వారు వారే

ఇంట్లో.. ప్రదర్శించిన దానితో తృప్తి నొందక

మిగుల్చుకున్న వికృతపు చొక్కా తొడుక్కుని

చెప్పులో కాలు పెడుతూనే చుట్టుపక్కల గోడలని ధాటి ..

మరీ.. వెతుక్కునే ఆకలి చూపులు…

అంతటితో ఆగవు సరికదా..

అందరూ ..వారి కోసమే ఆరేసుకుని

ఉంటారనుకున్నట్లు

రోడ్డుపై పరికింతలు..

వరుసలలోను..సందోహాల మధ్యనూ..

అవకాశం దొరికితే వంటరితనంలోను ..

శరీరాల తాకిడికై వెంపర్లాటలు ..

జేబుదొంగలు కూడా సిగ్గు పడే వీరి లాఘవం ..

నడుము వంపులని సృశిస్తూనో ,,

గుప్తంగాలు రాపిస్తూనో ..

పైపైన .. పలికే “సారీ” లతో..

పోనీలే ! పాపం పొరబాటు .. అన్నాడుగా .. అనుకున్నా..

ఒక్క క్షణం .. అయోమయం తర్వాత

నిజాన్ని గుర్తించి .. ఏది అబద్ధపు ముసుగో

ఎవరు మేకవన్నె వ్యాఘ్రమో ..తెలిసి..

అమ్మో..! ఈసారి అయినా..జాగ్రత్త పడాలనుకుంటాం..

వయసు ఉడిగేదాకా..

పర స్త్రీ .. అనాటమీ లో

అమ్మ అనాటమీ చూడలేని

అనాగరిక సంతతి. వారిది..

అరుచిల అనాటమీలో

ఏదీ .. రుచించని ..

వికృత అభిరుచి..వారిది..

వారు.. వారే.. ఎన్నటికి..మారని వారు వారే..

- వనజ వనమాలి

(ఈ కవితలో కనిపించే ద్వేషం కేవలం నా ఒక్క దానిది మాత్రమే కాదు. ఎందరో ఆడ కూతుర్లు పైకి వెల్లడించుకోలేక నిత్యం మృగాల చూపులను, వారి వికృత చేష్ట లను భరించవలసి రావడం అవమానకరం,ఆవేదనా భరితం. ఇది స్త్రీలందరి సమస్య. అందుకే వాడిగా వ్రాయవలసి వచ్చింది.అలాంటి వారు మారతారనే ఆశతో..ఈ కవిత )

image courtesy:Google

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

This entry was posted in కవితలు. Bookmark the permalink.

19 Responses to వారు వారే

  1. బుచ్చి రెడ్డి గారు..కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
    @సమీర ఎస్ హెచ్ గారు.. ధన్యవాదములు.
    @శారద ములుగు గారు మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను.  కవిత నచ్చినందుకు ధన్యవాదములు.

  2. mulugu sarada says:

    వనజ గారు చాలా బాగా చెప్పారండీ . మనం మౌనంగా భారిస్తున్నత కాలం ఇలాంటివి సాగుతూనే వుంటాయి. ఉపాయం గా సమయస్పూర్తితో నిలడేసి బండారం బయటపెట్టాలి ధైర్యంగా.

  3. sameera sh says:

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు. బాగా వ్రాసారు.
    ఇంత స్ట్రాంగ్ గా చెప్పడం మంచిదే అప్పుడైనా వారు మారతారని ఆశిద్దాం.

  4. buchi reddy says:

    వనజ గారు
    నిజాన్ని చెప్పారు — చాల బాగుంది

  5. సురేష్ పెద్దరాజు says:

    బాగా వ్రాశారు…మీ ఆవేశం, ఆవేదన మీ కవితలో కనపడుతోంది.
    ఆడవారు ప్రతిఘటిస్తేనే వారికి ప్రశాంతత వనజా గారు!

  6. శశి కళ says:

    ఏమి తీవ్రంగా లేదు.ఉన్న వాస్తవాన్ని చెప్పారు.
    ఎక్కడ దొరికితే మొహమాటం లేకుండా ఉతికి ఆరేయ్యాలి
    అలాంటి వాళ్ళను.అప్పుడే మిగిలిన వాళ్ళు బయపడుతారు

    • శశి కళ.. గారు.. అమ్మయ్య ! అర్ధం చేసుకున్నారు.
      నిజం గానే మీరు చెప్పినట్లే చేయాలి .
      మీ స్పందనకి ధన్యవాదములు.

