ఓ..కాంత ..ఏకాంత గాధ..”తన్హాయి”


             “తన్హాయి” నవలని నేను నవలగానే చదివాను.నేను ఆ నవలని చదకముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను కానీ.. సమీక్షలుచదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న పఠనా శక్తినిచంపేస్తుందేమో అని అనిపించింది.

తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ .. నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన.

కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ ఉంటుందో..చదువు కుంటూ పోతుంటే.. టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో..అన్న టెన్షన్ తో.. ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా..చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు.వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు..అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనే..

కౌశిక్,కల్హార ల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా..తన మనసుని,భావాలని వ్యక్తీకరించ గల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై..నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన బాగం నే మళ్లీ మళ్లీ చదివాను.

అపుడు.. ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే.. అనుకున్నాను. ఎందుకంటె..సమీక్ష వ్రాయడం అంటే.. ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి ఏ పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలి ఏమో!కానీ నాకు ఈ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి “కల్హార”పాత్ర పై..విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ .ని ..అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి ..అలాటి ప్రేమలోని.. లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే సాధ్యా సాధ్యాలని .. చెప్పే ప్రయత్నం చేసారు ..నవలా రచయిత్రి.

మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని.. బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే.. వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల..అంత పాజిటివ్గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలో.. నేను చేసిన ఈ సమీక్ష. ఇది.
ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.

పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.
ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో..ఎందుకు మరణిస్తుందో ..! మరణించి బ్రతికి ఉంటుందో..ఎవరు చెప్పలేరు.
భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు.
కానీ .. ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే భావం మాత్రం ..ఖచ్చితంగా iప్రేమే!

ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధం ని చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వ అధికారం ఉన్నప్పుడు..ఆమె శరీరం ని తను కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటె అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసు మాత్రమే నాకు కావాలి నీ శరీరం నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.
అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది అది ఆమెలో కల్గిన శారీరక ,మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.

కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ .. అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమె కళ్ళ ముందు కదలాడి..ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ.. కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేక పోయింది..అంటే.. మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.

కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండా ఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం.. “తన్హాయి” చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.

కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు..కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు. కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారు ఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని మనం చూడవచ్చు.

చైతన్య తో.. గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ..ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి . అందు కోసమే.. ఆ ప్రేమని త్యజించింది.
హటాత్తుగా ..ఆమె కి లభించిన ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్ల కల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా ..అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ.

చైతన్య కూడా .. మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా..అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా.అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం చేయకుండా..శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు.

రచయిత్రి.. ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ..ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలో మూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉంది కూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి ..అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అని కాదు కాని.. ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు..వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం .. జీవితాంతం ఒక అనుమాన పూరితమైన ప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా కూడా ఆ ప్రశ్న ని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు. చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో..కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధం చేసుకోగల్గాడు..అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.

మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే మాట కూడా.మనం మాటకి ముసుగు వేస్తాం. కల్హార తన మనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం చేయాలో చెప్పమని చైతన్యని అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండి విడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.
ఇదే నవలలో.. ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర.. విభిన్నమైనది.

పవిత్రత అన్నది అది మానసికమా శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో.. మనసు జారిపోయినా చాలా సందర్భాలలో కౌశిక్ సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా అతనిని కట్టడి చేస్తూ..ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా ..కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అని తెలియగానే..తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ..ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేక ఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడా తలెత్తడం సహజం. .

కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే.. చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతా ఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు.

ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే..ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురు ప్రేమికులని విడదీయడం వెనుక.. భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లు అయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమే కావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.

మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయి సర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.

అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా.. పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ..తన ఆలోచనలని అల్లుకుని..అందుకు అనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.

ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసిన స్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో.. హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటు చేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని ..కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్త సముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా.. ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!? స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆ ఉత్తెజంతోనే.. బ్రతక గలననే నిబ్బరం తోనే.. కౌశిక్ తనని వీడి పోతుంటే.. కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.

ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీ తెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పై మెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.

అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజం లో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు .. మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.

ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు. ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా.. ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటు కౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్య తో.. తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ ని ప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది.

ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే..అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో..ఎందుకు కల్గిందో.. ఈ ప్రేమ ..అనుకునే.. స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార. ఆమె ప్రేమని.. బహుశా కౌశిక్ కూడా పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.

ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో .. తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు కూడా అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా.. చెప్పడం ని జీర్ణించు కోలేరేమో అన్న అనుమానం ఉంది. కాని అది సబబుగానే అనిపించింది.

తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్య లు, మృదుల లు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు. రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణ ని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు. కల్హార .. వికసిత విరాజ కుసుమం. . బుద్భుదమైన భావ జాలంలోనుండి..జనియించిన సహస్ర భావాల తో అరవిరిసిన పుష్పం..

తనలో కలిగే భావాలని,ఆలోచనలు స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే.. ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే..అంతలా కల్హార పాత్ర చుట్టూ.. నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.

పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి , ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్ స్వాపింగ్ గురించి మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ ముసుగులో.. ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన ..వివాహ వ్యవస్థలో…. కల్హార లాటి వాళ్ళు తమ మనసుని..తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే పరిణామాలు మంచి-చెడులు .. వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.

నాకు మాత్రం కౌశిక్ ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది. “ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందు కలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!” అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి.

మనసంటే అచ్చమైన నిజాయితీ.

ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం దొరికే చోట మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.
కల్హార మనసుకి తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్ హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ.. బ్రతక గలం అని .దూరం అవుతారు. మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ.. కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో….సహజీవనం చేస్తుంది. అదే “తన్హాయి”

ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటె.. వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే! ఒక “సిల్సిలా” చిత్రం.. నా కనుల ముందు..అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది..ఒక “సిల్సిలా” చిత్రం లా ఉంది. లేకపోతె.. మేఘసందేశం అయి ఉండేది అని.

ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని ..అక్షరీకరించి.. “కల్హార” ని పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారికి ..అభినందించక తప్పదు.

అలాగే నేను గమనించిన ఒక ..చిన్న అంశం. కలువ పూలతో.. లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు..అని చెప్పాలి కదా! కలువ కి కమలానికి తేడా ఉంది .. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.

ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది. “ఓ అపురూప ప్రేమ కావ్యం ” గా ఉదాహరించుకోవచ్చు కూడా. *

                                                                                                – వనజ వనమాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పరిచయం: శ్రీమతి తాతినేని వనజ

(వనజ వనమాలి) బ్లాగర్ గా అందరికి పరిచయం

అంతకంటే ముందు, విజయవాడ..ఎక్సరే సాహితి సంస్థ లో గత ఏడేళ్ళుగా “నెల నెల వెన్నెల కార్యక్రమ నిర్వాహకురాలుగా కవిత్వం తో మమేకం. కథా రచయిత్రిగా పరిచయం. స్పందించినప్పుడు మాత్రమే కవిత్వం వ్రాస్తాను అని చెప్పే ఆమె కి ఉన్నవ్యసనాలు రెండు అని చెపుతుంటారు.అందులో ఒకటి చదవడం,రెండు వినడం.

ఎమ్.ఏ (తెలుగు) చదివిన ఆమె.. పదిమందికి ఉపాది కల్గించే వృత్తిలో స్థిరపడ్డారు. ఆత్మ విశ్వాసం,అంకితభావం ఉంటే  ఏ రంగం లో  అయినా విజయం సాధించవచ్చు అనే ఆమె స్త్రీ శక్తి కి నిదర్శనం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చర్చావేదిక, పుస్తక సమీక్షలు, , , , , , , , , , , Permalink

53 Responses to ఓ..కాంత ..ఏకాంత గాధ..”తన్హాయి”

 1. dramojirao says:

  అమ్మా మహీధరి
  మొదట మీ కామెంట్ ని కొంచెం బాగా పరిశీలించుకొండమ్మా.మీ కామెంట్ ని అనుసరించి చూస్తే మీకు నీహారిక వ్యాఖ్యానం నచ్చడం లో ఏం ఆశ్చర్యం కూడా తోచడం లేదమ్మా .పైపెచ్చు ఇద్దరూ సహాద్యాయులు కూడానని ,ఒకే వూరి వారనీ భోగట్టా కదమ్మా .లేకపోతే అంత కాంట్రదిక్టరీ కామెంట్ మీకు నచ్చడం మామూలుగా సాధ్యమేనా అమ్మా మహీధరీ .

