక్ష్ష్మీబాయి అమరత్వం పొందిన తీరు గురించి ప్రధానంగా రెండు కథనాలు ఉన్నాయి. ఆ కథనాలలో ఒకటి రాణి లక్ష్ష్మీబాయి బ్రిటీషర్ల తుపాకి గుండ్లకు బలైందన్నది. ఈ విషయాన్ని చాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ కథనం ప్రకారంగా ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి  అంగరక్షకుల్లా ఇరువురు  యువతులు మగ వేషాల్లో ఆమెను ఎల్లప్పుడూ వెన్నంటి ఉండేవారు. ఆ ఇద్దరిలో ఒకరు ముస్లిం యువతి. ఆమె రాణితో పాటు బ్రిటీష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. అప్పటి సెంట్రల్‌ ఇండియా ప్రాంతానికి గవర్నర్‌ జనరల్‌ ప్రతినిధిగా నియమించబడిన రాబర్ట్‌ హెమిల్టన్‌ 1858 అక్టోబర్‌ 30న అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్‌సన్‌కు ఒక లేఖ రాశాడు.

ఆ లేఖలో రాణి లక్ష్మీబాయి విూద తాము సాధించిన విజయాన్ని వివరించాడు. రాణి లక్ష్మీబాయి ఏ విధంగా మరణించింది వివరంగా తెలిపాడు. ఆ కథనం ప్రకారంగా, రాణి వెన్నంటి ఒక ముస్లిం యువతి గుర్రం విూద అనుసరించేది. కొఠాకి సరాయి ప్రాంతంలో రాణితోపాటుగా ఆమెకు తుపాకి గుండ్లు తగిలాయి. ఆమె రాణితోపాటుగా  ఒకేసారి నేలకొరిగిందని వివరించాడు.
ఆ విషయాన్ని EIGHTEEN FIFTY SEVEN  గ్రంథంలో  Dr. Surendra Nath Sen ఆంగ్లేయాధికారి రాబర్ట్‌ హెమిల్టన్‌ వివరణను ఉటంకించారు. ( ‘.. The Rane was on Horse back, and close to her was the female (a Mohomaden)  who seems never to have left her side on any occasion, these two were struck  by bullets and fell ‘ (Page 295) ఈ లేఖలో ఎక్కడా కూడా ఆ యువతి ఎవరన్న విషయం ప్రస్తావించలేదు.
ఆ కారణంగా ఆమె అజ్ఞాత యోధురాలుగా మిగిలిపోయింది. భారత ప్రభుత్వం 1973లో ప్రచురించిన    Who’s who of Indian Martyrs, Vol. 3  లో మాత్రం ఝాన్సీ రాణితో పాటుగా పలు పోరాటాలలో పాల్గ్గొన్న ఆ ముస్లిం మహిళ గురించిన సంక్షిప్త వివరాలను డాక్టర్‌ పి.యన్‌. ఛోప్రా ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
‘..Fought by the side of Maharani Lakshmi Bai during the battles against the British at Jhansi, Koonch, Kapi and Gwalior, Killed in the battle at Kotah-ki-sarai in Gwalior, where the Rani attained martyrdom. Her Body was also cremated in the garden of Baba Ganga Das at Gwalior on June 17, 1857 ‘ – Who’s who of Indian Martyrs, Vol.3, Govt. of India Publications, New Delhi, 1973, Page.102.
ఆ యోధురాలి పేరు ముందర్‌ (MUNDAR) అని డాక్టర్‌  ఛోప్రా పేర్కొన్నారు. ఈ వివరణలను, చరిత్ర గ్రంథాలలో వ్యక్తం అవుతున్న  కథనాలకు అన్వయించుకుని  చూస్తే ఆ అజ్ఞాత యోధురాలు పేరు  ‘ ముందర్‌ ‘  గా భావించవచ్చు. *

బ్రిటీష్‌ సైనిక  మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి – బేగం రహీమా

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, మాతృదేశాభిమానులైన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ లో త్యాగాల బలివేదికను ఆనందంగా అధిరోహించగల సాహసాన్ని, ఆత్మార్పణా స్ఫూర్తిని కలుగచేసింది.  ఆ వీరగుణం కొందర్ని వ్యక్తిగత సాహసాలకు పురికొల్పితే మరికొందర్ని ఉమ్మడి పోరాటాలకు సన్నద్ధులను చేసింది. ఈ మేరకు బ్రిటీష్‌ సైనికదళాల విూద విరుచుకుపడ్డ తిరుగుబాటుదళాలతో కలసి పోరుబాటను ఎంచుకున్నారు బేగం రహీమా.

         ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లాకు చెందిన రాజపుత్రుల కుటుంబంలో 1829లో జన్మించారు. రాజపుత్రుల శౌర్యప్రతాపాలు సంతరించుకున్న ఆమె స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ సైనిక మూకల విూద సమర శంఖరావం పూరించారు. ఆయుధం ధరించి తిరుగుబాటు దళాలతో కలిసి శత్రుమూకలను సంహరించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోరులో గాయపడిన ఆమె బ్రిటీష్‌ సైనికాధికారులకు బందీ అయ్యారు.  శత్రువు గుప్పెట్లో ఉన్నా, ఏమాత్రం తలవంచని ఆ యోధురాలికి సైనికాధికారులు ఉరిశిక్ష విధించారు. మాతృదేశం కోసం మరణించటం అత్యంత గౌరవంగా భావించిన బేగం రహీమా చిన్న వయస్సులోనే, పుట్టిన గడ్డకోసం ప్రాణాలను  అర్పించారు. ఆ తరువాతి తరం విప్లవకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారు.
(Who is who Indian Martyrs, Dr. PN Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 118)(1829 -1857)*

తిరుగుబాటుయోధుల క్షేమం కోరుతూ అగ్నికి ఆహుతైన – అస్గరీ బేగం

                ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మాతృభూమి పట్ల తెగని బంధాన్ని పెంచుకున్న ప్రతి ఒక్కరూ అపూర్వమైన త్యాగాలతో చిరస్మరణీయులయ్యారు. అటువంటి త్యాగధనులలో  తిరుగుబాటు యోధుల క్షేమం కోరుకుంటూ తనను తాను బలి చేసుకున్న త్యాగశీలి శ్రీమతి అస్గరీ బేగం.
1811 జులై 5న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ జిల్లాలో అస్గరీ బేగం జన్మించారు. ఆమె కుటుంబం ప్రథమ స్వాతంత్య్రసంగ్రామయోధుల కుటుంబం. 1857నాటి పోరాటంలో పాల్గొన్న ఖ్వాజీ అబ్దుల్‌ రహిమాన్‌ ఆమె కుమారుడు.అబ్దుల్‌ రహిమాన్‌ను  బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఆ తిరుగుబాటులో ఆమె కూడా పరోక్షంగా పాల్గొన్నారు. ఆ సంగ్రామంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తన బిడ్డలేనని భావించిన ఆమె  తిరుగుబాటు వీరులకు ఆశ్రయం కల్పించటం, ఆహార పానీయాలు అందించటంలో  సహాయపడ్డారు.
ఈ విషయం తెలిసిన ఆంగ్లేయ సైనికాధికారులు ఆమెను బంధించారు.  ఆమె విూద రాజద్రోహం ముద్రవేశారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధుల రహస్యాలు చెప్పమని ఆమెను వేధించారు. అధికారులతో సహకరించకుంటే సజీవదహనం చేస్తామని బెదిరించారు. ఆ  బెదిరింపులు ఏవీ కూడా ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. చివరకు భయంకర చిత్రహింసల పాల్జేసినా ఆమె లొంగలేదు, పెదవి విప్పలేదు. అందుకు ఆగ్రహించిన అధికారులు ఆమెను సజీవదహనం చేయించారు. ఆంగ్లేయ సైనికాధికారుల హింసాత్మక చేష్టలను భరించిన అస్గరీ బేగం మాతృభూమి సేవలో చిరునవ్వుతో  బలయ్యారు.(Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi,1993, Page.116 and Who is who Indian Martyrs, Dr. PN Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 118)

– సయ్యద్ నశీర్  అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)