  7. NS Murty says:

    వనజ గారూ
    మీ కవిత చాల బాగుంది. ఘంటసాల, కొండేపూడి నిర్మల గార్ల తొలి రచనలని గుర్తుచేసింది.
    అభినందనలతో

  8. Hemantha chowdary says:

    హేట్స్ఆఫ్.

    ఆవేశంగా వ్రాసినా అన్నీ నిజాలు వ్రాసారు. కొంతమంది ఎంత మిస్ బిహేవ్ చేస్తారో.ఆఖరికి బస్ కండక్టర్ తో సహా.తేళ్ళు జెర్రులు ప్రాకినట్లు ఉంటుంది.ఎక్కడికని పారిపోగలం?

    అందుకే కరాటే లాంటివి నేర్చుకుని ఉండాలి. లేకపొతే సేఫ్టీ పిన్ చాలు వాళ్ళని నిరోదించడానికి.
    ఇది మా అమ్మాయిల అభిప్రాయం.క్రూయాల్ మెంటాలిటి అనుకోకండి. మరి మా బాధ ఎవరికీ చెప్పుకోవాలి? వారు మారాలంటే లేడీస్ ఇలా ఉండాల్సిందే .

    వనజమ్మా ! చాలా మంచి కవిత వ్రాశావు. థాంక్స్ ఎ లాట్.

    హేమంత

    • హేమంత .. ధన్యవాదములు. మంచి టిప్ చెప్పారు.
      చాలా మంది అవమానకరంగా ఉంటుందని ఇలాటి ఇబ్బందులని వెల్లడించుకోరు.అందుకే వారు అలా చెలరేగి పోతారు.
      మీ స్పందనకి ధన్యవాదములు.

  9. Dadala Venkateswara Rao says:

    వారిని తీసేస్తే మిగతావారంతా మంచివారే

    వారు మారాలి అనుకోవడంలో తప్పులేడుకాని
    అంతటితో సరిపెట్టుకోవడం మాత్రం చాలదు
    వారు వారు వారే

    వారిని మార్చాలి
    వారిని మార్చవచ్చు
    వారిలా మరొకరిని మారనివ్వకుండా చెయ్యొచ్చు

    వారు మారాలంటే ఆడువారు మారాలి
    సారి చెప్పక ముందే చెంప పగుల గొట్టాలి
    సెల్ పోను చేతిలోపెట్టుకొని క్లిక్ చేసి
    జరిగింది పోలీసులకు చెప్పడానికి కూడా
    భయపడి నంతకాలం వారు వారే

    • Dadala Venkateswara Rao గారు
      మీ వ్యాఖ్యకి మనస్పూర్తిగా ధన్యవాదములు.
      స్త్రీలలో అలాటి పరిస్థితులని దైర్యంగా ఎదుర్కోవాలని ఆశిద్దాం.

  10. vijaya Lakshmi says:

    కవిత ని చాలా తీవ్రంగా చెప్పారండీ! ఇట్లా చెప్పినా కూడా వారు వారే లాంటి వారు మారరు.

    మీ కవిత ,కవిత వెనుక కథ సుపరిచితమే!ఇన్నేళ్ళకి ఇక్కడ చూస్తున్నాం.
    వనజ గారు మీ కవితకి మంచి వేదిక లభించింది.

    ఇలాటి పదునైన కవిత్వం మీ కలం నుండి రావాలని కోరుకుంటూ

  11. Hitaishi says:

    కవిత లో వాస్తవం కనిపించింది.చాలా బాగా వ్రాశారు.కవిత వెనుక కథలోని ఆమె లా ధైర్యంగా అలాటి వారికి శాస్తి చేస్తే మరొక సారి అలాటి పనులు చేయరు.  ఆడవాళ్ళు ఇలాటి వారితో చచ్చిపోతున్నారు థాంక్ యు వనజ గారు.మంచి వాయిస్ వినిపించారు.అభినందనలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Heads up! You are attempting to upload an invalid image. If saved, this image will not display with your comment.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)