  మీ వ్యాఖ్యానం చూడమ్మా మహీధరీ,

  ”ఈ గొడవల్లో పిల్లలు ఏమవుతారు? పిల్లల గురించి ఏమైనా ఆలోచించ గలరా ? ఈ సంబంధాల కోసం వెంపర్లాడే వాళ్ళు?”
  అదే కదమ్మా మహీధరీ కల్హారా చేసిందీ !అర్థం కాలేదూ ఆ మాత్రం .
  ”వ్యక్తిగత జీవితాలు వేరు, రచనలు వేరుగా చూడరు పాఠకులు. రచయితల గురించి తెలియనప్పుడు మాత్రమే రచనలనే ఉన్నది వున్నట్టు చదవగలరు. అది మానవ నైజం కూడా”.అవునామ్మా మహీధరీ అంటే రచయితలు ఆకాశం లోంచి ఊడి పడాలనా అమ్మా మీ ఉద్దేశం ?అయితే అమ్మా మహీదరీ మరి శ్రీ శ్రీ సిఫిలిస్ సంగ తేమిటమ్మా ?ఇంతకీ ఆయన రచనలు వున్నవి వున్నట్లు చదివారా లేకా ఇంకో రకంగా చదివారా ?
  ”ఆమె తప్పని సరయ్యి ప్రియుడిని వదిలానని అనుకుంది కానీ మానసికంగా ఆమె వదలలేదు.అందుకే ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ” అనుకుంది మనసులో….ఇది ఏ రకమైన నిజాయితీగా మీరు గుర్తించారు వనజ గారూ”…
  అమ్మా మహీధరీ వుండేది ఉండేట్టు గా ఒప్పుకోడాన్నే నిజాయితీ అంటారమ్మా .నిజాయితీ ఒకటే రకంగా ఉంటుందమ్మా ఏ రకంగానో …ఆ రకం గానో వుండదు తల్లీ .ఒప్పుని ఒప్పుగా చెప్పడం మాత్రమే నిజాయితీ కాదమ్మా మహీధరీ కొంచం ఆ విషయం తెలుసుకొమ్మా.ఇంతకీ కల్హారకి ఏం తప్పనిసరి అయి ప్రియుడ్ని వదిలింద మ్మా కూటికి లేకనా గుడ్డకి లేకనా ?కొంచం నవల చదువమ్మా పెద్దమనిషీ .ప్రేమించే భర్తలు వున్నా కూడా ఇలాంటి వాటికి లోనవడం స్త్రీ వాదమా?అసలు మొదట స్త్రీ వాదమంటే ఏంటో కొంచం స్టడీ చెయ్యమ్మా మహీధరీ .పాపం కల్పన రాసింది స్త్రీ వాదం కాదమ్మా మహీధరీ .నువ్వు చెప్పే స్త్రీ వాదమైతే సుబ్బరంగా ఆ మొగుడ్ని వదిలేసే ఉండదూ… ఆ మాత్రం అర్థం చేసుకోలేవూ ?మళ్ళీ వాదానికి వచ్చావ్ కూడానూ !
  ”మరొక రచయిత్రి భావించినట్టు సహృదయ అయిన కల్హార ఆర్ధిక స్వావలంభన, విజ్ఞత కలిసి వున్న రాజేశ్వరి”
  మరేనే అమ్మా ఆ రచయిత్రికి నీ అంత తెలివి లేక అలా రాసినట్లున్నది .కానీ నువ్వు చెప్పింది కూడా అదే కాదుట మ్మా మహీధరీ …!
  “స్త్రీ ,పురుషుల మధ్య ఆకర్షణలు సహజమే. వాటికి లోనవ్వడం కూడా అంతే సహజం .ఒక బంధానికి కట్టుబడ్డ వారికి నిగ్రహం కూడా అవసరమే.ఇతరుల కుటుంబాలను , ముఖ్యంగా కన్న పిల్లలను ఛిద్రం చేసుకోవటం ఆధునికతా?”
  అదేనమ్మా మోహం పుట్టగానే లేచి పోకుండా ఆర్ధిక స్వావలంబన వున్నా బిడ్డ కోసం ఆగింది కదుటమ్మా ! అది విజ్ఞత కాదూ మరీ .ఆ ఇంకో రచయిత్రి చెప్పింది అదే కాదూ!! .కల్పన రెంటాల చెప్పింది కూడా అదేనే అమ్మా !నీ శంఖం లోనిదే తీర్థం అంటే ఎట్లాగే తల్లీ !ఆలోచనలు తలతో కదుటే అమ్మా చేస్తారూ !ఇలా అనుకునే బదులు భర్తని వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అనిపించుకునేది.ఇదేమిటమ్మా మహీధరీ ఒక వైపేమో నిగ్రహంగా వుండాలంటావూ …[కల్హార నిగ్రహంగా వుందని ]మరో వేపేమో వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అంటావూ…!అది నోరా మరోటానటమ్మా మహీధరీ ?సిస్టం ఒకటి ఎదురుగా ఉన్నదీ …చేతులు కాళీగా వున్నాయి ఏమైనా వాగేద్దాం లోకం మీద పడదాం అనుకుంటే ఎట్లాగమ్మా మహీధరీ నువ్వూ ?కాస్తా ముందూ వెనుకా ఉండొద్దూ ?

 2. మహీధర గారు నేను ఈ..క్రింది మీ అభిప్రాయం తో.. ఏకీభవిస్తాను.
  వివాహ బంధంలో ఇలాంటివి స్త్రీ చేసినా , పురుషుడు చేసినా తప్పు తప్పే.
  అందరూ చేస్తున్నారని , మేము చేస్తే తప్పేంటని ప్రశ్నించటం వివేకం కాదు ఎవరికైనా.
  స్త్రీ ,పురుషుల మధ్య ఆకర్షణలు సహజమే. వాటికి లోనవ్వడం కూడా అంతే సహజం .
  ఒక బంధానికి కట్టుబడ్డ వారికి నిగ్రహం కూడా అవసరమే.ఇతరుల కుటుంబాలను , ముఖ్యంగా కన్న పిల్లలను ఛిద్రం చేసుకోవటం ఆధునికతా?
  ఈ సంబంధాలలో బాగా నష్ట పోతున్నది అమాయకులైన భార్యలు.పిల్లలు.ఇంకో కొత్త కాపురం పెట్టుకొని బిడ్డల్ని కంటూ ,సర్వ సుఖాలు అనుభవించే వారు , ఆర్ధిక ఆలంబన లేని తమ భార్య పిల్లలు లేదా భర్త ఆ తర్వాత ఎలా బతుకులు ఈడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?చదువులు చెప్పించే వాళ్ళు లేక జులాయిలై తిరిగే కొడుకుల గురించి, చదువులు మానేసి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాలను పోషించే కూతుళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించ గలరా?
  బాధించే భర్తలని వదిలేసి కొత్త జీవితం ప్రారంభించటం వేరు.అది అవసరం కూడా.”

  ఇక్కడి వరకు మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను.మహీదర గారు.

  ప్రేమించే భర్తలు వున్నా కూడా ఇలాంటి వాటికి లోనవడం స్త్రీ వాదమా?

  స్త్రీ వాదం దృష్టిలో ఈ నవల ని నేను చూడలేదు.
  పెళ్ళయిన స్త్రీ మనసులో కూడా “ప్రేమ” పుట్టవచ్చును..అనే కోణం లోనే.. ఫీలింగ్స్ దృష్ట్యా..మాత్రమె నేను ఈ “తన్హాయి” నవలని చూసాను.
  అయినా ప్రేమ అన్నీ ఆలోచించుకుని పుడుతుందా ..చెప్పండి?

  “లవ్ హాజ్ నో సీజన్ నాట్ ఈవెన్ రీజన్”

  ప్రేమ పుట్టిన తర్వాత మంచి-చెడు,విచక్షణ గుర్తుకువచ్చి మరో స్త్రీ జీవితం లో ప్రవేశించ కూడదు అనుకుని ఆలోచించి..విజ్ఞత తో వ్యవహరిస్తుంది.

  అలాంటి పాత్ర “కల్హార” paaThakudu మెచ్చినా, మెచ్చకపోయినా..ఆ పాత్ర స్వభావం అది

  పాఠకుడిగా మీకున్న సందేహాలకి ..సమీక్ష వ్రాసిన నేను .సంతృప్తి కలిగే రీతిలో వివరణ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ చర్చని ముగిద్దాం.

  సుదీర్గమైన మీ అభిప్రాయానికి ధన్యవాదములు మహీధర గారు.

 3. maheedhara says:

  అమ్మా వనజ గారూ! మీరు నాకు పగ వారు కాదు. అలా అని నీహారిక నాకు చుట్టమూ కాదు.

  సమీక్షలు ఎందుకు చేస్తారు? అది అందరు చదివి ఆ పుస్తకాన్ని అర్ధం చేసుకోవాలని, దాన్లో ఏముందో తెలుసుకోవాలని.అలా చదివినప్పుడు అందరు దానితో ఏకీభవించాలని లేదు. ఇంకొకరు వేరే కోణంనుంచి ఆలోచించవచ్చు.

