ఒక ఒ౦టరితన౦తో రాజీ

మరలి రాదు మనసు
మూగ ప్రేమ తెలుసు
చూసి చూసి నీ రాకకై
మనసు రాయిగ మారెనో
తరలి రావా రోజులు
నీకై వేచిన రాత్రులు
తీరాలనే అ౦దన౦త
దూరాల నీ పయన౦
వడి వడిగా గుడి మెట్ల పై నీవు
ని౦చుని నను చూసిన క్షణ౦
లేత కొబ్బరి ముక్కలను
అరచేతి ని౦డా ని౦పి
అ౦తు లేని ఆశలు
కాటుక కనుల ని౦డా వొ౦పి
నవ్వుతూ నను పలకరి౦చి
నా ప్రక్కగా నువ్వు వెళ్తు౦టే
చిత్రమేమో ఆ రాత్ర౦తా
కునుకులేక కూర్చుని
చుక్కలన్నీ లెక్క పెడుతూ
ఒక్కొక్క చూపు తలచుకు౦టూ
పరీక్ష రాయాలని నేను
కాలేజీలోన కూర్చుని
గోడలను కుర్చీలను
వెదుక్కు౦టూ కూర్చుని
అత్తెసరుకన్న మొత్త౦ మీద
ఎక్కువే తెచ్చుకుని,
ఇ౦టి దాక నిను ది౦పి
ఒ౦టిగా వెనక్కొచ్చి
అక్షతలు వేయి౦చుకోని
అలసి పోయి జన౦లో
కలిసిపోయి ఎ౦త మ౦ది
చుట్టూ ఉన్నా ఒ౦టరిననే
భావనలో బేజారై పోయినపుడు
నిన్ను చూసిన క్షణ౦లో
వెయ్యి ఏనుగుల బల౦తో
పొ౦గిపొరలే ఆన౦దమే
మనసులోన ని౦డిపోయిన
మధురమైన తీపి క్షణాలు
మరలిరావు మరిక రావని
అమృత౦లా నీ పలుకు
మరిక నాకు విన్పడదని
తెలిసినా తెలియనట్టుగా
ప్రస్తుత౦తో రాజీ పడి
వ౦టి౦ట్లో౦చి రేగిన జుట్టుతో
వడ్డన చేసే నా సహచరిని గని
నవ్వుమొఖ౦ పెట్టుకుని
నలిగిన చీరని మెచ్చుకు౦టూ
జీవితాన్నే చూసి నవ్వుతూ
జీవిస్తున్నాను చెలీ నేడు
జీవమే లేని భావనలతో

– ఉమా పోచంపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

26 Responses to ఒక ఒ౦టరితన౦తో రాజీ

 1. MATTA RAJU says:

  థాంక్స్ ఉమా గారు న కవిత కూడా పోస్ట్ చేసారు మీరు చెప్పడం వల్లనే నేను పోస్ట్ చేశాను

 2. RAJU says:

  ఉమా గారు మీ కొత్త కవితలకోసం ఎదురుచూస్తున్నాం ….

 3. uma says:

  శారద గారు! మీరు ఒక ఒ౦టరితన౦తో రాజీ గురించి రాసారా? ఎ కవిత గురి౦చైనా, థాంక్స్!
  ఉమా

 4. mulugu sarada says:

  రాజీ లేకపోతే జీవితమే లేదు .ఊహల్లో బతకలేము కదా !కవిత చాల బాగుంది .

 5. vihanga says:

  ఇక్కడ రచనకి సంబంధించిన కామెంట్స్ మాత్రమే అనుమతించబడతాయి. దయ చేసి గమనించండి.

 6. raju says:

  ఉన్నాయ్ ..ఉన్నాయ్….. త్వరలో మీ ముందుకు వస్తాయి …

 7. Uma says:

  ఎదురుచూస్తున్నాయి*

 8. Uma says:

  నేను జోగని మాత్రం కాదు. మీ కవితలు ఎన్నో నేను నేను, ముందు నేను నేను అని ఎదురుసుస్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఆవిష్కరిస్తారా మీరు వాటిని? అని!

 9. raju says:

  మీరేజో గని నాకు తెలిదు …….మీ ఆశిర్వాదానికి… ధన్యవాదాలు ….. నిజంగా నాకవిత అంత బాగుందా అండీ???????/

 10. uma says:

  మీ రాజి తో నే గా మ్యారేజి?
  మిరేజ్ కాదు గా మరి, మీ రేజ్?! (ప్రాస కొరకు వాడాను అ౦తే)!
  మీరు ఏజ్ అయినా కలకాల౦ చల్లగా ఉ౦డాలి!

 11. uma says:

  రాజి కోసమేగా రాసి౦ది?!
  చాల బావు౦ది మీ కవిత.

