స్వపక్ష పోరాటం
మొత్తానికి దళితులకి భూమి పై హక్కే కాదు. తమ ప్రాణాల పైన ,నోట్లోకి వెళ్ళే నాలుగు
గింజల పైన కూడా హక్కు లేదన్న నిజం మరో సారి తేటతెల్లమయింది.
శ్రీకాకుళం జిల్లా , లక్ష్మిం పేట లో జూన్ 12 ,2012 న జరిగిన దళితుల వధ ఎప్పటిలాగే
కొన్నిపత్రికల్లో లోపలి పేజీ వార్త గా మిగిలింది. రక్తం తో తడిసిన 250 ఎకరాల సాక్షిగా అయిదు
మందిప్రాణాలను కోల్పోగా , 30 మంది కి పైగా తీవ్రమైన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స
పొందుతున్నారు.
ఎప్పుడూ ఆస్థులు,అధికారం పైవర్గాల చేతుల్లోనే ఉండాలన్న కుతంత్రం
కార్య రూపం దాల్చితే నిమ్మకి నీరెత్తిన అధికార యంత్రాంగాన్ని నిద్రలేపే పని లో పడ్డాయి
దళిత ప్రజా సంఘాలు. తమ వారిహక్కుల కోసం న్యాయం కోసం పోరాడుతున్న దళిత
నాయకులూ కార్యకర్తలు , దళిత మహిళాకార్యకర్తలది అగ్ర స్థాయి మద్దతు లేని స్వపక్ష
పోరాటంగానే కనిపిస్తుంది.
దేశానికి స్వాత౦త్ర్య౦ వచ్చి౦దని గర్వ౦గా చాటి చెప్పుకున్నా, అట్టడుగున ఉన్న
జీవితాలను చూస్తే అ౦దుకు భిన్న౦గానే ఉ౦టు౦ది.
ఏ పార్టీ నాయకత్వ౦లో ఉన్నా ఆయా ఊళ్ళలోని దళిత వర్గాల పైనే దాడులు జరుగుతాయి .
దళితులే ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్నారు.
కార౦చేడు, నీరు కొండ ,లక్ష్మిం పేట …. వూళ్ళ పేర్లు మార్పే కానీ దళితుల బ్రతుకుల్లో
మార్పు లేదు.రక్షణ లేదు.
ఈ సంఘటనలో పైకి కనిపిస్తున్న దాడులు, హత్యల వెనక జీవితాలను కోల్పోయిన బాధిత స్త్రీ
మూర్తుల ఆర్తనాదం వినిపిస్తుంది. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు తమ
బిడ్డలతో సహా ఆధారం లేక ఒంటరిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయ బడ్డారు. ఆర్ధిక
ఆలంబన లేని వారు పైగా సాగు చేసుకుంటున్న భూముల కారణంగానే వైధవ్యంలోకి
నెట్టేయబడ్డారు.
స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్పేస్ ,ప్రైవసీ ఏదైనా కానీయండి. దానికి ఏ పరిస్థితుల్లో
అయినా భంగం కలిగితే సాటి వ్యక్తులుగా,సాటి స్త్రీలుగా స్పందిచటం,మద్దతు తెలపడం ఒక
సామాజికభాద్యత. ఇటువంటి విషయాలపై అభిప్రాయ సేకరణ చేసే పత్రికలు, స్పందించే
స్త్రీలకి అభినందనలు.
కానీ పనిలో పనిగా అయినా లక్ష్మిం పేటలో భర్తల్ని కోల్పోయిన మహిళా బాధితులకు కూడా
ఒకసంతాప సందేశాన్ని అందించలేక పోయా(రు)రూ?
- పుట్ల హేమలత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
















సానుకూలంగా స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు .
దళిత సమస్యపై సంపాదకీయం అంటే పత్రిక ఎటువైపు నిలబడిందో అర్ధం చేసుకోవడం అంత సులువా అని ఎవరైనా అంటే , దానికి యెంత దైర్యం కావాలో అంతకంటే పదిరెట్లు దైర్యం ఉన్నది అనడానికి అద్దం పడుతుంది. అందుకు మీకు చెయ్యెత్తి దండం పెడుతున్న. మాట సాయం కూడా చెయ్యని దౌర్భాగ్యులు ఉన్న ఈ సమయంలో మీ సంపాదకీయం వ్యాపార పత్రికలకు వో చెంప దెబ్బ . కీపిటప్ .
హేమ గార్కి అభినందనలు
దళిత పోరాటాలకి అగ్ర వర్ణాల ప్రోత్సాహం ఉండదని, లేదని మీరు చక్కగా వివరించారు. మీడియా కూడా ఆ రోజు న్యూస్ గా చూస్తుందే తప్ప , దళిత పోరాటాలకి ఎటువంటి నైతిక మద్దతు గానీ , కనీసం మేధావి వర్గాల్ని సమీకరించి ఉద్యమం దిశగా నడిపించే బాధ్యత గానీ తీసుకోవడం లేదు . మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు, నష్ట పరిహారం గురించి మాట్లాడేవాళ్ళు …దాంతో తమ బాధ్యత తీరిపోయిన్దన్నట్లు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం.
మన పాఠక మిత్రులనుంచి ఈ బాధితులకు ఎదైనా ఆర్ధిక సహాయం అందేలా చూస్తె బాగుంటుందని నా అభిప్రాయం. సంపాదకులుగా మీనుంచి ఈ ప్రయత్నం చేస్తే చాలా సంతోషిస్తాను. నా వంతు సహాయం కూడా అందించగలనని మనవి చేస్తూ , మీకు మరొక్కసారి అభినందనలు తెలియచేస్తున్న్నాను .
- వేద్
వేద్ గారూ ,
మీ సూచన బాగుంది. తప్పకుండా మన విహంగ పాఠక మిత్రులు మరి కొంతమంది మీలాగా స్పందిస్తే మనం పీడితుల కి మన వంతు సహాయం చెయ్యగలం.
మహిళా పత్రికలే కాదు, మహిళా సంఘాలు ముందుకు రావాలి.అంతే కాదు, మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా దీన్ని చర్చనీయాంశం చెయ్యాలి. మీ స్పందన కు అభివందనాలు.
రాజా
సంపాదకురాలికి,
వ్యాసం బాగుంది. ఇందులో మహిళా ఉద్యమం ఎందుకు చొరవ చూపడం లేదో అర్ధం గాదు. భూమి ante కేవలం పురుషులకే స్వంతం అనే భావన మనలో ఇంకా ఉందేమో. స్త్రీల మీద జరిగిన దాడుల గురించి స్పందనే లేదు. అది మన లోపమా ? లేక మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదా. స్త్రీ ఉద్యమ కారులు ఆలోచించాలి..
అభినందనలు
హేమా వెంకట్ రావు .