స్త్రీ యాత్రికులు

మృత్యువు నీడలో ప్రయాణాలు చేసిన సుసీ రీన్‌హార్ట్‌

            డాక్టర్‌ సుసీ రీన్‌హార్ట్‌ది కెనడా దేశం. అన్నీ టేలర్‌ మాదిరిగానే టిబెట్‌లో మత ప్రచారం చేద్దామని భర్తతో పాటుగా బయలుదేరింది. భర్త పెట్రస్‌ రీన్‌హార్ట్‌ డచ్‌ దేశస్థుడు. మత ప్రచారం కోసం ఎలాంటి సాహసాలు చెయ్యటానికైనా సిద్ధపడతాడు. టిబెట్‌ రాజధాని లాసా నగరంలో సువార్త సందేశాన్ని వినిపించటమే జీవిత ధ్యేయంగా పెట్టుకొన్నారు ఇద్దరూ. అది ఎంత కష్టమో వారికి తెలిసి ఉంటే అలాంటి ప్రయాణాలు మొదలు పెట్టేవారు కాదు. క్రితంలో యాత్రచేసినవారు ఎదుర్కొన్న ఇబ్బందులు, దారిలో ఎదురైన అవమానాలు, ప్రమాదాలు పూర్తిగా విని ఉండరు. లేకపోతే అంత ‘ఖరీదైన’ యాత్ర గురించి మరికొంచెం దీర్ఘంగా ఆలోచించే వారే. 1892-93 సం||లో మత ప్రచారంకోసం టిబెట్‌ వెళదామనుకొన్న అన్నీ టేలర్‌ని టిబెట్‌ ప్రభుత్వం ఆపేసిన విషయం వారికి తెలుసు. ఇంకా మూడురోజుల్లో లాసా చేరుకొంటుంది అనే సంతోషంలో ఉండగా అన్నీ టేలర్‌ని నిష్కర్షగా ఆపి, వెనక్కి పంపిస్తారు కాబట్టి, ఆమె చేయలేక వదలివేసిన కార్యాన్ని తాము సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో సుసీ, పెట్రస్‌ ధైర్యంగా ప్రయాణం మొదలుపెట్టి ఉంటారు.
1894 వ సం|| సెప్టెంబరు నెల పదిహేనవ తేదీన సుసీ, పెట్రస్‌ రీన్‌హార్ట్‌లు వివాహం చేసుకొంటారు. తమ వద్ద మిగిలిన డబ్బుకి తోడుగా స్నేహితులు, బంధువులు మరికొంత డబ్బు సహాయం చెయ్యటంతో వైద్యం చేయటానికి అవసరమైన సామానులు, మందులు తీసుకొని చైనా-టిబెట్‌ సరిహద్దులలో ఆసుపత్రి ప్రారంభించి, కొంతకాలం అక్కడ ఉన్నాక ఆ దంపతులు కుంబుం మోనాష్టరీ వైపుగాసాగిపోయారు.
గతంలో అన్నీ టేలర్‌ మత ప్రచారానికి ఎక్కడికి వెళ్ళి ఉందో వీళ్ళూ అక్కడికే వెళతారు. అక్కడి బౌధ్ధబికక్షువులు టేలర్‌గురించి ఎన్నో విషయాలు చెప్పినా ఆమె ఎవరో తెలియనట్లే వింటారు. సుసీ వాళ్ళు వెళ్ళటానికి రెండువారాలు ముందుగా అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగి చాలామంది అనారోగ్యం పాలవుతారు. డాక్టర్‌ సుసీ వాళ్ళందరికీ మందులు ఇచ్చి ఆదుకొంటుంది. త్వరలోనే ఆ స్థానికులకి ఆరోగ్యం బాగుపడటంతో వీళ్ళకి మంచి పేరువస్తుంది. స్థానికులందరూ సుసీ వాళ్ళను ఎంతగానో ఆరాధిస్తూ, ‘మీరు ఇక్కడే ఉండి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి’ అని కోరుకొంటారు.
కానీ సుసీ వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చిందీ ఎవ్వరికీ తెలియ కుండా జాగ్రత్తపడతారు. తాము లాసా వెళ్ళటానికి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని ఎవ్వరితోనూ అనలేదు. చుట్టు పక్కల గ్రామాల్లో ఉండే రోగులు కూడా సుసీ వాళ్ళ దగ్గిరకి వెళ్ళి వైద్యం చేయించుకోవటం మొదలుపెట్టేసరికి ఆమెకి మరీ తీరిక లేకుండాపోయింది. వారి సేవల్ని గుర్తించిన కుంబుం మోనాష్టరీ ముఖ్య మత గురువు, సుసీ దంపతుల్ని ఆలయంలోనే ఒక మూల ఉండమని ఆశ్రయం ఇస్తాడు. అక్కడే వారు చిన్న గదిలో ఆసుపత్రి ఏర్పాటు చేసుకుని రోగులకి తమ శక్తికొలదీ సేవలు అందిస్తూ ఉంటారు.