  ముఖ్యంగా రచయితకి సహృదయత వుండాలి.ఎటువంటి విమర్శలు వచ్చినా ఎదుర్కొనే లేదా స్వీకరించే విజ్ఞత కూడా వుండాలి.విమర్శకుల ఆరోపణలనుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా వుంటుంది. చదివితే చదవండి. నా దారికి రండి. లేదంటే ఒక్క క్లిక్ చాలు అనేది మీకు ఏ రకమైన ధర్మంగా తోస్తుంది?

  అందరు పాఠకులూ పని గట్టుకొని బురద జల్లరు. కేవలం ప్రశంస ల కోసమే రచనలు చేస్తారా?

  హిట్లర్ వచ్చి శాంతి మంత్రాలు జపిస్తే ఆయన వ్యక్తిగత జీవితం వేరు , ఈ ఉపదేశం వేరు అని మీరు ఆ ఉపదేశాలకు తలోగ్గుతారా?

  ఆ మాటకొస్తే ఈ చర్చలో కొందరు అభిప్రాయపడినట్టు – మీరు చెప్పినంత నిజాయితీగా ఒక స్త్రీ తన భర్త దగ్గరకెళ్ళి నేను ఇంకో అతన్ని
  ఇష్టపడుతున్నాను. కుటుంబం కోసం నీతో కలిసి వుంటాను అంటే ఆభర్త ఎం చేస్తాడు? నవలల్లో జరిగినట్టే వుంటుందా? నిజ జీవితంలో వేరేగా వుంటుందా?
  అదే స్థానం లో స్త్రీ వుంటే ఆమె ఎంత బాధ పడుతుంది? ఇంకా ధైర్యం వున్న మహిళ అయితే మహిళా సంఘాల సాయం తో ఎంత గొడవ చేస్తుంది?
  ఈ గొడవల్లో పిల్లలు ఏమవుతారు? పిల్లల గురించి ఏమైనా ఆలోచించ గలరా ? ఈ సంబంధాల కోసం వెంపర్లాడే వాళ్ళు?

  మీరే ఒప్పుకున్నారు కదా ”నేను నీహారిక గారికి మాత్రమే “తన్హాయి” చదవమని చెప్పలేదు. కామెంట్ చేస్తున్న అందరికి “తన్హాయి ‘ చదివి ఒక అభిప్రాయానికి రండి అని చెపుతున్నాను గమనించలేదా!? ” అని.
  ఆ అభిప్రాయానికి రావటం కూడా మీకు నచ్చిన అభిప్రాయానికి రావాలనే ఉద్దేశమే కదా!
  ఎందుకు పాఠకులని వారి ఆలోచనలకి వదలరు?

  • మహీధర గారు నమస్తే!
   పాఠకులు పని గట్టుకుని బురద జల్లరు.. మీ వ్యాఖ్య తో నేను ఏకీభవించను..
   తన్హాయి నవల పై ఇంతకూ ముందు ఫై.సత్యవతి గారు,వంశీ కృష్ణ, వాసుదేవ్,జ్యోతి..గార్లు సమీక్ష వ్రాసారు.
   ఆ సమీక్ష ల్లోకి ఒకసారి తొంగి చూడండి. అక్కడ ఇదే విధమైన పని గట్టుకుని చేసిన వివాదాలు ఉన్నాయా!?
   ఒకే ఒక వ్యక్తి పనిగట్టుకుని.. చేస్తున్న కువిమర్శ ఇది.
   వ్యక్తి గత ఆరోపణలు చేయడం పాఠకుల లక్ష్యమా!? చెప్పండి.
   ఇక రచయిత్రి ని ఇందులోకి లాగకండి.
   హిట్లర్ రచయిత కాదండి. ఒకవేళ రచయిత అయిఉంటే..ప్రశ్నించడం జరిగి ఉండేదేమో! హిట్లర్ వాస్తవ చరిత్ర. తన్హాయి ఊహాజనిత నవల తేడా గమనించండి.
   సమీక్షలు చదవండి.తన్హాయి నవల చదవండి. ఇంతవరకే నేను చెప్పగలను .
   కాని నవలా రచయిత్రిని, సమీక్షలు వ్రాసిన వారిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించకండి.
   అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదండి. అని మాత్రమే చెప్పదలచాను. .
   దయచేసి నీహారిక కి నేను ఇచ్చిన సమాధానం ని సునిశితంగా గమనించండి. విషయం మీకే బోధపడుతుంది.ధన్యవాదములు.మాహీదర గారు.

   • మహీధర గారు..పాఠకులని వారి దారిన వెళ్ళనివ్వ కుండా ఎవరు అడ్డు కోవడం లేదండీ!
    దయచేసి గమనించండి.
    నేను,నాలాంటి కొందరు ఇలా మాత్రమే చెప్పగలం.

    సాహిత్యాన్ని చదవడం ఒక కళ. రాయడం సంగతి వదిలేయండి – అసలెలా చదవాలో, ఏ కన్నులతో చూడాలో తెలీని మనుష్యులను, అన్నింటికీ మించి పక్క వ్యక్తి అభిప్రాయాలకి గౌరవమివ్వలేని తమ ఆలోచనలను దాచుకోలేని వారిని చూసి జాలిపడడం ఒక్కటే మనకు మిగిలిన దారి అనిపిస్తోంది.

    • maheedhara says:

     అమ్మా! సాహిత్యాన్ని మీ కళ్ళతో చూడాలని , మీరు అర్ధం చేసుకున్నట్టే అందరు అర్ధం చేసుకోవాలని భావించకండి.
     రామరాజభూషణుడు చెప్పినట్టు కవి, విమర్శకుడు ఇద్దరూ సహృదయత కలిగిన వాళ్ళు అయివుండాలి.
     పాఠకులందరూ కూడా నిందలు వేసే దృష్టితోనే చదవరు. ఇలా మీ రచనని పాఠకుల కోసం వారి ముందు వుంచినప్పుడు నిజమైన నిందలు వేసిన వారిని వదిలేయటమో, అపార్ధం చేసుకున్న వారికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీది.రచయిత్రిది కూడా.

     పాఠకుని అభిప్రాయం ఏదో దాన్ని గురించి ఆలోచించాల్సి న అవసరం రచయితలకి వుంటుంది.
     వ్యక్తిగత జీవితాలు వేరు, రచనలు వేరుగా చూడరు పాఠకులు. రచయితల గురించి తెలియనప్పుడు మాత్రమే రచనలనే ఉన్నది వున్నట్టు చదవగలరు. అది మానవ నైజం కూడా.

     ఇంక హిట్లర్ రచయిత కాదు సరే.అది ఒక పోలిక మాత్రమే. పోలిక లేకుండా చెప్తే మీకు నచ్చుతుందా?అది భావ్యం కాదనే కదా అలా చెప్పింది.

     కవిగా అందరికీ నచ్చిన ఒక కవి ఒక రోజు తన ఇద్దరు భార్యల భుజాల మీద చేతులేసి ఫోటో దిగి జనాలకి చూపిస్తే , ఏ స్త్రీ అయినా దగా పడ్డ ఆ స్త్రీలని గురించి ఆలోచించదా ? ప్రశ్నించరా ?
     ఆ భార్యలే అంగీకరించారు మీకెందుకు అంటారా?
     ఒక స్త్రీ తెలిసి కూడా మరో స్త్రీ జీవితంలోకి , కాపురంలోకి ప్రవేశించి ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన తర్వాత కూడా , తప్పని పరిస్థితుల్లో సర్దుకు పోక ఏం చేస్తుంది మొదటి భార్య ? కావాలనే భార్యని మోసం చేసినా కూడా అక్కడికి మొదటి భార్యని తరిమెయ్యకుండా బాగా చూసుకుంటున్నాడు అని ఆ భర్తని నెత్తిన పెట్టుకుంటారా మీరు ?

     తన్హాయీ నవలలో జరిగింది కూడా ఇదే.
     ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవిత భాగస్వాములని మోసం చెయ్యటం,తప్పని పరిస్థితుల్లో తనని మోసం చేసిన భర్తతో కలిసి కాపురం చెయ్యటం.
     చివర్లో కుటుంబం కోసం అన్ని అక్రమ సంబంధాలు వదిలేసుకుని కలిసి కాపురం చేద్దాం అని నిర్ణయించుకున్నా , అప్పటికే భార్య మీద నమ్మకం కోల్పోయి గాయ పడ్డ చైతన్య మళ్ళీ ఆమెని సోల్ మేట్ గా కూడా చూడగలడా? కేవలం శరీరం లాగానా ?

     కల్హార అంత చేసిన తర్వాత కూడా భర్తతో కలిసి జీవిచాలని నిర్ణయం తీసుకుంది సరే.బానే ఉంది.

     ఇంకెప్పుడు అతన్ని ప్రస్తావన మన మధ్య తీసుకు రావద్దు . అతనెవరో, మనమెవరమో.ఇక్కడితో అతని గురించి మర్చిపో అని ఎంతో నిజాయితీతో చెప్తాడు చైతన్య.
     ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ.అలా అతన్ని పంపించెయ్యాలని ముందే తెలిస్తే అతన్ని నా మనసులోకి రానివ్వకుండానే వుండేదాన్ని” అని మనసులో అనుకుంటుంది.
     ఇది ఏ రకమైన నిజాయితీగా మీరు గుర్తించారు వనజ గారూ?