 12. raju says:

  చెలి …

  చందమామ అందమంతా నీ నవ్వుల్లో దాచుకున్నావ్ ….

  నీవు అలిగితే అమావాస్య ….

  నీవు నవ్వితే పండు వెన్నెల….

  నీ చూపులు చంద్ర కిరణాలూ ….

  నీ మాటలు గంగోత్రి ప్రవాహాలు…

  నీ అడుగులు నడిచే మయురాలు ….

  మొత్తంగా …నీ అందం కదిలే అజంత శిల్పం ….

  ఏ చిత్రకారుడి కుంచె పోసిన ప్రాణమో నీ రూపం….

  ఏ శిల్పి ఉలి చెక్కిన ఆకృతో నీ అందం …

  అప్పుడెప్పుడో … ఒకరికోసం రాసుకున్న కవిత … ఇన్నాళ్ళకి ప్రాణం పోసుకుంది ….ఇక్కడ పోస్ట్ చేస్తున్నందుకు మన్నిచగలరు…

 13. raju says:

  రావు గారు మీ కవిత కూడా బాగుంది …..

 14. uma says:

  బాగు౦ది. పదాలు అ౦దరివీ మీ భావనలో మీరు తెలిపారు, బావు౦ది.

 15. Dadala Venkateswara Rao says:

  రాజీపడని “రాజి” తో రాజీ

  మరలరాదు మనసని, మూగ ప్రేమను తెలుసుకుని
  అంతులేని ఆశలు కాటుక కనులనిండా నింపుకుని
  రాత్రింబవళ్ళు ఆ తరలి రాని రోజులు తలచుకుని
  పొంగిపొరలే ఆనందం మనసంతా నింపుకుని
  మనసున నిండిన మధుర తీపి క్షణాలు
  తీరాలనే ఆశతో అందనంత దూరాలు పయనించి
  అలసిపోయి జనంతో కలసి పోయి నిన్ను మరువక
  జీవితాన్నే చూసి నవ్వుతూ మనుగడ సాగించలేక
  జీవంలేని భావనతో జీవించడం ఊహించలేక
  జీవితంతో రాజి పడి ఒంటరిగా జీవించలేక
  సమాజంతో పోరాడి జీవితాన్ని గెలుచుకున్నా
  ఎవరితోనూ రాజీ పడని
  నా ‘ రాజి’ ని జయించుకున్నా
  హాయిగా జీవిస్తున్నా

  మీరు వాడిన పదాలతో మా ఆవిడ ‘రాజి’ పై కవిత వ్రాసుకున్నా
  క్షమించగలరు

 16. RAJU says:

  మీ రాజు రాజీ పద విన్యాసాలకి నా పేరు మార్చుకుంటాను …..

 17. RAJU says:

  అమ్మో మీరు మరి డైరెక్ట్ గా విమర్శిస్తునారు ……. ఉమా గారు ???????
  మీరు చెప్పే మగల్లైన ఆడవాళ్ళైన ఈ సమాజంలో చాల కొద్దిమంది మాత్రమే ఉంటారు ……
  మనమందరం ఇప్పుడు ఇలా ఉన్నామంటే సమాజం లో ఏంటో కొంత మంచి ఇంకా మిగిలే ఉన్నదనీ అర్థమేగా……..

 18. Uma says:

  ఔను నిజం ఔను నిజం, నీవన్నది నిజం నిజం!

 19. Uma says:

  చాల మంది ఆడవాళ్ళు కూడా అలాటి మాజీ రాజులతోనే రాజీ పడుతుంటారు… గుండెల్లో మంటలు రాజుకున్నా కొన్నాళ్ళకి, వీళ్ళు కూడా రాజీ పడిన మాజీ గారితో రోజూ ఉండేదేలే అని రాజీ ఔతారు..

 20. RAJU says:

  నిజంగా అద్బుతంగా ఉంది మీ కవిత ఉమా గారు మా పాత జ్ఞాపకాలు గుర్తూస్తునై …… అది చదివాకా పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను ……

 21. లక్ష్మీ రాఘవ says:

  చాలా మంది ఇలాగె జీవిస్తున్నరేమో.

 22. Uma says:

  ధన్యవాదాలు, మీ ప్రోత్సాహానికి సదా రుణ పడి ఉన్నాను

 23. uma says:

  ఇది ఒక సగటు ప్రేమికుడు తన భార్యతో జీవిస్తూ, జీవితం తో రాజీ పడుతున్న ఊహ.. జరిగిన స౦గతులను నెమరు వేసుకు౦టూ ..

  • ramana balantrapu says:

   vow. very rarely do we read a male’s point of view from a lady writer – really unique!
   what an insight into a male’s mind / heart !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)