మురళి


“కృష్ణా ..!!

ఈ అడవిలో

వెదురు నై

పడి ఉన్న నేను

నీ పెదవుల

మధురిమ సోకి

మురళి నయ్యాను….!!”

– శ్రీ లత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, , , , , , , , Permalink

8 Responses to మురళి

 1. MATTA RAJU says:

  మీ కవిత చిన్నగా ఉన్న చాల అర్థవంతంగా ఉంది లతా గారు చాల చాల బాగుంది ..

  మట్ట రాజు

 2. SHRINIVAS says:

  మీ కవితలో పదజాలం చాల బాగుంది శ్రీలత గారు

 3. sravya says:

  చాలా బాగుంది 🙂

 4. Dadala Venkateswara Rao says:

  శ్రీ లత గారూ
  మీ కవిత చదివిన తరువాత నాకు మూడు పేరడీలు వ్రాయాలనిపించింది

  “రామా ..!!

  ఈ అడవిలో

  రాయి నై

  పడి ఉన్న నేను

  నీ చేతుల

  స్పర్శ సోకి

  ఆడదాన్ని అయ్యాను ….!!”

  “రామా ..!!

  ఆ అడవిలో

  నీ రాకకై

  వేచి ఉన్న సభరి

  నీవు తిని విడిచిన

  జామపండును తిని

  ధన్యురాలయ్యింది ….!!”
  —-
  “శ్రీ లత గారూ ..!!

  ఈ విహంగ

  కవితాలోకంలో

  వేచి ఉన్న నాకు

  మీ కవిత గాలి సోకి

  పేరడీ కవి నయ్యాను ….!!”

  • sreelatha says:

   మీ పేరడి కవితలు కూడా చాలా బాగున్నాయి ….
   కృతజ్ఞతలు

   • Dadala Venkateswara Rao says:

    ధన్యవాదములు .. శ్రీ లత గారూ …!

 5. lakshman says:

  శ్రీ లత గారు మీరు రాసిన ఈ చిన్ని కవిత చాల బాగుంది.