     నిజాయితీ వున్నది చైతన్యకా? కల్హారకా? కాపురం ముసుగులో కల్హార మానసికంగా ఏం చేస్తుంది ఆ తర్వాత ?
     కల్హార లో వచ్చింది నిజమైన మార్పు కాదని ,కేవలం కుటుంబం కోసమే అని నవల చదిన ఎవరికైనా అర్ధం అవుతుంది.

     వివాహ బంధంలో ఇలాంటివి స్త్రీ చేసినా , పురుషుడు చేసినా తప్పు తప్పే.
     అందరూ చేస్తున్నారని , మేము చేస్తే తప్పేంటని ప్రశ్నించటం వివేకం కాదు ఎవరికైనా.
     స్త్రీ ,పురుషుల మధ్య ఆకర్షణలు సహజమే. వాటికి లోనవ్వడం కూడా అంతే సహజం .
     ఒక బంధానికి కట్టుబడ్డ వారికి నిగ్రహం కూడా అవసరమే.ఇతరుల కుటుంబాలను , ముఖ్యంగా కన్న పిల్లలను ఛిద్రం చేసుకోవటం ఆధునికతా?
     ఈ సంబంధాలలో బాగా నష్ట పోతున్నది అమాయకులైన భార్యలు.పిల్లలు.ఇంకో కొత్త కాపురం పెట్టుకొని బిడ్డల్ని కంటూ ,సర్వ సుఖాలు అనుభవించే వారు , ఆర్ధిక ఆలంబన లేని తమ భార్య పిల్లలు లేదా భర్త ఆ తర్వాత ఎలా బతుకులు ఈడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?చదువులు చెప్పించే వాళ్ళు లేక జులాయిలై తిరిగే కొడుకుల గురించి, చదువులు మానేసి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాలను పోషించే కూతుళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించ గలరా?
     బాధించే భర్తలని వదిలేసి కొత్త జీవితం ప్రారంభించటం వేరు.అది అవసరం కూడా. ప్రేమించే భర్తలు వున్నా కూడా ఇలాంటి వాటికి లోనవడం స్త్రీ వాదమా?
     మరొక రచయిత్రి భావించినట్టు సహృదయ అయిన కల్హార ఆర్ధిక స్వావలంభన, విజ్ఞత కలిసి వున్న రాజేశ్వరి . ఆమె ఆర్ధిక స్వావలంభన ,విజ్ఞత వున్న స్త్రీ కాబట్టే ,ఒంటరిగా బ్రతకగలననే ధైర్యమే ఇలా చేసే ధైర్యాన్నిచ్చిందా ? ఆమె సహృదయతే ఇంకొక స్త్రీ భర్తని కోరుకుందా? సంఘర్షణనీ , పర్యవసానాల్ని చిత్రించినా కల్హార లో నిజమైన పశ్చాత్తాపం లేదు. ఆమెని అభినందించాల్సింది చలం కాదమ్మా. ఆమె భర్త. కూతురు. అవతల వాడి భార్య.
     ఆమె తప్పని సరయ్యి ప్రియుడిని వదిలానని అనుకుంది కానీ మానసికంగా ఆమె వదలలేదు.అందుకే ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ” అనుకుంది మనసులో.
     ఇలా అనుకునే బదులు భర్తని వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అనిపించుకునేది.
     సెలవు .

     • .అందుకే ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ” అనుకుంది మనసులో.
      ఇలా అనుకునే బదులు భర్తని వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అనిపించుకునేది.
      ఇది మీ అభిప్రాయం .ఓకే.. స్వాగ తిద్దాం.. మహీదర గారు.
      నిజ జీవితాల లో ఇలాటి వాటిని స్వాగతించి దైర్యం కల “కల్హార”లని ఆమోదించి నిజాయితీకి పట్టం కట్టడం.. మంచిదని అనుకుంటే.భారతీయ నాగరిక సమాజం తప్పక హర్షిస్తుంది.

      ఈ భారతీయ స్త్రీలకి “భర్త” పిల్లలు వద్దు..ప్రేమికుడు..చాలు అనుకునేంత ఎదగాలని నేను కోరుకోవడం లేదు.
      నేను కొంచెం చాందస భావం ఉన్నదానిని. ఏమనుకోకండి. “కల్హార”లు గడప దాటకూడదు.. అనుకుంటాను. అలాగే ఏ ప్రేమో,దిక్కు మాలిన ఆకర్షణ పుదితెనో.. రహస్యంగా మనసులో దాచుకో..అనే చెప్పే రచనలే చేస్తాను.

      మనసా,వాచా,కర్మణా.. నూటికి నూరు పాళ్ళు పాటించి. భర్త నిమాత్రమే ఊహించి,ప్రేమిస్తూ….. ఏమైనా పిదప బుద్దులు పుడితే..
      గౌరవంగా ఎన్కౌంటర్ చేసి పడేసి..పూటకొక గర్ల్ ప్రెండ్ తో తిరిగొచ్చిన భర్తకి పాద పూజ చేసి కళ్ళు వత్తుకుంటూ, కాళ్ళు వత్తుతూ. భారతీయ స్త్రీ ,సంప్రాదాయం అంటూ జేజేలు కొట్టించే రచనలు చేయాలని,వాటికి పొగుడుతూ వ్రాసే సమీక్షలు రావాలని కోరుకునే వాళ్లకి.. ఈ “కల్హార ; నచ్చదు,నచ్చదు,నచ్చదు. ..

      గౌరవం గా కాపురం చేసే భార్య భర్తల మనస్సులో ఎవరి మనసులో ఏముందో..తెలియకుండా
      ఉన్నంత కాలం ..అన్నీ పవిత్ర బంధాలే! అప్పుడు మానసిక వ్యభిచారాలు కనబడవు.

      “కల్హార” లా బయట పెడితే.. అలా బయటపెట్టాక కూడా భర్త తోనే కలసి జీవిన్చాలనుకుంటే. మాత్రం మానసిక వ్యభిచారం.
      ఇలా ..ఆలోచించే వారికి కల్హార నచ్చక పోవడం లో ఆశ్చర్యం లేదు.
      నచ్చిన వాడితో..వెళ్ళిపోయే “కల్హార” కావాలి. ఆమెని భర్త,పిల్లలు..నిజాయితీగా మెచ్చుకోవాలి.
      ఇలాటి రచనలు ఎప్పుడు వస్తాయో!
      అప్పుడు తప్పకుండా సమీక్ష రాస్తాను.
      ధన్యవాదములు. సెలవు.
      .

 4. rakumari says:

  వనజ గారు మీ సమీక్ష చాలా బావుంది సమీక్ష చదవక పోతే ఈ నవల వచ్చిన విషయం కుడా నాకు తెలిసేది కాదు ధన్యవాదాలు కల్పనా రెంటాల గారు తీసుకున్న ఇతివృత్తాన్ని కి రుణపడి వుంటాము సమీక్ష వల్ల కొందరు వ్యక్తపరుస్తున్న భావాలు గమ్మతుగా ఉన్నాయి భారతీయ మహిళ ప్రస్తుతం ఎవరి అదుపులోవున్నది స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ అనండి ప్రేమ అనండి ప్రకృతి సహజమైనది ప్రకృతిని మనిషిలు ఎన్నటికి కి నిర్దేశించలేరు స్త్రీ తనగురించి మాత్రమే ఆలోచించుకోదు స్త్రీ తనకు తానే బంది ఆమెని ఎవరు అదపులో వుంచలేరు ఏది ఏమైనా స్త్రీ మనసు గురించి చర్చించారు రచయిత్రి మీరు అభినందనీయులు

  • ra kumari గారు ..ధన్యవాదములు.”తన్హాయి” తప్పక చదవండి. మళ్ళీ మళ్ళీ చదవండి.

 5. uma says:

  మీ గూగల్ బ్లాగ్ చూసాను! మోహనరాగాలేవో కౌశిక్ లాగా లైన్వేస్తున్నట్లు౦ది, దెబ్బలాట/ వాగ్యుద్ధం ముసుగులో:)) ! అమ్మాయ్! శబ్నం జాగ్రత్త!

  • ఉమగారు ధన్యవాదములు.

  • uma says:

   “శబ్నం” అ౦టే మ౦చు బి౦దువు అని అర్థం! అ౦టే ‘dew drop ” అని!

   • ఉమా గారు ..హిందీ నాకు తెలుసును, :)) మంచు బిందులు సూర్య కిరణాలు తాకిడికి కరిగిపోక తప్పదు. కిరణం స్వభావం చీకట్లను చీల్చడమే..కదా! థాంక్ యు వేరి మచ్.

 6. ఇందాకే తన్‌హాయీ నవలని విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో కొన్నాను. ఎలా ఉంటుందో చూడాలి.

