వేద్ కవితలు

నా ఆరో ప్రాణం

రాత్రింబవళ్ళు
నాతోపాటు పని చేస్తూ-
దించిన మెడ ఎత్తని
వెట్టి చాకిరీ ఊసెత్తని
నా ప్రియ నేస్తం
నా ఆరో ప్రాణం
ఎవరనుకుంటున్నారు?
స్వచ్చమైన
తన ‘ప్రేమ వెలుగుల్ని’

నా ముందున్న పుస్తకంపైనిండుగా వడ్డించే
నా టేబుల్ లైట్

 

***************

ఎందుకు?

కాళ్ళ క్రింద
తొక్కబడ్తున్నా
పౌరుషంగా
తలెత్తుతాయి
గడ్డిపరకలు!
నిలువు దోపిడీ
చేయబడ్తున్నా
తలవంచుకు పోతారేం
ఈ మనుషులు?

                       – వేద్

*******************

This entry was posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం. Bookmark the permalink.

2 Responses to వేద్ కవితలు

  1. vedavyas says:

    డి వి రావు గారు ……….థాంక్స్ …..మీరు మంచి కవిత్వం చెబ్తున్నారు. good to say that..  ved

  2. Dadala Venkateswara Rao says:

    రాత్రింబవళ్ళు
    మీకు సహా చర్యలు చేస్తూ-
    సరాసరి దించిన మెడ ఎత్తని
    వెట్టి చాకిరీ ఊసెత్తని
    మీ ప్రియ నేస్తం అదే మీ ఆరో ప్రాణం
    ఎవరనుకుంటున్నారు?
    స్వచ్చమైన
    తన ‘ప్రేమ వెలుగుల్ని’
    మీ ముందున్నవిస్తరిపై నిండుగా వడ్డించే
    మీ అర్ధాంగి మాటేమిటండి?

    టేబుల్ లైట్ కి
    ఇంటి ఇల్లాలికి
    ఇంత చక్కగా పోలిక చెప్పగలిగిన
    మీకు జోహార్లు ఎలా చెప్పాలో
    తెలియడం లేదు వేద్ గారు

    కాళ్ళ క్రింద
    తొక్కబడ్తున్నా
    పౌరుషంగా
    తలెత్తుతాయి
    గడ్డిపరకలు!
    నిలువు దోపిడీ
    చేయబడ్తున్నా
    తలవంచుకు పోతారేం
    ఈ ముదితలు?

    చలి చీమలు సైతం
    చైతన్యంతో కాల సర్పాన్ని
    చీల్చి చెండాడుతాయి

    గర్భంలోనే జ్ఞానాన్ని
    జీర్ణించుకున్న విజ్ఞాన మణులు
    ఓర్పు సహనం అనే ఆయుధాలతో
    మగపురుగుల్ని అణచడంలో సిద్ధహస్తులు
    నారీమణులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Heads up! You are attempting to upload an invalid image. If saved, this image will not display with your comment.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)