సుసీ దంపతులు బౌద్ధ ఆలయంలో ఉండటం వలన పరిసరాల్లోని ప్రజల్లో వారిపట్ల ఎంతో గౌరవం పెరిగింది. మత గురువు అండదండలతో మంచి పేరుకూడా తెచ్చుకొన్నారు. కుంబుం మోనాష్టరీలో ఉంటుండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో సుసీ గర్భవతి కూడా అయింది కాబట్టి ‘ఈ మోనష్టరీలో ఎంత ఎక్కువకాలం ఉంటే అంత మంచిది’ అనుకొంటారు. ఇక్కడ ఉండటం వలన చైనీయుల భాష నేర్చుకోవచ్చు. పరిసరాల గురించి విజ్ఞానం సంపాదించటంతో పాటుగా లాసాకి వెళ్ళేదారుల గురించీ, వారికి తోడుగా రావటానికి ఇష్టపడే కూలీల గురించి తెలుసుకోవచ్చు అనుకొంటారు. కానీ ఆ నిర్ణయం మీద వారు నిలబడలేకపోతారు. ఎప్పుడెప్పుడు లాసాకి వెళదామా అనే ఆలోచనే తప్ప మరేదీ సరిగా ఆలోచించలేక పోయారు. క్రైస్తవ మత ప్రచారం చేయటాని కని ఇక్కడికి వచ్చి స్థానికులకి సేవలు చేస్తూ ఉంటే, తమ గమ్యస్థానం చేరటం ఆలస్యం అవుతుందనే అపోహతో ముందుకి సాగిపోవటానికే నిశ్చ యించుకొంటారు అది ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయమో వాళ్ళు తర్వాత తెలుసుకొంటారు.
కుంబుంలో అందరివద్దా సెలవు తీసుకొని, ఏవోకారణాలు చెప్పి దగ్గిరలో ఉన్న టంకూర్‌ అనే గ్రామానికి వెళతారు. లాసాకి వెళ్ళే బళ్ళబిడా రులకి అది దగ్గిరగా ఉంది కాబట్టే అక్కడికి చేరతారు. అవకాశం దొరికితే ఆ బిడారు వర్తకులతో స్నేహం చేసుకొని త్వరగా, ఎవ్వరికీ అనుమానం రాకుండా లాసాకి వెళ్ళవచ్చు అనేది వారి ఆలోచన. పైగా ఈ గ్రామంలో మంగోలియా ప్రజలు ఉన్నారు. వారినుండి మంగోలియా భాషకూడా నేర్చుకోవచ్చు అనుకొంటారు. వారికి అప్పటికే తెలిసిన చైనీస్‌, టిబెటన్‌ భాషలకి తోడు ఈ మంగోలియన్‌ భాష తోడైతే వారి యాత్ర చాలా సులభంగా జరిగిపోతుంది అని వారి నమ్మకం.
ఇలాంటి పరిస్థితుల్లోనే సుసీ బిడ్డను కంటుంది. లాసా ప్రయాణంలో పిల్లవాడు పుట్టటాన్ని శుభసూచకంగా భావించి, ఆ బాబుని ‘ఛార్లెస్‌’ అని ముద్దుగా పిలుచుకొంటారు.
ఆ పసికందుని భుజాన వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించి, పరిసరాల్లో బాగా తక్కువ ఇళ్ళున్న గ్రామానికి చేరుకొని, అక్కడ కొంతకాలం పాటు రోగులకి సేవలు చేస్తారు.
ఈ విధంగా సుసీ దంపతులు లాసాకి కొంచెం కొంచెంగా దగ్గిరౌతూ తమ కలల్ని నిజం చేసుకొందామని ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. పైగా పెద్ద బాటలకి దగ్గిరగా ఉన్న గ్రామాల్లోనే ఉండటానికి ఇష్టపడు తున్నారు. ఎందుకంటే చిన్నబాటల్లో అయితే వారిపై ఆరా ఎక్కువ తీస్తారు. అదే పెద్ద బాట అయితే వందలమంది ప్రయాణీకుల్లో వీరిగురించి ఎవ్వరూ పట్టించుకోరు అని వాళ్ళ ఆలోచన.
కానీ అలాంటి ఒక పెద్ద బాటలో కొందరు తెలిసినవాళ్ళు తోడై ‘లాసా ఒక్కరోజు ప్రయాణ దూరంలో ఉన్నాసరే మీరు నగరంలోకి మాత్రం వెళ్ళవద్దు’ అని సలహా ఇస్తారు. సుసీ దంపతులు విదేశీయులు కాబట్టి, అలాగ వెళ్ళటం వలన నగరాన్ని అపవిత్రం చేసినట్లు అవుతుందని వారు చెబుతారు.
సుసీ దంపతులు తమ బిడ్డతోసహా పెద్దబాట చేరుకుని ప్రయాణం కొనసాగించటానికి సిద్ధపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా లాసాకి చేరి అక్కడ సువార్త వినిపించి ఆ ప్రజలని పవిత్రులుగా చెయ్యాలనేదే వీళ్ళ నిర్ణయం. అక్కడికి వెళ్ళిన తరవాత తిరిగి రాలేకపోయినా, అక్కడ సువార్త వినిపించిన మొదటి వాళ్ళం తామే కావాలని నిశ్చయించుకొని, ఆ కీర్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడతారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తమ నిర్ణయాన్ని మార్చుకోదలచుకోలేదు.
ఇలాంటి దృఢసంకల్పంతో 1898 వ సం||, మే నెల ఇరవయ్యో తేదీన తంకూర్‌ పరిసర గ్రామాల నుండి ముందుకు సాగిపోయారు తమ పసిబిడ్డతో పాటుగా. కానీ ఈసారి తమతో పాటుగా ఒక కుక్క, ముగ్గురు స్థానిక సేవకులు, ఐదు పొట్టిగుర్రాలు, వీళ్ళందరికీ ఉన్న సామానుల్ని, ఆహారాన్ని మోసేందుకు మరో పన్నెండుమంది కూలీలను తీసుకొని బయలుదేరారు. దారిలో ఎదురయ్యే గ్రామాల్లో కొత్తవారికి, మరీ ముఖ్యంగా ఐరోపావారికి, ఆహారం అమ్మరుకాబట్టి రెండునెలలకి సరిపడా ఆహారాన్ని కూడా వారితో తీసుకుపోవాల్సి వచ్చింది. పైగా ముందు జాగ్రత్తగా వారు వెళ్ళేదారిలో ఉన్న మంగోలియన్‌ సెటిల్‌మెంటు వద్దకి కొన్ని వస్తువులు, ఆహారం కూడా పంపించారు, నెల రోజుల తరువాత అక్కడికి చేరుకోగలం అనే నమ్మకంతో. ఈ ప్రయాణంలో సుసీ దంపతులు టిబెట్‌ దుస్తులు ధరించినా, పిల్లవాడికి మాత్రం ఐరోపావారి దుస్తులే వేసారు.
ఇంతమందీ కలిసి దాదాపు మూడునెలలపాటు టిబెట్‌ గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించి లాసాకి వెళ్ళే ముఖ్యమైన దారివద్దకి చేరుకొంటారు. ముందుకి వెళ్ళేకొద్దీ దారిదోపిడీ దొంగల గురించి కథలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ళ క్రితం అక్కడ దారికాసిన దొంగల ముఠా ఐదువేల పశువుల్ని, గొర్రెల్ని తోలుకుపోయారట. ఇలాంటి ప్రమాదకరమైన దారిలో సుసీ వాళ్ళ బృందం అంతా సైడామ్‌ చిత్తడినేలని దాటి ముందుకి సాగిపోయారు. ఆ దారంతా మంచుపర్వతాలే. అక్కడక్కడ అస్థిపంజరాలతో నిండిన కనుమల్ని దాటుకొని లాసానగరానికి 1200 కి.మీ. దూరంవరకు చేరగలిగారు.
ఇప్పటి వరకూ దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ క్రైస్తవమత ప్రచారం ఆగకుండా చేస్తూనే ఉన్నారు. భోట్‌ భాషలో ముద్రించిన బైబిలు సూక్తులు ఉన్న కార్డుల్ని అందరికీ పంచుతూ ‘ప్రభువుని నమ్ముకోండి – మీ బాధలు తీరుస్తాడు’ అని అందర్నీ దీవిస్తూ ముందుకిసాగేవారు. ప్రతిరోజూ జరిగిన సంఘటనలన్నీ డైరీ రాస్తూనే ఉన్నారు.

– ప్రొ.ఆదినారాయణ

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

This entry was posted in ధారావాహికలు, యాత్రా సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Heads up! You are attempting to upload an invalid image. If saved, this image will not display with your comment.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)