 7. uma says:

  తన్హాయి చదువుతున్నాను, ఇ౦కా ఏర్పోర్ట్లోనే ఉన్నాను, అ౦టే చాల దూర౦ ప్రయాణ౦ చేయాలి!
  ఇలా౦టి స౦దర్భాలు నిజ జీవిత౦లో వస్తాయా? ఎ౦దుకు రావు? మానసిక పరిధి, అవగాహన పెరిగినపుడు, కొన్నిప్రేమలు లేదా infatuations పరిగెత్తే మేఘాల్లగా చిరుజల్లు కురిపి౦చో కురవకనో వెళ్ళిపోతాయి.. బస్సుల్లో, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో కళ్ళల్లో కలిసి మెరిసి వెలిసిన కావ్యాలు ఎన్నెన్నో. అన్నిటికన్నా మిన్నగా గమని౦చాల్సిన విషయ౦, (అది సమీక్షలు చదివాకే ఏర్పడి౦ది), కల్హార కుటు౦బ శ్రేయస్సునే తన శ్రేయస్సుగా తలచి, తన జీవితాన్ని సమాజ౦లోని రీతులు, విధానాలు, Expectations కి అనుగుణ౦గా రాజి పడడ౦.. అది రాజి పడడమా, లేక safety నెట్ లో ఉ౦డిపోవడమా, అన్న మీమాంసలో విభిన్న అభిప్రాయాలు కలగొచ్చు.. ఎవరికీ వారే ఆలోచనాకర్తలు, విమర్శకులు, ఎవరి అభిప్రాయ౦ వారిది.. అయితే ఇలాటి కధలు సమాజాన్ని వెర్రితలలు వేయిస్తున్నాయనో లేదా రాయటానికి వీల్లెదనో చెప్పడం Denial లో ఉ౦డటమే. మీరు కాదన్న౦త మాత్రాన మారుతున్న సమాజపు అవగాహన మీకు తెలియకు౦డా ఉ౦డదు, ఆలోచనలు నడిచే ప౦థా మారకు౦డా ఉ౦డదు. అ౦దరు ఇలాగేనా అ౦టే కాకపోవచ్చు. అలాగని ఇలాటి సమస్యలు లేవని భావి౦చగలరా?

 8. maheedhara says:

  తన్హాయీ చదివిన తర్వాత, ఈ సమీక్ష ,నీహారిక కామెంట్ చూసిన తర్వాత కొంత విషయం అర్ధమయింది.
  వనజ వనమాలి తనకోణం నుంచి సమీక్షించటం తప్పు కాదు.
  అలాగే నీహారిక వాదనలో కూడా తప్పు లేదు.
  సమీక్షకురాలి అభిప్రాయం ఏదో దాన్నే పాఠకులంతా అంగీకరించాలని , ఆమె కోణం నుంచే నీహారిక కూడా ఈ నవలని అర్ధం చేసుకోవాలని బలవంత పెడుతున్నట్టుగా అనిపించింది.కొన్ని కామెంట్ల వల్ల.
  భారతీయ సంస్కృతి, కట్టుబాట్లు, భార్యాభర్తల అనుబంధాలు వంటి విషయాలు హద్దులు దాటుతున్నయనే నీహారిక వాదన కూడా ఆలోచించ తగినదే.

  • భారతీయ సంస్కృతి, కట్టుబాట్లు, భార్యాభర్తల అనుబంధాలు వంటి విషయాలు హద్దులు దాటుతున్నయనే విషయం గుర్తెరగాలి.
   సాహిత్యం లో స్త్రీల పాత్ర చిత్రీకరణల వల్లనే.. ఇవన్ని జరుగుతున్నాయా!?
   ఇక తతిమా వేటి ప్రభావం .. లేదంటారా!?
   వివాహం అయిన తర్వాత కూడా.. ఇరువురు స్త్రీపురుషుల మధ్య ఏర్పడిన ఆకర్షణలు.. సమాజం లో ఇప్పుడే కొత్తగా మొదలయ్యాయా!?
   సాహిత్యంలో చలం వందేళ్ళ ముందే.. “మైదానం ” రచించారు. మైదానం ని యెంత మంది చదివారు. చదివిన వాళ్ళు అందరు.. రాజేశ్వరిని అనుకరించారా!? చదవని వాళ్ళలో రాజేశ్వరిలు లేరా?
   ఏం మాట్లాడుతున్నారండి !? మహీంద్ర గారు..
   “సమీక్షకురాలి అభిప్రాయం ఏదో దాన్నే పాఠకులంతా అంగీకరించాలని , ఆమె కోణం నుంచే నీహారిక కూడా ఈ నవలని అర్ధం చేసుకోవాలని బలవంత పెడుతున్నట్టుగా అనిపించింది.కొన్ని కామెంట్ల వల్ల.”
   ఇదా మీ సునిశిత పరిశీలన.
   నేను నీహారిక గారికి మాత్రమే “తన్హాయి” చదవమని చెప్పలేదు. కామెంట్ చేస్తున్న అందరికి “తన్హాయి ‘ చదివి ఒక అభిప్రాయానికి రండి అని చెపుతున్నాను గమనించలేదా!?
   ఏ ఒక్కరి అభిప్రాయం వేరొకరి అభిప్రాయంతో..సరి పోక పోవచ్చు అని చెపుతున్నాను.
   అతితీవ్ర భావజాలం ప్రదర్శించేవారికి.. ఇతరుల సంస్కారం అర్ధం చేసుకునే శక్తి కూడా నశిస్తుంది అని నిరూపితమవుతుంది.
   తన్హాయి చదివి ఎవరి కోణం లో వారు సమీక్షలు వ్రాశారు. నచ్చితే చదవండి. లేకపోతే..ఒక్క క్లిక్ చాలు.

 9. కినిగెలో తన్‌హాయీ అని సెర్చ్ చేస్తే దొరకలేదు. అసలు ఆ నవలని కినిగెలో పెట్టారా అనేది సందేహంగా ఉంది.

  • ప్రవీణ్ గారు..విశాలాంధ్ర లో దొరకవచ్చు ప్రయత్నించండి.

 10. SriRam says:

  వనజ గారు,
  తన్ హాయి నవలను సినేమాగా ఊహించుకొంటే మహేష్ భట్ మడ్డర్ సినేమా గుర్తొచ్చింది. మడ్డర్ సినేమాలో మల్లికా షరావత్ పాత్ర, కల్హార రుపాంలో కంటి ముందు కనిపించింది. సినేమాలో కొంచెం మిర్చి మాసాల జతచేయటం, నవలలో వారుతీసుకొన్న నిర్ణయాలకు జస్టిఫికేషన్ ఇవ్వటం సహజం. ఇక ఈ నవలలో కల్హార పాత్ర ద్వార ఆమే మనసులోని ప్రేమభావాలను రచయిత మాటల రూపంలో పేట్టారు. రచయిత తన రచానాశక్తితో చాలా మంది పాఠకులను కల్హార పాత్రను ఆకట్టుకొనేలా రాసి మెప్పించి ఉండవచ్చు. కాని నీజాయితిలేని కల్హార పాత్రని, నీజాయితి గలదని మీరు చెప్పటం మాత్రం అతకలేదు. భర్తతో కౌషిక్ నచ్చాడు అని చెప్పటమే నిజాయితి గా మీకలా అనిపించి ఉండవచేమోగాని, అసలికి కల్హార కి ధైర్యమే లేదు, నిజాయితి ఎక్కడ నుంచి వస్తుంది? నాకనిపించింది.

  • శ్రీరాం గారు ..కల్హార కి దైర్యం లేకపోవచ్చు. 100 % ఆమె నిజాయితీ కల వ్యక్తి. దైర్యం లేనంత మాత్రాన నిజాయితీ లేదనడం భావ్యం కాదు.
   కల్హార ఒక పాత్ర మాత్రమే!ఇంకా ఆ నవలలో చాలా పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలని నవలా రచయిత్రి నే చిత్రించారు. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలో..ఆ పాత్ర గుణగణాలు ఏమిటో .మనం కాదు నిర్ణయించేది. .రచనని పూర్తిగా చదివితే కాని అవగాహన రాదు. మీరు తన్హాయి చదవకపోతే ఇప్పుడు చదవండి.
   గడప దాటని ఆడవాళ్ళలో “కల్హార” ని చూసి వీలయితే మెచ్చుకోండి. లేదా వదిలేయండి.
   ఎవరి అభిప్రాయం ఇంకొకరి అభిప్రాయం లాగా ఉండకపోవడం ఆశ్చర్యం కాదుగా..

 11. సురేష్ పెద్దరాజు says:

  వనజా గారు, తన్హాయి నవలపై మీ సమీక్ష బాగుంది. నవల చదివినట్టు అనిపించింది. బాగా వ్రాశారు. మీరు ఉదాహరించిన సినిమాలే కాకుండా నటి రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ర్ మై ఫ్రెండ్’ సినిమా కూడా ఈ నవలకు స్పూర్తి అనుకుంటున్నాను.

 12. కార్డ్‌లో ఎంత బాలెన్స్ ఉందో తెలియదు. ఉంటే కినిగెలో కొని చదువుతాను.

 13. mahi says:

  మీ రివ్యూ బావుంది. ఇంతకీ తన్హాయీ అంటే అర్ధం ఏంటి?

 14. నీహారిక, నేను ఆ నవల చదవలేదు కానీ నీ వ్యాఖ్యలు మాత్రం చదివాను. ఒక ప్రశ్నకి డైరెక్ట్‌గా సమాధానం చెప్పు. “భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య క్షమిస్తుంది కానీ భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భర్త ఎందుకు క్షమించకూడదు?” ఇదే ప్రశ్న ఇంతకుముందు అడిగితే రాముణ్ణి ఉదాహరణగా చెప్పావు. ఎంత భావవాదులైనా పుక్కిటి పురాణాలని అంత సీరియస్‌గా తీసుకోరు.

  • ప్రవీణ్ శర్మ గారు.”తన్హాయి” నవల చదవ కుండా,పైన సమీక్ష కూడా చదవ కుండా.. ఇక్కడ నీహారిక వ్యాఖ్య పై చర్చ కి ఎందుకు వచ్చారండీ!?
   “తన్హాయి” నవలని చదవండి.తర్వాత మీ అభిప్రాయం చెప్పండి.

 15. నీహారిక says:

  వనజ గారు,మీరు వ్రాసిన తన్హాయి నవల పై సమీక్ష చదివాను. ఆ నవల ని
  వ్యతిరేకించేవారిలో నేనే మొదటి దాన్ని. ఇటువంటి నవలని మీరు
  సమర్ధిస్తున్నారంటే దానికి కారణం నేను అర్ధం చేసుకోగలను.ఇటువంటి నవలలని ప్రోత్సహించడం ద్వారా భారతీయ స్త్రీ అదుపు తప్పుతోంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ !!
  ఒకరికి ఒకరు నచ్చకపోయినా బలవంతంగా అయినా కలిసే బ్రతకాలి అన్న భారతీయ
  సంస్కృతి నాకు అక్ఖర్లేదు. ఎందుకంటే నా భర్తనెలా ప్రేమింపజేసుకోవాలో నాకు
  తెలుసు కాబట్టి !!అటువంటి ప్రేమ దూరమయిన నాడు అతని అవసరం నాకు లేదు.చాలా మంది ప్రేమ దొరకకపోతే అవతలి వారిమీద నెపం నెట్టేయడమో లేక అక్రమ సంబంధం
  పెట్టుకోవడమో లేక ఇలా తన్*హాయీ నడపడమో చేస్తుంటారు. కానీ తమ లోపలికి
  చూసుకుని ఏమి తప్పు చేసాము? మనకి ఎందుకు ప్రేమ దొరకలేదు అని స్వీయ పరిశీలన
  చేసుకోరు. నేను మా ఆయన్ని అతని పాజిటివ్, నెగటివ్స్‌తో సహా అంగీకరిస్తాను. నచ్చనివి ఉంటే సర్దుకుపోతాను. మార్చటానికి ప్రయత్నించను.
  నాకు సినిమాల్లో యాక్టింగ్ నచ్చుతుంది కానీ జీవితం లో యాక్టింగ్ అసహ్యం !!నాకు కల్హార
  పాత్ర నచ్చలేదు. ఆడపిల్ల ఉన్నా నచ్చిన వాడు దొరికితే
  నిరభ్యంతరం లేకుండా వెళ్ళిపొమ్మంటాను కానీ ఆ వచ్చిన వాడు ఏమీ అవకరాలు
  లేకుండా ఉండేంత గొప్పవాడా??వాడికీ ఏవో కొన్ని నచ్చని అలవాట్లు బుద్దులు
  ఉండవా ?? అపుడు మళ్ళీ ఇంకొకడిని చూసుకుంటుందా ?? ఎవరూ మిష్టర్ పర్‌ఫెక్ట్
  లు గా ఉండరు. మనందరిలోనూ ఏవో కొన్ని లోపాలు తప్పక ఉండితీరతాయి.సంవత్సరం తర్వాత ఎవరితో జీవితం గడపినా అలాగే అవుతుంది. దూరంగా ఉన్నంత సేపూ
  బాగుంటుంది దగ్గర కెళితే ఎవరయినా అంతే ఆ మాత్రం దానికి ఈ తన్‌హాయీ ఎందుకూ
  అనేగా నేను అడుగుతుంది ??ఏం నిజాయితీ అండీ ఇది ?? నచ్చిన వాడిని సొంతం చేసుకోకుండా … మనసులో ఒకడు
  …. ప్రక్కన ఇంకొకడు … ఇది మీకు నచ్చడం … బాగుందని సినిమా తియ్యడం
  …ఆడవాళ్ళు తన్‌హాయి నడపడం …. మగవాళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకోవడం ….
  ఎక్కడలేనిజంబ లకిడి పంబలూ ఈ బ్లాగుల్లోనే చూస్తున్నాము.నాకు ఒక
  కొడుకు ఉన్నాడు, నాకు ఆడపిల్లలు లేరు …నాకున్న బాధల్లో అదొకటి !!

  కూతురున్నా, డోంట్ కేర్ నా స్వార్ధం నాకు ముఖ్యం అని కాపురం గాలికొదిలేసి
  వెళ్ళడం మంచిదా అని నన్ను అడుగుతున్నారు !!
  మనసు లేకపోయిన తరువాత ఎవరిని ఉద్ధరించడానికి చెప్పండి ??ఒకవేళ అటువంటి
  పరిస్థితి వస్తే నాకు సరైన వాడు దొరకాలే గానీ ఇపుడు కూడా చక్కగా అందరికీ
  ప్లస్ లోనూ, బయట మీడియాతోనూ చెప్పి మరీ పోతాను !!ఎలిజెబెత్
  లాగా అన్నమాట !! కానీ విడాకులు కావాలి. ఒక రిలేషన్ షిప్ లో ఉన్నపుడు
  పూర్తి న్యాయం చేస్తాను. ఏ మాత్రం మోసం చేయను. నా మొగుడి ప్రక్కన పడుకుని
  వేరే ఒకడి గురించి ఆలోచించను. చావనయినా చస్తాను కానీ ఒకేసారి ఇద్దరితో
  ప్రేమ ని పంచలేను.నాకంత విశాల హృదయం లేదు.నాకెవరయినా దొరికితే బాగుండు సంవత్సరం పాటు ఎంజాయ్ చేసేసి మళ్ళీ మా ఆయన
  దగ్గరకి వెళ్ళి నాధా నీ పాద దూళి తప్ప నాకు వేరు దిక్కు లేదు అని
  వేడుకుంటాను. అప్పుడు మా నాధుడు రాముడిలాగా అక్కున చేర్చుకుని నా
  కళ్ళనీళ్ళు తుడిచి నన్ను ఇంటికి తీసుకెళ్ళి కొన్నాళ్ళు కాపురం తిన్నగా చేసి
  మళ్ళీ చాకలి వాడన్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నీ మీద
  నాకెటువంటి ద్వేషం లేదు అని ఊరందరికీ గొప్పగా త్యాగమూర్తి లాగా
  ఫోజులిస్తారు.ఇలా చెపితే మీకు బాగా అర్థం అయిందా లేదా ?? మరి
  మీకెలా చెప్తే అర్థం అవుతుంది ?? ఇలాగే పరిస్థితి కొనసాగితే ఇండియా అమెరికా
  లాగా మారడానికి ఎంతో కాలం పట్టదు.మళ్ళి అమెరికా లాగా మనం మారి మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి కూడా అలాగే
  కుప్పకూలాలా ?? అంత అవసరమా ?? ఇతరులను చూసి నేర్చుకోవలసింది మంచా? చెడా ??కల్హార
  భర్త మంచివాడు ఎటువంటి కారణం లేకుండా ప్రేమ పుట్టింది అని అంటుంది సరే
  కాదనను కానీ మళ్ళీ సంసారం కోసం కలిసి ఉంటున్నాను అంటుంది మీకు ఎలా
  నచ్చిందండీ ఆ కేరక్టర్ ?
  ఒక అదుపు తప్పిన దాన్ని ప్రోత్సహించకండి అని అంటున్నాను.నేను కొన్ని వాస్తవాలు బయటకి చెప్పాననుకోండి బాగుండదు. వాళ్ళ వ్యక్తిగత
  జీవితాలను బయటకు లాగాను అని అంటారు.ఇక్కడ బ్లాగుల్లో ఉన్న చాలా మంది ఎవరో
  ఒకరికి ఆకర్షితులవుతూనే ఉన్నారు. అది ఎవరు అన్నది మీకు ఎలా తెలిసింది అని
  ఆరా తీస్తే నేను మాట్లాడను. అటువంటి వారికి ఈ నవల బాగా నచ్చింది.ఆడపిల్ల
  ఉంటే ఒకలా మగవాడు ఉంటే ఒకలా ఉంటారా ఎవరైనా ?? మీరు పుస్తకాల్లో
  వ్రాసినట్లు మాట్లాడతారేమిటి ?? మైదానం నేను చదవలేదు !! నాకు చలం
  అంటే అభిమానం లేదు ద్వేషమూ లేదు. చలం పుస్తకాల్లో “స్త్రీ” అన్నది ఒక్కటే చదివాను.అది కూడా పుస్తకాల గురించి
  సరైన అవగాహన కూడా లేని రోజుల్లో … భయమేసింది కూడా ఒక స్త్రీ అలా ఉండవచ్చా
  ?? ఉంటే సమాజం ఎలా చూస్తుంది అని కానీ ఇపుడు భయమేయడం లేదు. కారణం నా
  పరిస్థితులు !! ఎంతకైనా తెగించాలన్నదే ప్రస్తుత నా భావ తీవ్రత !!అతని గురించి ఒక్కటైతే చెప్పగలను అతనికి
  ప్రేమ దొరకలేదు, అతనొక ప్రేమ పిపాసి, రంగనాయకమ్మ కూడా రాముడిని తిట్టడానికి
  అదీ ఒక కారణం.కానీ కొందరి జీవితాలను ప్రభావితం చేసే మరియు ముఖ్యంగా రచయతలు/ రచయిత్రులు ఏదయినా వ్రాసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిర్ణయాలు వారు తీసుకోవడం జరుగుతుంది. మనము ఆచరించినవే మన పాఠకులకు చెప్పాలి.
  ఇతరులను మాత్రం మీరు మనసు చంపుకుని
  బ్రతకండి అని చెప్పే హక్కు లేదా నీతులు చెప్పే హక్కు ఎలా వస్తుంది ??

  • నీహారిక గారూ !
   మీ వాదనలో అసంబద్ధత – భిన్న వైఖరులు – అసహనం – తొందరపాటు కనిపిస్తున్నాయి. ఆ నవల భారతీయ సమాజం-వివాహవ్యవస్థను బపరిచిందా ? కించపరిచిందా ? స్త్రీ పట్ల ఆమె మనసు పట్ల ఉన్నత భావనలను పెంచుతుందే తప్ప కించపరచలేదు. మీకు మీరే స్వీయమానసిక ధోరణితో స్వంత భావాలను ఆ నవలకు అంటగడుతున్నారేమో మరోసారి ఆలోచించండి.

  • మీ వ్యాఖ్యకి సమాధానం. మీరు వ్యతిరేకించారు. ఓకే.. అది మీ అభిప్రాయం.
   ఇటువంటి నవలను మీరు సమర్ధించారు అంటే కారణం నేను అర్ధం చేసుకోగలను.. అని అన్నారు.
   అంటే ఈ నవలని సమర్దిన్చేవారిని అందరిని.. ఈ నవలా రచయిత్రిని కూడా మీరు భారతీయ సభ్య సమాజం అందరి తరపునా వకాల్తా పుచ్చుకుని తెగుడుతున్నారు. అన్నమాట. ఓకే
   అలాగే ఇటువంటి నవలలని ప్రోత్సహించడం ద్వారా భారతీయ స్త్రీ అదుపు తప్పుతోంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ !!అని అంటున్నారు.
   మళ్ళీ మీరే ఒకరికి ఒకరు నచ్చకపోయినా బలవంతంగా అయినా కలిసే బ్రతకాలి అన్న భారతీయ
   సంస్కృతి నాకు అక్ఖర్లేదు. అంటున్నారు.
   ఈ రెండింటిలో ఏది మీ నిశితాభిప్రాయం ..మీరే తేల్చుకోండి.
   అప్పుడు.. నన్ను మీరు సమర్ధించారు అంటే అర్ధం చేసుకోగలను అని అన్నమాటకు ..సవివిరణ ఇవ్వగలను.
   విమర్శ కూడా హుందాగా ఉండాలి నీహారిక గారు.
   మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి జీవితంలోనే.. ఆకర్షణలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆశ్చర్య పడతాము.మొత్తం గాంధీ తత్వాన్ని జాతి అసహ్యించు కుందా !? ప్రపంచానికి ఆయన ఆదర్శం కాకుండా పోయాడా!? ఆకర్షణ లు సహజంగా కలిగేవి..అని కూడా అంగీకరించక తప్పదు. ఆకర్షణలు కలుగగానే వెనుకాముందు ఆలోచించకుండా నచ్చిన వాడితో వెళ్లి పోరు. ఆలోచిస్తారు.
   వివేకం,విచక్షణ లేకుంటే..భారతీయ వివాహ వ్యవస్థే ఉండదు.అవి ఉన్న స్త్రీ కాబట్టే “కల్హార” పాత్ర నాకు నచ్చింది.
   మీరనుకుంటున్న తైతక్కలు ఇవాళ కొత్తగా సమాజంలో రాలేదు.ఎప్పటి నుండో ఉన్నవే!
   కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి నియమాలుతో . సంస్కృతీ-సంప్రదాయం పేర ఎర్పరచుకున్నవి.
   తన్హాయి నవలని..మీ వ్యతిరేకభావం తగ్గించుకుని ఇంకొకసారి చదివి చూడండి. మీకే తెలుస్తుంది.

  • నీహారిక గారు..ఒక స్త్రీ పదే పదే ప్రేమలో పడుతుందా!? సాహిత్యంలో ఇలాటి సృజన ఇంతకూ ముందు కూడా ఉంది. తన్హాయి కన్నా చాలా ముందు. ఈ వివరాలు చూడండి. 1960 లోనే భగవతి చరణ్ వర్మ .. “చిత్రలేఖ” అనే నవలని హిందీలో రచించారు/ ఆ నవల ఇప్పటికి 15 సార్లు ముద్రించబడి అపార ఆదరణకి నోచుకుంది. మీరు అనుకున్నట్లు అనుకుంటే.. ఆ”చిత్ర లేఖ” నవల వల్ల భారతీయ సమాజం మొత్తం నాశనం అయి ఉండాలే! గమనించండి.. ఆ నవల కూడా చదివి మీ అభిప్రాయాన్ని మెరుగు పరచుకోండి …

 16. Sasi Thanneeru says:

  వనజ గారు నిజం గా మీ కలం నవలలోని లోతులను చక్కగా తెలియచేస్తుంది.
  ఒక పుస్తకం గొప్పదనం దాని సమీక్ష వలన రెట్టింపు అవుతుంది.
  నిజంగా ఈ పాత్రలు మనకు నిజ జీవితం లో ఎదురు అవుతుంటాయి.
  కాని సంయమనం ,వివేకం తో ప్రవర్తిస్తేనే దాంపత్యం నిలబడుతుంది.
  కల్పన గారు మీకు కూడా అభినందనలు

 17. Hitaishi says:

  వనజ గారు చక్కని సమీక్ష చేసారు. .
  నును ఈ నవల ని మీకు తెచ్చి ఇచ్చినప్పుడు ఏముంది.. ఇందులో?? ఇంతగా కొని తెమ్మని చెప్పారు అని ఆలోచించాను. ఇప్పుడు అర్ధం అయింది.
  కొన్నాళ్ళ పాటు మీ మాటల్లో కల్హార ని వినాలి అనుకుంటున్నాను. చాలా బాగుంది.అంతకన్నా నాకు మాటలు రావు.

  • హితైషి.. ధన్యవాదములు.
   “తన్హాయి” నవల కోసం విజయవాడ అంతా తిరిగి సాదించుకుని నాకు తెచ్చి ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు

 18. Raaji says:

  “ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.
  పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.”

  వనజవనమాలి గారూ.. “తన్హాయి” నవలను గురించి మీ సమీక్ష చాలా బాగుందండీ..
  తప్పకుండా చదవాలి అనిపించింది.
  మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు థాంక్యూ..

  • రాజీ గారు..మీ స్పందనకి ..నా ధన్యవాదములు. తప్పకుండ..”తన్హాయి”ని చదవండి.

 19. వనజా, మీ పోలికలకు నేనేమీ అనుకోలేదు.నిజంగానే….:)) నవల రాయడం వరకే నా వంతు. ఒక రీడర్ ఎలా అర్థం చేసుకుంటారు? అన్నది నా చేతుల్లో లేని పని. కల్హార, కౌశిక్ ల మధ్య దేహ కాంక్ష లేదు అని మీరన్నా, వుందని ఇంకొకరు అన్నా నేను మౌనంగా వుండేది అందుకే..:)) రంగనాయకమ్మ గారి లాంటి మహా రచయిత్రి తో నన్ను పోల్చడం నాకు గర్వ కారణం.నాకు ఆ స్థాయి ఇంకా లేదు, రాలేదు అనే నేననుకుంటున్నాను. కల్హార అంటే నాకూ కూడా చాలా ఇష్టం. :))

 20. వనజా, తన్హాయి మీద సమగ్రమైన విశ్లేషణ చేసినందుకు అభినందనలు. మీలాంటి మంచి పాటకులు ఆ నవలకు దొరకటం నా అదృష్టం. కల్హార పాత్ర ను బాగా అర్థం చేసుకున్నారు. మరో సారి థాంక్స్.

