ఒక్కసారైనా ప్రశ్నిద్దాం!!

అమాయకంగా వాగులోకి వంగి నీళ్ళు తాగుతున్న జింక అకస్మాత్తుగా దాడి చేసిన సింహానికి ఆహారమైపోతుంది.చెంగు చెంగున గెంతులేస్తున్న అల్లరి కుందేలు నక్క టక్కరి వేటకు బలైపోతుంది.
ఇది ఆటవిక న్యాయం..
చిన్న జంతువు, పెద్ద జంతువుకు అలుసు
ఏదేమైనా…ఇది నిరంతరంగా సాగే ఆహారపు గొలుసు!

ఒక రోజు బడికెళ్ళిన అమీనా ఇంటికి తిరిగి రాదు
కాలేజీ ఫంక్షన్ కు హాజరైన నీరజ మరి కనిపించదు
పిల్లాడిని ఆయమ్మకొదిలి ఇపుడే వస్తానని
కూరగాయల మార్కెట్టుకు వెళ్ళన మేరీ శరీర భాగాలు ఏ నదిలోనో తేల్తాయి
ఇంట్లో పోట్లాడి పారిపోయిన చిన్ని మరి దొరకలేదు
చిత్తు కాగితాలు ఏరితే గాని పోట్ట గడవని మున్నీ చీమకు కూడా కనిపించలేదు!

ఏమైపోయారు వీళ్ళు?
మానవులను తినే క్రొత్త జీవులు పుట్టాయా ప్రపంచంలో?
కొత్త ఆహారపు గొలుసు నిరంతరం సాగనుందా ఇక సమాజంలో?!!

శరీర భాగాల అమ్మకాలు జోరందుకున్న ఈ రోజుల్లో
నిర్జీవ సాక్షులై….ఏ నదిలోనో తేలుతున్నారేమో వెతుకుదాం!
ట్రాఫికింగ్ పేరుతో జరిగే మానవ రవాణాలో భాగంగా
ఏ బ్రోతల్ లోనో జీవశ్చవాలుగా మ్రగ్గుతున్నారేమో విచారిద్దాం!!

బయట తిరగాలంటే భయం…
స్వేచ్చాపాఠాలను వల్లించాలంటే వెన్ను జలదరింపు
పరాయివాడే అపహరిస్తాడో…
పగబట్టిన “రా”బంధువే ప్రాణాలు తీస్తాడో….
ఊహించలేని పరిస్థితులు!!

“కనడం తెలిసిన వాడివి, వెతుక్కోలేవా?” అనో..
“కాపురం చేయడం తెలిసిన వాడివి, నీ భార్యెక్కడుందో కనుక్కోలేవా” అనో
వెతకమన్న పాపానికి పోలీసోడు వెళ్ళగక్కే విషాన్ని కూడా మింగాల్సిన పరిస్థితులు!!

కన్నవాళ్ళ కళ్ళ నిండా పీడకలలు నింపి
కుటుంబాల జాడలను సైతం చిన్నాభిన్నం చేసి
సమాజ నిర్మాణాన్ని…
మానవత్వాన్నే మంటగలిపే
ఈ జుగుప్సాకరమైన అకృత్యాలను ఒక్కసారైనా ప్రశ్నిద్దాం!!

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to ఒక్కసారైనా ప్రశ్నిద్దాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో