ఆరేళ్ళప్పడు..
పక్కింటి అంకుల్
గట్టిగా బుగ్గ గిల్లాడని
తల్లికి చెప్పలేకపోయింది.
- కోప్ప డ్తుందని!
బడిలో ఓ కిరాతక పంతులి వెకిలి చేష్టల్ను
గొంతు లోనే అణచేసింది..
ఇంట్లో తెలిస్తే -
చదువుకిక సెలవంటారని.
కిరాణ దుకాణం వెంకటేశ్వర్లు
బస్సులో కండక్టరు
ఇంటి సందు లో రౌడీ గుంపు
ట్యూ షన్ మాస్టారి కొడుకు
అన్ని అవమానాలలోనూ
కన్నీటి తోడొక్కటే చాలనుకుంది.
ఈవ్ టీజింగ్ ని – ముని పంట నొక్కి..
రాగింగ్ లకు – దాసోహం చేసి.
అగ్ని గుండాల గండాలన్నీ దాటుకొచ్చింది
అగ్ని పునీత సీతనని మురిసింది.
వుద్యోగంలో -
అధికారి దుర్బుధ్ధి బయటపె (ప) డితే
గుట్టుగా తిట్టింది. వింటే, ఎవరైనా..
నింద తనకొస్తుందని భయపడి!
చివరిగా -
భర్త కౄరత్వాన్ని భరించడంలో
తానింకా భూదేవి పాత్రనే ధరి స్తూ
ఆతని ఆగడాలన్నిటినీ.. సహనంగానే భరిస్తోంది
మౌనంగా లోలోన కుముల్తూ..శాంతిని కోల్పోతూ.!
ఆరు నూరైనా సరే …
నుదుటి గీతను రాసే హక్కు మొగుడిదే అంటూ..
అతగాని ఆంక్షల లక్ష్మణ రేఖని చెరపలేనంటూ..
చెదరిన మనసుతోనే – ఇక బ్రతుకంటోంది.
వాని వికటాట్ట హాసాల విరుపులో
ఆమె ఒక తునిగిన తునక.
అదే విజయమని విర్రవీగితే -
అతని వెనకనున్నది ఆమె నల్లని నీడ!
- ఆర్.దమయంతి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


















ఆర్.దమయంతి గారు
మిమ్మల్ని ఒకటికి రెండు సార్లు చదివించినందుకు క్షమించాలి
పై కామెంట్ ని మొదట కవిత రూపంలో వ్రాసాను
అది ఇలా ఉంటుంది
ఇది మా మగవారిమీద నా అభిప్రాయం మాత్రమె
తప్పులుంటే సరిదిద్దగలరు
—
ఈ భూమండలానికి పకృతి ఇచ్చిన వరం ఆడది.
ఆకర్షణ ఆమెకున్న అమూల్య లక్షణం సౌందర్యం
చూసినకొలది చూడాలనిపించే అందాలను
పుట్టుకతోనే సంపాదించుకున్న అపూర్వ సౌందర్య రాశి ఆడది
ఎక్కడ చూసినా
ఎటునుంచి చూసినా
ఎలా చూసినా ఎప్పుడు చూసినా
ఎటువంటి మగవారి మనసునైనా
చలింపజేసే ఏకైక మంత్రం ఆడదాని అందం
ఎంత వెధవైనా మేధావైనా
ఆకర్షణకు లోనుకావడం ఒక బలహీనత.
కొందరు చూడాలనుకుంటారు
కొందరు చూస్తారు.
కొందరు తాకలనుకుంటారు.
కొందరు తాకుతారు.
కొందరు అనుభావిన్చాలనుకుంటారు.
కొందరు అనుభవిస్తారు
కొందరు ప్రేమిస్తుంటారు
కొందరు ప్రేమించ బడాలనుకుంటారు
కొందరు వ్యాపారవస్తువుగా చూస్తారు
అందమైన మాయలో పడిన మగవాడి తెగింపు చూస్తె
ఎ శిక్షకైనా సిద్ధపడే అలా చేస్తున్నాడని అనిపిస్తుంది
దేనికి భయపడని మగవాడు
మరలా ఆడదానికి మాత్రమె భయపడతాడు.
ఆమె ఒక తునిగిన తునక
నెమ్మది ఓర్పు సహనం
ఆమెకు ఆమె సంపాదించుకున్న లక్షణాలు
క్షమించడం లాలించడం
సేవించడం పాలించడం
ఆమె గుణగనాలు.
అందుకే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు
ఆడదాని అంతరంగం చాలా గొప్పది
అందుకే ఆమె త్యాగశీలి
ఎం చేయమంటారు
ఇది మగవారి లక్షణం – వీక్షించడం ప్రేమించడం
ఎలా చెప్పమంటారు.
ఇది మగవారి బలహీనత – సొంతం చేసుకోవాలనుకోవడం,
తనకే సొంతం కావాలనుకోవడం.
ఇది సర్వసాధారణం – అందాన్ని చూడాలనుకోవడం చూడడం
ఇది అసాధారణం – వేధించడం భాదిన్చడం శోధించడం సాధించడం
ఆదినుండి శరీర రీత్యా భాలవంతుడైన మగవాడు
ఏదో ఒక సందర్భంలో హద్దులు మీరుతుంటాడు.
ఆడువారి మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు
ఎవరికీ చెప్పుకోలేదనో చెప్పినా తన శీలానికేమి
భంగము వాటిల్లదని అనుకుంటాడు మగవాడు
అటువంటి మగవారికి మీ ఆడువారు వేసే శిక్షలు ఏమిటో మీరే చెప్పండి
..
వెంకటేశ్వర రావ్ గారూ!
మీరు రాసిందంతా చదివాను. ఒక సారి మాత్రమే కాకుండా చదివాను. ఐతే, ( మీరు నవ్వుతున్నట్టు) అర్థం కాక కాదు. అర్థం చేసుకోవడం లో పొరబడ కూడదని! !
< " శరీర రీత్యా బలవంతుడైన మగవాడు ఏదో ఒక సందర్భంలో హద్దులు మీరుతుంటాడు. "
* థాంక్స్! నా కవిత అభూత కల్పన కాదని మీరిక్కడ అందరి ముందూ – నిరూపించినందుకు! అక్షర సాక్షి గా నిలిచినందుకు – చాలా సంతోషమండి, రావ్ గారూ!
< " కొందరు చూడాలనుకుంటారు. కొందరు చూస్తారు. కొందరు తాకా లనుకుంటారు. కొఒందరు తాకుతారు. కొందరు అనుభ వించాలను కుంటారు. కొందరు అనుభవిస్తారు"
* కొందరందుకే చెప్పు దెబ్బలూ తింటూంటారు..కదూ! ఇంకా?.. చెప్పండి..చెప్పండి!
< " ఆడువారి మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు.. ఎవరికీ చెప్పుకోలేదనో, చెప్పినా తన శీలానికేమి భంగము వాటిల్లదని అనుకుంటాడు మగవాడు."
* ఎంత బాగా చెప్పారు!? అతని విజయానికి – నిలువెత్తు అద్దం ప ట్టారు.. కంగ్రాట్స్. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే..నాకు ' అతని' వెనక ఓ స్త్రీ నీడ కనిపిస్తూ వుంటుంది..నల్లగా..చీకటిగా.. కృం గుతూ..కృశి స్తూ..
మరో సారి కృతజ్ఞతలతో
- ఆర్.దమయంతి.
ఈ భూమండలానికి పకృతి ఇచ్చిన వరం ఆడది. ఆకర్షణ ఆమెకున్న అమూల్య లక్షణం. చూసినకొలది చూడాలనిపించే అందాలను పుట్టుకతోనే సంపాదించుకున్న ఆరాధ్య దేవత ఆమె. ఎక్కడ చూసినా ఎటునుంచి చూసినా ఎలా చూసినా ఎప్పుడు చూసినా ఎటువంటి మగవారి మనసునైనా చలింపజేసే ఏకైక మంత్రం ఆడదాని అందం. ఎంత వెధవైనా మేధావైనా ఆకర్షణకు లోనుకావడం మగవారి బలహీనత. కొందరు చూడాలనుకుంటారు. కొందరు చూస్తారు. కొందరు తాకలనుకుంటారు. కొనదరు తాకుతారు. కొందరు అనుభావిన్చాలనుకుంటారు. కొందరు అనుభవిస్తారు. కొందరు ప్రేమిస్తారు. కొందరు ప్రేమించ బడాలనుకుంటారు.కొందరు వ్యాపారవస్తువుగా చూస్తారు. అందమైన మాయలో పడిన మానవుడికి చావుకైనా ఎ శిక్షకైనా భయపడవలసిన అవసరం కనిపించదు. దేనికి భయపడని మగవాడు ఆడడానికి మాత్రమె భయపడతాడు.
ఆమె ఒక తునిగిన తునక. నెమ్మది, ఓర్పు సహనం ఆమెకు ఆమె సంపాదించుకున్న లక్షణాలు. క్షమించడం లాలించడం సేవించడం పాలించడం ఆమె గుణగనాలు. అందుకే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఆడదాని అంతరంగం చాలా గొప్పది. అందుకే ఆమె త్యాగశీలి.
ఎం చేయమంటారు ఇది మగవారి లక్షణం. వీక్షించడం ప్రేమించడం. ఎలా చెప్పమంటారు. ఇది మగవారి బలహీనత. సొంతం చేసుకోవాలనుకోవడం, తనకే సొంతం కావాలనుకోవడం. ఇది సర్వసాధారణం. అందాన్ని చూడాలనుకోవడం చూడడం. ఇది అసాధారణం. వేధించడం భాదిన్చడం శోధించడం సాధించడం.ఆదినుండి శరీర రీత్యా భాలవంతుడైన మగవాడు ఏదో ఒక సందర్భంలో హద్దులు మీరుతుంటాడు. ఆడువారి మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు ఎవరికీ చెప్పుకోలేదనో, చెప్పినా తన శీలానికేమి భంగము వాటిల్లదని అనుకుంటాడు మగవాడు
.’ రోజూ న్యూస్ లో వచ్చే ఉదాహరణకి గౌహితిలో బాలిక మీద అత్యాచారం
లాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్చ వుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు హేమలత గారూ?’
- mulugu sarada
** హేమలత గారు ఏమంటారు!, మనమంతా ఉ త్సాహంగా పాల్గొం టామంటే కాదంటారా చెప్పండి!
మీరు – మీ అభిప్రాయాలను వ్యక్త పరిచే విధానం, భావ స్పందనలను.. దృష్టిలో వుంచుకుని అభిమానంతో అడుగుతున్నా శారద గారు!
ఒక చర్చాంశాన్ని మీరే ఎందుకు ప్రారంభించ కూడదు?!.. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల పై ఇక్కడ మీ అవేదనని వ్యక్త పరుస్తూ..మీరొక రచన చేసి, పంపొచ్చు కదా! హృదయంతో రాసే అక్షరాలు – అవెప్పటికీ జీవ నదులు!
వచ్చే విహంగ సంచికలో మీ వ్యాసం చూడాలని ఆశిస్తూ..అభిలషిస్తూ..
ధన్యవాదాలతో-
ఆర్.దమయంతి.
శారద గారూ!
విహంగ లో చర్చా వేదిక వుంది చూడండి .
http://vihanga.com/?page_id=4694
నమస్తే, హేమలత గారు! చర్చా వేదికని నేనూ చూసాను. బావుంది. మంచి ప్రయత్నం చేసారు. ఇలా ఒక అంశాన్ని మాత్రమె కాకుండా.. మనమందరం కలసి, అన్ని విషయాలు మాట్లాడుకునే ఒక సదుపాయం వుంటే..ఇంకా .బావుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం (మాత్రమే )!
అభినందనలతో-
ఆర్.దమయంతి.
Reply
ఓ! థాంక్యు..థాంక్యూ! హేమలత గారూ! మిమ్మల్నిక్కడ చూడ్డం (!) నాకెంతో ఆనందంగా వుంది. అప్పట్లో రేడియో లో నేను తరచూ వినే – మహిళా కార్యక్రమం గుర్తొకొచ్చింది – చప్పున!ఇద్దరు స్త్రీలు – తమ తీయని స్వరాలతో మాటా మంతీలాడే వారు. ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొనే స మ స్యలు, పరిష్కార మార్గాలు, సూచనలూ వుండేవి- అందులో! అప్పట్లో అది నా ఫేవరేట్ ప్రోగ్రాం కూడా! చిన్న చిన్న కథానికలు, జోక్స్, నవ్వులు కూడా చోటు చేసుకునేవి. రోజూ – అరగంట కార్యక్రమమే అయినా నాకు బాగా నచ్చేది. అంతర్జాతీయ మహిళా దినోత్స వ సందర్భంగా వారు ప్రసారం చేసిన లలిత గీతాన్ని నేర్చుకుని, మా కాలేజ్ ఫంక్షన్ లో = స్టేజ్ మీద పాడాను కూడా! ఆ పాట పల్లవి మాత్రమే కొంచెం గుర్తుంది…. ‘ ఓ వనితా..నీ చరితం..త్యాగ భరితం…రాగ భరితం..’ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..విహంగ ని వేదిక చేసుకుని..అని మీరంటుంటే అనిపిస్తోంది – మనమందరం కలసి చక్కని విషయాలను తలపోసుకుంటూ..
ఒకరితో ఒకరం పంచుకుంటూ.. ఇలా కలసి మాట్లాడుకునే – ఒక శీర్షిక వుంటే బావుంటుందేమో కదా అని!
అలా ఒకటి ఆలోచిద్దామా!?
‘గొంతు గొంతు కలిపితేనే నినాదం.మనం మనం కలిస్తేనే సమాజం.!’మరి మీరేమంటారు!
మీ ఇరువురికి నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ..
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
మీరన్నది చాల బాగుంది దమయంతి గారు ఒక చర్చ వేదిక లాంటిది మన విహంగాలో వుంటే బాగ్గుంటుంది అనుకుంటున్నాను. రోజూ న్యూస్ లో వచ్చే ఉదాహరణకి గౌహితిలో బాలిక మీద అత్యచ్చారం లాంటి సఘతనాలు జరిగినప్పుడు చర్చ వుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు హేమలత గారూ?
స్త్రీ ఎప్పుడూ భరించాలి అనే అంటారు అందరూ…
*తర తరాలుగా ‘ అన్ని బాధలూ పడటమే మనకలవాటై పోయింది శారద గారూ !
కానీ,ఎన్నాళ్ళు ?
* అది తెలీకేగా తోడౌతాయి కన్నీళ్ళు!
దానికీ అంతం వుంటుంది కదా.!
* వుండాలి. కాని ‘ అంతు’ చూసేదెవరు? ముందుగా ఎవరు సాహసించాలి?
సాగరంలో బడబాగ్ని దాగి ఉన్నట్లే స్త్రీ సహనం లో కూడా అనంతమైన శక్తి వుంది
* వుంది కాబట్టే..ఇంకా సంసారాలు సజావుగా నడుస్తున్నాయి…
దయచేసి దాని బయటికి తీయాలని అనుకోవద్దు..!
* అవును. ఇదొక హెచ్చరిక!
అదే జరిగితే మగవాడి ఎగో కి పెద్ద దెబ్బ.
* తిరిగి కోలుకోలేనంత..!సందేహం లేదు.
చాల మంచి కవిత
* శారద గారూ! నిజం చెబుతున్నా! మీ స్పందనంత కాదని అనిపిస్తోంది నాకిప్పుడు!
థాంక్స్ దమయంతి గారు.
*నేనే మీకు థాంక్స్ చెప్పాలి శారద గారూ!
మనమిలా మనసువిప్పి మాట్లాడుకునే అవకాశాన్ని కలగచేసిన విహంగ కి మన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామా! థాంక్ యూ విహంగ!
ఆర్.దమయంతి
ధన్యవాదాలు దమయంతి గారూ రెస్పాన్స్ ఇచ్చినదుకు మీ నించి ఇంకా ఇలాంటి కవితలని ఆసిస్తూ థాంక్స్ విహంగ
తప్పకుండానండీ!..మంచి కవితలు రాయడానికే ప్రయత్నిస్తాను..
థాంక్స్..
ఆర్.దమయంతి.
మనసులు కలబోసుకునేందుకు , కలిసి పోరాడేందుకు ‘విహంగ’ని వేదికగా చేసుకున్న మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు!
స్త్రీ ఎప్పుడూ భరించాలి అనే అంటారు అందరూ.కానీ,ఎన్నాళ్ళు ? దానికీ అంతం వుంటుంది కదా. సాగరంలో బడబాగ్ని దాగి ఉన్నట్లే స్త్రీ సహనం లో కూడా అనంతమైన శక్తి వుంది . దయచేసి దాని బయటికి తీయాలని అనుకోవద్దు.అదే జరిగితే మగవాడి ఎగో కి పెద్ద దెబ్బ. చాల మంచి కవిత థాంక్స్ దమయంతి గారు.
నిజంగానే!? K.T.R. గారూ.మీ ప్రశంస కి నా మనః పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ..
అభివందనాలతో -
ఆర్.దమయంతి.
chala రోజులకి మంచి విషయం ఉన్న కవిత వేల్ల్దోన్
Very well written
* థాంక్స్ ఉమా గారూ! థాంక్యూ!
-ఆర్.దమయంతి.