  • కల్పన గారు..
   “కల్హార ” పాత్రని మీరు సృజించిన తీరు కి..మీకు శతకోటి అభివందనం. అంతా బాగా ఆ పాత్రని తీర్చి దిద్దిన తీరు..నాకు బాగా నచ్చింది. అందుకే.. ఈ సమీక్ష వ్రాసాను.
   కల్పన గారు.. ఇంకొక చిన్న వివరణ. నేను రంగనాయకమ్మ గారి తో పోల్చడం యాద్రుచికం అలాగే “సిల్సిలా” చిత్రం మరియు మేఘసందేశం తో పోల్చడం ఎందుకంటె.. నాకు కలిగిన భావాన్ని.. క్లుప్తంగా చెప్పడానికి మాత్రమే..తప్ప.. కల్హార ని తక్కువ చేయాలని కాదు.
   ధన్యవాదములు.

 21. ప్రేమ కావ్యం ‘తన్హాయి’ నవలపై మీ సమీక్ష చదువుతుంటే నవలను చదివినంత అనుభూతి కల్గింది. నవలను పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. కల్హార ప్రేమ గురించి చక్కగా విశ్లేసించారు. ప్రేమ ఏ వయసులోనైనా, ఎక్కడయిన ఎప్పుడయినా కలగవచ్చు. ప్రేమలో నిజాయితి వుంటే ఏ సమస్యలు దరిచేరవు. అభినందనలు వనజ గారు!

  • ధన్యవాదములు నాగేంద్ర గారు.
   సమీక్ష చదివి సరిపెట్టకండి “తన్హాయి” ని చప్పక చదవండి.

 22. కొండల రావు గారు .. మీ స్పందనకి ధన్యవాదములు.
  స్త్రీ-పురుష విడదీత సమానమైన భావన లేదనే విషయం తోనే.. పోల్చి చూప వలసి వచ్చింది తప్ప మన వివాహ వ్యవస్తని నేను తప్పు పట్టలేదు. లోపాలు ఉన్నాయి. ఉన్నా కూడా . వివాహ వ్యవస్థ .పటిష్టంగా నిర్మించుకోవడం పట్ల సదవకాశాలని హైలెట్ చేసాను.
  అదే పని ఈ నవలా రచయిత్రి చూపించారు.
  నిజాయితీ కల పాత్రగా “కల్హార” పై అభిమానం.
  జీవిత భాగస్వామిని మోసగించే స్త్రీ కాదు కాబట్టి.. ప్రేమ అనే ఆనుభూతి కోసం పరి తపించిన స్త్రీగా ఆమెని అర్ధం చేసుకుని వ్రాసిన సమీక్ష.
  ధన్యవాదములు.

  • కొండల రావు గారు .. మీ స్పందనకి ధన్యవాదములు.
   స్త్రీ-పురుష విడదీత సమానమైన భావన లేదనే విషయం తోనే.. పోల్చి చూప వలసి వచ్చింది తప్ప మన వివాహ వ్యవస్తని నేను తప్పు పట్టలేదు. లోపాలు ఉన్నాయి. ఉన్నా కూడా . వివాహ వ్యవస్థ .పటిష్టంగా నిర్మించుకోవడం పట్ల సదవకాశాలని హైలెట్ చేసాను.
   అదే పని ఈ నవలా రచయిత్రి చూపించారు.
   నిజాయితీ కల పాత్రగా “కల్హార” పై అభిమానం.
   జీవిత భాగస్వామిని మోసగించే స్త్రీ కాదు కాబట్టి.. ప్రేమ అనే ఆనుభూతి కోసం పరి తపించిన స్త్రీగా ఆమెని అర్ధం చేసుకుని వ్రాసిన సమీక్ష.
   ధన్యవాదములు.

 23. వనజ గారికి ,
  మీ రివ్యూ చదివాక నవల చదవాల్సిన అవసరం లేదనిపించింది. విశ్లేషణలో మీ అనుభూతిని గమనించవచ్చు. అందుకే అంత లోతుగా చూడగలిగారు. సామాన్యులకిది అంత తేలికగా అర్ధమయ్యే అంశం కాదు. మనసు – ప్రేమ – శరీర ధర్మాలు- పెళ్లి – కుటుంబం – సమాజం అనే అంశాలలో వ్యక్తి పాత్రను, బాధ్యతకూ – మానసిక సంఘర్షణకూ మధ్య నిజాయితీ అనే అంశాన్ని చాలా బేలన్సుడ్ గా చెప్పారు. మీ పోస్టులు గతం లో చూసినందున ఇది మీకిష్టమైన సబ్జెక్ట్ అని భావిస్తున్నాను. బహుశా వేరెవరూ ఈ నవలను ఇలా ఇంత అనుభూతితో సమీక్షించలేరేమో అనడం అతిశయోక్తి కాదనుకుంటా. నేను మనము లో ఒదిగి ఉండడమే సమాజానికి మనమివ్వగలిగే పెద్ద కాంట్రిబ్యూషణ్. అక్కడక్కడా స్త్రీ – పురుషుడు అనే విడదీత కనిపించింది. అది తప్ప మీ సమీక్ష హుందాగా ఉంది.

 24. Malakpet Rowdy says:

  కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన ..వివాహ వ్యవస్థలో…. కల్హార లాటి వాళ్ళు తమ మనసుని..తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే పరిణామాలు మంచి-చెడులు
  ____________________________________________________________________________________________

  హమ్మయ్య, నవల చదవకపోయినా ఇప్పటికి రివ్యూ చదివా.

  నాకయితే ఈ వాక్యం మింగుడు పడలేదండీ. తను చేసే ప్రతీ పనికీ justification గా పురుషుణ్ణో లేక వివాహ వ్యవస్థనో నిందించటం ఒక స్త్రీవాదికి సరిపోతుందేమోగానీ సాధారణ స్త్రీకి కాదు.

  • Malakpet Rowdy ..gaaru

   నేను మన వివాహ వ్యవస్తని నిన్దించలేదు. ఈ నవలా రచయిత్రి కూడా మన వివాహ వ్యవస్థ పై ఉన్న గౌరవం తోనే చక్కని ముగింపు ఇచ్చారు.
   నేను వివాహ వ్యవస్థని,పురుషుడిని కూడా నిందించలేదు.
   మన భావజాలం గురించి మాత్రమే చెప్పాను.పురుషుడు వివాహం తర్వాత పర స్త్రీ పై ఆకర్షణకి గురి అయి అక్రమ సంబంధాలని కొనసాగిస్తే..ఆమోదం చూపక పోయినా మౌనంగా ఉపేక్షించడం చూస్తాం. అదే పని స్త్రీ చేస్తే విమర్శిస్తారు. తప్పు ఎవరు చేసినా సమానంగా స్పందించాలి అనే ఉద్దేశ్యం ఉండాలి. అనే ఉద్దేశ్యంతోనే .. నేను ఆ వాక్యం వ్రాయాల్సి వచ్చింది.
   నేను సామాన్య స్త్రీ..నో.. స్త్రీ వాదినో..ఇక మీరే చెప్పాలి:))
   తన్హాయి నవల ని తీరిక చేసుకుని చదివే ప్రయత్నం చేయండి. మీ స్పందనకి ధన్యవాదములు.

   • Malakpet Rowdy says:

    ఎప్పుడో Order చేశానుగానీ ఇప్పటిదాక చదవటం కుదరలేదండి. తీరిక చేసుకుని చదవాలి. అప్పుడెప్పుడో చలం మైదానం దెబ్బకి బుఱ్ఱ తిరిగి అటువంటి కథల ౙోలికి వెళ్ళటం మానేశా. తన్~హాయి రెండూ మూడు ఎపిసోడ్లు చదివాగానీ మొత్తం చదవటం కుదరలేదు. పక్కింటి పిన్నిగారి పుస్తకమే కదా (కల్పనగారూ మీరు మళ్ళీ యుద్ధానికి రావద్దు) చదవవచ్చులే అని కుడ కాస్త neglegence

    ఇక మీరన్న విషయానికి వస్తే may be I didnt communicate properly .. నేనన్నది మిమ్మల్ని కాదు .. ప్రతీదానికీ పురుషులని నిందించే స్వభావాన్ని ..

    అన్నట్టు రివ్యు మాత్రం ఆకట్టుకునేలా వ్రాసారు మీరు.

 25. పూర్ణిమ. says:

  సమీక్ష చాలా బాగుంది .నవలను మీరు అనుభూతించిన తీరు ,అర్థం చేసుకున్న తీరు,సమీక్షించిన తీరు సరయిన పద్దతిలో ,ఆలోచింపజేసేదిగా వుంది .అభినందనలు వనజ గారూ .