.
ఏప్రిల్ 22న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు,
అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు కలిపి తెలుగుశాఖ తరపున ప్రదర్శించిన ‘‘భువన విజయం’’ నాటకం
అందరినీ అలరించింది.
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల కాలం(16వ శతాబ్దం)లో తెలుగు భాష, సాహిత్యాలకు
లభించిన గౌరవాదరణలను అష్టదిగ్గజ కవుల కావ్యాలలోని పద్యాల ద్వారా వివరిస్తూ, నేటికాలంలో
తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలను, తెలుగుతల్లి ఆవేదనను తెలుగుతల్లి పాత్రచేత చెప్పించడం
రక్తి కట్టింది.
ఈ నాటకంలో శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగుశాఖ కో` ఆర్డినేటర్ ఆచార్య పర్వతనేని సుబ్బారావుగారు,
అల్లసాని పెద్దనగా డా. తలారి వాసు, నంది తిమ్మనగా కె. రాంబాబు, అయ్యలరాజు రామభద్రకవిగా బి.
వరహాలబాబు, ధూర్జటిగా ఎన్.వి.వి.ఎస్. నారాయణ, తెనాలి రామకృష్ణకవిగా వడ్లమూడి జయరాజు,
మాదయగారి మల్లనగా నూకారపు శ్రీనివాసరావు, పింగళిసూరనగా టి. సింహాచలం, భట్టుమూర్తిగా
ఎ.ఎన్. రాజు, పరదేశ కవిగా జి.ఎల్. నాయుడు, నరసరాజుగా ఎల్. సంతోష్, భటులుగా ఇ.ఎన్.వి.
రమణ, ఎస్. నాగేశ్వరరావులు, తెలుగు తల్లిగా ఎల్. జ్యోతి నటించారు.
నాటకం చివర అందరూ కలిసి చేసిన తెలుగు ప్రతిజ్ఞ ప్రత్యేకతను సంతరించుకొంది.
ఈ నాటకానికి రచన, దర్శకత్వం వడ్లమూడి జయరాజు(అధ్యాపకులు, తెలుగుశాఖ)
తెలుగు ప్రతిజ్ఞ.
తెలుగు నా మాతృభాష. మాతృమూర్తితో సమానమైన మాతృభాష తెలుగును మరువననీ, ఎన్ని
ప్రతికూల ప్రభావాలెదురైనా తెలుగు భాషా పరిరక్షణ, దాని పురోభివృద్ధికోసం పాటుపడతాననీ,
అవసరానికి ఎన్ని భాషలను నేర్చుకొన్నా నా మాతృభాష తెలుగును మాత్రం మరువనని ప్రతిజ్ఞ
చేస్తున్నాను. ` జై తెలుగుతల్లి ‘
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

















